Our Health

Archive for జనవరి, 2016|Monthly archive page

ఏ నూనెలు , ఏ వంటకు, ఎందుకు , వాడాలి ? 2.

In Our Health on జనవరి 16, 2016 at 3:54 సా.
క్రితం టపాలో చూశాము ,   వేడి చేసే తీవ్రత , సమయమూ పెరుగుతున్న కొద్దీ ,మనం నిత్యం వాడే వంట నూనె లలో  ,  హానికర పదార్ధాలు ఎట్లా ఎక్కువ అవుతాయో ! ఈ యదార్ధం , శాస్త్రీయం గా నిరూపించ బడింది కూడా ! ( క్రితం టపా చూడండి , మరొక సారి , వివరాల కోసం ! )
ఇంకో విషయం కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం , మన ఆరోగ్యం గురించి , మనం సీరియస్ గా ఆలోచించుకునే ట్టయితే ! అదే  ” స్మోక్ పాయింట్ “( Smoke point ) .   క్లుప్తం గా చెప్పాలంటే , మనం వాడే ఏ నూనె అయినా , వేడి చేసినప్పుడు  ఎప్పుడు ( అంటే ఏ ఉష్ణోగ్రత  ) పొగలు వస్తూ ఉంటుందో  ఆ ఉష్ణోగ్రత ను స్మోక్ పాయింట్ అంటారు !
స్మోక్ పాయింట్ తెలుసుకోవడం ఎందుకు ? :
సాధారణం గా,  ఈ స్మోక్ పాయింట్ దగ్గర , నూనెలు , వాటి సహజ గుణాన్ని కోల్పోతాయి ! అంటే  స్మోక్ పాయింట్ కు ముందు ఉన్న రసాయన గుణం మారుతుంది , ఆ తరువాత ! అంటే మనం ఏ నూనెనైతే ఆరోగ్యానికి మంచిది అని  భావిస్తామో , ఆ నూనె కు  ఆ ధర్మం ,  స్మోక్ పాయింట్ ముందు వరకే ఉంటుంది !  ఆ తరువాత ఆ నూనె,  రసాయనికం గా ” విరిగి పోతుంది ” ! ఆరోగ్యానికి హానికరం గా మారుతుంది ! ( క్రితం టపా చూడండి , మరొక సారి , వివరాల కోసం ! ) 
ఇప్పుడు చూద్దాము , మన ( ఆరోగ్యానికి ) కు ఏ  నూనె ఏ  రకమైన వంటలకు , ఆహారానికి మంచిదో !
1. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ : ( extra virgin  olive  oil  ) 
దీనిని ఎట్లా తయారు చేస్తారు ? : 
ఈ నూనెను తయారు చేసే పద్ధతులలో , రసాయనాలను అతి తక్కువ గా వాడుతారు ! అందువల్ల , ఈ నూనె లో వివిధ రకాల ఖనిజాలూ , విటమిన్లూ సంవృద్ది గా ఉంటాయి !  ఈ నూనె తాజా గా కూడా ఉండడం వల్ల , దీనిలో , ఒలీయిక్ ఆమ్లం తక్కువ పాళ్ళలో ఉంటుంది.
ఈ నూనెను ఎందులో వాడడం ఉత్తమం ? :
సలాడ్ లలో నూ , పాస్టా  వండాక , దానిమీద చల్లడానికి , ఈ నూనె ను ఉపయోగిస్తే , దానిలోని పోషక పదార్ధాలు అన్నీ  మన దేహానికి అందుతాయి !
ఈ నూనెను ఎందులో వాడక పోవడం మంచిది ? 
వేపుడు కూరలు వండే  సందర్భాలలో , ఇంకా  ఇతర పిండి వంటలు డీప్ ఫ్రై  చేసే సందర్భాలలో , ఈ నూనెను వాడక పోవడం మంచిది ! ఎందుకంటే , ఈ నూనెకు స్మోక్ పాయింట్ తక్కువ గా ఉంటుంది కనుక ! అంటే  , ఈ నూనె అతి తక్కువ ఉష్ణోగ్రతల లో విరిగి పోతుంది !
2. ఆలివ్ ఆయిల్ ( olive  oil  ) : పై నూనె కూ , ఈ నూనె కూ తేడా , ఒలీయిక్ ఆమ్లం కాస్త ఎక్కువ పాళ్ళ లో ఉండడమే ! మిగతా విషయాలన్నీ పైన చెప్పిన నూనె కు వర్తించినవే  !
3. రేప్ సీడ్ ఆయిల్ ( rape seed oil  ) : ఈ నూనె కు స్మోక్ పాయింట్ ఎక్కువ గా ఉంటుంది , అందువల్ల ,  వేపుడు కూరలు , మిగతా పిండి వంటలు చేసేందుకు , ఈ నూనెను వాడ వచ్చు ! కానీ , ఈ నూనె రుచి  అందరికీ ” రుచించదు ” !
4. సన్ ఫ్లవర్ ఆయిల్ ( sun flower  oil ) లేదా సూర్యకాంతి పుష్ప నూనె ! ఇంకా  వెజిటబుల్ నూనె ( vegetable  oil  ) : ఈ నూనెలు  ఇప్పటి వరకూ ప్రపంచం అంతా విరివి గా వాడతున్నారు కానీ , తాజా పరిశోధనలు , ఈ నూనెలు వంటల్లో వాడక పోవడమే మంచిది అని సలహా ఇస్తున్నాయి !
5. నెయ్యి , కొబ్బరి నూనె ( ghee and coconut oil )  : ఈ నూనెలు,  అతి ఎక్కువ ఉష్ణోగ్రత లలో కూడా ‘ విరిగి ‘ పోవు ! అంటే ఈ నూనెల స్మోక్ పాయింట్ ఎక్కువ గా ఉంటుంది ! అందుకని , డీప్ ఫ్రై చేసి వండే పిండి వంటలకు  ( ఉదా: గారెలు , అరిసె లు , పకోడీ లు , బజ్జీ లు మొదలైనవి ) ఈ రెండు రకాలైన నూనెలను వాడ వచ్చు ! గమనించ వలసినది , ఈ నూనెలను అన్నం లో వేసుకు తినడం ఆరోగ్య కరం కాదు ! 
6. పల్లీ నూనె  ( groundnut oil  ) :  పల్లీ నూనె కు కూడా ఒక మాత్రం గా స్మోక్ పాయింట్ ఉంటుంది , అంటే అది  ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కూ ,  నెయ్యి , కొబ్బరి నూనె లకూ మధ్యస్తం గా ! అందు వల్ల , పల్లీ నూనె ను  పిండి వంటలకూ , ఒక మాదిరి వేపుళ్ళ కూ వాడ వచ్చు !
కొస మెరుపు : ఈ రోజుల్లో  , యు ట్యూబ్ లో , అనేక రకాలైన  వంటలు , అనేక  ” పాక శాస్త్రజ్ఞులు ”  చాలా నైపుణ్యం తో వండడం చూస్తున్నాం ! కానీ  పైన చెప్పిన  ఆరోగ్య విషయాలు చర్చించడం కానీ ,  వారు వాడే      నూనెలను , కనీసం ఒక్క సారి మార్చడం కానీ చూశామా !? 
అందుకే అంటారు  , మన తల్లి తండ్రులు , ” బయటి  తిండి తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి ” అని ! ఎంత అర్ధం ఉంది , ఆ వాక్యం లో !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
%d bloggers like this: