Our Health

Archive for సెప్టెంబర్, 2013|Monthly archive page

చుంబన రహస్యాలు.3. ప్రేమ , ప్రణయం , కామం లో, చుంబన తీవ్రత ఎందుకు మారుతుంది ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 14, 2013 at 9:29 సా.

చుంబన రహస్యాలు.3. ప్రేమ , ప్రణయం , కామం లో, చుంబన తీవ్రత ఎందుకు మారుతుంది ? 

మానవులు, తమలో ఎగసి పడే,  అనేక రకాల అనుభూతులను, తమ చుంబనం ద్వారా తెలియ చేస్తారు !  ఈ చుంబనం కేవలం నాలుగు పెదిమలు పెనవేసుకోవడమే అయినా కూడా ,  స్వీకరిస్తున్న వారు, ఆ ముద్దును విశ్లేషణ చేయగలరు ! కానీ అందరూ కాదు ! మరి ఇట్లా ఎందుకు జరుగుతుంది ? 
అని విశ్లేషిస్తే , జీవ పరిణామ రీత్యా , ముద్దు  ప్రేయసీ ప్రియుల మధ్యా , తల్లీ శిశువుల మధ్యా ఒక చక్కని అనుబంధానికి పునాది అవుతూ వస్తుంది ! అందువల్లనే , మానవులలో , శిశువు , తన పెదిమలతో తల్లి స్థన కుచాలను ( అంటే నిపుల్స్ ను ) స్పృ శించ గానే ,  ఆప్యాయతా , అనురాగాలకు మూలమైన ఆక్సీ టోసిన్ అనే  జీవ రసాయనం విడుదల అవుతుంది ! ( హార్మోనులు అని అంటారు వాటిని , ఈ హార్మోనుల గురించి వివరం గా ‘బాగు ‘ మునుపటి టపాలలో వివరించడం జరిగింది , ఉత్సాహం ఉన్న వారు చూడగలరు ) ఈ ఆక్సీ టోసిన్,  తల్లి లో, తన శిశువు పట్ల  ఒక విడదీయ రాని బంధం ఏర్పరుస్తుంది ! ప్రేమానురాగాల తో పాటుగా , అనుబంధం , వాత్సల్యం కూడా ! అదే తల్లి ప్రేమ ! అత్భుతం కదా సృష్టి ! 
అదే కారణం చేత , ప్రేయసీ ప్రియులు పరస్పరం చుంబించు కున్నా , గాఢమైన చుంబనాలలో , అంటే  భావానుభూతుల దొంతరాలలో ఒదిగి పోతూ , పట్టు వంటి అతి మెత్తని , అతి సున్నితమైన పెద బంధాలలో , అనేక జీవ రసాయనాలు ప్రవహిస్తాయి !  ఆ జీవ రసాయనాలు అతి తక్కువ పరిమాణం లో ఉన్నా కూడా , ఉత్తుంగ తరంగ జలపాతం లా, అత్యంత  అందమైన అనుభూతులను,  శరీరం లో ప్రవహింప చేస్తాయి ! అపుడే , తనువు , అణువణువునా కంపిస్తూ ఉంటుంది !  ఫిషర్ అనే శాస్త్రవేత్త , దీనికి కారణం ,  ప్రధానం గా ‘ డోపమిన్ ఇంకా నారెపినెఫ్రిన్ ‘ అని అంటారు !  ఆమె మాటల్లోనే ‘ ఈ డోపమిన్ ,నారెపినెఫ్రిన్ అనే రసాయనాల  విడుదల ,  ప్రత్యేకించి ,  ప్రేయసీ ప్రియుల తొలి కలయిక లో, అంటే ఒక  నూతన సందర్భం ( నావెల్ సిచు యే షన్  ) లో నే జరుగుతుంది ! ఇట్లా జరిగినప్పుడు,  ప్రేయసీ ప్రియులలో ( అంటే, కల్ల బొల్లి ప్రేమ కాక , నిజం గా ప్రేమలో ‘ పడ్డ ‘ వారు ! ) నాలుగు రకాల అనుభూతుల అలలు చెలరేగుతాయి: 
1. కామ వాంఛ :  విపరీతమైన కామ వాంఛ లు ఉత్పన్నం అవుతాయి ! అనేక మంది ప్రేయసీ ప్రియులు , ఈ కామ వాంఛ ల అలలో ‘ కొట్టుకు ‘ పోతారు కూడా ! 
2. ప్రణయ భావన : ఈ పరిస్థితి లో ,  కళ్ళు బరువు గా ఉండడం , శరీరం ఎంతో తేలిక అయిపోయిన అనుభూతి కలగడమూ , ఆకలి తగ్గి పోవడమూ , నిద్ర పోవాలని అనిపించక పోవడం , అంటే నిద్ర రాక పోవడం కూడా జరుగుతుంది.  కామ వాంఛల అలలో కొట్టుకు పోయిన వారు, ప్రణయ తీరం చేరి, కళ్ళు తెరిచి చూసే సరికి, ఒకరిమీద ఒకరికి తీవ్రమైన ప్రణయ భావనలు , ఆరాధనా భావనలూ కూడా ఉదయిస్తాయి ! ! 
3. ప్రేమ : వారిరువురి మధ్యా ప్రేమ చిగురిస్తుంది ! 
4.అనుబంధం :   ప్రేయసీ ప్రియులలో అనుబంధం పెనవేసుకుంటుంది , ఆ చిగురించిన ప్రేమకు ఆలంబన గా ! దానితో  ఒకరి మీద ఒకరికి భద్రతా భావం కలుగుతుంది ! అంటే ‘ సెన్స్ ఆఫ్ సెక్యురిటీ ‘ ! సృష్టి విచిత్రం ఏమిటంటే , పైన తెలిపిన నాలుగు   రకాల  అనుభూతులూ కూడా నాలుగు రకాలైన జీవ రసాయనాల వల్లనే ! 
కామ వాంఛ, టె స్టో స్టిరాన్ అనే హార్మోను వల్ల ( స్త్రీల లోనూ ,  పురుషుల లోనూ కూడా ! ) ప్రేమా ప్రణయాలు , డోపమిన్ , నారెపినెఫ్రిన్ అనే జీవ రసాయనాల  పుణ్యం ! ఇక అనుబంధం , ఒకరి ‘ ఒడి ‘ లో ఇంకొకరు స్వాంతన , శాంతీ , ప్రశాంతతా పొందు తున్న అనుభూతులన్నీ కూడా ఆక్సీ టోసిన్ మహిమే !  మీరు ప్రేమ లో పడి పిచ్చి గా పదే , పదే , మీ ప్రేయసిని కలవరిస్తూ , వరించినట్టు  కలలు కంటూ ఉంటే , అది కేవలం మీ  డోపమిన్ మహిమే ! అట్లా కాక , మీరు ‘ ఆ ‘ యువతిని  కామా తృత తో చూస్తూ , శృంగార కామ కేళీ విలాసాలు జరుపుతున్నట్టు కలలు కంటుంటే, అది  టె స్టో స్టిరాన్ అనే హార్మోను పనే ! మీ తప్పు కాదు ! కాక పొతే, ఆ  టె స్టో స్టిరాన్ హార్మోను మీ దే ! అని ఆమె అన్నారు ! 
 
వచ్చే టపా లో ఇంకొన్ని చుంబన రహస్యాలు  ! 

చుంబన రహస్యాలు.2. అధర బంధాలు , విడతీయలేని అనుబంధాలు !

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 13, 2013 at 7:50 సా.

చుంబన రహస్యాలు.2. అధర బంధాలు , విడతీయలేని అనుబంధాలు ! :  

 
చుంబనం, మానవ కామ కేళీ విలాసాలకు ప్రధాన ద్వారం ! ఈ ద్వారం గుండా ప్రయాణిస్తూ , అసలు సిసలైన  అనుభూతులను ఆస్వాదించగలుగుతాము ! అంతే  కాకుండా , ముద్దులు,  మానవులను ఒకే మూసలో పోసిన వారిలా కాకుండా నవ్యానుభూతుల ప్రాంగణానికి ఆహ్వానిస్తాయి !
హెలెన్ ఫిషర్ అనే శాస్త్ర వేత్త, కేవలం మానవులే కాక, సృష్టి లో అనేక ఇతర జీవాలు కూడా ముద్దులు కురిపిస్తూ ఉంటాయని తెలియ చేశాడు  ! 
తోలి ముద్దు పెట్టగానే , మీరు మీ భాగస్వామి పర్సనల్ స్పేస్ ను అతిక్రమించారన్న మాటే ! అంటే, మీరు చుంబించిన వారిని నమ్ముతున్నారన్న మాటే ! అంతే కాకుండా, మీరు వారిని తాకడమూ , వారి కళ్ళలో కళ్ళు పెట్టి చూడడమూ , వారి శ్వాస లో మీ శ్వాస తీసుకోవడమూ , వారి మనసు తెలుసు కోడానికి ప్రయత్నం చేయడమూ కూడా  చేస్తారు ! 
 అధరాల నుంచి, అనేక వందల రిసెప్టార్ లు మన మెదడు కు  సంధానం అయి ఉంటాయి ! అంతే కాకుండా, పెదిమల నుంచి పంపే సంకేతాలను గుర్తించడానికి మెదడులోని సెన్సరీ కార్టెక్స్ లో ఒక పెద్ద భాగం ( అంటే, ఒక ప్రత్యేకమైన డిపార్ట్ మెంట్ అని చెప్పుకోవచ్చు ) కేటాయింప బడింది ! స్త్రీ లోలురైన  చాలామంది పురుషులు , తాము స్త్రీతో కామ క్రీడల లో , ముద్దాడడం కన్నా , కామ క్రీడలో పాల్గొన డానికే సుముఖం గా ఉంటారుట , కారణం , తదేకం గా వనితను ముద్దాడితే , తీక్షణమైన ఆ ముద్దుల వలలో విల విల లాడి , ఉక్కిరి బిక్కిరి అయి తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతారుట ! అంతటి ప్రభావం ఉంది ముద్దు కు !  
తీక్షణం గా స్త్రీ పురుషులిద్దరూ, నాలుకలు మెలికలు వేసుకుని పెట్టుకునే ముద్దులు , శరీరాలలో , అనేక రకాల జీవ (రస మయ ) రసాయనిక చర్యల ను రగిలించి ,  రోగ నిరోధక శక్తి ని  ఎక్కువ చేస్తాయని పరిశోధనల వల్ల విశదం అయింది ! ( ప్రేయసీ ప్రియులిద్దరూ ఏ రకమైన అంటు వ్యాధులూ లేకుండా ఉంటేనే ! ) 
అధర బంధాలు , విడతీయలేని అనుబంధాలు ! :  ఆప్యాయతా , అనురాగాలతో చేసే స్పర్శ , స్త్రీలలో ఆక్సీ టోసిన్  అనే జీవ రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆక్సీ టోసిన్  శరీరాన్నీ , మనసునూ ప్రశాంత పరిచి , స్వాంతన చేకూరిస్తుంది !  ఒక రకం గా ఆక్సీ టోసిన్ ను ప్రశాంత హార్మోన్ అనుకోవచ్చు !  కానీ  పెదవులతో  బంధం వేసి చేసే స్పర్శ , అత్యంత సున్నితమైనది గా మెదడు లోని న్యురాన్ లను, అంటే నాడీ కణాలను శక్తి వంతం చేసి ఉత్తేజ పరుస్తుంది ! ఈ రకమైన అధర స్పర్శ ,  విడదీయ లేని అనుబంధం గా పరిణమిస్తుంది, ప్రేయసీ ప్రియుల జీవితం లో !  అంటే చుంబనం, ప్రేమ వర్ధనం చేసే,  సహజ ఫెవి కాల్  ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చుంబన రహస్యాలు.1.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 9, 2013 at 8:02 సా.

చుంబన రహస్యాలు. 1. 

ఒక గొప్ప ముద్దు,  ప్రపంచాన్నే కరిగిస్తుంది !  తనువును తహ తహ లాడిస్తూ , కామ కోరికలు రేపుతుంది ! నేర్పు కల అతివలు , మొదటి ముద్దును రుచి చూసి , తాము కోరుకున్న వారితో బంధం , కల కాలం సాగుతుందో , లేక తెగుతుందో , ఇట్టే చెప్ప గలరు ! అంతటి మహత్యం ఆపాదించ బడింది, ఒక‘ చిరు ‘ చుంబనానికి ! 
తనివి తీరా పెట్టే ఒకే ఒక్క ముద్దు తో , తనువులో అనేక రకాల జీవ రసాయన ప్రక్రియలు చెల రేగుతాయి ! ఈ క్రియలన్నీ కూడా శరీరానికీ , మనసుకూ కూడా అనేక విధాలు గా ఆనందం చేకూరుస్తాయి ! తరచూ , ముద్దులు గుప్పించుకునే ప్రేయసీ ప్రియులు , ఎక్కువ ఆరోగ్య వంతం గానూ , ఆనందం గా నూ  ఉండగలుగుతున్నారు !  ప్రతి ముద్దూ , నిమిషానికి రెండు క్యాలరీల శక్తి  తీసుకుని , అధిక బరువును కూడా తగ్గిస్తుంది ! కాక పొతే నిదానం గా ! ( ట్రెడ్ మిల్ మీద పరిగెత్తితే, మనం నిమిషానికి పదకొండు క్యాలరీల వరకూ ఖర్చు పెడతాము ! ).  
హడావిడి గా ఎడా పెడా ముద్దులు కుమ్మరిస్తూ , అటూ ఇటూ కదులుతూ , ప్రేయసిని ఉసి కొలుపుతూ , కసి గా ప్రవర్తించే వారు , వడి వడి గా నడిచే వారి తో సమానం గా క్యాలరీలు ఖర్చు చేస్తారని శాస్త్రజ్ఞుల ఉవాచ !  ఇక్కడ చుంబన సూత్రం ఏమిటంటే : ఆవురావురు మంటూ మధువు గ్రోలుతూ, మధువు ( ముద్దు రూపం లో )  ఇస్తూ ఉంటే , మధువు ( షుగరు ) కూడా వినియోగం అవుతుందని ! ఫ్రెంచి ముద్దులు  పరస్పరం సమర్పించుకునే ప్రేయసీ ప్రియుల లో మంచి రోగ నిరోధక శక్తి పెంపొందు తుందని కూడా విశదం అయింది ! ఫ్రెంచి ముద్దులు,  కేవలం ఫ్రెంచి వారి హక్కు కాదని ఇతర దేశాల వారంతా గమనించాలి ! ( ఈ ఫ్రెంచి ముద్దుల కదా కమామీషూ ముందు ముందు టపాలలో తెలుసుకుందాం ! ) మెత్తగా , ‘పుత్తడి బొమ్మకు’ పెట్టే ముద్దు , మానసిక వత్తిడి ని కూడా తగ్గించి కోరికలను ఎక్కడికో తీసుకు పోతుందని స్టాన్ఫర్డ్  లో వత్తిడి మేనేజ్ మెంట్ నిపుణుడు రాడ్నీ డేంజర్ ఫీల్డ్ గారి అభిప్రాయం ! 
కామ వాంఛా , కామ పూరితమైన స్పర్శా ,  కామానుభూతీ , ఈ మూడు లక్షణాలూ , మానవుల ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయని, సియాటిల్ సెక్సాలజిస్ట్ జాయ్ డేవిడ్సన్ గారి  ఒపీనియన్ !  ఆమె ఇంకా ‘ చుంబనం  తో ఒక  అత్భుతమైన కామ యాత్ర మొదలవుతుంది ! ప్రత్యేకించి , మనసు పడిన వారితో జరిపే ఈ కామ యాత్ర లో , శరీరమంతా ఆనంద డోలి కల్లో తేలుతుంది ‘ అని అన్నారు ! వీరి మాటల్లోనే ‘  తదేకం గా , ఏకాగ్రత తో చేసే చుంబనాన్ని ‘ కామ ధ్యానం ‘ అని చెప్పుకోవచ్చు !  సామాన్యం గా యోగ  ధ్యానం లో పొందే  ఆందోళనా రహితమైన , మానసిక ప్రశాంత స్థితి ని  ఈ కామ ధ్యానం ( చుంబన ధ్యానం అనవచ్చేమో ! ) లో పొందవచ్చు !  యోగ ధ్యానం లో జరిగే జీవ రసాయన చర్యల లాగే , చుంబన ధ్యానం లో కూడా కలుగుతాయి’ ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !  

చుంబన రహస్యాలు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 8, 2013 at 10:52 ఉద.

చుంబన రహస్యాలు ! 

 
చుంబనం ! 
ప్రేయసీ ప్రియుల వందనం !
ప్రణయ  జీవితాల్లో  అది  చందనం ! 
రసమయ జీవన పారిజాతం ! 
అధర  సంధి లో పొంగి , పారే ‘వల’పాతం !
 
మానవులకు ప్రకృతి ప్రసాదించిన ఒక అమూల్యమైన వరం, చుంబనం !  స్త్రీ పురుష సంబంధాలకు అతి ముఖ్యమైన వారధి ! ప్రేమ మయ జీవితాలకు పునాది !  మరి మానవులంతా ఈ విషయం తెలిసినా , చుంబనాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు !  అట్లాగని , సత్సంబంధాల కోసం, కనపడిన వారినల్లా ముద్దు పెట్టుకోమని కాదు ! ఒక పురుషుడు , ఒకే స్త్రీ తో కూడా బంధాల విషయం లో కూడా , ఈ చుంబనం అనే  ‘ ప్రేమ పరికరాన్ని ‘ సవ్యం గా వినియోగించుకోలేక పోతున్నారు , కారణాలు అనేకమైనప్పటికీ !  ఈ విషయం మీద అనేకమైన పరిశోధనలూ , పరిశీలనలూ , జరిగాయి , జరుగుతున్నాయి కూడా !  మరి శతాబ్దాలుగా అంతు చిక్కని రహస్యం గా ఉండి పోయిన ఈ చుంబన రహస్యాలను , వచ్చే టపా నుంచి తెలుసుకోడానికి ప్రయత్నిద్దాం ! 
 
  
 

18. సేఫ్ కార్ డ్రైవింగ్. ప్రమాదం లో కర్తవ్యం ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 6, 2013 at 10:53 సా.

18. సేఫ్ కార్ డ్రైవింగ్. ప్రమాదం లో కర్తవ్యం ఏమిటి ? 

విదేశాలలో, రోడ్డు ప్రమాదాలకు ఎప్పుడూ ఇతర వాహనాలే కారణం అవననవసరం లేదనడానికి ఓ నిదర్శనం, పై చిత్రం ! 
మనం సామాన్యం గా కారు నడుపుతున్నప్పుడు , అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం కదా !  కానీ , ఈ ‘ అన్ని జాగ్రత్తలూ ‘ అనే పదం ఒక్కొక్కరి కీ ఒక్కో విధం గా ఉంటుంది !  బాగా చదువుకున్న వారు కూడా కారు విషయం లో తీసుకునే జాగ్రత్తలు సంపూర్ణం గా ఉండక పోవచ్చు . అట్లాగే  పెద్ద గా చదువు కోని వారు కూడా కారు నడపడం లో ఎక్కువ శాతం జాగ్రత్తలు తీసుకోవచ్చు !  ముఖ్యమైన విషయం : చదువు తో సంబంధం లేకుండా , కారు కు సంబంధించిన అన్ని విషయాలూ తెలుసుకోవడం , కారు నడిపే ప్రతి వారికీ అతి ముఖ్యం. క్రితం టపాలలో చెప్పుకున్నట్టు , కారు నడపడం అనేక  పరిస్థితు ల మీద ఆధార పడి ఉంటుంది ! వాటిలో కారు కు సంబంధించినవి ముఖ్యమైనవయితే , కారు నడిపే వారికి సంబంధించినవి అతి ముఖ్యమైనవి. కారు నడిపే వారికి కారు మీదా , వారు నడిపే రోడ్డు మీదా వారికి ఉన్న అవగాహన తో పాటుగా , వారి శారీరిక స్థితీ , మానసిక స్థితీ కూడా అతి ముఖ్యమైనవే ! ప్రత్యేకించి , కారు నడిపే సమయం లో వారి శారీరిక , మానసిక స్థితులు , వారి రోజు వారీ కార్యక్రమాలలో జరిగిన సంఘటనల వల్ల ప్రభావితం అయినప్పటికీ ,  ఆ ప్రభావం ఎట్టి పరిస్థితుల లోనూ , కారు నడిపే సమయం లో కనిపించ కూడదు. ఎందుకంటే కారు కేవలం అనేక మీటలూ , అంటే స్విచ్ లూ , గేర్ లూ , చక్రాలూ , మొదలైన పరికరాలు అమర్చి ఉన్న ఒక యంత్రం ! ఆ యంత్రం కేవలం ,ఆ యంత్రం లో వివిధ రకాల స్విచ్ లు ఏ విధమైన చర్యల కోసం అమర్చ బడి ఉన్నాయో , ఆ యా  చర్యలే చేస్తుంది !  ఇంకో రకం గా చెప్పుకోవాలంటే , ఆ యంత్రాన్ని నడిపే మనకు వివిధ రకాల శారీరిక అలసట లు కానీ , మానసిక చీకాకు లు కానీ ఉన్నాయని ‘ తెలుసుకుని ‘ సురక్షితం గా ప్రయాణం సాగించదు ! అట్లాగే కారు నడిపే మనం , నిద్ర పోతూ ఉంటేనో ,లేదా ‘ మందు ‘ సేవించి , కారు నడుపుతూ ఉంటేనో , ‘ కారు యజమాని బాగా అలసి పోయి నిద్ర పోతున్నారు ‘ అనుకుని కానీ , లేదా  కారు యజమాని తీవ్రమైన మానసిక వత్తిడి కలిగి , మద్యం తాగి , కారు నడుపుతున్నారని కానీ , అనుకుని , ‘ వారిని సురక్షితం గా ఇంటికి చేరుద్దాం అని ‘ ఆలోచించదు ‘ ఆ యంత్రం ! అందువల్ల , కారు నడిపే అన్ని వేళలలోనూ , అత్యంత అప్రమత్తత తో నడిపితేనే , ప్రయాణం సురక్షితం అవుతుంది ! మన గమ్యం కూడా సునాయాసం గా చేరుకుంటాం ! 
కానీ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కూడా ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి !  మరి అట్లా ప్రమాదం సంభవించినప్పుడు మన  కర్తవ్యం ఏమిటి ?  ప్రమాదం లో మనం చిక్కు కోక పోయినా కూడా , కొన్ని సమయాలలో , మన కళ్ళ ఎదురు గానే ప్రమాదం సంభవించ వచ్చు !  మనం తరచూ టెలి విజన్ లో చూస్తూ ఉంటాం ! ప్రమాదం జరిగినప్పుడు కానీ , లేదా  మనుషులు పొడుచు కుంటున్నప్పుడు కానీ మన దేశం లో ప్రజలు ఎక్కడ లేని వైరాగ్యం ప్రదర్శించి , తమకు ఈ భవ బంధాలు ఏవీ పట్టనట్టు , ఏమాత్రం విచారించ కుండా, తప్పుకుని పోతూ ఉంటారు , కళ్ళ  ఎదురు గానే అనేక అకృత్యాలు జరుగుతున్నా కూడా ! ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం లో పాల్గొని తిరిగి వచ్చిన బ్రిటిష్ సైనికుడు ఒకడిని నడి రోడ్డుమీదే ఇద్దరు హంతకులు హతమార్చారు గొంతు కోసి ! ఆ సందర్భం లో అక్కడే ఉన్న ఇద్దరు స్త్రీలు, ఆ హంతకుల తో మాట్లాడుతూ , వారిని ఎంగేజ్ చేస్తూ , వారిని  ఇతరుల మీద దాడి చేయకుండా , ధైర్యం గా నివారించ గలిగారు ! కేవలం ఇద్దరు స్త్రీలు ! 
ప్రమాద సమయాలలో ఖచ్చితం గా మాట్లాడాలంటే , దేశ ప్రజల బాధ్యత ఏమీ లేక పోయినప్పటికీ , ఆ యా సమయాలలో అక్కడ ఉండడం వల్ల సాటి మనిషి ఆపద లో ఉంటే , సహాయం చేయడం కనీస మానవ ధర్మం కదా !  సామాన్యం గా, ఏ ప్రమాదం జరిగినా కూడా , అందులో గాయ పడిన వారికి , ప్రమాదం జరిగిన తరువాతి గంటలో అందే సహాయం అత్యంత ముఖ్యమైనది ,  వారికి జీవం పోసేదీ అవుతుందని అనేక శాస్త్రీయ పరిశీలనల వల్ల స్పష్టమైనది ! అందువల్ల కారు నడిపే అందరికీ , ప్రధమ చికిత్స లో ట్రైనింగ్ ఇవ్వడమూ , తీసుకోవడమూ కూడా ముఖ్యమే ! ఎందుకంటే , వారు కానీ , ఇతరులు కానీ ప్రమాదం లో తీవ్రం గా కానీ / స్వల్పం గా కానీ గాయ పడితే ,వారు నేర్చుకున్న ప్రధమ చికిత్స ఎంత గానో ఉపయోగకరం గా ఉంటుంది !  ఎమర్జన్సీ సర్విస్ వారు వచ్చే లోగా ! 
1. ప్రమాద స్థలం నుంచి , యాక్సిడెంట్ రిస్కు ఉన్న వారినందరినీ  సురక్షిత ప్రాంతానికి చేర్చాలి. 
2. కారు  నుంచి డేంజర్ సిగ్నల్ ను అందరికీ కనిపించేట్టు ఆన్ చేయాలి . ( హజార్డ్ లైట్ లను ఆన్ చేయాలి ) 
3. అది మిగతా వాహన దారులకు వార్నింగ్ అవుతుంది. 
4. అమ్ బ్యులెన్స్ వారికి ఫోన్ చేసి అన్ని వివరాలు స్పష్టం గా ఇవ్వాలి ! 
ఒక వేళ మీరే కనక ప్రమాదం లో చిక్కుకుంటే , మీ ప్రమాదానికి కారణమైన ఇతర వాహన వివరాలను నోట్ చేసుకోవడం , వీలయితే కనీసం సెల్ ఫోన్ తో నైనా కొన్ని కోణాలలో ప్రమాద దృశ్యాలను ఫోటో తీసుకోవడం చాలా ఉపయోగ కరం , ఉత్తరో త్తరా , ఇన్స్యురెన్స్ క్లెయిమ్ ల కోసం కూడా ! ఎందుకంటే , భారత దేశం లో ( కొన్ని ఇతర దేశాలలో కూడా నేమో నాకు తెలియదు ! )  ప్రతి వాహన దారుడూ , ప్రమాదం సంభవించి నప్పుడు , తప్పని సరిగా , తనది ఏమీ తప్పు లేదనీ , తప్పంతా ఇతర వాహన దారులదే ననీ వాదిస్తాడు , వీలయితే వారి మీద చేయి చేసుకుంటాడు కూడా ( నోటి తో పాటు గా ! ) ! 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు ! 

17. సేఫ్ కార్ డ్రైవింగ్. కారు బ్రేక్ డౌన్ లో ఏం చేయాలి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 5, 2013 at 7:09 సా.

17. సేఫ్ కార్ డ్రైవింగ్.కారు  బ్రేక్ డౌన్ లో ఏం చేయాలి ?

 
మనం కారు లో కూర్చున్నంత సేపూ , సురక్షితం గా ప్రయాణం చేసి , ఇంటికి ఎప్పుడు చేరుతామా అనే ఆలోచిస్తూ ఉంటాము. అంటే , ఏ ప్రమాదాలూ లేకుండా, అది సహజమే కదా ! కానీ కారు అకస్మాత్తు గా రోడ్డు మీద బ్రేక్ డౌన్ అవుతే మన కర్తవ్యం ఏమిటి ? అనే విషయం అంత సీరియస్ గా పట్టించు కోము కదా ! మరి ఆ విషయాలు కూడా ముందే తెలుసుకుంటే , ప్రయాణం సురక్షితం అవడమే కాకుండా , సకాలం లో సహాయం అంది , మన ‘ గూళ్ళ ‘ కు చేరుకోగలం కూడా ! ఉన్నట్టుండి కారు రోడ్డు మీద బ్రేక్ డౌన్ అవుతే , రెండు రకాలు గా ప్రమాదాలు సంభవించ వచ్చు ! ఒకటి మన కారు మోటారు వే మీద కనుక బ్రేక్ డౌన్ అవుతే , ఇతర వాహనాలు అది గమనించ కుండా , నేరు గా, వేగం గా వచ్చి గుద్దు కోవడం వల్ల !  రెండు  ఆ సమయం లో మనకే కాకుండా , ఇతర వాహన దారులు కూడా ప్రమాదాల బారిన పడడం ! 
వెంటనే చేయవలసినదేంటి ?
కారు సడన్ గా బ్రేక్ డౌన్  అవగానే విపరీతం గా ఆందోళన చెంది , ఒక్క సారిగా కారు బ్రేక్ మీద, గట్టిగా కాలు ( పాదం ) పెట్టి , బ్రేక్ వేయ కూడదు. అవును , బ్రేక్ సడన్ గా వేయకూడదు. స్టీరింగ్ ను కంట్రోలు చేస్తూ కారును రోడ్డు మీద ఒక సరళ రేఖ లోనే నడుపుతూ , వేగాన్ని నియంత్రించు కుంటూ , వీలైనంత త్వర గా కారును రోడ్డుకు ఎడమ ప్రక్కకు తీసుకు పోవాలి ( అంటే నడపాలి ). ఇట్లా చేయడం వల్ల , కారు ను మనం మనకు వీలైనంత తక్కువ అవ కాశం కలిగిస్తాము , ఇతర వాహనాలతో గుద్దు కోడానికి !  మోటారు వే మీద కారు బ్రేక్ డౌన్ అయినా కూడా కారును ఇదే విధం గా , రోడ్డుకు వీలైనంత ఎడమ వైపు కు తీసుకు వెళ్ళాలి , ( విదేశాలలో , సామాన్యం గా, ఈ ఎడమ ప్రక్క ప్రదేశాన్ని  హార్డ్ షోల్డర్ అంటారు , మరి భారత దేశం లో రోడ్ల మీద కూడా ఇవి ఉండి తీరాలి, ఎవరూ ఆక్రమించు కోకుండా ఉంటే ! ) 
a హజార్డ్ లైట్ లను ఆన్ చేయాలి 
b . బయట చీకటి గా ఉంటే , కారు సైడ్ లైట్ లను కూడా ఆన్ చేయాలి !
c. కారు లోంచి వీలైనంత త్వరగా బయటకు రావాలి , సైడ్ డోర్ ను ఓపెన్ చేసి. మిగతా వాహనాలు వేగం గా వెళుతున్న సైడ్ నుంచి ఎప్పుడూ బయటకు రాకూడదు !  కారణం వివరించ నవసరం లేదు కదా ! 
d. పెంపుడు జంతువులను కార్ లోనే ఉంచడం శ్రేయస్కరం ! 
e. మన తో పాటు గా మన కారులో ప్రయాణం చేస్తున్న ఇతర ప్రయాణీకులు కూడా హార్డ్ షోల్డర్ కు వీలైనంత దూరం గా అంటే రోడ్డుకు వీలైనంత దూరం లో నిలబడడం క్షేమ దాయకం ! 
వెంటనే ఎమర్జెన్సీ సర్విస్ వారికి ( బ్రేక్ డౌన్ సర్విస్ ) ఫోను చేయాలి. విదేశాలలో ప్రత్యేకించి ఈ అవసరానికే , మోటార్ వే ల మీద అక్కడక్కడా ఫోన్ లు అమర్చి ఉంటాయి ! వీటి వల్ల ఉపయోగం ఏమిటంటే , మనం ఆ ఫోన్ లనుంచి ఫోన్ చేయగానే , ఎమర్జన్సీ సర్విస్ వారికి తెలిసి పోతుంది , ఖచ్చితం గా మనం మోటార్ వే మీద ఎక్కడ ( అంటే ఎన్ని మైళ్ళ దూరం లో ) ఉన్నామో ! భారత దేశం లో ఇట్లాంటి ఎమర్జెన్సీ ఫోన్ లు నాకు తెలిసినంత వరకూ అమర్చ లేదు ! ఒక వేళ  అమర్చినా , ఆ ఫోన్ బాక్స్ లు ఖాళీ అయి పోతాయి అమర్చిన కొద్ది క్షణాల లోనే , ఎవరైనా ఫోన్ చేసినా , ఎమర్జెన్సీ సర్విస్ వారు ,  ఆ ఫోన్ ను అనేక మైళ్ళ దూరం లో , ఉండే ఇళ్ళలో లోకేట్ చేస్తారు ! అందువల్ల మొబైల్ ( సెల్ ) ఫోన్ ను ఎప్పుడూ పని చేసే కండిషన్ లో ( చార్జ్ చేసుకుని ) ఉంచు కోవడం క్షేమ దాయకం , ప్రత్యేకించి , వాహనాలు నడిపే వారు ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

16.సేఫ్ కార్ డ్రైవింగ్. సదా, కారు సురక్షితం గా నడపాలంటే పధకం ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 2, 2013 at 8:24 సా.

16.సేఫ్ కార్ డ్రైవింగ్.  సదా కారు సురక్షితం గా నడపాలంటే పధకం ఏమిటి ?

 

( పైన ఉన్న చిత్రం హైదరాబాదు లో రోడ్డు మీద ట్రాఫిక్ ! ) ప్రతి వారూ అర్జంట్ గా వెళ్ళాలి ! ఎక్కడికి ?

కారున్న ప్రతి వారూ, ఎప్పడూ, కారు సురక్షితం గానే నడుపుదామనుకుంటారు కదా ! మరి మనకు ఏమైనా పధకం ఉందా ,అట్లా  సురక్షితం గా నడప డానికి ? అని ఆలోచించుకుంటే కొన్ని ముఖ్య విషయాలు గోచరిస్తాయి ! 
1. సరి అయిన గేరు 
2. సరి అయిన వేగం 
3. సరి అయిన స్థానం. 
మనం కారు నడిపే సమయం లో అత్యంత సురక్షితం గా నడపాలంటే ఎప్పుడూ, పైన సూచించిన లక్షణాలు దృష్టి లో పెట్టుకునే డ్రైవ్ చేయాలి ! మనం ఎప్పుడూ , కారును సరైన గేరు లోనే పోనిస్తూ , కారు వేగాన్ని ఎప్పుడూ మన నియంత్రణ లోనే ఉంచుకోవాలి ! అట్లాగే రోడ్డు మీద మన స్థానాన్ని ఎప్పుడూ  సురక్షితమైన స్థానం గానే చూసుకోవాలి ! ఉదా : ఒక లారీ నిండా ఇటుకలు ఉంటే, త్వరగా ఆఫీసు కు వెళ్లాలని , ఆ లారీ ను అతుక్కుని డ్రైవింగ్ చేసినట్టు గా , ఏమాత్రం మధ్య స్పేస్  ఉంచకుండా , ఆ లారీ బ్రేక్ వేస్తే, తగిలేంత దూరం లో కారును నడుపుతుంటే , వేగం గా పోతున్న ఆ లారీ డ్రైవరు , ముందు అడ్డం వచ్చిన సైకిలిస్ట్ ను తప్పించ తప్పించ డానికి , సడన్ గా బ్రేక్ వేశాడనుకోండి ! అప్పుడు జరిగేది ? : మనం నడుపుతున్న కారు మీద ఇటుకల వర్షం ! ( ఎందుకంటే ఇటుకలు న్యూటన్ మొదటి సూత్రం పాటిస్తాయి కనుక ! ) ఆ వెంటనే మన కారు గ్యారేజీ సూత్రం పాటిస్తుంది !  మన అదృష్టం బాగుంటే , మనం హాస్పిటల్ సూత్రం నుంచి తప్పించు కుంటామేమో ! ఇదే పరిస్థితి , మనం నడిపే కారుకూ , ముందు వెళ్ళే లారీ కీ, మూడు నాలుగు కార్ల ఎడం ఉంచి ఊహించుకుంటే , ఎంత సురక్షితం అవుతుందో కదా ! లారీ , కారూ రెండూ సడన్ బ్రేక్ వేసినా కూడా ! పైన చెప్పినవే కాక , ఈ క్రింది లక్షణాలు కూడా , మన డ్రైవింగ్ ను ఎంతో సురక్షితం చేస్తాయి. 
 
1. బాధ్యత : కారు ను రోడ్డు మీద బాధ్యతా యుతం గా నడపాలి ! మనం భారత దేశం లో చూసే అతి సాధారణ దృశ్యం , వాహనం పెద్దదవుతున్న కొద్దీ బాధ్యతా రాహిత్యం ఎక్కువ అవుతూ ఉంటుంది ! లారీలకు వ్యాన్లూ , వ్యాన్లకు , కార్లూ , కార్లకు మోటార్ సైకిలిస్ట్ లూ , వాళ్లకు సైకిలిస్ట్ లూ ! ఇట్లా ప్రతి పెద్ద వాహనానికీ , చిన్న వాహనదారులు తేలిక  భావం ! రోడ్డు మీద పెద్ద వాహనాలు పోతుంటే మిగతా వారు తప్పుకోవాలి , వారిది ఏ తప్పూ లేక పోయినా కూడా !  రోడ్డు ఉపయోగిస్తున్న ప్రతి వారూ రోడ్డు టాక్స్ కడుతున్నప్పటికీ ! ఈ  ప్రవృత్తి చాలా అనర్ధ దాయకం , ప్రమాద కరం కూడా ! ప్రతి వాహన దారుడూ అత్యంత బాధ్యతా యుతం గా కారు నడపాలి ! 
2. జాగ్రత్త : అప్రమత్తతా, జాగ్రత్తా కూడా చాలా ముఖ్యమైన లక్షణాలు , కారు నడిపే ప్రతి వారికీ ఉండవలసినవే ! ( ఆమాటకొస్తే , ప్రతి వాహనదారుకూ ఉండవలసిన లక్షణాలు ! )  
3. మర్యాద లేదా సౌజన్యం : ప్రయాణాలు , దూరాలూ, ఇతర వాహనదారులతో మర్యాదా , సౌజన్యం తో ప్రవర్తిస్తే , తక్కువ టెన్షన్ తో , ఎక్కువ తృప్తి కరం గా సాగుతాయి ! రెక్ లెస్ గా ఇతర వాహన దారులను ఏమాత్రం పట్టించుకో కుండా ! ( హైదరాబాదు లో )  ఆటో డ్రైవర్ ల లా డ్రైవింగ్ చేయ కూడదు ! 
4. దూరం :  ఖచ్చితం గా చెప్పుకోవాలంటే , మనం కారు లో ప్రయాణం చేస్తున్నప్పుడు , అంటే, కారు నడుపుతున్నప్పుడు , ఇతర వాహనాలకూ , మనకూ ఎప్పుడూ  తగినంత దూరం ఉంచుకునే డ్రైవింగ్ చేస్తూ ఉండాలి ! అంటే,  ఏ సమయం లోనైనా  మన ముందు వాహనాలకూ , మన కారుకూ  కనీసం రెండు మూడు కార్లు పట్టే దూరం ఉండాలి ! హైదరాబాదు , ముంబాయి , మద్రాసు , ఢిల్లీ వాసులంతా , నేను తల తిక్క గా మాట్లాడుతున్నానాను కుంటారు కదా ! కానీ ఇట్లా,  రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రతి వాహనదారుడూ అనుకుని డ్రైవ్ చేస్తే ఎంత హాయి గా ఉంటుందో ! ఎందుకంటే, ఈ చెప్పిన పట్టణాలలో , కేవలం  రైలు పట్టాలు ఉన్న చోట తప్పించి ఇంకెక్కడా గేట్లు మూసి వేయరు కదా ! మరి ఎందుకు  ముందున్న వాహనం ‘ మీద పడడం ‘ ? ??  రెండు మూడు కార్ల ఎడం ఉంటే ఎంత ఆలస్యం అవుతుంది ప్రయాణం ??? 
పైన ఉన్న చిత్రం, కాలిఫోర్నియా లో రోడ్డు మీద ట్రాఫిక్ ! ఇక్కడా, ప్రతి వారూ అర్జంట్ గా వెళ్ళాలి ? అందుకే,  క్రమ శిక్షణ ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !