Our Health

చుంబన రహస్యాలు.6. చుంబనానికి ఇంధనం, సరస సంభాషణం !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 18, 2013 at 9:10 సా.

చుంబన రహస్యాలు.6. చుంబనానికి ఇంధనం, సరస సంభాషణం ! 

 క్రితం టపాలో, ముద్దుకు మూడ్ తీసుకు రావడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం కదా !  సమయోచితం గా , సందర్భానుసారం గా మూడ్ క్రియేట్ చేస్తే, ముద్దు ల కోసం  ఆమె ముఖం అరవిందం లా  వికసిస్తుంది !  అప్పుడు, మీరు తేనెటీగ అయి, ఆ అరవిందం లో మకరందాన్ని గ్రోల వచ్చు !  కుట్టకుండా, గుట్టు చప్పుడు కాకుండా ! కానీ , సమయ సందర్భాలు ఆలోచించకుండా , మీరు ‘ ఆమెను ‘ ముద్దు పెట్టుకుందామని చేసే ప్రయత్నాలతో, ఆమె ముఖం కంద గడ్డ లా ఎర్రబడి , మీ ‘పని’ గోవిందా అవుతుంది ! ఇప్పుడు తెలుసుకోవలసిన ఇంకో ముఖ్య విషయం:  మీరు ‘ ఆమె తో చేసే సంభాషణ , ప్రత్యేకించి,  సరస సంభాషణ ,  ‘ ఆమె ‘ లో చుంబన భావాలు జనించడానికి , ఇంధనం అవుతుంది ! ధరల పెరుగుదలలూ  ,  ట్రాఫిక్ ప్రమాదాలూ , లేదా మరణాలూ , ఇట్లాంటివి  సహజమైన  యదార్ధ జీవిత సంఘటనలే అయినా , ముద్దు ప్రయత్నాల ముందు , ఇవన్నీ ,  వ్యర్ధమైన సంభాషణ లే ! అంటే , మీరు ముద్దు పెట్టుకుందామనుకునే  ‘ఆమె ‘ కు ఇవన్నీ అనవసరమైన సంభాషణ లే ! ‘ ఆమె ‘ కు ఇవన్నీ భయాందోళనలు కలిగించి , మనోభావాలను గాయ పరుస్తాయి ! పాఠం : ‘ ఆమె ‘ కు ఆందోళన నూ , దుఃఖాన్నీ కలిగించి ,  ఆమె  హృదయాంతరాళం లో విషాద ఛాయలు ఆవరింప చేసే సంభాషణ చేయకూడదు ! ప్రత్యేకించి , మీరు ‘ ఆమె ను ముద్దు పెట్టుకుందామని , ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు  అసలే చేయకూడదు !  

మీరు చేయకూడనివి ఇంకా కొన్ని ఉన్నాయి ! 
1. ఆమె తో ఇతర యువతుల గురించి కానీ , వారి అందాల గురించి పొగడడం గానీ చేయకూడదు ! 
2. మీ జీవిత సమస్యలూ , మీరు అందువల్ల ఎంత అసంతృప్తి గా జీవితం గడుపుతున్నదీ , లేదా మీకు ఇష్టం లేనివీ , ఇవన్నీ కూడా కంప్లైంట్ లు చేయడం కిందకు వస్తాయి !  అందువల్ల ఈ విషయాలు కూడా ‘ ఆమె ‘ తో మాట్లాడ కూడదు, ప్రత్యేకించి ఆమె కు మీ ముద్దు ఇద్దామను కుంటున్నప్పుడు !
3. మీరు సామాన్యం గా , ఇతర మగ స్నేహితులతో చర్చించే విషయాలు , ఆమె తో చర్చించ కూడదు ! 
4. మీ దేహ ధర్మాల గురించి అంటే చెమట పోయడం , నిద్ర గురక పెట్టి పోవడం , ఊపిరి పీల్చుకోవడం లాంటి శరీర ధర్మాల గురించి ‘ ఆమె ‘ తో చర్చించడం కూడదు !  
మరి మాట్లాడ వలసిన విషయాలు ఏముంటా యి ? పైన చెప్పినవన్నీ చేయక పొతే ? !!! అని మీరు అనుకుంటున్నారు కదా ! ఈ క్రింది ముఖ్యమైన  విషయాలు గమనించండి ! 
1. మీ సంభాషణ  అంతా  ‘ ఆమె ‘ గురించే అయి ఉండాలి ! 
2. ఆమె ను ప్రశంసించండి ! ఉదా:  ‘ ఎంత బాగున్నావు !!! ‘ 
3. ఆమె మనసు తెలుసుకోండి !  అది అంత సులభం కాదు ! చాలా సమయాలలో, అది భగీరధ ప్రయత్నం అవ వచ్చు !  అందుకు సన్నద్ధులు కండి ! 
4. మీ ఇరువురిలో కామన్ లక్షణాలు బేరీజు వేయండి !  ఆమెతో ! 
5. మీకు మాటలు తోచక పొతే ( ఒక్కో సమయం లో, మీరు, ‘ ఆమె’  బౌలింగ్ చేయక పోయినా , కొన్ని క్షణాలు క్లీన్ బౌల్డ్ అవుతూ ఉంటారు , ఆ సమయం లో మీకు మాటలు రావు ! ) అప్పుడు , ఆమె హేర్ స్టైల్ బాగుందని ప్రశంసించండి  ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !  
 
  1. ఇప్పటి అమ్మాయిలు పొగడ్తలకి పడిపోరండి……..జేబు బరువే…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: