ఏ నూనెలు , ఏ వంట కు వాడాలి ? 1.
( పైన ఉన్న బార్ గ్రాఫ్ గమనించండి !
అందులో , మరిగించే కాలం ఎక్కువ అవుతున్న కొద్దీ , వివిధ రకాల వంట నూనెల లో , విషపూరిత ఆల్డి హైడ్ ల శాతం ఎట్లా పెరుగుతుందో తెలియ చేయ బడింది ! ఆశ్చర్య కరం గా , వెన్న , కొబ్బరినూనె ల లో , తక్కువ విషపూరిత ఆల్డి హైడ్ లు విడుదల అవుతాయి ! )
ఇప్పటి వరకూ , ఆలివ్ ఆయిల్, సన్ ఫ్లవర్ , కార్న్ ఆయిల్ ( అంటే మొక్క జొన్న నూనె ) ల తో చేసిన వంటకాలు , ఆరోగ్య కరమైనవనీ , నెయ్యి , వెన్న లతో చేసిన వంటకాలు అనారోగ్య కరమైనవనీ భావించడం జరుగుతూంది !
తాజా పరిశోధనల ఫలితాలు అందుకు భిన్నం గా ఉన్నాయి !
ప్రొఫెసర్ మార్టిన్ గ్రూట్ వెల్డ్ ( జీవ రసాయన విశ్లేషణ నిపుణుడు ) డి మాంట్ ఫోర్డ్ విశ్వ విద్యాలయం లో పరిశోధనలు చేసి , ఈ ఫలితాలు ప్రకటించాడు !
మనం మామూలు గా మంచివి అనుకుంటున్న వంట నూనెలు మంచివే , కానీ ఆ మంచి , ఆ నూనె లలో , కొద్దిగా వేడి చేసి నంత వరకే ఉంటుంది !
అంటే , ఆ నూనెలను మరిగించి , అందులో బజ్జీలు , లేదా ఇతర వేయించిన వంటకాలు వండితే , ఆ నూనెలు ఆరోగ్య కరం కాదు !
ఈయన గారు అందుకు కారణాలు కూడా, స్పష్టం గా తెలియ చేశారు !
అతిగా వేడి చేసిన వంట నూనెలు , అంటే సాధారణం గా ఎక్కువ నూనె , గిన్నె , లేదా భాండీ లో సగానికి పైగా పోసే నూనెలు , బాగా ఎక్కువ ఉష్ణోగ్రతల లో వేడి చేయ బడతాయి !
ఇట్లా వేడి అయ్యాక , ఆ నూనెల లో నుంచి , ఆల్డి హైడ్ లు అనే రసాయనాలు బయటకు వస్తాయి ! మరి ఆ బయటకు వచ్చిన ఆల్డి హైడ్ లు , మనం తినే ఆ వంటకాల తో పాటుగా , మన శరీరాలలోకి ప్రవేశిస్తాయి !
ఆల్డి హైడ్ లు, విష పూరితాలు ! కానీ ఆ విష పూరితాలు , మనకు వెంటనే హాని చేయకుండా , కొంత కాలం అయ్యాక , వాటి ప్రభావం , మన దేహం లో చూపిస్తాయి ! ( పైన ఉన్న బార్ గ్రాఫ్ గమనించండి ! )
గుండె జబ్బులకు , క్యాన్సర్ కూ , ఇంకా మతి మరుపు జబ్బు ( డిమెంషియా అని అంటారు ) లకూ కారణమవుతాయి !
మనం నూనెలను ఎక్కువ గా వేడి చేస్తే కలిగే పరిణామాలు తెలుసుకున్నాం కదా , మరి వచ్చే టపాలో , వివిధ వంట నూనెలు , ఎట్లాంటి వంటల్లో వాడాలో కూడా తెలుసుకుందాం !