Our Health

తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?7.

In Our Health on జనవరి 17, 2015 at 10:38 ఉద.

తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?7. 

13. యాలకులు ( కొన్ని ప్రాంతాలలో ఇలాచీ లు అని కూడా అంటారు ) ( పై చిత్రం చూడండి )  : యాలకులలో ‘ సినియోల్’  అనే రసాయన పదార్ధం , మన దేహం లో  అనేక  అవయవాలకు , ముఖ్యం గా మర్మావయవాలకు , రక్త సరఫరా వృద్ధి చేస్తుంది ! దానితో , కామ వాంఛ  అధికం అవడమే కాకుండా ,  రతి క్రియా శక్తి కూడా పెంపొందుతుంది ! అంటే యాలకులు,  సహజం గా లభించే వయాగ్రా  ! అందుకే పూర్వ కాలం లో ప్రియురాలు  , శయన మందిరం లో ,  తన మమతానురాగాలతో పాటుగా ,  యాలకులు, లవంగాలు  కూడా వేసిన తాంబూలం , ప్రియుడికి   అందించే ఆచారం ఉండేది !  ఆ ఆచారం   పురాతనమైనదే అయినా , ( కామ ) ఆరోగ్య రీత్యా , ఎప్పటికీ అధునాతన మైనదే ! 
14. గుమ్మడి విత్తనాలు( పై చిత్రం చూడండి )  : గుమ్మడి విత్తనాలలో ‘ జింక్ ‘  అనే ఖనిజం అధికం గా ఉంటుంది !  ఈ జింక్ ఖనిజం, శరీరం లో అనేక రసాయన చర్యలలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ! అందులో ‘ టె స్టో స్టిరాన్ ‘  అనే  కామ వాంఛ కూ , రతి క్రియ కూ  అనివార్యమైన హార్మోను  ఉత్పత్తి కూడా ఒకటి ! ఇంకా ‘  ప్రోస్టా గ్లాండిన్ ‘  ల ఉత్పత్తి కి కూడా జింక్  ఉపయోగ పడుతుంది ! ప్రోస్టా గ్లాండిన్ లు కూడా కామ వాంఛ , మిధునం , లేదా రతి క్రియ లో కీలక పాత్ర వహిస్తాయి !  
గుమ్మడి విత్తనాలను ఎట్లా తినాలి ?: గుమ్మడి విత్తనాల బయట పొర  భాగం ,గట్టిగా పీచు పదార్ధం తో నిర్మితమై ఉంటుంది ! ఈ భాగాన్ని తిన కూడదు !  ఈ పొర ను చీల్చాక , లోపల ఉన్న ఎండొ స్పెర్మ్ నే తినాలి ! అంటే, విత్తనాలను అదే విధం గా తినకూడదు ! 
15. వాల్నట్ లు( పై చిత్రం చూడండి )  : ఈ  విత్తనాల మధ్య భాగం ( దానినే ఎండొ స్పెర్మ్  అంటారు )  తిన వచ్చు.  ఈ భాగం  లో లభ్యం  అయే అనేక రసాయన పదార్ధాలు , వీర్య వృద్ధి కలిగిస్తాయి ! అంటే  వీర్య కణాల సంఖ్య ను ఎక్కువ చేయడమే కాకుండా , ప్రతి వీర్య కణాన్నీ శక్తి వంతం గా కూడా నిర్మించడం లో నూ , ఉత్పత్తి చేయడం లోనూ ముఖ్య పాత్ర వహిస్తాయి ఈ వాల్నట్ లో లభించే రసాయనాలు !  వీటిలో ‘ ఒమేగా 3 ఫాటీ ఆమ్లాలు ‘   కూడా అతి ముఖ్యమైనవి ! ఈ ఒమేగా 3 ఫాటీ ఆమ్లాలు , డోపమిన్ అనే రసాయనం, ఇంకా  ఆర్జినిన్  అనే రసాయనం తయారు చేయడం లోనూ అతి ముఖ్యమైనవి ! 
 డోపమిన్ మనకు ఎందుకు అవసరం ? : డోపమిన్ అనే రసాయనం , మన  మెదడు లో అనేక రకాలైన  ఆలోచనలకు , అనుభూతులకు , అనివార్యమైన జీవ రసాయనం ! ఈ  డోపమిన్ ను  ‘  ఆహ్లాద రసాయనం ‘ అని  కూడా అంటారు  అందుకే ! ( ప్లెజర్ కెమికల్ ) 
 ఆర్జినిన్  మనకు ఎందుకు అవసరం ? : ఆర్జినిన్ అనే రసాయనం కూడా ముఖ్యమైనది ! ఈ ఆర్జినిన్  ,  జననాంగాల రక్త ప్రసరణ ను అధికం చేయడం లో ప్రముఖ పాత్ర వహించే నైట్రిక్ ఆక్సైడ్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది !   ఆ తరువాతే , పురుషాంగం అనేక రెట్లు వ్యాకోచించి , ( దీనినే పురుషాంగ స్థంభన లేదా ఎరెక్షన్ అంటారు )  రతి క్రియ లో పాల్గొన డానికి సన్నద్ధం అవుతుంది !  స్త్రీలలో కూడా ఈ నైట్రిక్ ఆక్సైడ్  , సున్నితమైన యోని , ఇంకా యోని కీల ( క్లిటోరిస్ ) భాగాలలో అత్యధికం గా రక్త ప్రసరణ కలిగించి , ఆ యా భాగాలు పురుషాంగం స్వీకరించడానికి ఉవ్విళ్ళూ రేలా సన్నద్ధం చేస్తుంది ! 
అందుకే , సంసార సుఖం కోసమూ , ప్రత్యేకించి  సంతానం కలగని దంపతులకూ , ఈ వాల్నట్ లు ఎంతగానో ఆరోగ్య దాయకం !
వచ్చే టపాలో మరి కొన్ని సంగతులు !  

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: