ఫైటో న్యూట్రి ఎంట్ ల ( phytonutrients ) గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి ?3.
లైకో పీన్ :
ఈ జీవ రసాయనం , పండ్లకు ఆకర్షణీయమైన రంగు ను ఇవ్వడమే కాకుండా , ప్రోస్టేట్ గ్రంధి
( పురుషులలోనే ఉంటుంది ) కి వచ్చే క్యాన్సర్ ను నివారిస్తుంది !
ఈ లైకో పీన్ , రామ ములగ పండ్ల లోనూ ( టమాటా , లేక తక్కాళీ పండు అని కూడా అంటారు ఒక్కో ప్రాంతం లో ) , కర్బూజా పండు లోనూ , గ్రేప్ ఫ్రూట్ లోనూ పుష్కలం గా లభిస్తుంది !
ల్యూటిన్ :ఈ జీవ రసాయనం కూడా , ఆకుకూరల లో పుష్కలం గా ఉండి , అనేక రకాలైన కంటి జబ్బులను నివారించడం లో సహాయ పడుతుంది !
ఎల్లాజిక్ ఆమ్లం :
అనేకరకాలైన బెర్రీస్ లోనూ , ఇంకా , దానిమ్మ పండు లోనూ పుష్కలం గా ఉంటుంది ! ( బెర్రీస్ అంటే స్ట్రా బెర్రీస్ , రాస్ప్ బెర్రీస్ , బ్లాక్ బెర్రీస్ మొదలైనవి ). అనేక రకాలైన క్యాన్సర్ లను నివారించడం లోనూ , వాటి తీవ్రత ను తగ్గించడం లోనూ , ఎల్లాజిక్ ఆమ్లం ఉపయోగ పడుతుందని తేలింది , కానీ మానవుల లో , ఈ జీవ రసాయనం ఎట్లా పని చేస్తుందో వివరం గా తెలియ లేదు, ఇంకా !
ఫ్లావినాయిడ్స్:

క్యా టె చిన్ లూ , హెస్పరిడిన్ లూ , ఫ్లావినాల్ లూ , వివిధ రకాలైన ఫ్లావినాయిడ్స్ ! ఈ జీవ రసాయనాలు , పండ్లలో , ముఖ్యం గా యాపిల్ పండ్ల లోనూ , బెర్రీస్ లోనూ , ఇంకా ఉల్లిపాయలలోనూ , కూడా లభిస్తాయి ! ఫ్లావినాయిడ్స్ , క్యాన్సర్ నివారణ లోనే కాకుండా , ఆస్త్మా ( ఉబ్బసం ) , గుండె జబ్బు ఉన్న వారికి కూడా అనేక రకాలు గా ఉపయోగ పడతాయి !

( తేయాకు లేదా టీ లో పుష్కలం గా లభిస్తుంది , క్యా టెచిన్ అనబడే ఫ్లావినాయిడ్ ! )
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !