Our Health

రచయత ఖజానా

నీరు, మానవుల ప్రాధమిక హక్కు కాదంటున్న నెస్లే అధినేత !

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఏప్రిల్ 21, 2013 at 10:56 ఉద.

నీరు,  మానవుల ప్రాధమిక హక్కు కాదంటున్న నెస్లే అధినేత ! 

 
నెస్లే !  ప్రపంచం లోని అతి పెద్ద కంపెనీలలో ఒకటి ! అతి ఎక్కువ లాభాల బాట లో ఉన్న కంపెనీలలో కూడా ఒకటి ! ఆ కంపెనీలో, ప్రపంచ వ్యాప్తం గా కనీసం లక్షన్నర మంది ఉద్యోగులు పని చేస్తున్నారు !  తల్లి ( పోత ) పాల పొడి డబ్బాలూ , చాక్లెట్లూ ( కిట్ క్యాట్  చాక్లెట్ , ఉదాహరణకు ) , పలహార సీరియల్స్ , అంటే బ్రేక్ ఫాస్ట్  సీరియల్స్ , కాఫీ ( ఉదా: నెస్కెఫె  ) , ఇట్లా చెప్పుకుంటూ పొతే, అనేక ఉత్పత్తులు ! అతి ముఖ్యంగా , ప్రపంచం లో  నీటిని సీసాలలో నింపి అమ్మే, అతి పెద్ద కంపెనీ ! నెస్లే కంపెనీ గురించి తెలియని వారికి , ఈ పరిచయం చాలేమో ! ఇటీవల  నెస్లే కంపెనీ అధినేత  ఒక  ఉపన్యాసం ఇచ్చాడు. అందులో , తన కంపెనీ ఎంత పెద్దదో, ఎంత గొప్పదో కూడా వివరించాడు. అంతే కాకుండా , మానవులందరూ తాగే నీరు ను ప్రపంచం లో ఉన్న అతి ముఖ్యమైన వ్యాపార ముడి సరుకు  అన్నాడు !  తాగు నీటిని ప్రైవేటీకరణ చేస్తే , నీటిని సరిగా అందరికీ అందేట్టు చేయవచ్చు ” అని అన్నాడు ! అంతే కాక ,  తాగు నీరు ప్రతి మానవుడి ప్రాధమిక హక్కు అంటున్నది ,కేవలం తీవ్రవాద భావాలున్న  ప్రభుత్వేతర సంస్థలే !  అని కూడా చెప్పాడు !
 
ఆయన గారి ప్రసంగం లింకు వీడియో  క్రింద నొక్కి వినండి / చూడండి  !
ఆయన గారి దృష్టి లో నీరు కేవలం  ఒక వ్యాపార వస్తువు !  అంతే కాక , ప్రపంచం లోని అతి పెద్ద కంపెనీలలో ఒకటైన నెస్లే కంపెనీ అధిపతి గా తాను , తన ఉద్యోగుల శ్రేయస్సు కోరుతూ, ఈ మాట చెబుతున్నాననీ , అది తన బాధ్యత అని కూడా చెప్పాడు ! దీనిలో అంతర్యం ఏమిటంటే , ఇంకా , ఇంకా వీలైనన్ని లాభాలు, నీటిని అమ్మి కూడా, నెస్లే కంపెనీకి కలిగించి , తద్వారా  తన ఉద్యోగులకు , ఉద్యోగ భద్రత కలిగించడమే ! ఈ నీటిని ప్రైవేటీకరించడం అనే విషయం లో విపరీతం గా నష్టపోయేది , మారు మూల గ్రామాలలోనూ ,  నగరాలలో మురికి వాడలలోనూ నివశిస్తూ , కేవలం సరిఅయిన తాగు నీటి వసతి కూడా లేని లక్షలాది పేద ప్రజలే ! ఇటీవల దక్షిణ ఆఫ్రికా లో తీవ్రమైన ప్రజా ప్రతిఘటన ఉన్నా కూడా,  నీటిని ప్రైవేటీకరించడం వల్ల , తాగే నీటిని కొనుక్కోలేక , కలుషిత నీటిని తాగి, కనీసం రెండు వందల మంది పేద ప్రజలు కలరా తో మరణించారు ! ఐక్య రాజ్య సమితి కూడా , జీవించే హక్కు తో పాటుగా , నీరూ , ఆహారం , బట్టా , ప్రతి మానవుడి ప్రాధమిక హక్కు అని తీర్మానించింది కూడా  ! కానీ ఇట్లా ప్రపంచం లోని బడా కంపెనీ లు నీటిని ఒక వ్యాపార వస్తువు గా మార్చి సొమ్ము చేసుకుంటున్నాయి ! ఇప్పటికే భారత దేశం లో కూడా ,నీళ్ళ ట్యాంకు వాడి దగ్గర నుంచి , నీళ్ళ బాటిల్స్ సరఫరా చేసే వాడి వరకూ విచక్షణా రహితం గా దోచుకుంటున్నారు ప్రజలను ! ఈ మధ్య నే మహా రాష్ట్ర లో తీవ్రమైన నీటి కరువు వచ్చి , మొక్కల కు సరఫరా చేసే నీటి ట్యాంకు వెంబడి ,  తాము  ఆ నీటిని తాగటానికి పరుగులు తీసే ప్రజలను ,కూడా చూశాము ! 
ముందు ముందు ,   సీసాలలో నింపి  ఉన్న, మనం పీల్చే గాలిని కూడా  కొనడానికి సిద్ధ పడదామా ?!!!
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

అభినవ ద్రౌపదులు !

In మానసికం, Our minds on ఏప్రిల్ 20, 2013 at 1:52 సా.

అభినవ ద్రౌపదులు !  

ఎక్కడో కాదు , ఉత్తర భారత దేశం లో , అనేక మంది స్త్రీలు ఒకరి కన్నా ఎక్కువ మంది భర్తల తో ( సంసార ) జీవితం గడుపుతున్నారు ! ఆశ్చర్య కర విషయం ఏమిటంటే , వారు అందరూ , శాంతియుతం గా జీవితం సాగిస్తున్నారు ! ఇక జూదాలు ఏవీ ఆడకుండా , అభినవ మహాభారత యుద్ధం చేయకుండా  ఇట్లాగే ” ఆనందం గానే ” ( ???!!! )  జీవితం గడుపుతూ ఉండాలని ఆశిద్దామా ?!!!
 
ఈ క్రింద వీడియో లింక్ మీద క్లిక్ చేసి , వివరాలు చూడండి !  
 
 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

5. గర్భం దాల్చితే, డయాబెటిస్ రిస్కు ఎక్కువ అవుతుందా?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health, Our minds on ఏప్రిల్ 19, 2013 at 8:26 సా.

5. గర్భం దాల్చితే డయాబెటిస్ రిస్కు ఎక్కువ అవుతుందా? 

డయాబెటిస్ గురించిన కొన్ని వివరాలు క్రితం టపాలలో మనం తెలుసుకున్నాం కదా ! కొన్ని నివారణోపాయాలు కూడా తెలుసుకున్నాం కదా !మరి స్త్రీ గర్భం దాల్చగానే డయాబెటిస్ రిస్కు ఎక్కువ అవుతుందా ? :
ఒక్క మాటలో సమాధానం,  ఔననే చెప్పుకోవాలి ! వాటి వివరాలు తెలుసుకుందాం ! ఈ వివరాలు,ముఖ్యం గా   పిల్లా పాపలతో, కుటుంబం ప్రారంభించుదామనుకునే ప్రతి జంటా  తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ! ఒక అంచనా ప్రకారం, ప్రతి వంద మంది   గర్భ వతులలోనూ , కనీసం పద్దెనిమిది మంది కి గర్భం తో ఉన్నప్పుడు , డయాబెటిస్ వచ్చే రిస్కు ఉంది !
గర్భం లో డయాబెటిస్ రావడానికి కారణం ఏమిటి ?:
ఇప్పటి వరకూ గర్భం దాల్చినప్పుడు, డయాబెటిస్ రావడానికి ఖచ్చితమైన కారణాలు తెలియలేదు , కానీ  పెరుగుతున్న శిశువు కు అనువుగా తల్లి హార్మోనులలో కొన్ని మార్పులు జరిగి , తల్లి నుంచి వచ్చే ఇన్సులిన్ అనే రక్తం లో షుగర్ లేదా చెక్కర ను కంట్రోలు చేసే హార్మోను సరిగా పనిచేయ నీయక పోవడం జరుగుతుంది ! దీనిని ఇన్సులిన్ రెసిస్టె న్స్ అంటారు ! పిండ దశలో ఉన్న శిశువు కు అవసరమయిన మావి లోనుంచి వచ్చే హార్మోనులు, తల్లి నుంచి వచ్చే ఇన్సులిన్ ను సరిగా పని చేయనీయవు ! దానితో తల్లి లో  డయాబెటిస్ వచ్చే రిస్కు ఎక్కువ అవుతుంది. గర్భం పూర్తి అయి , మావి కూడా శిశువు జన్మించాక బయటికి వస్తుంది కాబట్టి ,క్రమేణా ,  ఇన్సులిన్ పనిచేయడం మొదలై డయాబెటిస్ తల్లి లో మాయం అవుతుంది !  ఒక విధం  గా , గర్భం దాల్చినప్పుడు తల్లి లో కనిపించే డయాబెటిస్ ” మావి చేసే మాయ ” అన్న మాట ! 
మరి తల్లి కి గర్భం లో డయాబెటిస్ వస్తే  ఏమవుతుంది ? మళ్ళీ  ప్రసవం అవగానే ఆ డయాబెటిస్ మాయం అవుతుంది కదా ? :
గర్భం దాల్చినపుడు డయాబెటిస్ కనుక వస్తే వాటి పరిణామాలు   తల్లి మీదా,  గర్భం లో పెరుగుతున్న శిశువు మీదా కూడా ఉంటాయి ! 
1. తల్లి రక్తం లో ఏర్పడిన అధిక చెక్కెర అంటే షుగర్ , రక్త నాళాల ద్వారా శిశువు లో ప్రవేశించి , శిశువు బరువు ను పెంచుతుంది !  ఈ బరువు సాధారణ బరువుకన్నా ఎక్కువ గా ఉంటుంది ! 
2. శిశువు బరువు ఎక్కువ గా ఉండడం వల్ల   ప్రసవ సమయం లో బయట కు వచ్చే సమయం లో శిశువు భుజాలు ( పెద్దవి అవడం వల్ల ) గాయ పడే ప్రమాదం ఉంది ! 
3. అంతే కాక , శిశువు ఎక్కువ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది ( తన రక్తం లో ప్రవేశించిన ఎక్కువ చెక్కెర ను నియంత్రించుకోవడం కోసం ) దానితో శిశువు రక్తం లో చెక్కెర శాతం తగ్గిపోతూ , ఊపిరి తీసుకోవడం లో సమస్యలు ఏర్పడే రిస్కు ఎక్కువ అవుతుంది ! 
4. ఇంకా ,  పరిశోధనల వల్ల , ఇట్లా అధిక బరువు తో పుట్టిన శిశువులలో , వారు పెరిగి పెద్ద అవుతున్నపుడు వారికి డయాబెటిస్ వచ్చే రిస్కు ఎక్కువ అవుతుంది !  
శిశువుకే కాక , గర్భం దాల్చిన సమయం లో డయాబెటిస్ వచ్చే ప్రతి ముగ్గురు తల్లుల్లో , కనీసం ఇద్దరికి , క్రమేణా డయాబెటిస్ వస్తుంది  అని తెలిసింది !  
 
