తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ? 6.
11.ఖర్జూరాలు ( పై చిత్రం ) : ఎడారి ప్రాంతాలలో , లేదా ఎడారి వాతావరణం లో పెరిగే ఖర్జూర చెట్టు నుంచి ఫలించే ఈ ఖర్జూరాలు , రతి క్రియా సమయం లో అలసి , సొలసి ఉండే ప్రేయసీ ప్రియులకు, ఒయాసిస్ లాగా పనిచేస్తాయి ! ఖర్జూరాల లో శక్తి కి అవసరమయే క్యాలరీ ల తో పాటు గా , శరీరానికి నిత్యం అవసరమయే అనేకమైన విటమిన్లూ , ఖనిజాలూ నిక్షిప్తమై ఉంటాయి ! త్వర గా శక్తి ని ఇచ్చే చెక్కర పదార్ధాలు ఖర్జూరాల్లో ఎక్కువ గా ఉంటాయి ! అందువల్ల , మధుమేహ వ్యాధి ఉన్న వారు , అతి జాగ్రత్త వహించాలి ! సామాన్యం గా వారు అతి గా చెక్కరలు ఉన్న ఏ పదార్ధాలూ తినగూడదనీ , లేదా అతి తక్కువ గా తినాలనీ సలహా ఇస్తారు నిపుణులు !

12.అల్లం ( పై చిత్రం ) : రక్త ప్రసరణ కు దివ్యమైనది అల్లం ! మన శరీర ఉష్ణోగ్రత ను సమం గా ఉంచడానికీ , మన ఊపిరితిత్తులలో మ్యూకస్ అంటే ఒక రకమైన చిక్కటి ద్రవం , లో ఇరుక్కు పోయే సూక్ష్మ క్రిముల ను తొలగించడం లో కూడా అల్లం ఉపకరిస్తుంది ! ముఖ్యం గా అల్లం ఆలు మగల లేదా ప్రేయసీ ప్రియుల సంగమాన్ని బెల్లం లా తీయగా చేస్తుంది, ఘాటుగా ఉన్నా ! జలుబు దగ్గుల నివారణ కూ , ఉప శమనానికి కూడా అల్లం ఎంతగానో ఉపయోగ పడుతుంది ! క్యాన్సర్ నివారణలో కూడా అల్లం పని చేస్తుందని కొన్ని పరిశోధనలు తెలిపినా , ఖచ్చితం గా క్యాన్సర్ నివారణలో ఉపయోగ పడుతుందో లేదో అనే విషయం ఇప్పటి వరకూ తేల్చలేదు నవీన శాస్త్రజ్ఞులు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !