
మనం రోజూ తినే ఆహారం లో తాజా కూరగాయలూ , పండ్లూ ముఖ్యమైనవి గా ఉండడం , మన ఆరోగ్యానికి మంచిది !
బిస్కెట్లూ , చాక్లెట్లూ , కేకులూ , ఇతర స్వీట్ లూ , కూడా తియ్యగా ఉంటాయి కదా !? అవి కూడా శక్తి ని ఇస్తాయి కదా ! ? మనకు , అవి తింటే పరవాలేదు కదా ?! , పండ్లకు బదులు ! అని వాదించే వారు , ఈ రోజుల్లో ఎక్కువ గా ఉన్నారు ! అందుకు కారణం ,వారికి , కేవలం తీపిని, రుచినీ తప్ప , ఇతర లాభాలను కూడా పోల్చలేక పోవడమే !
బిస్కెట్లూ , చాక్లెట్లూ , కేకులూ , ఇతర స్వీట్ లూ రుచికరం గా ఉండడమే కాకుండా , ప్రత్యేకం గా కూడా ఉండి , ఆకర్షణీయ మైన ప్యాకెట్ లలో , ఇంకా ఆకర్షణీయ మైన , అమ్మాయి, అబ్బాయి ల ప్రకటనలతో , అన్ని ప్రచార సాధనాలలోనూ హోరెత్తి పోతూ , జనాలను ఊరిస్తూ ఉంటాయి ! వాటిని తినడం కూడదు అని ఇక్కడ చెప్ప దలుచుకోలేదు ! కానీ , ప్రతి వారూ గమనించ వలసినది , వాటికన్నా , ఎన్నో రెట్లు , ఖనిజాలూ , పోషక పదార్ధాలూ , విటమిన్లూ , యాంటీ ఆక్సిడెంట్ లు కలిగి ఉన్న తాజా కూరగాయల గురించీ , పండ్ల గురించిన ప్రకటనలు ఎప్పుడైనా చూశామా మనం ఏ ప్రచార సాధనాలలో నైనా !!??
ఫైటో న్యూట్రి ఎంట్ లంటే ఏమిటి ? : అంటే మొక్కల నుంచి లభ్యమయే పోషక పదార్ధాలు ! ఈ పోషక పదార్ధాలు , మన జీవనాధారం కాదు ! అంటే అవి రోజూ తినకుండా , కూడా మనం జీవించ వచ్చు ! కానీ క్రమేణా , ఆ పోషక పదార్ధాలు , మన శరీరం లో తగ్గి పోయి , విటమిన్లూ , ఖనిజాల లోపం తో అనారోగ్యం కలుగుతుంది ! అంటే , కొన్ని నెలలూ , సంవత్సరాల తరువాత , ఆ యా పోషక పదార్ధాల లోపం శరీరం లో అనేక రూపాలు గా కనిపిస్తుంది !
ఇంకో రకం గా చెప్పుకోవాలంటే , పోషక పదార్ధాలు , ప్రత్యేకించి మొక్కల నుంచి లభ్యమయే పోషక పదార్ధాలు , మనలను ఆరోగ్యం గా ఉంచడమే కాకుండా , క్యాన్సర్ ల బారిన పడకుండా కూడా నివారిస్తాయి ! ( ఆ పని ఎట్లా చేస్తాయో కూడా మనం తెలుసుకుందాం , ముందు ముందు )
ఫైటో న్యూట్రి ఎంట్ లు ఒక పాతిక వేల రకాలున్నాయి ! అంటే 25 వేలు ! వాటిలో ముఖ్యమైనవి ఒక ఆరు ఉన్నాయి , వాటి గురించి తెలుసుకుందాం ! అవి
1. కెరటినాయిడ్స్ ( Carotinoids ) 2. ఎల్లాజిక్ ఆమ్లం ( Ellagic acid ) 3. ఫ్లావినాయిడ్స్ ( flavinoids ) 4. రెస్వె ర ట్రాల్ ( resveratrol ) 5. గ్లూకోసినోలేట్స్ ( glucosinolates ) 6. ఫైటో ఈస్ట్రో జెన్స్ ( phytoestrogens ) .
వచ్చే టపాలో మిగతా విషయాలు !