ఈ క్రింది లింకు మీద క్లిక్ చేయండి  ఈ విషయం మీద ఎక్కువ అవగాహన ఏర్పడడానికి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

3. మరి, అసలు రతి ( సెక్స్ ) లో ఎన్ని క్యాలరీలు ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఏప్రిల్ 18, 2013 at 11:47 ఉద.

3. మరి  అసలు రతి ( సెక్స్ )  లో ఎన్ని క్యాలరీలు ?

క్రితం టపాలో  రతి కి ముందు జరిగే ముందాట ( అంటే ఫోర్ ప్లే  ) లో జరిగే వ్యాయామమూ , వ్యయమయే క్యాలరీల వివరాలు శాస్త్రీయం గా సెక్సాలజిస్ట్ పరిశోధనల ప్రకారం తెలుసుకున్నాం కదా ! మరి అసలు రతి    మాటేంటి ? అసలు సిసలైన సెక్స్, అంటే పెనె ట్రే టివ్ సెక్స్ ( అంటే పురుషాంగం యోనిలో ప్రవేశింప చేసి, ఇరువురూ అనుభవించే  ” అసలైన రతి ” ) లో క్యాలరీలు వ్యయం ఎట్లా అవుతాయి ? ఆ వ్యయాన్ని ఎట్లా ఎక్కువ చేసుకోవచ్చు ? 
సామాన్యం గా, ఒక సారి రతి  సంపూర్ణం గా జరిగితే , కనీసం నూట నలభై నాలుగు క్యాలరీలు దహించ బడతాయి, అంటే వ్యయమవుతాయి ! ఈ లెక్క , ఒక సారి,  స్త్రీ పురుషులు , ఓ అరగంట కనుక రతి లో పాల్గొన్నట్టయితే అనుకుని వేసిన లెక్క . అంటే,  మీరు తిన్న ఓ పెద్ద చాక్లెట్ బార్ లో ఉండేన్ని క్యాలరీలు ఖర్చు చేసినట్టే ! ఎక్కువ క్యాలరీలు కాల్చాలంటే, ”  రతిలో ముఖ్యం గా చేయవలసినది, చాలా కామ పూరితం గా నూ , చాలా ఎక్కువ సమయమూ, స్త్రీ పురుషులిరువురూ అత్యుత్సాహం తో , కానీ ఆత్రుత పడకుండా , నింపాది గా  పరస్పరం , ప్రేమానురాగాలను కామ వాంఛ తో కలగలిపి ” రతి రంగం ” లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి ! మన అచ్చ తెలుగు లో చెప్పుకోవాలంటే , క్రియా శీలురు కావాలి, ప్రేయసీ ప్రియులిరువురూ ! ” అని ‘అనుభవజ్ఞుల’ ఉద్భోద ! రతి కార్యం జరిగే సమయం లో,ఇంకా ఖచ్చితం గా చెప్పుకోవాలంటే , ఓ గాఢమైన కౌగిలి లో ‘ మరుగు” తున్నప్పుడో , పెదవులు నాలుగూ ‘ సీలు ‘ వేసిన మగత ముద్దు లో ‘మునిగి ఉన్నప్పుడో ,’ లేదా  పురుషాంగం యోని ద్వారా   ఒక సవ్యమైన విధం గా అంటే ఒక రిధం లో ప్రవేశిస్తూ ఉన్నపుడో , భారమైన  ఆనందోద్వేగాల నిట్టూర్పు , ఇంకా ఆర్గాజం పొందుతూ , చేసే మూలుగులూ , కూడా ఓ ముప్పై క్యాలరీల వరకూ వ్యయం అవుతాయి” , అంటే  భారమైన మూలుగులూ, నిట్టూర్పులు కూడా క్యాలరీల వ్యయానికి దోహద పడతాయని శెలవిచ్చారు కింబాచ్ గారు ! ఇక్కడ గమనించ వలసినది, కేవలం మూలుగులు , నిట్టూర్పులు క్యాలరీలను దహించవు. ప్రేమ పూర్వకమైన రతి లో, ప్రణయోద్వేగం జనించి,   ఆ అనుభూతులను ఆస్వాదిస్తూ , కామోచ్చ్చ దశ అంటే క్లైమాక్స్  చెందుతున్న ప్పుడే , ఆ సన్నని మూలుగులు కూడా, ఎన్నో క్యాలరీలు వ్యయం చేస్తాయని !  
 ఇంకో ముఖ్య విషయం ,”  అధిక భారం తగదు” :  మనకందరికీ తెలుసు, మనం బరువులు మోస్తే మన క్యాలరీలు ఎక్కువ ఖర్చు అవుతాయని ! అదే సూత్రం రతి లోనూ వర్తిస్తుంది ! సంప్రదాయ రతి కార్యం లో , స్త్రీని ( పురుషుడి ) భారం మోయడమే సహజమనుకునే వారు చాలా మంది ఉంటారు !  ఇట్లా చేయడం వల్ల రతి, నిజం గానే ” అతి భారం ” అవుతుంది , ముఖ్యం గా స్త్రీకి ! స్త్రీ పురుషులిరువురూ , ఉల్లాసం గా , కామ వాంఛ  తో, కామోద్వేగం తో,  క్రియా శీలురు అయి, ఆనంద డోలిక లలో తేలుతూ ఉండాలంటే , వారు తరచూ రతి సమయంలో ” స్థాన భ్రంశం ” కూడా చెందుతూ ఉండడం ఉత్తమం ” అంటారు కింబాచ్ గారు ! ప్రత్యేకించి ఆమె చెప్పేది ,  పురుషు ని మీద కనుక స్త్రీ కూర్చుని ” రతి ” లో పాల్గొని  ” రత్యానందం ” పొందుతే , ”  కనీసం ఆ అరగంట సమయం లో రెండు వందల ఏడు క్యాలరీలు వ్యయమవుతాయి ఆ స్త్రీలో ” ! అని !  రతి రీతులు ఎట్లా ఉన్నా , స్థాన భ్రంశాలు జరుగుతూ ఉన్నా కూడా  చివరగా ఇరువురూ ఆర్గాజం పొందడం ద్వారానే , అత్యధిక క్యాలరీలు దహింప బడి , అత్యధిక ఆనందం కూడా పొందగలుగుతారు ” అన్న మాట కింబాచ్ గారి ” తుది మెరుపు” ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 ( మీకు తెలుసా ? ఈ బ్లాగులో  ‘ medline plus ‘ అనే విడ్జెట్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ ఆరోగ్య విషయం మీదనైనా శాస్త్రీయ మైన వివరాలు లభ్యమవుతాయని !  కాక పొతే అవన్నీ ఆంగ్లం లోనే ఉన్నాయి ) 

రతి వ్యాయామం కాదా.2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఏప్రిల్ 16, 2013 at 10:42 సా.

రతి వ్యాయామం కాదా.2. 

 
మీ హస్త లాఘవం కూడా క్యాలరీలను దహించి  ఆమె లో కామోత్తేజ దీపం వెలిగిస్తుంది ! :
 క్యాలరీలు వ్యయం కావట్లేదు అనుకునే వారికి రతి  ముందు వారి చేతులతో చూపించే ” చొరవ ”  కూడా  బాగా ఉపయోగ పడి, కనీసం అరగంటకు ఓ యాభై క్యాలరీలను దహిస్తుంది ! అంటే ఒక గంటకు వంద క్యాలరీలు ! ఓపికను బట్టి , హస్త లాఘవం ఒక గంట వరకూ చూపించ వచ్చు !  ప్రేయసీ ప్రియులు రతి ముందే  ఒకరి నుంచి ఇంకొకరు ఆనందాన్ని దోచుకోవడమే కాకుండా పంచుకోవచ్చు కూడా !  ” చాలా సుతి మెత్తని , భావోద్వేగ పూరితమైన  అనుభూతులు రేకెత్తించే స్పర్శ మీ చేతులతో , అతి నెమ్మది గా కలిగించాలి !  ఆమె దేహం మీద అతడూ , అతని దేహం మీద ఆమె  కేవలం కర స్పర్శ తో నే  క్యాలరీలను మండి స్తూ , రతికి ముందు అవసరమయే ఉష్ణోగ్రత జనింప చేయవచ్చు అంటారు సెక్సాలజిస్ట్ కింబాచ్ ! అంతే కాకుండా ఒకరినొకరు తమ దేహాలు పరస్పరం తగిలించు కుంటూ కూడా , అంటే కేవలం చేతులతో కాకుండా క్యాలరీలను కాల్చ వచ్చునంటారు ఆమె ! 
 
మర్దన తో అంటే మసాజ్ తో కూడా వేడిని పుట్టించ వచ్చు ! మీ మెసేజ్ ను ఎక్కడా  రాయకుండా నే తెలప వచ్చు ! 
” మీ ప్రియుడికి మీ చేతులతో ఒక మంచి మసాజ్ , అదే మర్దన ఇచ్చినా కూడా  మీలో  ప్రేమ  ప్రవర్ధనం అవుతుంది ”  మీరు ప్రేమ తో , అతని శరీరం మీద మర్దన చేసే ప్రతి సారీ , మీ హృదయ స్పందన వేగం ఎక్కువ అవుతూ , మీలో కోరికల గుర్రాలను చెల్లా చెదురుగా పరిగెత్తిస్తుంది ”  మీ శరీరాన్ని క్యాలరీలు కాల్చే మోడ్ లో పెడుతుంది ! ఇక్కడ కూడా ” మీరు ఎంత నిదానం గా , ఎంత ” లోతు గా ” మర్దన చేస్తే, అంత లాభం !  క్యాలరీలు దహించడం లోనూ , మీ ఆనందపు గ్యాలరీ లో మీ అనుభవాలను పదిల పరుచుకోవడం లోనూ ” అంటారు కింబాచ్ !  ఇంకో చిరు సూచన కూడా ఆమె చేశారు ! మీరు కేవలం శయన మందిరం లో కాక ఈ మసాజ్  ఇవ్వడం, పుచ్చుకోవడం , ఒక మసాజ్ బల్ల , అదే టేబుల్ ఉపయోగించడం ఉత్తమం ! మసాజ్ టేబుల్  మీద ఒకరుండి , ఇంకొకరు నుంచుని మసాజ్ చేస్తే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి ! ” అని కూడా ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !     

రతి ( సెక్స్ ) వ్యాయామం కాదా ?

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on ఏప్రిల్ 14, 2013 at 7:02 సా.

రతి ( సెక్స్ )  వ్యాయామం కాదా ? : 

అన్యోన్య దాంపత్య జీవితం లో  రతి  అంతర్భాగమే కదా !  ఆరోగ్య వంతులైన దంపతులు తరచూ రతి లో పాల్గొంటూ ఉంటే ,  అది వారి మానసిక ఆరోగ్యానికే కాక, శారీరిక ఆరొగ్యానికీ  ఎంతో మంచిది ! ప్రేమానురాగాలతోనూ , భావావేశ పూరితం గానూ , పాల్గొనే ప్రతి రతీ , అనేక ఆనందాలు కలిగించడం తో పాటుగా అనేక వందల క్యాలరీల ను కూడా  కాల్చి, ప్రేమలో వేడిని పుట్టిస్తుంది !  శాస్త్రీయ పరిశోధనల వల్ల  రతి కార్యక్రమం లో ప్రతి చర్యా , స్త్రీ పురుషుల శక్తిని ( క్యాలరీ ల రూపం లో ) ఉపయోగించడం తో పాటుగా, వారిలో నూతన శక్తిని కూడా ఆవిష్కరిస్తుంది !  ఒక నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది !
ఈ క్రింద  ఉన్న వివరాలు చూడండి !  ఇవన్నీ స్త్రీ పురుషుల బరువు షుమారు డెబ్బై కిలోల బరువు ఉన్న స్త్రీ పురుషుల ను ఆధారం గా చేసికొని గుణించినవి. 
1. చుంబనం :  ( ముద్దు ) :  స్త్రీ పురుషులు  ఒకరినొకరు  రతి క్రియ మొదలు పెట్టే ముందు ఒక అరగంట కనుక ఒకరి మీద ఒకరు ( ఆకాశం ప్రేమావ్రుతం అయాక ! )  ముద్దుల వర్షం కురిపించుకుంటే , ఆ ముద్దు తీవ్రతను బట్టి , మీరు అరవై ఎనిమిది క్యాలరీల ను వ్యయం చేస్తారు !  మీ ప్రేమ ఘాటు గా ఉంటే ,  మీరు వ్యయం చేసే క్యాలరీలు ఎక్కువ అవుతాయి అంటే , మీరు  తొంభై  క్యాలరీల వరకూ వ్యయం చేయవచ్చు ! జయా కింబాచ్  అనే లాస్ ఏంజెల్స్ కు చెందిన సెక్సాలజిస్ట్ ”  మీరు వ్యయం చేసే క్యాలరీలను ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు , మీరూ  మీ భాగాస్వామీ  కాస్త  పొజి షన్లు  సర్దుబాటు చేసుకుంటే !  ” అని కూడా శలవిస్తున్నారు ! వారి ఉవాచ ప్రకారం,శయన మందిరం లో  ప్రియుడి మీదగా ప్రియురాలు చేరి, అతని పెదవుల మీద ఒక చుంబనం అందించి , మళ్ళీ దూరం గా జరగడం చేయమంటున్నారు ! ఇట్లా ముద్దులను స్త్రీ ” అందని ద్రాక్ష పళ్ళ లా , అందించీ అందించకుండా ముఖాన్నీ ( తన శరీరాన్నీ ) దూరం గా జరుపుతూ ఉంటే , వ్యాయామం అవడమే కాకుండా , క్యాలరీలు కూడా వ్యయమవుతాయి ! అంటున్నారు ఆమె !
2. వలువలు తీయడం :  స్త్రీ పురుషులు  రతి క్రియ కు ముందు బట్టలు తీసుకునే సమయం లో కూడా కనీసం ఎనిమిది నుంచి , పది క్యాలరీలు ఖర్చు చేస్తారని తెలిసింది . ఒక ఇటాలియన్ సెక్స్ స్పెషలిస్టు , పురుషుడు కనుక తన చేతులతో కాక తన పళ్ళతో అంటే దంతాలతో, పెదవులతో  స్త్రీ ధరించిన బ్రా ను కనుక  ఊడ దీస్తే , అప్పుడు, కనీసం అరవై నుంచి డెబ్బై క్యాలరీలు ఖర్చు అవుతాయని ప్రవచించారు ! గిల్డా కార్ల్ అనే సైకో తెరపిస్ట్  ” వడి వడి గా బట్టలు తీసుకుంటే ఉండే ఆనందం కన్నా ,నింపాదిగా , ఒకరినొకరు ఆడించు కుంటూ, దొంగాట లాడుతూ , కొంత సస్పెన్స్ తో  కనుక  ఈ ( నగ్నం గా సిద్దమయే ) క్రియ జరిగితే కూడా ఒక రకమైన వ్యాయామం అయి , క్యాలరీలు ఖర్చు అయినా , ఆనందం కూడా దక్కుతుందని అంటారు ఆమె !
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు ! 

4. ఎక్సర్సైజు డయాబెటిస్ ను ఎట్లా నివారిస్తుంది ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం. on ఏప్రిల్ 13, 2013 at 11:46 ఉద.

4. ఎక్సర్సైజు డయాబెటిస్ ను ఎట్లా నివారిస్తుంది ?

డయాబెటిస్ నివారణలో మనం తినే ఆహారం యొక్క ప్రాముఖ్యత గురించి క్రితం టపాలలో తెలుసుకున్నాం కదా ! మరి వ్యాయామం లేదా ఎక్సర్సైజు డయాబెటిస్ ను ఎట్లా నివారించ గలదు ?: 
1. మనం రోజూ చేసే వ్యాయామం , మన రక్తం లో చెక్కెర శాతాన్నీ , చెడు కొవ్వు శాతాన్నీ , ఇంకా రక్త పీడనాన్నీ అంటే బీపీనీ తగ్గించడమే కాకుండా నియంత్రణ లో ఉంచుతుంది !
2. వ్యాయామం , మనకు  డయాబెటిస్ , పక్షవాతం , ఇంకా గుండె జబ్బు వచ్చే అవకాశాన్ని , లేదా రిస్కును తగ్గిస్తుంది !
3. వ్యాయామం , మన గుండెనూ , ఎముకలనూ , ఇంకా మన శరీరం లో ఉన్న కండరాలనూ బలవర్ధకం చేస్తుంది !
4. మన శరీరం లో రక్త ప్రసరణ ను కూడా అభివృద్ధి చేస్తుంది !
5. మన శరీరం లోని అన్ని రకాల కీళ్ళనూ అంటే జాయింట్ లనూ బిగుతు గా కాక వ్యాకోచింప చేసి సులభం గా మనం ఏ నొప్పులూ లేకుండా మన కీళ్ళు కదిలించ గలిగేట్టు చేసుంది !
 
మరి దేనిని మనం వ్యాయామం అంటాము ?:
మన శరీరానికి సంపూర్ణ వ్యాయామం కావాలంటే మనం ఈ క్రింద పేర్కొన్న శరీర వ్యాయామం చేస్తూ ఉన్నామో లేదో  పరిశీలించుకోవాలి !
1. నడవడమూ , రోజూ మన పనులు చేసుకుంటున్నప్పుడు ఒకే చోట స్థిరం గా ఉండక అటూ ఇటూ తిరుగాడుతూ ( అంటే నిరంతరం కాదు, తరచుగా ! ) అవసరమైనప్పుడు మెట్లు ఎక్కుతూ , దిగుతూ ఉండడం ! 
2. వడి వడి గా నడవడమూ , అంటే బ్రిస్క్ వాకింగ్ చేయడమూ , ఈత కొట్టడమూ , లేదా డాన్సు చేయడమూ లాంటి ఏరోబిక్ వ్యాయామాలు చేస్తూ ఉండడం ! సైకిల్ తొక్కడం కూడా ఈ రకమైన వ్యాయామం క్రింద చెప్పుకోవచ్చు !
3. స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామాలు అంటే , తరచూ బరువులు ఎత్తుతూ ఉండడం లాంటి వ్యాయామాలు ( ఇక్కడ గమనించ వలసినది కేవలం డంబెల్స్ ఎత్తడమే వ్యాయామం కాదు, మనం రోజూ చేసే పనులలో అనేక సార్లు నీళ్ళ బకెట్ మోయడమో , లేదా కూరలు మోసుకు రావడమో , లేదా పసి పిల్లలను ఎత్తుకు తిప్పడమో 
లాంటి పనులు కూడా ఈ రకమైన వ్యాయామం కోవలోకి వస్తాయి ! ) 
4. స్ట్రెచ్ చేసే వ్యాయామాలు అంటే మన కండరాలను వ్యాకొచింప చేసి చేసే వ్యాయామాలు !
ఇవన్నీ కూడా మన వ్యాయామ కార్యక్రమం లో భాగం గా ఉండేట్టు మనం చూసుకోవాలి ! 
 
ఎంత సేపు చేయాలి ?
వ్యాయామం  కనీసం రోజూ అరగంట చేసినా ,  ఆ వ్యాయామం వల్ల అనేక లాభాలు ఉంటాయని , పరిశోధనల వల్ల స్పష్టమైంది !  ఊబకాయం అంటే ఒబీసిటీ ఉన్నవారు ,ఎక్కువ సమయం వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి , ( వారి ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పుల తో పాటుగా ! ) 
 మధుమేహం ఉన్నవారు వ్యాయామం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ క్రింది వీడియో చూడండి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

అంతర్జాలం లో మీ కుటుంబ ఆరోగ్య వివరాల పేటిక , మైక్రోసాఫ్ట్ ” హెల్త్ వాల్ట్ ” Health Vault ” !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 11, 2013 at 11:02 ఉద.

అంతర్జాలం లో మీ  కుటుంబ  ఆరోగ్య  వివరాల పేటిక  , మైక్రోసాఫ్ట్ ” హెల్త్ వాల్ట్ ” Health Vault ” !

 
మైక్రో సాఫ్ట్ వారు అంతర్జాల వాడక దారులందరికీ అందిస్తున్న  విలువైన కానుక హెల్త్ వాల్ట్  !
1. మీ ఆరోగ్య వివరాలన్నీ పొందు పరుచు కోవచ్చు  అంతర్జాలం లో !
2. మీ బీపీ మానిటర్ ను  మీ కంప్యూటర్   తో అనుసంధానం చేసుకోవచ్చు !
3. మీ హృదయ స్పందన మానిటర్ ను అనుసంధానం చేసుకోవచ్చు 
4. మీ రక్తం లో చెక్కర ను సూచించే గ్లూకోజు మానిటర్ ను  అనుసంధానం చేసుకోవచ్చు 
5. మీ రక్త పరీక్షల , ఎక్స్ రే ల వివరాలను కూడా పొందు పరుచు కోవచ్చు ఇక్కడ !
6. మీరు తీసుకునే మందుల వివరాలు , మీకు ఉన్న ఎలర్జీ ల వివరాలు కూడా ఇక్కడ చేర్చ వచ్చు !
7. మీ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలనూ ఈ సాఫ్ట్ వేర్ లో ఎక్కించు కోవచ్చు ! 
8. మీరు ప్రపంచం లో ఎక్కడైనా ( అంతర్జాలం ఉన్న చోట ) మీ వివరాలను  ఓపెన్ చేసి చూసుకోవచ్చు ! 
9. మీరే కాక , మీ కుటుంబ సభ్యులందరి ఆరోగ్య వివరాలు కూడా ఇక్కడ ఉంచుకోవచ్చు ! 
 
మీకు కావలసినదేమిటి ?:
 
మైక్రో సాఫ్ట్ వారు మీకు ఈ అవకాశాన్ని ఉచితం గా అందిస్తున్నారు ! మీకు కావలసినదల్లా మీ కంప్యుటరూ , ఇంకా మీ హాట్ మెయిల్ ( ఈమెయిలు ) అడ్రసూ ! మీకు ఒకవేళ ఇప్పటికే లేకపోతే , హాట్ మెయిల్ లో మీ ఈమెయిలు అడ్రస్ ఏర్పాటు చేసుకోవడం కూడా ఉచితమే ! 
 
శ్రీవిజయ నామ సంవత్సరం లో మీరు మీ కోసమూ , మీ కుటుంబ సభ్యుల కొసమూ , అంతర్జాలం లో హెల్త్ వాల్ట్ ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని భావిస్తున్నారా ? అయితే ప్రయత్నించండి ! మైక్రో సాఫ్ట్ వారి ఉచిత కానుక  ” హెల్త్ వాల్ట్ ” ! మిగతా అన్ని వివరాలకూ  www .healthvault.com  చూడండి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు ! 
 

‘బాగు’ సందర్శకులందరికీ ” శ్రీ విజయ ” నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఏప్రిల్ 10, 2013 at 11:11 సా.

పని సూత్రాలు . 42. మీ దైన పరిచయాల వలయం ఏర్పరుచుకోండి !

In మానసికం, Our minds on ఏప్రిల్ 9, 2013 at 10:26 సా.

పని సూత్రాలు . 42. మీ దైన  పరిచయాల వలయం ఏర్పరుచుకోండి ! 

మీరు పని చేసే ఏ చోట అయినా , మీ తెలివి తేటలనూ , మీ కష్ట పడే స్వభావాన్నీ , సొమ్ము చేసుకుందామనుకునే బాసులే కాకుండా , మిగతా ఉద్యోగులు కూడా మీ ఉపయోగం పొందుదామని చూస్తూ ఉంటారు ! మీ తో పనులు చేయించు కోవడమో , లేదా బాధ్యతా యుతమైన పనులు చేసే సమయం లో ఆ పనులు మీ మీదకు నెట్టి , వారు చల్లగా జారు కుందామనో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు !  మరి మీరు పనిసూత్రాలకు నిబద్ధులై ఉండి,  అట్లాంటి వారి ప్రయత్నాలను గమనిస్తూ అప్రమత్తం గా ఉండాలి ! మీరు వారికి ఒక ఉదాహరణ కావాలి ! ఒక ఆదర్శం కావాలి , మీ సుగుణాల ద్వారా ! అంటే  మీరు నిజాయితీ గా ,విశ్వాస పాత్రులు గానూ ,  దయాగుణం తోనూ , స్నేహ పూర్వకం గానూ ఉండాలి మీ సహా ఉద్యోగులతో సంబంధాల విషయం లో ! అట్లా ఉంటే , మీ సహ ఉద్యోగులు మిమ్మల్ని విశ్వసించడం మొదలు పెడతారు ! మీ సలహా తీసుకోడానికి వెనుకాడరు !  సహాయం అవసరం ఉన్నప్పుడు మీ దగ్గరకు రావడానికి సందేహించరు !  అంతే కాక మీ కు నిత్యం ” దగ్గర ” గా ఉంటారు ! అందుకే మీరు, మీకు విశ్వాస పాత్రమైన స్నేహితులనూ , పరిచయాలనూ , పెంపొందించు కుంటూ ఉండాలి ! మీరు నిజాయితీ గా నూ విశ్వాస పాత్రులు గానూ మీ ఉద్యోగం చేస్తూఉంటే  , మీతో ” చేయి కలపడానికి” అనేకమంది ఉద్యోగులు ముందుకు వస్తారు ! మీరు సదా మీ చిరునవ్వుతో , ఇతర ఉద్యోగుల సమస్యలను అర్ధం చేసుకుని , మానవతా దృక్పధం తో మీకు చేతనైనంత సహాయం చేస్తూ , వారి కి సహకరిస్తూ ఉంటే,మీరు వారి విశ్వాసం సునాయాసం గా పొంద గలరు ! మీరు వారికి చేసే ప్రతి చిన్న సహాయమూ , మీకు వారి లాయల్టీ రూపం లో అందుతూ ఉంటుంది ! మీలో అట్లా నాయకత్వ లక్షణాలు పరిణితి చెందడమే కాకుండా, మీరు మీ దీర్ఘ కాలిక లక్ష్యాలను చేరుకోవడం లో ప్రముఖ పాత్ర వహిస్తాయి ! ఈ విధం గా  మీరు రోజూ వేసే ప్రతి అడుగూ, మీ లక్ష్యాన్ని చేరుకునే  దూరాన్ని తక్కువ చేస్తుంది ! 
ఇంకో పని సూత్రం తరువాతి టపాలో !