Our Health

Archive for ఏప్రిల్, 2015|Monthly archive page

బంధాలు ఎందుకు తెగుతాయి ?10. ఘర్షణ !

In Our Health on ఏప్రిల్ 26, 2015 at 10:51 ఉద.

బంధాలు ఎందుకు తెగుతాయి ?10. ఘర్షణ !

ఏ బంధం లోనైనా ఎంతో కొంత , అప్పుడప్పుడూ  ఘర్షణ ఉండడం సహజమే !  కానీ ఆ ఘర్షణ నిరంతరం , అంటే విరామం అంటూ లేకుండా , పగలూ , రాత్రీ జరుగుతూ ఉంటే , ఆ బంధం తెగిపోయే అవకాశం హెచ్చుతుంది ! 
ఘర్షణ తీవ్రతరం అవుతున్నప్పుడు  బంధం లో ఉన్న ఇరువురూ గుర్తుంచు కోవలసిన ముఖ్యమైన విషయాలు :
1.  మీకు ఆ ఘర్షణ సమయం లో ఏ విధం గా ప్రతి స్పందించాలో , అంటే రియాక్ట్ అవ్వాలో,  అది పూర్తి గా మీ మీదే ఆధార పడి  ఉంటుంది ! అంటే ఆ స్వేచ్ఛ  మీకు ఉంది !
2. ఘర్షణ సమయం లో మీరు  తీసుకునే ప్రతి చర్యా , ఆ ఘర్షణ ను తీవ్రతరం చేస్తున్నదా , లేదా ఆ ఘర్షణ ను  తగ్గిస్తున్నదా అనే విషయం మీరు ఆలోచించుకోవాలి ! మీరు తీసుకునే చర్య , కేవలం ఒక మాట అనడం కావచ్చు ! అంటే  ఒక  పరుషమైన మాట , అంటే , ఇతరుల ను ఉద్రేక పరిచే మాట , లేదా అవమాన పరిచే మాట అవ వచ్చు ! అట్లా పరుషమైన మాటలు అనే ముందు , వాటి పరిణామాలు కూడా మీరు ఆలోచించుకోవాలి ! అంటే , మీరు అనే మాట ఘర్షణ ను తీవ్రతరం చేస్తుందా లేదా అని !  లేదా ఒక  పని అవ్వ వచ్చు ! ఉదాహరణ కు , ఆ ఘర్షణ వాతావరణం నుంచి , బయటకు కానీ , ఇంకో గది లోకి కానీ వెళ్ళడం !  లేదా మీ భాగస్వామి దగ్గరికి వెళ్లి  అనునయం గా వారితో మాట్లాడి సర్ది చెప్పడం అవ వచ్చు ! లేదా  వారిని విదిలించుకుని పోవడం కూడా అవ వచ్చు ! 
3. కొన్ని సమయాలలో , మీ కు బాగా బాధ కలిగించే మాటలు వినడం కానీ , లేదా  ప్రవర్తన కానీ మీకు అనుభవం అవ వచ్చు ! ఆ సమయాలలో  వెంటనే రియాక్ట్ అవకుండా , కేవలం కొన్ని క్షణాలు  పాజ్ అంటే విరామం ఇస్తేనే , ఆ ఘర్షణ పరిస్థితి ఎంత ‘ చల్ల ‘ బడుతుందో మీరే గమనించండి ! అంటే , మీకు ఆ ఘర్షణ సందర్భం , బాధ లేదా ఉద్రేకం కలిగించినా కూడా  మీరు  ఓపికతో , వెంటనే ఇంకో మాట అనకుండా , కేవలం  మీ మౌనం తో , ఆ పరిస్థితిని మార్చ గలరు ! 
4. మీ పొరపాటును ఒప్పుకోండి !  : పొరపాట్లు మానవ సహజం ! ఎందుకంటే , ఖచ్చితమైన,  లేదా ఆదర్శ ప్రాయమైన ప్రవర్తన , కేవలం పుస్తకాలకే పరిమితమవుతుంది !  ఏది పొరపాటో , ఏది మంచో అనేది కేవలం సాపేక్ష ! అంటే రిలేటివ్ !  కానీ , మీవల్ల జరిగిన పొర పాట్లను  సహృదయత తో అంగీకరించితే , ఆ బంధం బల  పడుతుంది ! 
5. ఇతరుల ప్రవర్తన మార్చే ముందు , మీ లో మార్పు కు సిద్ధ పడండి ! మీ ప్రవర్తన  ( బంధం లో ) ఇతరుల ప్రవర్తన ఎట్లా మారుస్తుందో గమనించండి ! మీలో మార్పే , ఎదుటి వారిలో మీకు నచ్చని ప్రవర్తనను మార్చి వేయవచ్చు !  మీ బంధం  చక్కటి అనుబంధం గా మారవచ్చు ! 
మిగతా సంగతులు వచ్చే టపా లో ! 

బంధాలు ఎందుకు తెగుతాయి ? 9. డబ్బు !

In Our Health on ఏప్రిల్ 17, 2015 at 2:35 సా.

బంధాలు ఎందుకు తెగుతాయి ? 9. డబ్బు ! 

స్త్రీ పురుషుల బంధానికి , ప్రత్యక్షం గానో , పరోక్షం గానో , డబ్బు  ఎంతగా ప్రభావితం చేస్తుందో , ప్రత్యేకించి చెప్ప నవసరం లేదు కదా ! బంధం ఏర్పడడానికి ముందు నుంచీ , ఆ బంధం గట్టి పడి , పాకం లో పడ్డాక , ఆ తీపి పాకం , చేదు అవ్వడానికి , లేదా ఇంకా తీయగా , అమృతమయం అవడానికి కూడా డబ్బు  చాలా  ఉపయోగకరం ! 
కానీ, విజ్ఞత కలిగిన స్త్రీ పురుషులు , తమ బంధం బలహీన పడకుండా , డబ్బు విలువ ను గ్రహించి , ఆ డబ్బును అదే స్థానం లో ఉంచి , ఆనంద మయ జీవితం గడప వచ్చు ! 
1. నిజాయితీ గా పరస్పరం తమ ఆర్ధిక విషయాలు తెలుసుకోవడం ! : చాలా వరకూ బంధాలు ఏర్పడే సమయం లో , పురుషులు , లేని పోని  గొప్పలు చూపిస్తూ ఉంటారు ! ఆస్తి పరులు గానూ , డబ్బు జల్సా గా ఖర్చు పెట్టే వారి లాగానూ , అమ్మాయిల ముందు , తమ ఇమేజ్  పెంచు కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ! నిజం గా డబ్బు కల వారయినా కూడా , ఒక బంధం ఏర్పడ్డాక , తమ భాగస్వాములతో , ఆర్ధిక పరమైన వాస్తవాలను , మనసు విప్పి , ఉన్నది ఉన్నట్టు , మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి ! 
2. ఎప్పుడు ? :  ఇట్లా మాట్లాడుకోవడం , బాగా ఉద్రేకం గా ఉన్నప్పుడో , లేదా ఇరువురి మధ్య వాదనలు జరుగుతున్నప్పుడో చేయకూడదు ! ప్రశాంతమైన , ఇరువురికీ అనుకూలమైన సమయాల లోనే  జరగాలి ! 
3. అప్పులూ , క్రెడిట్ కార్డు అప్పులూ , ఇతర లోన్ లూ , ఇట్లా ఏ ఆర్ధిక విషయాలూ దాచుకో కుండా మాట్లాడుకోవాలి !  ఎందుకంటే , అవి వారిరువురి జీవితాలనూ ప్రభావితం చేస్తాయి కాబట్టి ! 
4. పరస్పర నిందారోపణలు కూడదు :  ‘ నువ్వు ఎక్కువ గా ఖర్చు చెస్తున్నావనో , లేదా నీవు వృధాగా ఖర్చు పెడుతున్నావనో ‘ , ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ  , తప్పు పట్టాలని చూస్తూ ఉంటే , బంధం బలహీన పడడం ఖాయం ! అందుకే నిందలు మోపడం మానుకుని , వాస్తవాలు గ్రహించాలి, ఇరువురూ !
5. కొంత సమయం తీసుకున్నా , ప్రతి నెలా , మొదటి వారం లోనో , ఆఖరి వారం లోనో , ఇరువురూ , అనుకూల సమయం లో తీరిక గా కూర్చుని , తమ తమ ఆదాయం ఎంతో , ఖర్చులు ఏంటో , ఒక ప్రణాళిక వేసుకుని , అవసరమైన ఖర్చులకు తప్పించి , అనవసరమైన ఖర్చులను ఏ విధం గా తగ్గించుకోవాలో చర్చించుకుని , తగిన నిర్ణయాలు తీసుకోవాలి ! వాటిని అమలు చేయాలి కూడా ! ఆశ్చర్యకరం గా , ఇట్లా చిన్న పాటి  లెక్కలను కూడా చేసుకోకుండా , బతుకు భారం మోస్తున్న వారు కోట్లల్లో ఉన్నారు ప్రపంచం లో ! 
6. తగినంత డబ్బును ఆదా చేసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి !:  విహారాల కోసమో , విందుల కోసమో , లేదా తమ సంతానం కోసమో !  ఈ రోజుల్లో ప్రతి బ్యాంకు వాడూ , ఊరూ పేరూ తెలియక పోయినా కూడా అప్పులిస్తున్నాడు ! ఆ అప్పుల వల లో పడకుండా , కొద్ది కొద్ది మొత్తాలు ఆదా చేసుకుంటూ ఉంటే , ఆర్ధిక పరమైన వత్తిడులు, బంధాలను బలహీనం చేయ లేవు ! 
7. కేవలం , తమ తమ అవసరాలకే కాకుండా , కనీస మొత్తాలను అంటే , వారి సంపాదన లో అతి కొద్ది డబ్బు నైనా , ఆపదలో ఉన్న బంధువులకోసమో , లేదా పేద వారికోసమో , ఇట్లా, ధార్మిక కార్యాలకు ఉపయోగిస్తే , ఆ బంధం దృఢ పడడమే కాకుండా ,  వారి ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

బంధాలు ఎందుకు తెగుతాయి ? 8. సంగమం !

In Our Health on ఏప్రిల్ 9, 2015 at 8:18 సా.

బంధాలు ఎందుకు తెగుతాయి ? 8. సంగమం ! 

బంధాలు తెగడానికి , స్త్రీ పురుషులు పరస్పరం , తమ తమ భాగస్వాముల  సంగమ అవసరాలే కాకుండా , తమ కామ పరమైన అవసరాలను కూడా సరిగా అవగాహన చేసుకోక పోవడం వల్లనే అని,  మేరీ ఫే  అనే నిపుణురాలు అభిప్రాయపడుతుంది ! ఈమె అభిప్రాయం ప్రకారం , స్త్రీ పురుషుల బంధాలు , సమస్యలతో అతలాకుతలం అవుతున్నప్పుడు ,  వారిరువురూ   కామ పరమైన సంగమాన్ని కూడా అనుభవించక పొతే , ఆ బంధం ఇంకా బలహీన పడుతుందని !  కామ పరమైన కలయిక , ఒక బంధం లో ఉన్న స్త్రీ పురుషులను  భౌతికం గా దగ్గర చేయడమే కాకుండా ,  అనేక రకాలైన హార్మోనులు ,  విడుదల అయి , వారిరువురినీ , భౌతికం గా కామోచ్ఛ దశ కు చేర్చడమే కాకుండా , మానసికం గా కూడా ఉల్లాసం చేకూర్చి , వారిరువురినీ ‘ కట్టి పడేసి ‘ , వారి బంధాన్ని ‘ గట్టి పరుస్తాయి  ‘ !  అందు వల్ల నే , బంధం బలహీన పడే సమస్యలు ఉన్న స్త్రీ పురుషులు , తాము సగమించడం వాయిదా వేసుకో కూడదు ! 
ముభావం గా , అంటీ అంటనట్టు , తిరుగాడే భాగస్వామి ని , తమకు తెలిసిన , ఇతర  కామ స్థానాల లో , నవ్యత చూపిస్తూ , సంగమం లో పాల్గొంటే , బంధం గట్టి పడడానికి అవకాశం హెచ్చుతుందని , నిపుణులు సలహా ఇస్తారు !  అట్లాగే , కామోద్దీపన కలిగించి , వారిలో కామాతురత ప్రేరేపింప చేయడానికి , రెండో భాగస్వామి చేసే ప్రయత్నాలు మానుకో కూడదు !  ఆమె కు ఇష్టమైన  పువ్వు ను కానీ , స్వీట్ ను కానీ ,  లేదా , ఒక కొత్త డ్రెస్ ను కానీ కొని తీసుకు రావడం , మునుపటి సంగమాలలో , ఏ ప్రదేశాలలో తాకితే ఎక్కువ స్పందన కలుగుతుందో , ఆయా స్థానాలలో , ఆమెను ప్రేరేపింప చేయడం కూడా  వారి బంధం దృఢ పడడానికి సహకరిస్తాయి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: