Our Health

Archive for మార్చి 2nd, 2016|Daily archive page

ఫైటో న్యూట్రి ఎంట్ ల ( phytonutrients ) గురించి, మనం ఎందుకు తెలుసుకోవాలి ?2.

In మన ఆరోగ్యం., Our Health on మార్చి 2, 2016 at 6:14 సా.

ఫైటో  న్యూట్రి ఎంట్ ల ( phytonutrients ) గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి ?2. 

ఫైటో న్యూట్రి ఎంట్ లు ఒక పాతిక వేల రకాలున్నాయి ! అంటే 25 వేలు ! వాటిలో ముఖ్యమైనవి ఒక ఆరు ఉన్నాయి , వాటి గురించి తెలుసుకుందాం ! అవి
1. కెరటినాయిడ్స్ ( Carotinoids  )   2. ఎల్లాజిక్ ఆమ్లం ( Ellagic acid  )   3. ఫ్లావినాయిడ్స్ ( flavinoids )  4. రెస్వె ర ట్రాల్ ( resveratrol )  5. గ్లూకోసినోలేట్స్ ( glucosinolates ) 6. ఫైటో ఈస్ట్రో జెన్స్ ( phytoestrogens )  . 
1. కెరటినాయిడ్స్ ( Carotinoids  ) : ఈ కెరటినాయిడ్స్ ఒక ఆరు వేల రకాలు ఉన్నాయి . ఇవి కూరగాయలకూ , పండ్లకూ , వాటి,  వాటి ప్రత్యేకమైన రంగును ఇస్తాయి !
అంతే కాక , ఈ జీవ రసాయనాలు , యాంటీ ఆక్సిడెంట్ లు గా పనిచేస్తాయి , దేహం లో !  జీవ కణాలు  శక్తి హీనం అవుతూ ఉంటే , వాటికి యాంటీ ఆక్సిడెంట్ లు  కలిసి , ఆ జీవకణాలను  తిరిగి శక్తి వంతం చేస్తాయి !   మానవ దేహం లో , జీవ కణాలు నిరంతరం పని చేస్తూ , శక్తి ని కోల్పోతూ ఉంటాయి ! ఆ జీవ కణాలను , తిరిగి శక్తి వంతం చేయడం , అతి ముఖ్యమైన జీవ క్రియ !  రోజూ , తాజా  పండ్లు , కూరగాయలూ తినే వారిలో , ఈ యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలం గా ఉండి , మన జీవ కణాలను , క్రమం గా  శక్తి వంతం చేస్తాయి ! పండ్లూ , కూరగాయలూ , వాటి తాజా తనం పోతున్న కొద్దీ , వాటిలో ఈ యాంటీ ఆక్సిడెంట్ లు  కూడా తగ్గుతూ ఉంటాయి !  కృత్రిమం గా పోస్తున్న రంగులు , హార్మోనులు , కేవలం ,  కూరగాయలను , పండ్లనూ , ఆకర్షణీయం గా చేస్తాయే కానీ , ఆరోగ్యానికి  ఎంతో హాని కూడా చేస్తాయి !
ఇంకో ముఖ్య మైన జీవ క్రియ , అంటే ,  సజీవ కణాల లోనే జరిగే క్రియ :  ఈ కెరటినాయిడ్స్  లో  ముఖ్యమైన  ఐదు రకాలూ , ల్యూటిన్  , లైకోపీన్  ( పైన ఉన్న చిత్రం గమనించండి ,  వేటిలో ఇవి సమృద్ధి గా ఉన్నాయో తెలుస్తుంది ! ) .  వీటిలో మూడు రకాలు , ఆల్ఫా కెరటిన్ , బీటా కెరటిన్ , ఇంకా బీటా క్రిప్ టో  జాంతిన్ ,  జీవ కణాలలో  విటమిన్ A  గా మారుతాయి ! విటమిన్ A  కంటి ఆరోగ్యానికీ , ఒంటి ఆరోగ్యానికీ కూడా అతి ముఖ్యమైన విటమిన్ !    ఈ విటమిన్ లోపం తో , కంటి చూపు మందగించడం , చూపు కోల్పోవడమే కాకుండా , రోగ నిరోధక శక్తి కూడా లోపించి , అనేక రకాల వ్యాధుల బారిన పడడం జరుగుతుంది !  అందుకే , రోజూ తినే , మన ఆహారం లో కెరటినాయిడ్స్ ఉండడం ఎంతో ముఖ్యం ! క్రింద క్లిక్ చేసి , ఒక వీడియో కూడా చూడండి  !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: