Our Health

Archive for డిసెంబర్ 8th, 2013|Daily archive page

చదువుకోవడం ఎట్లా? 22. పరీక్ష రోజున ఏం చేస్తే, ఎక్కువ లాభం ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 8, 2013 at 7:43 సా.

చదువుకోవడం ఎట్లా? 22. పరీక్ష రోజున ఏం చేస్తే ఎక్కువ లాభం ? 

మునుపటి టపా లో , పరీక్ష రోజున మీరు చక్కగా పర్ఫాం చేయాలంటే , అంతకు ముందు రాత్రి సరిపడినంత  నిద్ర పోవాలని తెలుసుకున్నాం కదా !  ఈ విషయం హాస్యానికి రాయలేదని గమనించాలి !  ఒకవేళ మీరు పరీక్ష ముందు రాత్రి చదవాలనుకుంటే కూడా ,  రోజూ చదివే సమయమే అప్పుడుకూడా , వినియోగించాలి అంటే , సాయింత్రం అయిదు గంటలనుంచి , ఎనిమిది వరకూ చదువుకోవడం అలవాటయి ఉంటే , ఆ విధం గా చేయవచ్చు ! కానీ పరీక్ష ముందు రోజుల్లో, రాత్రి చాలా సమయం మేలుకొని కనుక చదివే అలవాటు ఉన్న వారు కూడా  , పరీక్ష ముందు రోజున, త్వరగా నిద్ర పోవడం  మరచి పోకూడదు ! మరి మిగతా జాగ్రత్తలేంటి ?
 రాత పరికరాలు సిద్ధం చేసుకోవడం :  పరీక్ష ముందు రోజే , రాత కు అవసరమయే , పెన్సిళ్ళూ , పెన్నులూ , స్కేలూ , మిగతా  కంపాస్ బాక్స్ లాంటి వాటిని సిద్ధం చేసుకోవాలి !  ఎక్కువ  పెన్సిళ్ళు తీసుకు వెళ్ళడం వల్ల సహజం గానే , పరీక్షలో సమయం ఆదా చేస్తున్నారన్న మాటే కదా , చెక్కు కోకుండా !  పరీక్షా సమయం లో ప్రతి నిమిషమూ విలువైనదే కదా ! ఒక వాటర్ బాటిల్ ను అనుమతిస్తే , తీసుకు వెళ్ళ వచ్చు ! అట్లాగే  కొద్దిగా చిరు తిళ్ళు కూడా చాక్లెట్ , బిస్కెట్లూ అనుమతిస్తే ! ఉంటే ,  సరిగా పనిచేసే వాచీ ని కూడా ! 
ఆహారం, నీరూ : పరీక్ష కు ముందే మీ ఆహారం విషయం లో జాగ్రత్త తీసుకోవాలి !  అతి గా కానీ అల్పం గా కానీ తిన కూడదు ! పడని ఆహారమూ , కొత్త ప్రదేశం లో ఆహారమూ అసలే తినకూడదు , పరీక్ష రోజున !  ప్రత్యేకించి మద్యాహ్నం పరీక్ష ఉన్న సమయం లో ! డీ హైడ్రేట్ అవకుండా , ముందే ,  చాలినంత నీరు తాగడం మంచిది ! ప్రత్యేకించి , భారత దేశం లాంటి ఉష్ణ దేశాలలో ,  చాలా మంది విద్యార్ధులు , అతిగా టీలూ , కాఫీలూ తాగి , నీరు సరిపడినంత తాగకుండా , వారికి తెలియ కుండానే డీ హైడ్రేట్ అయి పరీక్షా హాలు లోకి వస్తారు ! దానికి తోడు , పరీక్ష ల వలన కలిగే ఆందోళన , వారికి ఎక్కువ చెమట పట్టించి , పరిస్థితిని ఇంకా అధ్వాన్నం చేస్తుంది ! ఇవన్నీ చిన్న విషయాలే అయినా , మిగతా సమయాలలో అంత ఏకాగ్రత అవసరం లేదు కనుక , డీ హైడ్రేషన్ వల్ల వెంటనే ఏ పరిణామాలూ ఉండక పోవచ్చు , కానీ , పరీక్షా సమయం లో డీ హైడ్రేట్ అవుతే , వారి మెదడు అతి సున్నితమైన భాగం కావడం వల్ల , ఏకాగ్రత తక్కువ అవడమే కాకుండా ,  తల తిప్పినట్టూ , తల నొప్పిగానూ కూడా ఉంటుంది ! ఆ లక్షణాలతో పరీక్ష ముందు బాగా సిద్ధం అయిన వారు కూడా , పూర్తి గా సమాధానాలు రాయలేక పోవడం జరగ వచ్చు ! 
పరీక్షా పధ్ధతి గురించి ముందే తెలుసుకోవడం :  చదవడం , నేర్చుకోవడం ఒక ఎత్తైతే , పరీక్ష గురించి పూర్తి గా తెలుసుకుని అవగాహన ఏర్పరుచు కోవడం ఇంకో ఎత్తు ! ఆ మాటకొస్తే ,  రోజూ పాఠాలు నేర్చు కుంటున్నప్పుడే , పరీక్షా పత్రం లో ప్రశ్నలు ఎట్లా ఇస్తారు ! ఎంత సమయం ఉంటుంది ? వాటిని ఆ సమయం లో నే బాగా రాయడం ఎట్లా ? అనే విషయాలన్నీ తెలుసుకుని , తదనుగుణం గా చదవడమూ , రాసుకోవడమూ, అంటే నోట్సు రాసుకోవడమూ చేసిన విద్యార్ధులు ఎక్కువ లాభ పడతారు !  ఇక పరీక్ష హాలులో కూడా , ప్రశ్న పత్రం గురించిన అన్ని సూచనలనూ, నిబంధనలనూ ,  శ్రద్ధ గా విని , ఆచరించాలి !  
వచ్చే టపాలో , అసలు పరీక్షా సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ! 

చదువుకోవడం ఎట్లా ? 21. మరి పరీక్ష రోజున, ఏం చేస్తే ఎక్కువ లాభం ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 8, 2013 at 12:28 ఉద.

చదువుకోవడం ఎట్లా ? 20. మరి పరీక్ష రోజున, ఏం చేస్తే ఎక్కువ లాభం ? 

( పై చిత్రం , పరీక్షకు సిద్ధమవకుండా, ఒక విద్యార్ధి రాసిన సమాధానం !  చిత్రం లో ఉన్న త్రికోణం లేదా ట్రయాంగిల్ లో, రెండు భుజాల విలువ తెలుసు కదా ! ( 3 cm. and 4 cm. )   ఆ రెండు భుజాల విలువలనూ గుణించి , ఫలితాన్ని , 2 తో భాగిస్తే , అది మూడవ భుజం విలువ అవుతుంది ! అంటే పైన ఇచ్చిన ప్రశ్న లో X విలువ 6 cm.( 3×4 = 12/2 = 6 cm. ), కానీ పై సమాధానం రాసిన విద్యార్ధికి ఆ విషయం తెలియక,   X ( విలువ అంటే ఆ భుజం విలువ ) ను కనుక్కో మని అడిగితే , ఇదుగో ఇక్కడే ఉంది X  అని రాసి, ఒక బాణం గుర్తు కూడా వేసి చూపించాడు ! )
మునుపటి టపాలలో , పరీక్షలకు ముందు చేయవలసిన కర్తవ్యం గురించి తెలుసుకున్నాం కదా ! సామాన్యం గా, పరీక్ష కు కొన్ని వారాల ముందే , చాలావరకూ సిద్ద మయి ఉండాలి ! అది చాలా మంచి పధ్ధతి ! కొంత మంది విద్యార్ధులను గమనించాను , కాలేజీ రోజుల్లో , వారు పరీక్ష ముందు వారాల్లో , ఏమాత్రమూ ఆందోళన లేకుండా , అదే సమయం లో,  మిగతా విద్యార్ధులు ( నేను కూడా ! )   పడే అవస్థలు చూస్తూ ఉండే వారు  ! పరీక్ష రోజులు ప్రతి విద్యార్ధికీ వారి భవిష్యత్తును నిర్దేశం చేసే, అతి ముఖ్యమైన రోజులు కదా ?  ఆ సమయం లో ఈ జాగ్రత్తలు పాటిస్తే , వారు అంతకు ముందు చేసిన  ప్రయత్నాలన్నీ , పూర్తి ఫలితాలనిస్తాయి ! అది ఎట్లాగో తెలుసుకుందాం ! 
1. పరీక్ష ల కోసం తీసుకునే జాగ్రత్తలు , పరీక్ష ముందు రోజు నుంచే ప్రారంభం చేయాలి , తప్పని సరిగా !  పరీక్ష ముందు రోజు రాత్రి కనీసం 7 నుంచి 8 గంటలు తప్పని సరిగా నిద్ర పోవాలి , ఎట్టి పరిస్థితి లోనూ !  ఒక వేళ పరీక్షా హాలు దూరం గా ఉంటే ,  అందుకు తగిన ప్రయాణ ఏర్పాట్ల గురించి పూర్తి అవగాహన , హాల్ టికెట్ తీసుకున్న వెంటనే చేసుకోవాలి ! పరీక్ష సెంటర్ కు చేరుకోడానికనీ , ప్రయాణం చేయడానికి , కనీసం కొన్ని గంటలు ముందే బయలు దేరాల్సి ఉంటే , అందుకు తగినట్టు గా , పరీక్ష రోజు ముందే , కొన్ని గంటలు ముందు గా నిద్ర కు ఉపక్రమించాలి ! టీలూ , కాఫీలూ ఎక్కువ గా తాగి, పరీక్షల ముందు సిద్దమయే వారు కూడా , పరీక్ష కు ముందు రోజున  కనీసం నాలుగు నుంచి ఆరు గంటల ముందు ( అంటే నిద్ర పోయే సమయానికి  నాలుగూ , ఆరు గంటల ముందు , ఏ  టీలూ కాఫీలూ , తాగకుండా జాగ్రత్త తీసుకోవాలి !  కారణం , పరీక్ష  ముందు రాత్రి , సరిపడినంత నిద్ర ఉంటే , మెదడు లో ఉండే నాడీ కణాల కన్నిటికీ , సరిపడినంత ప్రాణ వాయువూ , సరిపడినంత గ్లూకోజూ , అందితే , ఆ కణాలన్నీ , తాజా గా ఫ్రెష్ గా ఉండి , చురుకు గా పని చేస్తాయి !  చదివిన పాఠాలూ , ముఖ్యమైన విషయాలూ , మూల సూత్రాలూ కేవలం గుర్తు ఉండడమే కాకుండా , వాటిని సరి అయిన పధ్ధతి లో ఉపయోగించడం కూడా సులభం అవుతుంది , నాడీ కణాలు అన్నీ కూడా  చురుకు గా పని చేస్తే ! పరీక్షల ముందు , టీలూ , కాఫీలూ ఎక్కువ గా తాగుతూ , రాత్రుళ్ళు నిద్ర కోల్పోయి చదివిన వారు , ఉదయాన్నే కాలేజీ కి వచ్చినా , వంద శాతం ఏకాగ్రత తో కాలేజీ లో, భౌతికం గా ఉన్నప్పటకీ , మానసికం గా ,  విషయాలను వంద శాతం గ్రహించ లేరు ! కొంత వరకూ అది పరవాలేదు , కానీ పరీక్షల లో కూడా అట్లాంటి పరిస్థితే  ఏర్పడితే , విద్యార్ధుల పర్ఫామెన్స్ గణనీయం గా తగ్గి పోతుంది ! నిద్ర సరిగా పోకుండా , పరీక్ష రాయడానికి వచ్చిన వారు , రాయ వలసిన జవాబులు , వారు ముందే అనుకున్నట్టు రాయ లేక పోవడమే కాకుండా , ప్రశ్న పత్రాలను పూర్తి గా చూడకుండా , పేపర్ కు రెండో పేజీ చూడకుండా నూ , మిగతా సమాధానాలు రాయడమూ , లేదా ఆ సమాధానాలు రాసే సమయం లో, నిద్ర విపరీతం గా వచ్చి, తూలుతూ ఉండడమూ కూడా చేస్తారు , చేశారు కూడా ! సరి పడినంత నిద్ర , పరీక్ష ముందు రోజు ఉండవలసిన అవసరం గురించి ,  తెలుసుకున్న విషయాలు ,  ఆచరణలో పెడితే , అంటే సరిపడినంత నిద్ర పొతే , ఈ టపా ఉద్దేశం మీరు గ్రహించినట్టే ! 
వచ్చే టపాలో పరీక్ష రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం ! 
%d bloggers like this: