చర్మ మర్మాలు . 11 . చర్మ ఆరోగ్యానికి చిట్కాలు !
చర్మం ఎప్పుడూ , నవ నవ లాడుతూ , ఆరోగ్యం గా ఉండాలంటే , తినే ఆహారం లో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం !గుర్తు ఉంచుకోవలసినది , చర్మం , అనేక లక్షల సజీవ కణాలతో నిర్మితమైనదని ! అంటే, చర్మం లో ప్రతి మిల్లీ మీటర్ లోనూ అనేక చర్మ కణాలు , సజీవమైనవి ఉంటాయి ! ఆ కణాలకు నిరంతరం పోషక పదార్ధాలు అందుతూ ఉంటేనే , అవి ఆరోగ్యం గా ఉంటాయి ! చర్మం , ఒక కాగితం కాదు , మనకు కావలసిన రంగులు ‘ పెయింట్ ‘ చేసుకోవడానికి , లేదా క్రీములు పూసుకోవడానికి ! అందుకే, చర్మం లోని ప్రతి కణాన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి !
ఆరోగ్యం కోసం శక్తి కి కావలసిన పిండి పదార్ధాలూ , కొవ్వు లేదా ఫ్యాట్ లతో పాటు గా ప్రోటీనులు లేదా మాంస కృత్తులు అవసరం అవుతాయి ! శక్తి తో పాటుగా అనేక విటమిన్లూ , ఖనిజాలూ కూడా అవసరం అవుతాయి !
విటమిన్లూ , ఖనిజాలూ , అనేక రకాలైన జీవ రసాయన చర్యలలో కీలక పాత్ర వహిస్తాయి ! సాధారణం గా, మనం తినే ఆహారం లో పిండి పదార్ధాలు , ఫ్యాట్ లేదా కొవ్వు పదార్ధాలూ తప్పని సరిగా ఉంటాయి , ఆ మాట కొస్తే , ఎక్కువ గా ఉండి , మనకు సమస్యలు తెచ్చి పెడతాయి , వివిధ రకాలు గా ! మాంస కృత్తులు తక్కువ గా ఉండి , వాటి లోపం ఏర్పడుతుంది , ముఖ్యం గా శాక హారుల్లో ! అట్లాగే విటమిన్లు , ఖనిజాలు కూడా తక్కువ గా ఉండి , వాటి లోపం కూడా చర్మం లో మనకు ‘ కనిపిస్తూ ఉంటుంది ‘ !
వీలైనంత వరకూ , తాజా కూరగాయలు , పళ్ళ లో మనకు కావలసిన విటమిన్లు లభ్యం అవుతాయి ! ఇక ఖనిజాల గురించి చెప్పుకోవాలంటే , అనేక రకాలైన విత్తనాలు , ఉదా: గుమ్మడి కాయ విత్తనాలు , ఆల్మండ్స్ , వేరు శనగ పప్పులు ( పల్లీలు ) , సన్ ఫ్లవర్ సీడ్స్ , నువ్వులు , మొదలైనవి ఆహారం లో తరచూ తీసుకుంటూ ఉండాలి ! జింకు , సెలీనియం, మెగ్నీషియం లాంటి అతి ముఖ్యమైన ఖనిజాలు , విత్తనాలలో లభిస్తాయి ! ఈ ఖనిజాలు చాలా కొద్ది పరిమాణం లో మన శరీరానికి అవసరం. కానీ, అవి అసలు శరీరం లో లేకపోతే , అనారోగ్యం తో పాటుగా , చర్మం కూడా వివిధ మార్పులు చెందుతుంది !
ఈ ఖనిజాలు కేవలం జీవ రసాయన చర్యలలో ( అంటే బయో కెమికల్ రియాక్షన్స్ ) ముఖ్యమైనవే కాకుండా , సూర్య రశ్మి చర్మ కణాలకు చేసే హానిని తగ్గిస్తాయి ! అంటే చర్మ కణాలలో ఖనిజాలు సమ పాళ్ళ లో ఉంటే , సూర్య రశ్మి లో ఉండే అల్ట్రా వయొలెట్ కిరణా ల ప్రభావం వల్ల చర్మ కణాల లో క్యాన్సర్ మార్పుల నివారణ జరుగుతుంది !
వివిధ దేశాలలో , వివిధ ప్రాంతాలలో ఉండే వారు , అక్కడ స్థానికం గా దొరికే తాజా పళ్ళూ , కూరగాయలూ , ఆకు కూరలూ , వివిధ రకాలైన విత్తనాలూ తరచుగా , వీలయితే రోజూ కూడా , వారు తినే ఆహారం లో తీసుకుంటే , చర్మం ఆరోగ్యం గా ఉండడమే కాకుండా , శరీరం కూడా వివిధ అనారోగ్యాలకు దూరం గా ‘ ఉండడం ‘ జరుగుతుంది ! ఆ అవకాశం లేని వారు , కనీసం విటమిన్లు , ఖనిజాలు ఉన్న ట్యా బ్లెట్ లు కానీ , క్యాప్స్యుల్స్ కానీ తీసుకోవడం కూడా శ్రేయస్కరం ! కానీ ఈ పని , వైద్య సలహా మీద చేస్తే ఉత్తమం !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !