Our Health

Posts Tagged ‘how to study? చదువుకోవడం ఎట్లా ?’

చదువుకోవడం ఎట్లా ? 25. పరీక్షలయాక, కర్తవ్యం ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 11, 2013 at 6:38 సా.

చదువుకోవడం ఎట్లా ? 25. పరీక్షలయాక,  కర్తవ్యం ఏమిటి ? 

గతం గతాహి : అంటే గడచి పోయిందేమో గడచి పోయింది ! ఒక సారి , పరీక్ష పత్రాన్ని , వదలకుండా , అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాశారో లేదో , చూసుకుని , ఆన్సర్ పేపర్ ఇన్విజిలేటర్ కు ఇచ్చాక ,  ఇక ఆ విషయాన్ని తాత్కాలికం గా మర్చి పోవాలి !  ఒక వేళ , సరిగా చేశానో లేదో అని మధన పడుతూ , విపరీతం గా ఆందోళన పడినా , ఒక సారి పరీక్ష హాలు నుంచి బయట పడ్డాక ,  చేయ గలిగేది ఏమీ లేదు ! అంటే ,మీరు రాసిన జవాబు లలో పొరపాట్లు ఉన్నా , అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయ లేక పోయినా కూడా , అంతా  గతాహి అంటే అంతా జరిగి పోయింది !  ఇక పరీక్ష జవాబు పత్రం అంటే ఆన్సర్ పేపర్ మీ నియంత్రణ లో ఉండదు, ఏ మార్పులు చేయడానికీ ! అందువల్ల , ఇక ఆ పరీక్ష గురించి కానీ , మీరు రాసిన జవాబుల గురించి కానీ ఏ విధమైన చింతా పెట్టుకో కూడదు !  మీ స్నేహితులతోనో , మీ కుటుంబ సభ్యులతో నో సరదా గా మీకు తోచిన విధం గా సమయం గడపండి !  మీకు ఇష్టమైన పనులు చేయండి !  మీకు ఇష్టమైన ఆహారం తినండి ! ఇష్టమైన సంగీతం వినడమూ , సినిమా కు వెళ్ళడమూ కూడా చేయవచ్చు ! బాగా అలసి పోయి ఉంటే , కొన్ని రోజులు ఆ అలసట తీరేవరకూ , ఎక్కువ సమయం నిద్ర పొండి, రాత్రి సమయాలలో ! ఇట్లా చేసి , మీరు  ఛార్జ్ తక్కువ అయిన మీ శరీరాన్ని మళ్ళీ ఛార్జ్ చేసుకుంటున్నా రన్న మాట !  

పరీక్ష ఫలితం విఫలం అయితే, అంటే, ఫెయిల్ అవుతే ! :  ఏ మాత్రం విచారించకండి !  కొంత నిరుత్సాహం ఉండడం సహజమే ! కానీ ఆ నిరుత్సాహం, తాత్కాలికమే అవ్వాలి !  నిరాశా నిస్పృహలకు లోనవ్వ కూడదు ! అట్లా సామాన్యం గా , సరిగా రాని ఫలితాల గురించే పదే పది గా ఆలోచించుతూ , నిద్రాహారాలు మాని , బాధ పడి ,కృంగి పోవడం వల్ల జరుగుతుంది !  ఆ పరిస్థితి నుండి బయట పడడం కన్నా , ఆ పరిస్థితిని అన్ని విధాలా నివారించుకోవడమే ఉత్తమం !   పరీక్ష ఫలితం మీరు ఆశించినట్టు ఉండకపోతే , ముందుగా  చేయవలసినది ,  స్నేహితులనూ , కుటుంబ సభ్యులనూ వదల కూడదు ! వారి మధ్యనే కాలం గడపడమూ ,  లేదా  టీచర్ వద్దకు గానీ , లెక్చరర్ వద్దకు గానీ వెళ్లి ,   లోపాలను ఎట్లా సరిదిద్దు కొవచ్చో , తెలుసుకోవడం ముఖ్యం !  పరీక్షలో ఫెయిల్ అవడం , నేరం కాదు ! అందువల్ల ఆత్మ న్యూనతా భావాలు  రాకూడదు ! ఒక్క పరీక్షలో విఫలం అయితే , అనేకమైన పరీక్షలు ఎదురు చూస్తూ ఉంటాయి ! అంటే అనేకమైన అవకాశాలు  ఆహ్వానిస్తూ ఉంటాయి ! జీవితం లో, ఒక పరీక్ష సఫలానికీ , విఫలానికీ , మాటల అర్ధం లో చాలా తేడా ఉంది , కానీ మార్కుల అంతరం లో ఆ తేడా అతి స్వల్పం ! ఎందుకంటే ,  ముప్పై నాలుగు మార్కులు వస్తే దానిని ఫెయిల్ అంటారు , అదే ముప్పై అయిదు మార్కులు వందకు వస్తే దానిని పాస్ అంటారు ! మీ పరిధి విస్తృతం అవాలి !  ఆ ఒక్క శాతం మార్కులు తక్కువ వస్తే, కేవలం ఆ పరీక్ష లో ఆ సందర్భం లో మాత్రమే , వారు ఓడి పోయారు !  వారి జీవితం లో కాదు !  అసలు చదువు కోని వారూ , స్కూలూ ,కాలేజీ లకు అసలు వెళ్ళని వారు , ఈ ప్రపంచం లో అనేక కోట్ల మంది ఉన్నారు ! వారికన్నా ఎక్కువ నేర్చు కుంటారు ,  పరీక్ష రాసే వారు  , ఎందుకంటే , వారి జీవితం లో వారికి ఎదురయే అనేక రకాలైన పరీక్షలకు , వారికి ఈ చిన్న పరీక్షలు అనుభవాలూ , పాఠాలూ అవుతాయి కనుక ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చదువుకోవడం ఎట్లా ? 24. పరీక్ష సమయం లో , ఎక్కువ మార్కుల కోసం, ఏం చేయాలి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 11, 2013 at 5:28 ఉద.

చదువుకోవడం ఎట్లా ? 24. పరీక్ష సమయం లో , ఎక్కువ మార్కుల కోసం,  ఏం చేయాలి ? 

మునుపటి టపాలో,  పరీక్ష సమయం లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా ! ఈ రోజు ఇంకొన్ని కిటుకులు తెలుసుకుందాం ! 
వ్యాస పధ్ధతి లో రాసే జవాబులకు : 
వ్యాస పధ్ధతి లో రాయమని అడిగే ప్రశ్నలను ముందుగా కొద్ది నిమిషాలు వెచ్చించి అయినా సరే , శ్రద్ధతో చదవాలి !  వ్యాసం అడిగాడు కదా,  ఓ ఇరవై లైన్లు  రాసి, ఆన్సర్ పేపర్, ‘వాడి’ మొహాన పారేస్తే సరిపోతుంది ,కనీసం అరవై శాతం మార్కులేయక చస్తాడా ?!   అని, తలా తోకా లేకుండా రాసుకుంటూ పోకూడదు ! నిజం గా, అట్లా ఆలోచించే వారి కెపాసిటీ ఇంకా ఎంతో ఉంటుంది ! కేవలం , అట్లా ఆలోచించడం , ఆచరించడం ద్వారా , వారికి వచ్చే ఎక్కువ మార్కులను చేతులారా పోగొట్టు కుంటారు ! ఇంత కు ముందు టపాలలో రాసినట్టు , రాసే ఆన్సర్ పేపర్ , ఆ  విద్యార్ధి  మెదడు ను  ప్రతిబింబింప చేస్తుంది ! రాత పూర్వకం గా !  విషయం తెలిసి ఉండి కూడా , కేవలం వారి తృప్తి స్థాయిని తగ్గించుకోవడం వలననే , వారు మార్కులు తక్కువ తెచ్చుకుంటున్నారని గమనించాలి !  
వ్యాస పధ్ధతి లో సమాధానం రాయమని అడిగిన ప్రశ్న లకు, మూస పధ్ధతి లో రాసుకుంటూ పోక , ఆ ప్రశ్నలో ప్రత్యేకించి ఏమడుగుతున్నాడో అర్ధం చేసుకోవాలి !   వివరించండి అని ప్రశ్న ఉంటే వివరించాలి ! నిర్వచించండి అని అడిగితే , నిర్వచించాలి ! పోల్చి చూడండి అని అడిగితే , ఆ సమాధానాన్ని వివరం గా పోల్చి ఆ పోలికలను రాయాలి ! సమాధానాన్ని , విభిన్న కోణాలలో , రాయడం , ఇంకా వీలున్న చోటల్లా , ఆ  పాఠం లో వచ్చిన సాంకేతిక పదాలను వాడడమూ మరువ కూడదు !  ఈ సాంకేతిక పదాల గురించి కూడా మనం క్రితం టపాలలో తెలుసుకున్నాం !   ప్రతి సబ్జెక్ట్ కూ  సాంకేతిక పదాలు, ఆ సబ్జెక్ట్ కు చెందిన అక్షరాల లాంటివి !  అంటే , కేవలం భాష  తెలుగైనా , ఇంగ్లీషైనా , సాంకేతిక పదాలు , నేర్చుకునే సబ్జెక్ట్ ను బట్టి , ప్రత్యేకం గా ఉంటాయి ! ఉదాహరణకు :  కంప్యూటర్ ల కు చెందిన సమాధానాలు రాసే చోట ,  దాని మెదడు కెపాసిటీ  1TB అనీ ,  వెబ్ క్యామ్ ను దాని కళ్ళు అనీ రాయడం విచిత్రం గా ఉంటుంది ! ( హార్డ్ డిస్క్ కెపాసిటీ అనీ వెబ్ క్యామ్ అనీ అంటారు కదా వాటిని ) అదే , మానవ మెదడు నూ , కంప్యూటర్ నూ పోల్చి రాయమని  అడిగితే , అప్పుడు ఆ విధం గా పోల్చి వివరించ వచ్చు ! 
మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలూ , నిజం – తప్పు ( ట్రూ ,ఫాల్స్ ) ప్రశ్నల కు సమాధానాలు రాసే సమయం లో కూడా ,  మీరు అనుసరించే పధకం వేరుగా ఉండాలి !  చదవగానే ప్రశ్న కు సమాధానం రాయడానికి ఉబలాట పడకుండా , ప్రశ్నలను తిప్పి ఇస్తున్నాడా , సమాధానాలు సరి యైన వేనా ? అని ఒకటి కి రెండు సార్లు పరిశీలించుకుని , అవసరమైతే ఒక చిత్తు కాగితం మీద  సమాధానం రాసుకుని , తరువాత ఆన్సర్ పేపర్ మీదకు ఎక్కించు కోవచ్చు ! పొర పాట్లను తగ్గించుకునే భాగం గా ! 
పరీక్ష హాలు లో, ఇతర విద్యార్ధులను  పట్టించు కోక పోవడం : ఇది చాలా ముఖ్యమైన పధ్ధతి !  పరీక్ష హాలు లో కాస్త సమయం ఉంటే , ఇతర విద్యార్ధుల ప్రవర్తన పరిశీలించడం  సామాన్యమే , చాలా సమయాలలో అది అప్రయత్నం గానే జరుగుతూ ఉంటుంది !  ఇక  ఒక్కో విద్యార్ధి , ఒక్కో రకం గా ప్రవర్తిస్తూ ఉంటారు, పరీక్షా సమయం లో ! కొందరు , ప్రతి పది నిమిషాలకూ ఒక సారి , ఇన్విజిలేటర్ ను  పిలుస్తూ ఉంటారు !  కొందరు ప్రతి ఇరవై నిమిషాలకూ , అడ్ది షినల్ ఆన్సర్ షీట్ లు అడుగుతూ ఉంటారు ! వారు అట్లా అడుగుతున్నప్పుడల్లా , మిగతా విద్యార్ధులకు  ‘ నేను తక్కువ గా రాస్తున్నానా?  అనే సందేహం కలుగుతూ ఉంటుంది ! ఇంకొందరు విద్యార్ధులు , చాలా ధీమా గా  పరీక్షా సమయం లో సగం సమయం లోనే చప్పున , ఉన్న చోటినుంచి లేచి , ఆన్సర్ పేపర్ , ఇన్విజిలేటర్ కు ఇచ్చి బయటకు వెళుతూ ఉంటారు ! ఇంకొందరు పూర్తి సమయం అయిపోయినాక కూడా , పెన్నులు టేబుల్ మీద పెట్ట మన్నా కూడా , వినిపించు కోకుండా , విపరీతమైన వేగం తో రాస్తూ ఉంటారు ! 
గమనించ వలసినదీ , గుర్తుంచు కోవలసినదీ ఏమిటంటే , ఈ  వివిధ ప్రవర్తనా రీతులు, వారి  మార్కులను నిర్ణయించవు ! మీ మార్కులను కూడా నిర్ణయించ కూడదు ! ఒక వేళ నిర్ణయించ గలుగు తే అది తక్కువ మార్కుల దిశలోనే !  ఎట్టి పరిస్థితులలోనూ , ఆ ప్రవర్తనలు మీ ఏకాగ్రత కు భంగం కలిగించ కూడదు !  అందుకు మీరు చేయవలసిందల్లా , మీ ప్రశ్న పత్రం మీదా , రాసే సమాధానాల మీదా , మీకు అనుమతించిన సమయం , అంటే గడియారం మీదా, మీ  మనసునూ , మేధస్సు నూ కేంద్రీకరించడమే !  ఆ పని మీరు , మీకు ఇచ్చిన సమయమంతా కూడా చేయాలి ! ఎందుకంటే , ప్రతి ఒక్క మార్కూ , విలువైనదే , మీ జీవిత గమనాన్ని మార్చి వేసేదే ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చదువుకోవడం ఎట్లా ? 23. పరీక్ష సమయం లో ఏం చేస్తే, ఎక్కువ మార్కులు వస్తాయి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 9, 2013 at 8:24 సా.

చదువుకోవడం ఎట్లా ? 23. పరీక్ష సమయం లో ఏం చేస్తే, ఎక్కువ మార్కులు వస్తాయి  ? 

ఇంతకు ముందు టపాలో పరీక్షల ముందు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా ! మరి పరీక్షా సమయం లో ఏ జాగ్రత్తలు , ఎక్కువ మార్కులు తెస్తాయి మీకు ?  ఈ ప్రశ్నకు ఒక్క వాక్యం లోనే సమాధానం కావాలంటే , ‘ సమాధానాలన్నీ బాగా రాయడమే’  ! ( ఈ నా సమాధానానికి, మీరు ఎక్కువ మార్కులు ఇవ్వరు కదా ! ) అందుకు, నా సమాధానం వివరంగా ఇవ్వ బడింది , ఈ క్రింద చదవండి ! ( అన్ని సూచనలూ, సలహాలూ , మీరు చదివాక ,  మార్కులు వేయండి ! ) : 
1. ప్రశ్నా పత్రం లో ఉన్న సూచనలూ , నిబంధనలూ శ్రద్ధ గా చదివి , సందేహాలుంటే , మొహమాట పడకుండా , ఇన్విజిలేటర్ ను అడగాలి ! కొన్ని సమయాలలో వారికి కూడా  కొన్ని ప్రశ్నలు అర్ధం కావు !  అపుడు వాటిని చీఫ్ ఇన్విజిలేటర్ దగ్గర  క్లారిఫై చేసుకుని మీకు చెప్ప గలుగు తారు ! పరీక్షా సమయం లో , సందేహాలు రావడం సామాన్యమే ! అప్పుడు, వాటిని వెనువెంటనే నివృత్తి చేసుకోవడం మంచిది ! ప్రత్యేకించి,  ఎక్కువ మార్కులు తెచ్చుకో డానికి ! 
2.  శ్వాస సహజం గా తీసుకోవడం మర్చి పోకూడదు ! :  పరీక్షా సమయం లో ఆందోళన వల్ల , చాలా మంది విద్యార్ధులు ఎక్కువ వత్తిడి కి లోనయి ,  టెన్షన్ తో సహజమైన శ్వాసను కూడా తక్కువ తక్కువ గా తీసుకుంటూ ఉంటారు ! అట్లా చేయడం వల్ల , మెదడు కు ఆక్సిజన్ అంటే ప్రాణ వాయువు సరిగా అందక ,  ఏకాగ్రత  లోపించ వచ్చు ! కొన్ని సమయాలలో ,  తల తిరిగి పడి పోవడం కూడా జరగ వచ్చు !  అందువల్ల సహజం గా తీసుకునే ఉచ్వాస నిశ్వాస లను మరచి పోవడం కానీ , వాటికి షార్ట్ కట్ గా పై పైనే శ్వాస తీసుకోవడం కానీ చేయ కూడదు ! 
3. పశ్నా పత్రాన్ని సర్వే చేయడం ! : ఇక అసలు సంగతి , అంటే ప్రశ్న పత్రాన్ని  పూర్తి గా చదవడం ! ఇది అతి ముఖ్యమైన పని. సామాన్యం గా చాలా మంది విద్యార్ధులు , ప్రశ్నా పత్రాన్ని చూడగానే , విపరీతమైన ఆతృత తో  మొదటి ప్రశ్న కు సమాధానం రాయడం మొదలుపెడతారు !  అట్లా చేయడం కన్నా , ప్రశ్నలన్నింటినీ , కూలంక షం గా  చదవడం మంచి పధ్ధతి !  ఆ పని చేయడడానికి ఎక్కువ సమయం తీసుకోకూడదు !   అడిగే ప్రశ్నలు ఏ రకం గా ఉన్నాయి ?  అడిగిన ప్రశ్న లన్నింటికీ , సమాధానాలు రాస్తే , సమానం గా ఉన్నాయా మార్కులు , లేదా ప్రశ్న లు చిన్నవీ , పెద్దవీ కూడా ఉన్నాయా , పెద్ద ప్రశ్నలకు ఎక్కువ మార్కులు ఉంటే , మరి వాటి సమాధానాలు రాయడానికి కూడా ఎక్కువ సమయం కేటాయించాలి కదా ! ఆ సమయం ఎంత ?  కాస్త ఎక్కువ గా ఆలోచించి రాయవలసిన సమాధానాలు ఎక్కువ సమయం తీసుకుంటాయి కదా ! అందుకు సమయాన్ని ఏ విధం గా కేటాయించాలి ? ఈ విషయాలన్నీ సర్వే లో నిర్ణయించుకోవాలి !  ప్రతి ప్రశ్న గురించీ సమయాన్ని ఖచ్చితం గా నిర్ణయించలేక పోయినా కూడా , ఒక అంచనా వేసుకో గలగాలి సర్వే చేస్తున్నప్పుడే !  ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాశాక , ఒక అయిదు పది నిమిషాలు ఇంకా సమయం మిగిలేట్టు అంచనా వేసుకుంటే, ఉత్తమం ! ఆ సమయం లో రాసిన సమాధా నాలన్నింటి నీ సరిగా చూసుకుని , మర్చి పోయిన పాయింట్స్ చేర్చ దానికి ఉపయోగించ వచ్చు ! 
4. ప్రతి ప్రశ్ననూ, తప్పని సరిగా, విపులం గా చదవాలి :   ఉదా : జీవ కణం లో భాగాలను, పటం ద్వారా చూపండి .  మూడు ప్రధాన భాగాల విధులు వివరించండి. అని ప్రశ్న ఉంటే , సగం సమయాన్ని పటం వేసి భాగాలను గుర్తించడానికీ , మిగతా సగం సమయం ప్రధాన భాగాల విధులు వివరించడానికీ కేటాయించాలి ! కేవలం పటం వేస్తూ నే సమయాన్ని వెచ్చించ కూడదు ! అట్లాగే ఇంగ్లీషులో , ఒక  ఇరవై వాక్యాలలో , ఒక వ్యక్తి , గురించి రాయమంటే , ఆ ఇరవై వాక్యాలూ , వ్యాకరణ బద్ధం గా , సులభం గా అర్ధం అయ్యేట్టు ఉండాలి !  అతి గా రాసినా , తప్పులతో రాసినా , మార్కులు కోల్పోతారు కదా ! అందువల్ల , ప్రశ్నలను చదివి సరిగా అర్ధం చేసుకోవాలి  ముందే ! లెక్కల ప్రశ్నలకు కూడా సమాధానాలు రాసే సమయం లో కేవలం, సమాధానం మాత్రమే రాయకుండా, ఆ సమాధానాలు, మీరు ఎట్లా సాధించారో , మీ పేపర్ దిద్దే వారికి మీరు,  జవాబు పత్రం లో అంటే ఆన్సర్ పేపర్ లో విపులం గా రాసి తెలియ చేయాలి ! ఉదా :   నవంబరు నెలలో ఎన్ని గంటలు ఉన్నాయో సమాధానం ఎట్లా రాబట్టారో కూడా తెలియ చేయండి ? అని ప్రశ్న ఉంటే , 30 రోజులుంటాయి కాబట్టి, సమాధానం 720 గంటలు అని మాత్రమే రాయకూడదు !  నవంబర్ నెలలో 30 రోజులు , రోజుకు 24 గంటలు , 30 X 24= 720 గంటలు. అని సమాధానం రాయాలి ! ఇవి కేవలం ఉదాహరణలు  మాత్రమే ! మీరు చదివే సబ్జెక్ట్ లూ , పాఠాలను బట్టి ప్రశ్నలు కూడా మారుతూ ఉంటాయి కదా ! 
వచ్చే టపాలో, పరీక్షా సమయం లో మరచి పోకూడని  మరి కొన్ని కిటుకులు ! 

చదువుకోవడం ఎట్లా? 22. పరీక్ష రోజున ఏం చేస్తే, ఎక్కువ లాభం ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 8, 2013 at 7:43 సా.

చదువుకోవడం ఎట్లా? 22. పరీక్ష రోజున ఏం చేస్తే ఎక్కువ లాభం ? 

మునుపటి టపా లో , పరీక్ష రోజున మీరు చక్కగా పర్ఫాం చేయాలంటే , అంతకు ముందు రాత్రి సరిపడినంత  నిద్ర పోవాలని తెలుసుకున్నాం కదా !  ఈ విషయం హాస్యానికి రాయలేదని గమనించాలి !  ఒకవేళ మీరు పరీక్ష ముందు రాత్రి చదవాలనుకుంటే కూడా ,  రోజూ చదివే సమయమే అప్పుడుకూడా , వినియోగించాలి అంటే , సాయింత్రం అయిదు గంటలనుంచి , ఎనిమిది వరకూ చదువుకోవడం అలవాటయి ఉంటే , ఆ విధం గా చేయవచ్చు ! కానీ పరీక్ష ముందు రోజుల్లో, రాత్రి చాలా సమయం మేలుకొని కనుక చదివే అలవాటు ఉన్న వారు కూడా  , పరీక్ష ముందు రోజున, త్వరగా నిద్ర పోవడం  మరచి పోకూడదు ! మరి మిగతా జాగ్రత్తలేంటి ?
 రాత పరికరాలు సిద్ధం చేసుకోవడం :  పరీక్ష ముందు రోజే , రాత కు అవసరమయే , పెన్సిళ్ళూ , పెన్నులూ , స్కేలూ , మిగతా  కంపాస్ బాక్స్ లాంటి వాటిని సిద్ధం చేసుకోవాలి !  ఎక్కువ  పెన్సిళ్ళు తీసుకు వెళ్ళడం వల్ల సహజం గానే , పరీక్షలో సమయం ఆదా చేస్తున్నారన్న మాటే కదా , చెక్కు కోకుండా !  పరీక్షా సమయం లో ప్రతి నిమిషమూ విలువైనదే కదా ! ఒక వాటర్ బాటిల్ ను అనుమతిస్తే , తీసుకు వెళ్ళ వచ్చు ! అట్లాగే  కొద్దిగా చిరు తిళ్ళు కూడా చాక్లెట్ , బిస్కెట్లూ అనుమతిస్తే ! ఉంటే ,  సరిగా పనిచేసే వాచీ ని కూడా ! 
ఆహారం, నీరూ : పరీక్ష కు ముందే మీ ఆహారం విషయం లో జాగ్రత్త తీసుకోవాలి !  అతి గా కానీ అల్పం గా కానీ తిన కూడదు ! పడని ఆహారమూ , కొత్త ప్రదేశం లో ఆహారమూ అసలే తినకూడదు , పరీక్ష రోజున !  ప్రత్యేకించి మద్యాహ్నం పరీక్ష ఉన్న సమయం లో ! డీ హైడ్రేట్ అవకుండా , ముందే ,  చాలినంత నీరు తాగడం మంచిది ! ప్రత్యేకించి , భారత దేశం లాంటి ఉష్ణ దేశాలలో ,  చాలా మంది విద్యార్ధులు , అతిగా టీలూ , కాఫీలూ తాగి , నీరు సరిపడినంత తాగకుండా , వారికి తెలియ కుండానే డీ హైడ్రేట్ అయి పరీక్షా హాలు లోకి వస్తారు ! దానికి తోడు , పరీక్ష ల వలన కలిగే ఆందోళన , వారికి ఎక్కువ చెమట పట్టించి , పరిస్థితిని ఇంకా అధ్వాన్నం చేస్తుంది ! ఇవన్నీ చిన్న విషయాలే అయినా , మిగతా సమయాలలో అంత ఏకాగ్రత అవసరం లేదు కనుక , డీ హైడ్రేషన్ వల్ల వెంటనే ఏ పరిణామాలూ ఉండక పోవచ్చు , కానీ , పరీక్షా సమయం లో డీ హైడ్రేట్ అవుతే , వారి మెదడు అతి సున్నితమైన భాగం కావడం వల్ల , ఏకాగ్రత తక్కువ అవడమే కాకుండా ,  తల తిప్పినట్టూ , తల నొప్పిగానూ కూడా ఉంటుంది ! ఆ లక్షణాలతో పరీక్ష ముందు బాగా సిద్ధం అయిన వారు కూడా , పూర్తి గా సమాధానాలు రాయలేక పోవడం జరగ వచ్చు ! 
పరీక్షా పధ్ధతి గురించి ముందే తెలుసుకోవడం :  చదవడం , నేర్చుకోవడం ఒక ఎత్తైతే , పరీక్ష గురించి పూర్తి గా తెలుసుకుని అవగాహన ఏర్పరుచు కోవడం ఇంకో ఎత్తు ! ఆ మాటకొస్తే ,  రోజూ పాఠాలు నేర్చు కుంటున్నప్పుడే , పరీక్షా పత్రం లో ప్రశ్నలు ఎట్లా ఇస్తారు ! ఎంత సమయం ఉంటుంది ? వాటిని ఆ సమయం లో నే బాగా రాయడం ఎట్లా ? అనే విషయాలన్నీ తెలుసుకుని , తదనుగుణం గా చదవడమూ , రాసుకోవడమూ, అంటే నోట్సు రాసుకోవడమూ చేసిన విద్యార్ధులు ఎక్కువ లాభ పడతారు !  ఇక పరీక్ష హాలులో కూడా , ప్రశ్న పత్రం గురించిన అన్ని సూచనలనూ, నిబంధనలనూ ,  శ్రద్ధ గా విని , ఆచరించాలి !  
వచ్చే టపాలో , అసలు పరీక్షా సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ! 

చదువుకోవడం ఎట్లా ? 21. మరి పరీక్ష రోజున, ఏం చేస్తే ఎక్కువ లాభం ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 8, 2013 at 12:28 ఉద.

చదువుకోవడం ఎట్లా ? 20. మరి పరీక్ష రోజున, ఏం చేస్తే ఎక్కువ లాభం ? 

( పై చిత్రం , పరీక్షకు సిద్ధమవకుండా, ఒక విద్యార్ధి రాసిన సమాధానం !  చిత్రం లో ఉన్న త్రికోణం లేదా ట్రయాంగిల్ లో, రెండు భుజాల విలువ తెలుసు కదా ! ( 3 cm. and 4 cm. )   ఆ రెండు భుజాల విలువలనూ గుణించి , ఫలితాన్ని , 2 తో భాగిస్తే , అది మూడవ భుజం విలువ అవుతుంది ! అంటే పైన ఇచ్చిన ప్రశ్న లో X విలువ 6 cm.( 3×4 = 12/2 = 6 cm. ), కానీ పై సమాధానం రాసిన విద్యార్ధికి ఆ విషయం తెలియక,   X ( విలువ అంటే ఆ భుజం విలువ ) ను కనుక్కో మని అడిగితే , ఇదుగో ఇక్కడే ఉంది X  అని రాసి, ఒక బాణం గుర్తు కూడా వేసి చూపించాడు ! )
మునుపటి టపాలలో , పరీక్షలకు ముందు చేయవలసిన కర్తవ్యం గురించి తెలుసుకున్నాం కదా ! సామాన్యం గా, పరీక్ష కు కొన్ని వారాల ముందే , చాలావరకూ సిద్ద మయి ఉండాలి ! అది చాలా మంచి పధ్ధతి ! కొంత మంది విద్యార్ధులను గమనించాను , కాలేజీ రోజుల్లో , వారు పరీక్ష ముందు వారాల్లో , ఏమాత్రమూ ఆందోళన లేకుండా , అదే సమయం లో,  మిగతా విద్యార్ధులు ( నేను కూడా ! )   పడే అవస్థలు చూస్తూ ఉండే వారు  ! పరీక్ష రోజులు ప్రతి విద్యార్ధికీ వారి భవిష్యత్తును నిర్దేశం చేసే, అతి ముఖ్యమైన రోజులు కదా ?  ఆ సమయం లో ఈ జాగ్రత్తలు పాటిస్తే , వారు అంతకు ముందు చేసిన  ప్రయత్నాలన్నీ , పూర్తి ఫలితాలనిస్తాయి ! అది ఎట్లాగో తెలుసుకుందాం ! 
1. పరీక్ష ల కోసం తీసుకునే జాగ్రత్తలు , పరీక్ష ముందు రోజు నుంచే ప్రారంభం చేయాలి , తప్పని సరిగా !  పరీక్ష ముందు రోజు రాత్రి కనీసం 7 నుంచి 8 గంటలు తప్పని సరిగా నిద్ర పోవాలి , ఎట్టి పరిస్థితి లోనూ !  ఒక వేళ పరీక్షా హాలు దూరం గా ఉంటే ,  అందుకు తగిన ప్రయాణ ఏర్పాట్ల గురించి పూర్తి అవగాహన , హాల్ టికెట్ తీసుకున్న వెంటనే చేసుకోవాలి ! పరీక్ష సెంటర్ కు చేరుకోడానికనీ , ప్రయాణం చేయడానికి , కనీసం కొన్ని గంటలు ముందే బయలు దేరాల్సి ఉంటే , అందుకు తగినట్టు గా , పరీక్ష రోజు ముందే , కొన్ని గంటలు ముందు గా నిద్ర కు ఉపక్రమించాలి ! టీలూ , కాఫీలూ ఎక్కువ గా తాగి, పరీక్షల ముందు సిద్దమయే వారు కూడా , పరీక్ష కు ముందు రోజున  కనీసం నాలుగు నుంచి ఆరు గంటల ముందు ( అంటే నిద్ర పోయే సమయానికి  నాలుగూ , ఆరు గంటల ముందు , ఏ  టీలూ కాఫీలూ , తాగకుండా జాగ్రత్త తీసుకోవాలి !  కారణం , పరీక్ష  ముందు రాత్రి , సరిపడినంత నిద్ర ఉంటే , మెదడు లో ఉండే నాడీ కణాల కన్నిటికీ , సరిపడినంత ప్రాణ వాయువూ , సరిపడినంత గ్లూకోజూ , అందితే , ఆ కణాలన్నీ , తాజా గా ఫ్రెష్ గా ఉండి , చురుకు గా పని చేస్తాయి !  చదివిన పాఠాలూ , ముఖ్యమైన విషయాలూ , మూల సూత్రాలూ కేవలం గుర్తు ఉండడమే కాకుండా , వాటిని సరి అయిన పధ్ధతి లో ఉపయోగించడం కూడా సులభం అవుతుంది , నాడీ కణాలు అన్నీ కూడా  చురుకు గా పని చేస్తే ! పరీక్షల ముందు , టీలూ , కాఫీలూ ఎక్కువ గా తాగుతూ , రాత్రుళ్ళు నిద్ర కోల్పోయి చదివిన వారు , ఉదయాన్నే కాలేజీ కి వచ్చినా , వంద శాతం ఏకాగ్రత తో కాలేజీ లో, భౌతికం గా ఉన్నప్పటకీ , మానసికం గా ,  విషయాలను వంద శాతం గ్రహించ లేరు ! కొంత వరకూ అది పరవాలేదు , కానీ పరీక్షల లో కూడా అట్లాంటి పరిస్థితే  ఏర్పడితే , విద్యార్ధుల పర్ఫామెన్స్ గణనీయం గా తగ్గి పోతుంది ! నిద్ర సరిగా పోకుండా , పరీక్ష రాయడానికి వచ్చిన వారు , రాయ వలసిన జవాబులు , వారు ముందే అనుకున్నట్టు రాయ లేక పోవడమే కాకుండా , ప్రశ్న పత్రాలను పూర్తి గా చూడకుండా , పేపర్ కు రెండో పేజీ చూడకుండా నూ , మిగతా సమాధానాలు రాయడమూ , లేదా ఆ సమాధానాలు రాసే సమయం లో, నిద్ర విపరీతం గా వచ్చి, తూలుతూ ఉండడమూ కూడా చేస్తారు , చేశారు కూడా ! సరి పడినంత నిద్ర , పరీక్ష ముందు రోజు ఉండవలసిన అవసరం గురించి ,  తెలుసుకున్న విషయాలు ,  ఆచరణలో పెడితే , అంటే సరిపడినంత నిద్ర పొతే , ఈ టపా ఉద్దేశం మీరు గ్రహించినట్టే ! 
వచ్చే టపాలో పరీక్ష రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం ! 

చదువు కోవడం ఎట్లా ? 19. పరీక్షల ముందు, ఎట్లా చదివితే ఎక్కువ లాభం ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 5, 2013 at 7:36 సా.

చదువు కోవడం ఎట్లా ? 18. పరీక్షల ముందు ఎట్లా చదివితే ఎక్కువ లాభం ? 

 
పరీక్షల ముందు , తక్కువ  సమయం లో ఎక్కువ పాఠాలు రివైజ్ చేయడం తో పాటుగా , బాగా గుర్తు ఉండేట్టు కూడా ఎట్లా చదవాలో, ఆ కిటుకులు కొన్ని మునుపటి టపాల లో తెలుసుకున్నాం కదా ! మరి ఇప్పుడు ఇంకొన్ని తెలుసుకుందాం ! 
చూడకుండా రాసి , తరువాత పోల్చడం : మీకు గుర్తు ఉండే ఉంటుంది , చిన్న తనం లో, పదాల స్పెల్లింగ్ లు నేర్చుకోవడం కోసం ,  ఆ పదాలను చూడకుండా , పేపర్ మీదో , పలక మీదో రాసి తరువాత ఆ రాతను ( అంటే రాత లో స్పెల్లింగ్ ను )  అసలు ప్రింటు లో ఉన్న పదాలతో పోల్చి సరిచూసుకోవడం ! పొర పాటు ఉంటే , సరి చేసుకోవడం ! అది చాలా మంచి పద్ధతే కనుక , ఆ పద్ధతిని పెద్ద క్లాసులకు వెళ్ళినా కూడా , అనుసరించ వచ్చు !  అంటే కాలేజీ లో చదువుతున్నా కూడా !  ఈ పధ్ధతి లో జరుగుతున్నది ఏమిటంటే , ఒకసారి చదువుకుని నేర్చుకున్న స్పెల్లింగ్ మన మెదడులో ‘ ముద్ర ‘ వేసిందో లేదో పరీక్షించు కోవడమన్న మాట !  మనం స్పెల్లింగ్ ను శ్రద్ధ గా నేర్చుకుంటే నే , ఆ స్పెల్లింగ్ మన మెదడు లో ముద్ర వేయ గలదు !  చదువులో పై క్లాసులకు వెళుతున్న కొద్దీ , స్పెల్లింగ్ లు వచ్చినా , ఇంకో రకం గా ఈ పధ్ధతి ని వినియోగించుకోవచ్చు !  అంటే పాఠాలలో ఉండే వివిధ నిర్వచనాలను , చూడకుండా రాసుకుని ,  తరువాత చూసి సరిచేసుకోవడం !  ఎందుకంటే , నిర్వచనాలు ఉన్నది ఉన్నట్టుగా పరీక్షలో పూర్తి మార్కులు వస్తాయి !  
కధ చెప్పడం :  అంటే స్టోరీ టెల్లింగ్ : ఈ పధ్ధతి కూడా మన జ్ఞాపక శక్తి ని చురుకు గా ఉంచే ఒక ప్రక్రియ !  తల్లి దండ్రులు చెప్పే కధలను చెవులారా ఆలకించి , శ్రద్ధగా విని ఆనందించి , ఆ కధలను జీవితాంతం గుర్తు ఉంచుకోని సంతానాన్ని వేళ్ళ మీద లెక్కించ గలమా ? అంతటి మహత్యం ఉంది కధ కు !  ఆ మాటకొస్తే , మన జీవితాలన్నీ ,అనేక కధలతో నిండి ఉంటాయి !   మన జీవితాల పెద్ద కధ లో అనేక పిట్ట కధలు ఉంటాయి !  అన్నిటినీ మనం వీలైనంత వరకూ గుర్తు ఉంచుకో గలుగు తున్నామంటే ,  మరి అది కధ  గొప్ప తనమే కదా ! చదివే చదువు లో కూడా, వివిధ సబ్జెక్ట్ లలో ,  ఈ పధ్ధతి ని ఉపయోగించుకోవచ్చు , ఉత్సాహం ఉన్న విద్యార్ధులు ! వ్యక్తుల జీవిత చరిత్రలు ,కధల రూపం లో గుర్తు ఉంచుకోవచ్చు ! మిగతా పాఠాలు కూడా ! చాలా కష్టమైన పాఠాలను , కధా రూపం లో మొదటే చెప్పుకుని , ఆ కధ ను గుర్తు ఉంచుకోవచ్చు !  
ప్రశ్న : నాలుగు   నీటి బుగ్గలు  లేదా ఫౌంటెన్లు, ఒక్కొక్కటీ పూర్తి గా నీరు వదిలితే ,ఒక పెద్ద పీపాను, ఒక రోజులోనూ , రోజులో సగం సమయం లోనూ , రోజులో మూడో భాగం లోనూ , రోజులో ఆరో భాగం లోనూ ,  నింప గలవు ! మరి ఆ నాలుగు ఫౌంటెన్ లూ కలిసి పూర్తిగా నీరు  నింపడం మొదలెడితే , ఆ  పెద్ద పీపా  రోజులో ఎంత కాలం లో నిండుతుంది ? ఈ  ప్రశ్న లో, గణితం లో నిష్పత్తి అంటే ఫ్రాక్షన్స్ అనే అధ్యాయం గురించినది ! కానీ చిన్న పిల్లలకు ఆసక్తి కరం గా , ఈ లెక్క ఒక కదా రూపం లో ఇవ్వ బడింది భాస్కర గణితం లో !  భాస్కర గణితం లో ఇట్లాంటి ప్రశ్నలు కోకొల్లలు ! మరి పైన ఇచ్చిన ప్రశ్న కు జవాబు చూద్దామా ?  
ఒకటవ ఫౌంటెన్   ఒక రోజులో పీపాను నింప గలదు ! అంటే 1/1 రోజు 
రెండవ ఫౌంటెన్, ఒక రోజులో సగం సమయం లో పీపాను నింప గలదు ! అంటే 1/2 రోజు 
మూడవ  ఫౌంటెన్,  రోజులో మూడవ వంతు సమయం లో నింపగలదు అంటే 1/3 రోజు 
నాలుగవ ఫౌంటెన్,  రోజులో ఆరవ వంతు సమయం లో నింప గలదు  అంటే 1/6 రోజు  
మరి అన్ని ఫౌంటెన్ లనూ ఒక్క సారిగా తెరిస్తే ఆ పీపాను ఎంత సమయం లో నింప గలవు అనేది ప్రశ్న కదా ! అందుకు   నాలుగు ఫౌంటెన్ లూ , విడి విడి గా ఎంత సమయం తీసు కుంటాయో , వాటన్నిటినీ కలపడమే కదా ! ఎందుకంటే అన్నీ కలిసి ఎంత సమయం లో నింప గలవు ? అనేది ప్రశ్న కాబట్టి ! అందుకు 1/1 +1/2+1/3+  1/6 = 1/12 అంటే రోజులో పన్నెండవ వంతు రోజులో నింప గలవు అన్నీ కలిసి ! అంటే 24 గంటలలో  పన్నెండవ భాగ సమయం, రెండు గంటలు !  వెయ్యి సంవత్సరాల క్రితమే , భాస్కరా చార్యుడు,  గణితాన్ని,తన కుమార్తె లీలావతి కీ, ( ఇతర  విద్యార్ధులకూ ) సులభం గా అర్ధమవడానికి ఎంత చక్కగా ప్రశ్నలను  ఆసక్తి కరం గా ( కధా రూపం లో ) అడిగేవాడో !
 
వచ్చే టపాలో ఇంకొన్ని కిటుకులు ! 

చదువుకోవడం ఎట్లా? 18. పరీక్షల ముందు, ఎట్లా చదివితే ఎక్కువ లాభం ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 3, 2013 at 7:55 సా.

చదువుకోవడం ఎట్లా? 18. పరీక్షల ముందు ఎట్లా చదివితే ఎక్కువ లాభం ? 

 
క్రితం టపాలో , పద చిత్ర  గురించి తెలుసుకున్నాం కదా , అది ఎట్లా మీకు ఉపయోగ పడుతుందో ఇక మీరే, అనుభవం మీద చెప్పాలి,  మిగతా వారికి ! తరువాతి  కిటుకు  గురించి తెలుసుకుందాం ఇప్పుడు ! 

సంక్షిప్తాక్షరాలూ , పొట్టి పదాలు :  దీనినే ఆంగ్లం లో నెమొనిక్స్ , యాక్రోనిమ్స్ అని కూడా అంటారు !  అంటే పొడవైన పదాలను , ఎక్కువ గా ఉన్న వాటిని కుదించి ,  చిన్న చిన్న అక్షరాలూ , పదాలు గా  రాసుకోవడం ! ఈ పధ్ధతి , చాలా మంది విద్యార్ధులు , చాలా తరచు గా ఉపయోగించే పద్ధతే ! 
కాకపొతే , చాలా మంది విద్యార్ధులు , ఈ పధ్ధతి ని సంపూర్ణం గా ఉపయోగించుకోరు !   సరి అయిన పధ్ధతి లో ఈ పధ్ధతి ని ఉపయోగించుకుంటే ,  వాటి లాభాలు చాలా ఉంటాయి !  ఈ పధ్ధతి గురించి వివరం గా తెలుసు కుందామిప్పుడు !
ఉదాహరణలు : 
వార్తలను ఆంగ్లం లో NEWS  అని అంటారు ఎందుకో తెలుసా ? ఉత్తర , తూర్పు , పడమర , దక్షిణ దిక్కులనుంచి  వచ్చే సమాచారాన్ని  వార్త అంటారు కనుక అందుకు నాలుగు ప్రధాన దిక్కుల మొదటి అక్షరాలను కలిపి NEWS  అనే ఒక పదం ఏర్పాటు చేశారు !  మనం త్వరగా ఒక పనిని చేయమని ఎవరికైనా రాత పూర్వకం గా చెప్పడానికి , ASAP  అని రాస్తాము కదా !  అంటే As Soon As Possible అనే వాక్యం లో పదాల మొదటి అక్షరాలు ! 
అట్లాగే U.S. అంటే యునైటెడ్ స్టేట్స్ అని కదా ! ఇట్లా ఇంకొన్ని చూద్దాం ! ఇంధ్ర ధనుస్సు లో సప్త వర్ణాలనూ , VIBGYOR  అని అంటారు, సులభం గా గుర్తు ఉంచుకోవడానికి . దానినే విబ్ జియార్ అని గుర్తు ఉంచుకోవచ్చు !   మరి వాటికీ ఇంధ్ర ధనుస్సు లో రంగులకూ , సంబంధం ఏమిటి ? 
V అంటే వయోలెట్ రంగు I అంటే ఇండిగో రంగు , B అంటే బ్లూ రంగు , Y అంటే ఎల్లో రంగు , O అంటే ఆరెంజ్ రంగు , ఇక చివరగా R అంటే రెడ్ రంగు ! చూశారా ఒక్క VIBGYOR  అనే పదాన్ని గుర్తు ఉంచుకుంటే , అన్ని రంగులూ మీకు గుర్తు ఉన్నట్టే కదా ! 
ఇక కాస్త పెద్ద క్లాసులలో పాఠాల నెమొనిక్స్ కొన్ని చూద్దాం : 
My Very Easy Method Shows Us Just Nine Planets అనే వాక్యం గుర్తుంచుకునారనుకోండి ! మీకు సూర్యుడి చుట్టూ తిరిగే  నవగ్రహాల పేర్లు తెలిసి పోయినట్టే ! అది ఎట్లా గంటే ,  My  లో మొదటి అక్షరం Mercury , Very లో మొదటి అక్షరం Venus ,Easy లో మొదటి అక్షరం Earth, Method లో మొదటి అక్షరం Mars , Shows లో మొదటి అక్షరం Saturn ,Us లో మొదటి అక్షరం Uranus , Just లో మొదటి అక్షరం Jupiter , Nine లో మొదటి అక్షరం Neptune , Planets లో మొదటి అక్షరం Pluto !  ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే  ఈ వాక్యం మొదట సూర్యుడు ఉన్నట్టు మనం ఊహించుకుంటే ,   గ్రహాలన్నీ కూడా పదాల క్రమం లోనే  కక్ష్యల  లో ఉంటాయి ! 
జీవ శాస్త్రం అంటే బయాలజీ లో  వర్గీకరణ క్రమం గుర్తు పెట్టుకోవాలంటే , Don King Plays Chess On Friday , Generally Speaking ‘ అనే వాక్యం మీరు గుర్తు ఉంచుకుంటే ,  మీకు తెలిసిపోయినట్టే !  Don లో మొదటి అక్షరం Domain , King లో మొదటి అక్షరం Kingdom , Plays లో మొదటి అక్షరం phylum , Chess లో మొదటి అక్షరం Class , On  లో మొదటి అక్షరం Order , Friday లో మొదటి అక్షరం Family , Generally లో మొదటి అక్షరం Genus , Speaking లో మొదటి అక్షరం Species అనీ గుర్తు పెట్టుకోవాలి !  
పైన చెప్పిన విధం గా వివిధ సబ్జెక్ట్ లలో ముఖ్యమైన పదాలనూ , మీకు ఇష్టమైన రీతి లో నెమొనిక్స్ అంటే క్లుప్త పదాలుగానూ , అక్షరాలు గానూ మీరు  పాఠం లో ఆ పదాలు చదువుతున్నప్పుడే , ఏర్పరుచుకుంటే ,  మీకు  ఎక్కువ విషయాలు గుర్తుంటాయి , ఎక్కువ కాలం !  ముఖ్యమైన విషయం ఏమిటంటే , మీరు ఇట్లా క్లుప్త పదాలు ఏర్పరుచు కున్నప్పుడు , మళ్ళీ మళ్ళీ మీకై  మీరే పరీక్ష చేసుకుంటూ ఉండాలి  అవి పూర్తి గా మీకు వచ్చే వరకూ ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని కిటుకులు ! 

చదవడం ఎట్లా ? 16. పాఠ్య పుస్తకాలు, సులభం గా అర్ధం చేసుకోవడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 1, 2013 at 2:55 ఉద.

చదవడం ఎట్లా ? 16. పాఠ్య పుస్తకాలు  సులభం గా అర్ధం చేసుకోవడం ఎట్లా ? 

 
S Q R 4. ( R4= RRRR )
 
క్రితం టపా లో మనం, S  అంటే సర్వే అనీ , Q  అంటే , చదివే సమయం లో  వేసుకునే ప్రశ్నలు అంటే , what , where ,when,how , who ,why  అనే ప్రశ్నలు ప్రతి పాఠం లోనూ మీ అంతట మీరే ప్రశ్నలు వేసుకుని , వాటికి సమాధానాలు రాబట్టు కోవడానికి , శ్రమ పడితే ,  పాఠం  మీకు ఎంత త్వరగా అర్ధం అవుతుందో కూడా తెలుసుకున్నాం కదా ! మరి ఇప్పుడు R 4 అంటే ఏమిటో చూద్దాం ! R 4 అంటే నాలుగు R లు ( Read , Recite , Record , Review  )  అంటే రీడ్ , రిసైట్ , రికార్డ్ , రివ్యూ  అని ! 
మరి చదివే సమయం లో, ఈ నాలుగు R లూ ఎట్లా ఉపయోగ పడతాయి ?  ( R4= RRRR )
Read :  మొదటి దశలో మీరు సర్వే చేశాక , ప్రశ్నించు కోవడం కూడా చేశాక , ఆ పాఠాన్ని జాగ్రత్త గా చదవడం చేయాలి ! ఈ సారి చదివే సమయం లో కేవలం పై పైన సర్వే చేయడం కాక , పాఠం లో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి ! అంటే పాఠం , కూలంక షం గా చదవాలి ! అంటే అన్ని వివరాలూ చదువుతూ , ఏవి ముఖ్య విషయాలో , వాటి మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి ! ఒక వేళ , ఆ పాఠం  లో కనుక మీకు పరీక్ష ఉంటే , ఏ రకాలైన ప్రశ్నలు అడగ వచ్చు ? అనే విషయం కూడా మీరు మనసు లోనే ఆలోచించి , వాటికి సమాధానం మీకు తెలుసో లేదో కూడా , చదివే సమయం లోనే  మీరు అంచనా వేసుకుంటూ ఉండాలి ! 
Recite : రిసైట్ చేయడం అంటే, వల్లె వేయడం.  అంటే , మీరు చదివిన పాఠాన్ని ,  రెండో మారు మననం చేసుకోవడం , అంటే, ఈ సారి మీరు పాఠ్య పుస్తకం లో పాఠం చూడకుండా ,  మీరు చదివినది గుర్తు కు తెచ్చుకోవడం !   ఈ చర్యలో, మీరు చదివిన పాఠాన్ని, ఉన్నది ఉన్నట్టు , గుర్తు తెచ్చుకో నవసరం లేదు !   చదివినది , క్లుప్తం గా గుర్తుకు తెచ్చుకుంటే , మంచిది ! పాఠం లో ఉన్న పదాలే ఖచ్చితం గా మళ్ళీ గుర్తుకు తెచ్చు కోవలసిన అవసరం కూడా లేదు  !  మీ స్వంత పదాలు కూడా ఉపయోగించ వచ్చు ! ( కానీ పాఠం లో ఉన్న కొత్త సాంకేతిక పదాలనే వాడితే , పరీక్షలో మార్కులు ఎక్కువ వస్తాయి ! ) ఈ రిసైట్ చేయడం లో  మీరు వేసుకోవలసిన ప్రశ్నలు ( పైన చెప్పినవి ) మళ్ళీ వేసుకుని , ఆ ప్రశ్నలకు సమాధానాలు మీరు చదివి , మననం చేసుకున్న పాఠం  లో ఉన్నాయా? లేదా? అని సరి చూసుకోవాలి !  ఈ సరి చూసుకోవడం , మీరు   విశ్వసనీయం గా అంటే సిన్సియర్ గా చేసుకోవాలి ! అంటే ,విషయాలన్నీ గుర్తుకు రాకపోయినా కూడా మీరు , ‘ బాగా చదివేశాను లే ‘ అని  ప్రశంసించు కోకూడదు !  మీరు , గుర్తు చేసుకున్న పాఠం  లో విషయాలన్నీ కూడా సంపూర్ణం గా లేదని మీకు అనిపించినా , లేదా మీకు తృప్తి గా లేక పోయినా కూడా , పాఠాన్ని మళ్ళీ అంటే రెండో సారి , అవసరం అవుతే , మూడో సారీ  చదవడానికి వెనుకాడ కూడదు !  ప్రతి సారీ చదివాక , మీరు చేయవలసినది, మొదట చేసినదే , అంటే  మళ్ళీ పాఠాన్ని మననం చేసుకోవడం ,  ఆరు ప్రశ్నల సహాయం తో (  what , where ,when,how , who ,why ) ! 
Record : పై విధం గా మీరు మననం చేసుకుని , మీ స్వంత పదాలతో గుర్తు కు తెచ్చుకున్న పాఠాన్ని , నోట్స్ లో రాసుకోవడం ! అంటే  మీరు పరీక్ష లో రాసినట్టు రాసుకుంటున్నారన్న  మాట ! కాక పొతే, మీ నోట్స్ లో !  ఈ నోట్స్ కేవలం, మీరు చదివినది రికార్డ్ చేయడం కోసమే !  ఈ రికార్డ్ చేసుకోవడం అంటే నోట్స్ ఎట్లా రాసుకోవాలో ,మీరు ఇప్పటికే తెలుసుకున్నారు కదా !  ఆ పధ్ధతి ని అనుసరించడమే ! పాఠం లో వచ్చే , ముఖ్యమైన ( సాంకేతిక )  పదాలను కూడా,  మర్చి పోకుండా రాసుకోండి !  
Review : ఇక నాలుగో R  అంటే రివ్యూ చేసుకోవడం : అంటే  పునశ్చరణం చేసుకోవడం ! ఈ దశలో , మీరు నోట్స్ లో రాసుకున్న పాఠం  లోని విషయాలను ఒక సారి చూసుకోవడం చేయాలి !   మీరు చదివిన పాఠానికీ , మీరు రాసుకున్న నోట్స్ కూ , పొంతన ఉందా లేదా అని సరి చూసుకోవాలి ! అంటే , పాఠం లో ఉన్న అన్ని ముఖ్య విషయాలూ , నోట్స్ లో  మీరు ఒక పధ్ధతి లో రాసుకున్నారా లేదా అని చూసుకోవడం !  ఏవైనా ఇంకా ఆ నోట్స్ లో చేర్చాలా ? అనే విషయం కూడా అప్పుడు నిర్ణయించు కోవాలి ! మీ నోట్స్ కేవలం ముఖ్యమైన విషయాలు క్లుప్తం గా రాయబడి , మీరు తరువాత సులభం గా గుర్తు తెచ్చుకోడానికి  అనుకూలం గా ఉండాలే కానీ , చాలా వివరం గా   ప్రింటు లో కాక , చేతి రాత తో రాసిన పాఠ్య పుస్తకం లా ఉండ కూడదు !  
మొదట్లో , పైన వివరించిన విధం గా చదవడం , కొద్దిగా శ్రమ గా నే అనిపించ వచ్చు !   కానీ మీరు ఒకే పధ్ధతి S Q R 4.  ( ఈ పద్ధతే  కూడా అవసరం లేదు ! ) అలవాటు చేసుకుని , దానినే ఎప్పుడూ అనుసరిస్తూ ఉంటే , మీకు పాఠాలు నేర్చుకోవడం అతి సులభం అవుతుంది !  విజయం  కూడా మీదే అవుతుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చదువుకోవడం ఎట్లా ?. 15.పాఠ్య పుస్తకాలు ఎట్లా చదివితే, ఎక్కువ ఉపయోగం ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 30, 2013 at 10:27 ఉద.

చదువుకోవడం ఎట్లా ?. 15.పాఠ్య పుస్తకాలు ఎట్లా చదివితే ఎక్కువ ఉపయోగం ? 

 
మునుపటి టపాలలో  చదువుకు కావలసిన సరంజామా  గురించీ ,  క్లాసు లో చెప్పే పాఠాల నోట్సు తీసుకునే పధ్ధతి గురించీ , తెలుసుకున్నాం కదా !  మనం తెలుసుకునే విషయాలన్నీ కూడా ,  మన లక్ష్యాన్ని అంటే బాగా చదువుకుని , మంచి ఫలితాలు పొందాలనే లక్ష్యాన్ని , చేరుకోవడానికి , ఎంతో సహాయ పడతాయి ! మంచి ఫలితాలు అంటే అవి కేవలం , పరీక్షలలో , మంచి మార్కులు రావడానికే పరిమితం అవకుండా , జీవితాలలో కూడా , చేసే ప్రతి పని లో నూ , ఒక పధ్ధతి ఏర్పడి ,  విజయం పొందే లా  ఉంటాయి , ఆ ఫలితాలు ! ఇప్పుడు పాఠ్య పుస్తకాలు చదివే విధానం గురించి  శాస్త్రీయం గా తెలుసుకుందాం !  చాలా మంది అనుభవజ్ఞులు తమ సంతానానికి ,  ‘ బాగా చదవాలి ‘ కష్ట పడి చదవాలి ‘ అనీ ,   పాఠ్య పుస్తకాలన్నీ , వల్లె వేయాలి , ‘ కంఠ తా పట్టాలి ‘  అని సాధారణ సలహాలు ఇస్తూ ఉంటారు ! అవన్నీ నిజమే , కానీ  ఆ చదివే పద్ధతుల గురించి విద్యార్ధులకు తెలియ జేయరు ! దానితో , పాఠ్య పుస్తకాలను చూడగానే , విద్యార్ధులకు  ఒక రకమైన గుబులు పుట్టుకుంటుంది ! ‘ ఇదంతా నేను చదవాలా ? ‘ అని  ఆందోళన పడుతూ ఉంటారు !  
ఈ క్రింది సూచనలు గమనించి , వాటిని అనుసరించడం అలవాటు చేసుకుంటే ,  పెద్ద పెద్ద పాఠ్య పుస్తకాలు చదివి ఆకళింపు చేసుకోవడం కూడా  చాలా సులువు అవుతుంది !   
 
ప్రధమ సూత్రం : S Q R 4   : ఈ అక్షరాలనూ , అంకె నూ , ‘ ఎస్క్యూ ఆర్ఫోర్ ,ఎస్క్యూ ఆర్ఫోర్ ,ఎస్క్యూ ఆర్ఫోర్ ,ఎస్క్యూ ఆర్ఫోర్ ‘  అని,  అనేక సార్లు వల్లించి,   అది మీ మనసులో నాటుకునేట్టు  అంటే మీరు మీ జీవితం లో ఎప్పుడూ మర్చిపోకుండా , నేర్చుకోండి ! 
 
S  అంటే సర్వే : ( survey  ) :  అంటే మీరు చదవ బోయే  పాఠమైనా , మొదట గా చూడగానే కంగారు పడకుండా ,  ఆ పాఠాన్ని , మొదలు నుంచి , ముగింపు దాకా  ఒక సర్వే చేయండి ! అంటే   ఉదాహరణకు : ఒక పాఠం  అయిదు పేజీలలో ఉంటే , మొదటి పేజీ లో ముందుగా ఆ పాఠం పరిచయం ఎట్లా చేశారు ? ఆ పాఠం దేని గురించి ? ,   అనే విషయం తెలుసుకోండి ! తరువాత  ఆ పాఠం లో తెలుసుకోవలసిన విషయాలను ఏదైనా సైడ్ హెడింగ్స్ రూపం లో ఇచ్చారా? ఇస్తే , ఆ సైడ్ హెడింగ్స్ ఏమిటి ?  అనే విషయం గమనించండి !  చివరగా , ఆ పాఠం  చివర గా  ఇచ్చిన సంగ్రహ వాక్యాలు అంటే సమ్మరీ కూడా చదవండి ! ఇట్లా సర్వే చేయడం వల్ల  మీకు , ఆ పాఠం తో మీకు  రచయిత ఏమి బోధించ దలుచుకున్నాడో  అర్ధం అవుతుంది !  గుర్తు ఉంచుకోండి : మీరు ఈ సర్వే లో కేవలం  ఆ పాఠం  గురించి ఒక  స్థూలమైన అంటే జెనరల్ అభిప్రాయం ఏర్పరుచు కుంటున్నారన్న మాట ! 
Q  అంటే క్వశ్చన్ : లేదా ప్రశ్న :  ఇది మీరు చదివే ఏ  పాఠమైనా , తప్పని సరిగా ఉండవలసిన లక్షణాలలో ఇంకొకటి ! ఒక సారి మీరు చదివే పాఠాన్ని సర్వే చేశాక , మీరు ఆ పాఠాన్ని , అనేక రకాలు గా ప్రశ్నించాలి.  అంటే , ఆ పాఠం , మిమ్మల్ని , రచయిత ఎందుకు నేర్చుకోమంటున్నాడు ?  ఆ పాఠం లో ప్రధాన విషయం ఏమిటి ?  అనే ప్రశ్నలన్నీ మీకై మీరు వేసుకోవాలి ! అంటే   చదివే సమయం లో, ఈ ప్రశ్నలకు జవాబులు అన్నీ మీరు ఆ పాఠం లో వెదకాలి !
 ఈ ప్రశలన్నీ కూడా తేలిక గా గుర్తు ఉంచుకోవడానికి  what? where? why? how? when? who?  ఈ ఆరు ప్రశ్నలనూ మీరు ప్రతి పాఠం నేర్చుకునే సమయం లో తప్పని సరిగా మీకై మీరే వేసుకుని , వాటి సమాధానాల కోసం ప్రయత్నించాలి !  మీరు ఆ  సమాధానాలన్నింటినీ ,  రాబట్టుకున్నారంటే , మీరు మీ పాఠం  , చాలా వరకు నేర్చుకున్నారనే చెప్ప వచ్చు !  విజ్ఞానం సంపాదించుకోవడానికి , లేదా చదువుకుని విద్యావంతులవడానికీ , ఈ  ఆరు ప్రశ్నలూ ,  అతి ముఖ్యమైనవి !  మీరు ఏ సబ్జెక్ట్ చదువు దామనుకున్నా కూడా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు ! 

చదువుకోవడం ఎట్లా ? 14. నోట్సు రాసుకోవడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 29, 2013 at 5:50 సా.

చదువుకోవడం ఎట్లా ? 14. నోట్సు రాసుకోవడం ఎట్లా ?  

పోలికలు మంచిదే ! :
క్రితం టపాలో, నోట్సు ఎట్లా తీసుకోవాలనే విషయం చాలా వరకూ తెలుసుకున్నాం కదా !   విద్యార్ధులు, కేవలం వారి కోసమై నోట్సు రాసుకోవడం అలవాటు చేసుకున్నా , ఇంకొన్ని ముఖ్యమైన విషయాల మీద కూడా దృష్టి పెడితే , వారు రాసుకున్న నోట్సు తో అత్యధికం గా లాభం పొందుతారు ! ఆ విషయాల లో ఒకటి ,  తాము రాసిన నోట్సు ను , తోటి విద్యార్ధుల నోట్సు తో పోల్చుకోవడం. ఇట్లా చేయడం వల్ల అనేకమైన ఉపయోగాలున్నాయి ! సామాన్యం గా , ఒక విద్యార్ధి , కేవలం తను ఒక రోజో లేదా కొన్ని రోజులో , స్కూలు కు కానీ , కాలేజీ కి కానీ వెళ్లక పోవడం వల్లనే , ఇతర స్నేహితుల వద్దనుంచీ , తోటి విద్యార్ధుల నుంచీ ,నోట్సు తీసుకుంటారు !  కానీ ఈ అలవాటును ఒక క్రమ పధ్ధతి లో చేస్తే , అంటే ,  ప్రతి వారమూ , తోటి విద్యార్ధుల నుంచి నోట్సు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి !  ఈ పధ్ధతి తో , తాము మిస్ అయిన ముఖ్యమైన విషయాలను ఇతర విద్యార్ధుల నోట్సు తో  పోల్చుకుని , ఆ పాయింట్స్ కూడా  తమ నోట్సు లో రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ! ముఖ్యం గా, తోటి విద్యార్ధులు ఆ పాఠాన్ని ఎట్లా అర్ధం చేసుకుంటున్నారు ? , తమ కన్నా భిన్నం గా ? అని ఒక అంచనా కూడా వేసుకోవచ్చు !  తమ నోట్సు ను ఆ రకం గా ఇంకా బాగా రాసుకోవడం చేయవచ్చు !  వారు పాఠాన్ని వినే సమయం లో ఇంకేవైనా విషయాల మీద దృష్టి కేంద్రీకరించాలా లేదా అన్న విషయం కూడా వారికి బోధ పడుతుంది , ఇతర విద్యార్ధుల నోట్స్ తో వారి నోట్స్ ను పోల్చుకుంటే !  వారిలో స్నేహ భావం కూడా అలవడుతుంది ! పోటీ స్వభావం కూడా పెంపొందుతుంది !  ఈ పోటీ , కేవలం ఒక ఆరోగ్యదాయకమైన పోటీ గానే ఉండాలి కానీ , అసూయా ద్వేషాలకు  అవకాశం ఇవ్వ కూడదు ! 
సమీక్షించడం ( రివ్యూ ) , మళ్ళీ మళ్ళీ రాసుకోవడం ! మెరుగులు దిద్దడం : 
ఒక సారి,  ప్రతి పాఠం చెప్పే సమయం లోనూ నోట్సు రాసుకోవడం అలవాటు చేసుకున్నాక ,  ఇంకో అతి ముఖ్యమైన విషయం కూడా విద్యార్ధులు ఎప్పుడూ గుర్తు ఉంచుకోవాలి !  అది, నోట్సు రాసుకోవడం  అనేది ఒక్క సారి చేశాక , మీ పని అయి పోయిందని , చేతులు దులుపు కో కూడదు ! అంటే ఒక సారి రాసిన నోట్సు , ఫైనల్ కాకూడదు !   ఇంటికి వచ్చాక , ఆ నోట్సు ను అనేక సార్లు సమీక్షించుకోవాలి ! అంటే , ఆ విషయం మీద, మీరు రాసుకున్న నోట్సు , సంపూర్ణం గా ఉందో లేదో , తరచి చూసుకుంటూ ఉండాలి !  ఇట్లా చూసుకోవడం, అనేక మార్లు చేయాలి , అవసరమైతే !   ఈ చర్యలో పైన ఉదహరించిన , ఇతర విద్యార్ధుల నోట్సు తో పోలికే కాక ,ఒక పాఠ్య పుస్తకం నుంచి కూడా రిఫర్ చేసి  కొన్ని ముఖ్యమైన  విషయాలను , నోట్సు లో రాసుకోవచ్చు ! అంతే కాక , మీరు రాసుకున్న విషయాలను ఒక  పధ్ధతి లో  ఆర్గనైజ్ చేసుకోవాలి మీరు మీ నోట్సు లో !  ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటే , మీరు రాసుకున్న నోట్సు సులభం గా అర్ధం అవుతుంది !   కొన్ని సమయాలలో మీరు కొన్ని పటాలు కూడా చేర్చు కోవలసిన అవసరం ఉండ వచ్చు , మీ నోట్సు లో !   మీరు, మళ్ళీ ,మళ్ళీ, నోట్సు ను రివైజ్ చేసి, కుదించి , మెరుగులు దిద్దుతూ ఉండడం వల్ల , మీకు   మీరు రాసుకున్న నోట్సు లో ఉన్న విషయాలు చాలా వరకు అర్ధం కావడమే కాక , మీరు ఎక్కువ కాలం గుర్తు ఉంచుకో గలుగుతారు కూడా  !  ఇట్లా చేయడం అలవాటు చేసుకుంటే , విద్యార్ధులకు చిన్న తనం నుంచే , తాము ( పాఠం లో ) గ్రహిస్తున్న విషయాలను , తరచి చూసి , సునిశితం గా పరిశీలించే , పరిశీలనా జ్ఞానం కూడా పెంపొందుతుంది !  చదివే ఏ చదువు లక్ష్యం అయినా అదే కదా !   చివరగా , ఇట్లా  మీరు శ్రమ పడి , అనేక రకాలు గా విషయాలను సేకరించి , రాసుకున్న నోట్సు ను  జాగ్రత్తగా , ఒక ఫైల్ లో నో ఫోల్డర్ లోనో  , బైండర్ లోనో పెట్టుకోండి !
నోట్సు   తీసుకోవడం ఎప్పుడూ, ఒక పధ్ధతి గా ఎట్లా చేయాలో సులభం గా గుర్తుంచు కోవడానికి    5R లు అంటే అయిదు R లు :  Record,Reduce, Recite, Reflect, and Review  ఉపయోగ పడతాయి , విద్యార్ధి జీవితం లో ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !