Our Health

రచయత ఖజానా

ప్ర.జ.లు. 10. స్త్రీలూ – ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 28, 2012 at 11:30 సా.

ప్ర.జ.లు. 10. స్త్రీలూ – ఇన్ ఫిడిలిటీ లూ ! 

ప్రశ్న: విదేశాలలో ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ ల మీద  యువతుల  ఆలోచనా ధోరణులు ఎట్లా ఉన్నాయి? : 
జవాబు : యువతుల కామ జీవితం లో చెప్పుకోదగ్గ మార్పులు కనిపిస్తున్నాయి. ఒక ఉదాహరణ: లైలా యుక్త వయసు వచ్చిన స్త్రీ.  వయసు తో పాటు గా కాక కాస్త ఎక్కువ గానే పెరిగింది.టీనేజ్ అమ్మాయి గా కాక ఒక ప్రౌఢ లా కనిపిస్తుంది చూసే వారికి. ఆత్మ విశ్వాసం తొ ణికిస లాడుతూ ఉంటుంది ఆమెలో !  స్వతంత్రం గా  పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ, కాలేజీ లో చదువుకుంటుంది. తను ఆమె తల్లి లా ఆలోచించడం లేదు. లైలా దృష్టి లో ఆమె అమ్మ ఒక మూసలో పోసిన విధం గా, ఒక వివాహం చేసుకుని , ఇరువురు పిల్లలను పెంచుతూ , భర్త తొ సంసారం చేస్తుంది. ఆమె తండ్రి ఒక డల్ పురుషుడు. ఆర్ధిక సుస్థిరత మాత్రమె ఇవ్వగలడు. అయినా సరే , ఆమె తల్లి , ఆయన మీద ఆధార పడి, వారి సంబంధం , ఏ చిరుగాలికి దీపం లా ఎప్పుడు ఆరిపోతుందో అని బెంగ పడుతూ , ‘ సంసార జీవితం ‘ గడుపుతూ ఉంటుంది. తాను అట్లా చేయకూడదు. తనకూ ఒక స్థిరమైన  ఆర్ధిక స్వాతంత్ర్యం కలిగిన పురుషుడు కావాలి. అతని  స్థిరమైన ప్రేమా కావాలి. వాటి తో పాటుగా , తనకు జీవితం లో రోమాన్స్ కావాలి.  ఎక్సైట్ మెంట్ కావాలి , కామోత్తేజం కలిగించి , తనను కామ కడలిలో డోల లాడించే  మగ ధీరుడు కావాలి. తన కామోత్తేజ స్థానాలను లయ బద్ధం గా   మీటుతూ  తన లో ప్రణయ రాగాలు పలికించే  రసమయ సంగీత సామ్రాట్టు కావాలి. ఆమె అంచనాలకు తగ్గ పురుషుడు , వివాహం లో లేక పొతే , ఆమె  , ఆమె తల్లి లా  సరిపుచ్చు కోదు. సామాజిక కట్టుబాట్లు, పాప్ కల్చరు, అన్నీ కలిసి ఆమె మెదడులో ఉన్న కామోత్తేజ జీవ రసాయనాలను  ‘ నీరు గారుస్తున్నాయి ‘ దానికి తొడు కుటుంబ గౌరవం , కట్టుబాట్లూ , లైలాను ఉక్కిరి బిక్కిరి చేసి, ఆమెకు    కామ సువాసన కలిగిన తాజా  ప్రణయ శ్వాసలు తీసుకోకుండా  చేస్తున్నాయి.  తాను ఈ బంధనాలను తెంచు కుంటే ,  అతి తేలిక గా   ఊపిరి తీసుకోగలదు. అప్పుడు ఆమె కోరికల  రెక్కల విహంగాలు , హాయిగా ఎగిరి , తన ప్రణయ సామ్రాజ్యం లో తన ఇష్టం వచ్చిన చోట  వాలుతాయి. ఆమె తన  జీవితం లోని ఆ ‘ చిరు ‘ కోరికలు తీర్చ గలిగే  వాడి  కోసం , రహస్యం గా కూడా  వెదికి , అవసరమైతే ,  ఎఫైర్స్  పెట్టుకుని ,  సంపూర్ణమైన ఆనందం అనుభవించడానికి  వెనుకాడదు.
వివాహ జీవితం లో , ఆనందం కోల్పోయి , సతమత మవుతూ , తీవ్ర నిరుత్సాహం చెంది , నిస్సహాయ స్థితి లో ఉన్న వారే , ఆ వివాహ బంధం నుంచి విముక్తి చెందడానికి ప్రయత్నిస్తారు. అట్లా బయటకు అడుగిడడం తో  ,  స్త్రీలు ,  తమకు తాము ఒక నూతన శక్తి పొందినట్టు భావిస్తారు. వారి లో ఉడిగి పోయిన శక్తులు , మళ్ళీ సజీవమైనట్టు ఫీల్ అవుతారు. 
వారి దృష్టి లో ఆ సమయం లో ఎఫైర్ పెట్టుకోవడం ,  ఒక పెద్ద  అరుపు లేదా స్క్రీం.  ఆ  అరుపు  , తామో , తమ వివాహమో ఉండాలి అని అనుకుని, తాడో పేడో తేల్చుకోవాలి , అని  తీసుకున్న నిర్ణయానికి సంకేతం. ఆ నిర్ణయం తీసుకుని , స్త్రీలు , కేవలం ఎప్పుడూ అణిగి మణిగి , ఆత్మ న్యూనతా భావం తో తల ఊపుతూ ఉన్న ఒక సామాన్య స్త్రీ గా కాక , ఒక శక్తి వంతమైన  స్త్రీగా ఫీల్ అయి , నూతనోత్తేజం పొందుతారు. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

ప్ర.జ.లు. 9. స్త్రీలూ- ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 28, 2012 at 10:24 ఉద.

ప్ర.జ.లు. 9. స్త్రీలూ- ఇన్ ఫిడిలిటీ లూ ! 

ప్రశ్న : మరి విదేశాలలో ఈ  పరిస్థితి ఎట్లా ఉంది ? : 
జవాబు : విదేశాలలో స్త్రీల ఇన్ ఫిడిలిటీ పరిస్థితి ‘ ఆశా జనకం ‘ గా ఉంది. ఒక అంచనా ప్రకారం, విదేశాలలో పురుషులలో యాభై నుంచి డెబ్బయి శాతం వరకూ ఉంటే , స్త్రీలలో ముప్పై నుంచి అరవై శాతం ఉంది. ఈ గ్యాప్ అతి త్వరగా   తగ్గి పోతూ ఉన్నది.అంటే ఈ విషయం లో కూడా స్త్రీలు , పురుషులతో సమానత్వానికి ప్రయత్నిస్తున్నారు.  అమెరికా లో ప్రెసి డెన్ షియల్ కాండిడేట్ అనుకున్న సారా పాలిన్ తన భర్త బిజినెస్ పార్టనర్ తో తన రొమాంటిక్ పార్టనర్ షిప్  రహస్యం గా సాగించినది. దానితో ఆమె భర్త ,  తన బిజినెస్ లో అతని  పార్టనర్ షిప్ కు ఉద్వాసన చెప్పాడు. రొమాంటిక్ పార్టనర్ షిప్ నిర్విఘ్నం గా కొనసాగించ డానికా అన్నట్టు ! స్త్రీలలో ఇన్ ఫిడిలిటీ అనేది  కేవలం సాహసోపేత మైనదే  కాక ,  డెస్పరేట్ అంటే తప్పని సరి పరిస్థితులలో జరుతుతుంది.  డెస్పరేట్ ఎందుకంటే , స్త్రీలు తమ వ్యక్తి గత ప్రణయ సంబంధాలను చాలా సీరియస్ గా తీసుకుంటారు.ఆ సంబంధాలలో  తుఫాను వస్తే తట్టుకోలేరు. సుడి గాలికి తల్లడిల్లే  పూ రెక్క అంటే  petal of a flower లా విల విల లాడతారు. వారు ఆ సమయం లో తీసుకునే ఆ చర్య , అదే ఇన్ ఫిడిలిటీ ,  వారు సేద తీర్చుకోడానికి , ఆలంబన గా ఉండాలని భావిస్తారు.వారికి ఆ సమయం లో కావలసినది   సేద తీర్చే ఒక నును వెచ్చని  కౌగిలి , వారి ముఖం మీద ముంగురులు సరిచేస్తూ , వడి వడి గా కొట్టుకుంటున్న వారి ‘ గుండె సడి ‘ వినగలిగే స్నేహ పూర్వక మనసూ  కల ఒక  బల వంతుడైన పురుషుడు ! వారి   నిర్ణయం సాహసోపేతమైనది కూడానూ ! ఎందుకంటే , వారు తీసుకునే ఆ నిర్ణయం తో , వారు ఒక సమూలమైన మార్పు , వారి జీవితాలలో రావాలని ఆశిస్తారు. అంటే వారు తీసుకునే ఆ సాహసోపేత నిర్ణయం  ఒక క్యాటలిస్ట్ ( catalyst ) గా పని చేసి ,  తనువూ , అధరాలూ  కూడా కలగలిసిపోయి, తమ జీవన రసాయన మిశ్రమం,   ఒక మధురమైన  నూతన  నవ జీవన  ప్రణయ కావ్య రసాయనం  కావాలని కలలు కంటారు. ఇట్లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు , కేవలం వారికి ఒక  స్థిరమైన ఉద్యోగం, ఇల్లూ, భర్తా, పిల్లలూ , లేనివారే తీసుకుంటా రనుకోవడం పొరపాటే ! కొన్ని సమయాలలో , ఉదయాన్నుంచీ , రాత్రి వరకూ , తీరిక లేని పనీ, బాధ్యతా, పిల్లల పోషణా బాధ్యతా , వారి హడావిడీ , షాపింగ్, క్లీనింగ్ , లాంటి మొనాటనస్ జాబ్స్ , అన్నీ కూడా కలిసి , స్త్రీ ని  క్రమేణా నిరుత్సాహ  పరుస్తూ ఉండడమే కాక , ఆమె మెదడులో ఉన్న డోపమిన్, సీరోటోనిన్, ఆక్సి టోసిన్, ఇంకా వాసో ప్రెసిన్ లాంటి  రసాయనాలను  తగ్గించి , ఆమెను మానసికం గా  నిర్వీర్యం కూడా చేస్తాయి. ఆమె  ఒక  జటిలమైన వలలో బంధించ బడిన చేపలా ఫీల్ అవుతూ ,గిల గిల లాడుతూ ఉంటుంది. శక్తి హీనం గానూ , ఫీల్ అవుతూ , విపరీతమైన ఒంటరి తనం తో   ఒక్క సారిగా , ఒక సాహసోపేత నిర్ణయానికి  అంకురార్పణ చేయ వచ్చు.
ఆమె సాహసోపేత నిర్ణయానికి కొస మెరుపులా , ఆమె భర్త , ఎప్పటి లాగానే  ఆమె సమస్యలు ఏవీ పట్టనట్టు , ప్రతి కలయిక లో ,  ఆమె ‘  మీద నుంచి ‘  ఆమె లో ‘ ప్రవేశించ డానికే ‘ ఉత్సాహం చూపుతాడు కానీ ,  ఆమె గుండె తలుపు తట్టి , ఆమె మనసు మాట వినడు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని  సంగతులు ! 

ప్ర.జ.లు.8.స్త్రీలలో ఇన్ ఫిడిలిటీ కి కారణాలు.

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 27, 2012 at 10:34 ఉద.

ప్ర.జ.లు.8.స్త్రీలలో ఇన్ ఫిడిలిటీ కి కారణాలు. 

ప్రశ్న: మరి మిగతా కారణాలు ఏమిటి ?:
జవాబు:4. జీవితం లో ఉత్తేజం , ఉత్సాహం కావాలనుకునే స్త్రీలు: పురుషులు, స్త్రీల తో  సీరియల్ ఎఫైర్స్ కలిగి , అంటే ఒకరి తరువాత ఒకరితో , సంబంధాలు ఏర్పరుచుకుని , ఎట్లా గైతే తమ కామ వాంఛ లను తీర్చుకుంటూ ఉంటారో , అదే విధం గా స్త్రీలలో కూడా కొందరు , ఒక పురుషుడి తరువాత ఇంకో పురుషుడి తో  పొందు కోసం తహ తహ లాడుతూ ఉంటారు. అంటే వీరు త్రిల్ సీకర్స్ ( thrill seekers )  ఆ రకమైన స్త్రీలు , వారి భర్తలను వదిలేయ లేక పోవచ్చు, కానీ వారికి  వారి జీవితాలలో ఇంకొంచం  అదనపు రుచి  ( extra taste )కావాలి.
 ఉదా: వనజ .పేరుకు తగ్గట్టు గానే ఒక  ఉద్యాన వనం లో జనించిన బహు చక్కని పుష్పంలా ఉంటుంది.  యుక్త వయసు వచ్చినప్పటినుంచీ , ప్రతి మగవాడి చూపులూ, తదేకం గా తన వైపు తిప్పించుకునే అందాల తో  ప్రభవించు తుంది. ఎందుకో ఏమో  తను ఎప్పుడూ అది తప్పు గా భావించలేదు. పైగా , తన సుందర నయనాలతో , వారిని కృతజ్ఞతా పూర్వకం గా చూసేది.ప్రతి రోజూ , బాత్ రూం లో నూ , డ్రెస్సింగ్ మిరర్ ముందూ , తన అందాలు చూసుకుంటూ , గర్వం గా నూ ఫీల్ అయేది. ఈ అందాలన్నీ రంగరించి తన వలపు గంధం తో  స్వీకరించే  మగ వాడు ఎవరో !     తానూ , చదువుకొని , మంచి ఉద్యోగం చేస్తూ , (  తల్లి దండ్రులకు ) నచ్చిన సంబంధం, చేసుకుని ,  జీవితం అనుభవించు దామని కలలు కన్నది.  సరిగ్గా అదే జరిగింది కూడానూ ! తన భర్త కూడా  తగిన వాడే !  ఆనందం గా సాగి పోతుంది జీవిత నావ ! కానీ వనజ కు   తన ఆఫీసులో  , మగ వారి ప్రవర్తనను కూడా అధ్యయనం చేసే అవకాశం వచ్చింది. అవకాశం ఉంటే , మగ వారు , తన ఇతర స్త్రీ కొలీగ్స్ తో , ఎఫైర్స్ కు ఏమాత్రం  జంకు లేకుండా  ముందంజ వేస్తున్నారు.  తాను ఉండే వాతావరణం, తనకు ఎఫైర్స్ ఉంటే , వేలెత్తి చూపే సమాజం కాదు ! తనకూ ఒక ఇన్ఫెక్షన్ లా ఈ త్రిల్ సీకింగ్ బిహావియర్  అలవాటు అవుతున్నట్టుంది. ఆ మాట తలుచుకుంటేనే  మనసంతా జిల్లు మంటుంది. తన ప్రాజెక్ట్ సూపర్వైజర్ తో సరసాలు మొదలైనాయి. అది ఎంతో ఆనందం గా ఉంది తనకు , అతనూ మంచి రసికుడు , చనువు పెరిగాక ఒక  మన్మధ సమయం లో   ఆమె వక్షోజాల మీద తమ ప్రాజెక్ట్ పేరు ‘ ప్రాజెక్ట్ వీనస్ ‘ అని చిలిపి గా రాశాడు ! అక్కడి తో నిజం గానే వనజ ప్రాజెక్ట్ వీనస్ ఊపందుకుంది ! కొన్ని కొత్త  ప్రాజెక్టులకు, కొత్త సూపర్వైజర్స్ ను తనే సెలెక్ట్ చేసుకుంటుంది. కొన్ని విదేశాలలో కూడా ఉంటున్నాయి. వనజ ఇప్పుడు , అనిర్వచనీయ మైన ఆనందం పొందుతుంది, వివిధ రసవత్తర ప్రాజెక్ట్ లతో ! ఆమె జీవిత నావ కాస్తా క్రూజ్ షిప్ అయింది ! 
5.కామ పరం గా నిరు పేద స్త్రీలు : ఇంట్లో కామం లోపించితే , బయట వెతకడం సహజం గా జరిగేదే కదా ! అదే జరుగుతుంది , స్త్రీ విషయం లో కూడా ! వయసు మీరిన కొద్దీ , మగ వారి లో కూడా హార్మోనులలో మార్పులు కలిగి పురుష హార్మోను టేస్తో స్టిరాన్ తక్కువ అవుతుంది. దానితో కామ వాంఛ కూడా సన్నగిల వచ్చు . అపుడు  బెడ్ రూం లో కేవలం భర్త   తన   కళ్ళు  ఓ పుస్తకం లో ముంచు కోవడమో , లేదా ఎదురుగా ఉన్న టీవీ లో వచ్చే అత్యంత బోరింగ్ ప్రోగ్రాం చూడడమో జరుగుతుంది , అత్యంత   ఆసక్తి కరమైన ‘ రతి ప్రోగ్రాం ‘ ను అశ్రద్ధ చేసి  !  అదే సమయం లో ఆమె లో కామ వాంఛ ఉత్తుంగ తరంగమై  ఉరవళ్ళు తొక్కుతూ ఉంటుంది ! ఆ ఉధృతాన్ని  తన కౌగిలి లో బంధించి, తనను ‘ సెక్సింప ‘  చేసి ,    తన్మయం తో  పరవశింప చేసే  పరమ కాముడు కావాలి ఆమెకు. అంతే !ఆ సమయం లో ,  ఇన్ ఫిడిలిటీ లూ , ఎఫైర్ లూ  ఆమె మనసుకు తట్టవు . ఆమె   వయసు కు అసలే పట్టవు ! 
మిగతా సంగతులు  వచ్చే టపాలో ! 
 

ప్ర.జ.లు. 7. స్త్రీలలో కూడా ఇన్ ఫిడిలిటీ ఉంటుందా ?:

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 26, 2012 at 6:05 సా.

ప్ర.జ.లు. 7. స్త్రీలలో కూడా ఇన్ ఫిడిలిటీ ఉంటుందా ?: 

ప్రశ్న:  ఇంత వరకూ , పురుషులలో ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ గురించి వివరం గా తెలుసుకోవడం జరిగింది కదా , మరి స్త్రీలలో కూడా ఇన్ ఫిడిలిటీ ఉంటుందా? :
జవాబు: ఇది ఆసక్తి కరమైన ప్రశ్న.  ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘ ఉంటుంది’. అతివల ఇన్ ఫిడిలిటీ కి అయిదు ముఖ్య కారణాలున్నాయి.
1. లో సెల్ఫ్ ఎస్టీం ( low self esteem ) అంటే ఆత్మ న్యూనతా భావం:  కొందరు స్త్రీలు , తమ కుటుంబాలలో , కేవలం  పిల్లలను కనే మెషీను లలాగా  యాంత్రికమైన జీవితం గడుపుతుంటారు.  కేవలం కనడమే కాకుండా , వారి పోషణా బాధ్యతా, ఇల్లు గడవడం , రోజూ ఇంటి లోకి కావలసిన అవసరాలు కనిపెట్టి ,  వాటిని కూర్చడం చేస్తూ ఉంటారు.  ఈ విధమైన యాంత్రిక జీవనం , వారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. కాల క్రమేణా వారు తమ వ్యక్తి గత పోషణ ను అంటే కేవలం శారీరికం గానే కాకుండా , మానసికం గా కూడా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దానితో  , ఎప్పుడూ జవ సత్వాలు ఉడిగి పోయిన వారిలా , నిరాసక్తత తో ఉంటారు. ‘   పాపను కనక ముందు , వారికి నా మీద ఎంతో ప్రేమ గా ఉండేది. జీవితం  మూడు ముద్దులూ , ఆరు కౌగిళ్ల లా సాగి పోయేది.  పాప పుట్టగానే , వారి ప్రవర్తన మారి పోయింది. ఎప్పుడూ ఆఫీసూ , మీటింగులూ ,  టూర్లూ !  నేను ఉన్నాను , పడి అడ్డమైన చాకిరీ చేస్తూ , ఇళ్ళూ, వాకిళ్ళూ చూసుకుంటూ ,  పాప ను కనిపెట్టుకుని ఉండడానికి ! ‘  ఈ రకం గా ఉంటుంది వారి ఆలోచనా ధోరణి.
2. ఎమోషనల్ స్టార్వేషన్  అంటే భావావేశాల  లంఖణాలు :  ఇళ్ళూ , వాకిళ్ళూ , ఉంటాయి , పిల్లలూ , నౌకర్లూ ఉంటారు. ఆమె తెలివి గలది. విద్యార్హతలతో పాటుగా, వాటికి తగినట్టు , మంచి హోదా కలిగిన ఉద్యోగం కూడా ఉంది. భర్త కు కూడా  పగలు వెళ్లి రాత్రి దాకా పని చేసి వచ్చే బాధ్యతా యుతమైన ఉద్యోగం ఉంది. కానీ జీవితం యాంత్రికం అయి పోయింది. ఉదయం నిద్ర లేచిన టైం నుంచీ పరుగు, ఇక భావావేశాల  ను పంచుకోవడం మాట దేవుడెరుగు ! చీకటి పడే దాకా రారు.  చక్కగా షవర్ చేసి , వారికి ఇష్టమైన రంగు లోని సల్వార్ కమీజ్ వేసుకుని బాల్కనీ లోంచి చూసి మందస్మిత వదనం తో ఎన్ని సార్లు ఎదురు చూడలేదు ఆమె ! దానికి సమాధానం చెప్పేది  చిరు నవ్వు తో కాక , తీవ్రమైన అలసట తో, ఆకలి తో కూడిన భర్త ముఖం ! ఇద్దరికీ ఆకలి !  ఆమెది భావోద్వేగాల ఆకలి. ఆయన ది , కడుపు మండిన ఆకలి ! ఆయన ఆకలి మంటను ఆమె తీర్చ గలదు. ఆమె  భావావేశపు  ఆకలి ని ఆయన అర్ధం చేసుకుంటే గా , తీర్చడానికి ! సస్య శ్యామల గృహ  క్షేత్రం లో ప్రేమానుభూతుల దుర్భర క్షామం !  కాల క్రమేణా భావా వేశాల లంఖణాలు , అనుభవిస్తూ , శుష్కించి పోతారు ! 
3. కోమలి కోపం :  ఆమె చక్కనిది. చాక్లెట్ రంగులో ఉండి ,తీయగా  మాట్లాడడమే కాకుండా , ఆయన  తో లెక్క లేనన్ని మార్లు తీయని అనుభూతులు కూడా పంచు కున్నది తను. ‘  కానీ జరిగిందేమిటి ? తన ఫామిలీ ఫ్రెండ్  ను ‘ ప్రేమించి ‘  ఇంకో టౌన్ ట్రాన్స్ఫర్  చేయించుకుని , అక్కడ ఉంటున్నాడు ఆమె తో !   అంతటి కృతఘ్నుడు నాకు కనపడకుండా పోవడమే మంచిదయింది. నేనూ నా దారి చూసుకో గలను , ఆయన లేక పోయినా , ప్రపంచం అంతా ఇంకా నా ఎదుటే ఉంది ‘ అనుకునే అంతు లేని క్రోధం !  
మిగతా కారణాలు వచ్చే టపాలో ! 

ప్ర.జ.లు. 6. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 26, 2012 at 9:43 ఉద.

ప్ర.జ.లు. 6. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ ! 

ప్రశ్న: మిగతా కారణాలు ఏమిటి మగ వారి ఇన్ ఫిడిలిటీ కి ? 
జవాబు: ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
19. ప్రతీకార వాంఛ : మూడు సంవత్సరాల నుంచీ తాను ఎంతగానో   ప్రేమించుతున్న  తన ఇల్లాలు కేవలం తన మద్య పానం వల్ల వదిలేసి పోయింది. వాళ్ళ తల్లిదండ్రులకు బాగోలేదనీ , వారి దగ్గర తాను ఉండాలనీ కూడా చెప్పింది.కానీ చేసిందేమిటి?తల్లి దండ్రులు కుదిర్చిన ఇంకో సంబంధం చేసుకుని హాయి గా ఉంది. తనకేమీ తక్కువ కాలేదు , మద్యం ముట్టుకోవట్లేదు ఇప్పుడు , మగువలు కావాలనుకుంటే తప్పేంటి ? అనుకునే స్వభావం.ప్రతీకార భావం.
20. ‘ అది ‘ ఇంకా ఉందో లేదో ! : పిల్లలు  కాలేజీ కీ వెళుతున్నారు. అయితే ఏం ? తనలో ఏమాత్రం  ‘ అది ‘ తగ్గి పోవడం లేదు కదా , ఇంకా ఎక్కువ గా ఉంటుంది. ఈ రోజులలో ! తన భార్యామణి చాలా మంచిది. కానీ ‘ ఆ ‘ విషయాని కొస్తే , ‘ బాగా అలసి పోయాను ,మళ్ళీ పొద్దున్నే లేచి ఆఫీసు కు తయారవాలి అంటుంది. ఇక ఆది వారాలు   పూజలూ , పునస్కారాలతో సతమతం అవుతుంది. తాను , తనకు తోచిన విధం గా ఇంకో దేవి  పూజ చేసుకుంటే సరిపోతుంది ‘ అనుకునే ఆత్మ సమర్ధనాభావం. ఈ వయసులో వారు సామాన్యం గా తమ భార్య కంటే , తక్కువ వయసు వారితో కామ క్రీడలకు వ్యామోహ పడుతుంటారు.
21. రూల్స్ తనకు కాదు : తాను , చిన్న తనం నుంచీ , పెద్దగా రూల్స్ పట్టించు కున్నది లేదు. స్కూల్ లోనూ , కాలీజీ లోనూ తనకు మాత్రం లేవు రూల్స్. తన ఉద్దేశం లో రూల్స్ ను పట్టించుకునే వారు ఫూల్స్. ఒకరి కన్నా ఎక్కువ మంది స్త్రీలతో పొందు, తన రూలు.భార్య తోనే జీవితాంతం గడపడం ఏమి రూలు  ?!  అనుకునే  ధిక్కార స్వభావం. 
22. తాను ఆ పని చెయ్య గలడు : తనకు ఏ విధం గానూ లోపం లేదు ! మరి  ఆ పని తాను ఎందుకు చేయ కూడదు ? అనుకుని   పట్టుదలతో  ఇంకో యువతిని పట్టుకునే స్వభావం.
23. నైతికమైన అంటే నీతి బద్ధమైన జీవితం మీద ఏమాత్రం నమ్మకం లేక పోవడం:  వీరి దృష్టి లో మిగతా మగ వారంతా  స్త్రీ లోలురే , మరి తాను ఎందుకు కాకూడదు అనే పొరపాటు స్వీయ సమర్ధనా భావం. 
24. వ్యసన లోలురు అవడం అంటే వ్యసనాలకు అలవాటు పడడడం :  సామాన్యం గా మూడు  W లు అని అంటుంటారు  ( Wealth, Wine and Women ).  డబ్బు  ఉండగానే ,  అలవాట్లకు అవకాశం ఎక్కువ అవుతుంది. అది మద్యమే  కావచ్చు , ఇతర మాదక ద్రవ్యాలే కావచ్చు. వాటి తో  ఇన్హి బిషన్స్  కోల్పోవడం సామాన్యం గా జరిగేదే. అంటే ,  యుక్తా యుక్త విచక్షణ , కామ వాంఛ ల మీద నియంత్రణ , కోల్పోవడం జరుగుతుంది.  ఆ తరువాత ,  వేరే యువతి తో  శృంగారం కూడా ‘ ఎంతో మత్తు గా ‘  ఉంటుంది. 
25. సెక్స్ అడిక్షన్ :  పైన ఉదాహరించిన వాటన్నిటి లోకీ , సెక్స్ అడిక్ షన్  ఒకటే అతనికి ఉంటే, అది క్షమార్హం.  సెక్స్ అడిక్ షన్ అనే పరిస్థితి ఒక మెడికల్ కండిషన్.  ఈ పరిస్థితి ఉన్న వారు నిరంతరం  కామ వాంఛ తో ఉండి , అనేక మంది ఇతర యువతులతో,కామ క్రీడలకు ఎప్పుడూ  అర్రులు చాస్తూ ఉంటారు.  వారికి  నిరంతరం  కామ నామ స్మరణే !  కామ కార్య  వాంఛ లే !  వారి ఆలోచనలు, వారి మెదడు కే పరిమితం కాక , వారు  ఏమాత్రం సంకోచించ కుండా అనేక మంది స్త్రీలతో సంబంధాలు కూడా పెట్టుకుంటారు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు  ! 

ప్ర.జ.లు. 5. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 24, 2012 at 11:37 సా.

ప్ర.జ.లు. 5. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ ! 

 

ప్రశ్న: మగ వారి కామ చంచలత్వానికి  ఇంకా కారణాలు ఉన్నాయా ? :
జవాబు: ఆ హా ! ఎందుకు లేవూ , ఇంకా చాలా ఉన్నాయి ! 
11. తగిన అర్హతలు : ప్రతి మగ దీరుడూ , తానూ ,  అంద గాడిననీ , హ్యాండ్సం గా  ఉన్నాడనీ  , ధనికుడిననీ , సంఘం లో చాలా పాపులర్ అనీ , అంతే కాక ముఖ్యం గా కామ కేళీ విలాసం లో  చతురుడనీ  సంపూర్ణం గా నమ్ముతూ , ఆత్మ విశ్వాసం తో ఉంటాడు. ఇవన్నీ మంచి గుణాలే కదా ? ఆత్మ విశ్వాసం తో ఉండడం కూడా, కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయి , ఇతర స్త్రీల తో ఎఫైర్స్ కు దారి తీసి , అతివలు  ‘ అందు బాటులో ‘ ఉంటే, వారి  పొందు కోరడం లో తప్పేమిటీ అనే  భావన కలుగుతూ ఉంటుంది కొందరిలో .
12. ఎక్కువ మంది స్త్రీలతో  తో కామం,  మగ ధీరతకు చిహ్నం ! :  , ఒకరి కన్నా ఎక్కువ మంది స్త్రీలతో కామ కేళీ కలాపాలు జరుపుతూ ఉంటే ఎంతో ఆనంద దాయకం గా , కామ వాంఛలు తీరుతూ ఉంటే చాలా సంతృప్తి కరం గా ఉంటుంది  ఇవి , కొందరు పురుషులలో నాటుకున్న  భావనలు. 
13. చాటు మాటు ఎఫైర్ లు రేపుతాయి గుండెలో వేడి ఫైర్ లు ! :   రమణి తో రస భావనలు ! ఆహా ఎంత ఆహ్లాద కరం గా ఉంటాయి ? ప్రత్యేకించి,   ఆ చిలిపి ఈ  మెయిల్స్  , ఇంట్లో భార్య  ఆద మరిచి నిద్ర పోతున్నప్పుడు తనకు వచ్చే టెక్స్ట్ మెసేజెస్, ఆ తరువాత  కలయికలు , మనసులో వెచ్చని కోరికల కుంపట్లు రేపుతాయి కొందరికి.
14. తాను వలచిన ‘ రంభలు ‘ తన గురించి కీచు లాడుకుంటూ ఉంటే ,  భలే సరదా గా ఉంటుంది ! :  రాధ కు తెలుసు నేను ఎంత ఆనందాన్ని తనకు ఇచ్చానో ! అట్లాగే  సుమ కూ ,  మాధవి కు కూడా తెలుసు ‘ తన ప్రతాపం ‘ ఇక వారు ముగ్గురూ కలిసినప్పుడు చూడాలి వారి రొషాలూ, పోట్లాటలూ , చాలా సరదా గా ఉంటుంది ‘ అనుకునే  మనస్తత్వం కొందరిలో.
15.  అతడికి తెలుసు ఆమె క్షమించి  మళ్ళీ తనతో రమిస్తుందని !  : నా  రుక్మిణి  ఎంతో మంచిది !  నా సుఖం ఎప్పుడూ  కాదనదు. ఇంతకు ముందు , ఆ ఇద్దరితో  నేను ‘ కుర్ర తనం ‘ ప్రదర్శించినా , ఎంతో ప్రేమ తో నన్ను క్షమించి తన వేడి కౌగిలి లో చేర్చుకుంది.ఇప్పుడు కోమలి తో  వ్యవహారం పరవాలేదు ! అనుకునే భరోసా భావం ! 
16. స్వచ్చమైన ప్రేమ ! :  సుశీల నిజం గా నన్ను ప్రేమిస్తూంది ! నాలో కూడా ఏదో తెలియని ఆత్మీయతా భావం నిండు కుని , ప్రేమ మొగ్గ తొడుగుతుంది ! పిచ్చి వాణ్ని చేసి వేస్తుంది నన్ను !  ఇక  భార్యామణి స్వాతంత్ర్యానికి తానూ అడ్డు చెప్ప నవసరం లేదు అనుకుని సమాధాన పరుచుకునే స్వభావం  కొందరిది ! 
17, (  రస ) దారి చూపే వారి  అడుగు జాడలలో ! :  తన బాబాయి   భలే సరదా మనిషి ! అమలాపురం లో ఉన్నప్పుడు , తన చిన్న తనం లో ఎన్ని సార్లు  బాబాయి  స్నేహితురాళ్ళ ఇళ్ళకు తీసుకు పోలేదు ? ఎందుకో ఎప్పుడూ బెడ్ రూం లో తాను ఆంటీ తో  మాట్లాడుతూ , తనను బయట గుమ్మం దగ్గర జామ  చెట్టు నీడ లో  ఆడుకుంటూ ఉండమనే వాడు.  తాను పెద్ద అయ్యాక గానీ తెలియ లేదు , బాబాయి  పడక గది లో  ఉన్న’  జామ పండు ‘  ను ఒక ‘  చిలక కొట్టుడు ‘ కొడుతున్నాడని ! 
తన చిన్న  మామయ్య సంగతి సరే సరి !  ఆయన కళా పోషణ సరాసరి  మద్రాసు లో చిన్న వేషాల ‘ నటీ మణుల ‘  మీద ఉండేది ! మరి ఇందరు  మహా మహుల కుటుంబం లో పెరిగిన తను  ఇంత స్తబ్దత ఎందుకు ప్రదర్శించడం !  వారి   రసిక  మడుగు జాడలలో తప్పటడుగు   వేస్తె తప్పేంటి అనే భావన !  ‘  వంశ ప్రతిష్ట ను  ‘ నిలబెట్టా లనుకునే కళా తపన  కొందరిది. 
18. జవరాలి ప్రత్యేకతలు ఇల్లాలిలో ఏవీ ? : ఆమె  ప్రత్యేకత ఆమె  దే !    తన భార్య లా కేవలం బుగ్గల మీద చిట్టి ముద్దులు మాత్రమె కాదు,   షవర్ నుంచి బయటకు వచ్చి ,  నూట ఎనిమిది  వేడి  ముద్దులు కావాలంటుంది, నా మీద అతి భక్తి తో !  ఖచ్చితం గా నూట ఎనిమిది ముద్దులు అతి జాగ్రత్త గా ఆమె ‘ మీద ‘ పెట్టినా  నన్నే బోల్తా కొట్టించి ,  లెక్క సరిగా లేదని , మూడు వందల ముద్దులు పెట్టించుకున్న రోజులు ఎన్నో ! లెక్కలు సరిగా రాక పోవడాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి ఇంతకన్నా మించిన అవకాశం నాకు మాత్రం  ఎప్పుడు ఉంటుంది కనుక ?  తన భార్య మాత్రం ,   ఇట్లాంటి విషయాలలో ‘ తాను ‘  మడి ‘  కట్టుకుని కూర్చుని  తన  ‘ వేడి నంతా ‘ చల్లారుస్తుంది’ .అనుకునే మనస్తత్వం  ఇంకొందరిది.
వచ్చే టపాలో ఇంకొన్ని  ఇన్ ఫిడిలిటీ సంగతులు ! 

ప్ర.జ.లు.4.ఎఫైర్ లూ, ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 23, 2012 at 8:47 సా.

ప్ర.జ.లు.4.ఎఫైర్ లూ, ఇన్ ఫిడిలిటీ లూ ! 

ప్రశ్న:  మరి పురుషులు ఎఫైర్ లు ఏర్పరుచు కోవడానికి కారణాలు ఏమిటి ? : 
జవాబు: పురుషులు ఎఫైర్ లు పెట్టుకోడానికి చాలా కారణాలు ఉన్నాయి.  
1. కాదనలేక పోవడం:  అందమైన, ఆకర్షణీయ మైన యువతి ఎదురుగా ఉంది. మనసు లో రస మన్మధుడు వేయి గుర్రాల మీద స్వారీ చేస్తూ ఉంటాడు.ఆ వేగం లో భావావేశాలు కూడా కనీసం వేయి మైళ్ళ దూరం వెళతాయి. ఇంక కాదనడానికి  సమయం ఏదీ ? 
2. అహం సింహాసనం ఎక్కుతుంది. : తనకు  తెలివి ఉన్నా , సరి అయిన అవకాశాలు లేక ఆమె తో పోటీ గా పెద్ద ఉద్యోగం లేదు. తీవ్రమైన ఆత్మ న్యూనతా భావానికి విరుగుడు వీలైనంత మంది  యువతులతో   ‘ నవ జీవనం ‘ రుచి చూస్తె సరే అనే భావన ! ( ఇగో బూస్టు చేసుకోవడం  ) 
3. తోటి వారితో పోటీ ! :  రమేష్  చాలా లక్కీ , భార్యకు  రవంత అయినా తెలియకుండా , కనీసం  ముగ్గురు యువతులతో శృంగారం ‘ వెలగ పెడుతున్నాడు ‘ , ఇక మధు విషయం సరే సరి !  ఆఫీసులోనే ఇద్దరితో చనువు గా ఉంటాడు. ఈ చనువు ఆఫీసు అయిపోగానే , ఏ రూపం లో ఉంటుందో ఊహించుకోడానికి మధు వారికి ఆఫీసులోనే చాటు మాటుగా చేసే  ఈ మెయిల్స్  చూపించినప్పుడే తెలిసింది. మరి తనకు ఏమి తక్కువ , ఆ మాత్రం తీసి పోనా ! అనే భావన , ‘ పోటీ ‘ తత్వం !( పీర్ ప్రెషర్ ) 
4. ఉన్న సంబంధానికి ఉద్వాసన చెప్పే విధం : తనతో నాకు పడట్లేదు ఎట్లాగూ ! ప్రయత్నం చేసినా ! ఇక ‘ కాదనుకున్నప్పుడు ‘ ఎఫైర్ ఇంకొకరి తో ఉంటే తప్పా ? అన్న భావన.  ఇంకొందరు  తాము ఇంకో ఎఫైర్ పెట్టుకున్న తరువాత కూడా , తాము ఉంటున్న వారితో వీడ్కోలు , ఆ విధం గా తీసుకుంటారు. 
5. ఆమె అమాయకత్వం :  అనసూయ కు  అతని మీద ఎంతో నమ్మకం.’  డ్యూటీ చేసి నేరుగా ఇంటికి వస్తాడు. మల్లె పూలు తెస్తాడు. దేవి భక్తీ , దైవ భక్తీ రెండూ ఉన్నాయి ‘ అని సంబర పడి పోతూ , తన ‘ భాగ్యానికి ‘ రోజూ అనేక పూజలు చేస్తూ , గుళ్ళో ప్రదక్షిణాలు కూడా చేస్తూ ‘ కాలం , ఆనంద మయం గా ‘ వెళ్ళ బుచ్చుతూ ఉంటుంది , అమాయకం గా  అనసూయ , అతను  చేసే కొన్ని డ్యూటీ లు, నేరుగా  ‘ రెండో  దేవి ‘ వద్ద కూడా చేస్తూ , తన దేవి భక్తి  చాటు మాటు గా చాటుతున్నాడని తెలియక  ! 
6. ‘ రస కీర్తి కిరీటం లో ఇంకో మణి పూస ‘ :  అందమైన యువతి తో పొందు , ఎంతో పొందిక గా అనిపిస్తుంది , భార్య కన్నా !  ఆమె చతురత , తన ఇల్లాలికి ఏదీ  అనే అభిప్రాయం ఏర్పడుతుంది. ‘ ఆ  ఆమె చతురత ‘  ను ఆస్వాదిస్తున్న వారి వరుసలో తాను మూడో వాడు అనే  వాస్తవం ( ఆమె చతురత తో ! ), మరుగున పడుతుంది.
7. ఇతర స్త్రీ ( ల ) తో పొందు కోసం తహతహ ! : తాను  తన భార్య పొందు తో ఆనందం అనుభవిస్తూ ఉన్నాడు.  కానీ  ‘  ఆ యువతి తో పొందు ఆ హా ! ఎంత బాగుంటుందో ! అని  ఎమోషనల్ అలల మీద తేలి పోతూ ‘ ఆ యువతి ‘ పొందు కోసం తహ తహ లాడుతారు కొందరు ! 
8. కామ విశృంఖలత : కొందరు ద్విలింగ సంపర్కులు, తాము భార్య తో సహజీవనం చేస్తూనే , ఇతర మగ వారితో సంబంధాలు ఎర్పరుచుకుంటారు.
9. మొదటి సారి , ఎవరికీ తెలియలేదు కదా ! :  ఆ తోలి రాత్రి ,  రమ్య  తో గడిపిన క్షణాలు, ఎంతో కొత్తగా ఉన్నాయి , మళ్ళీ  ఆ క్షణాలు ‘ రిప్లే ‘ చేసుకుంటే సరిపోదూ ! అందులో  తన  శ్రీమతి కి కూడా ఏ అనుమానమూ లేదు కదా !   మతులు పోగొట్టే అందాలు రమ్య లో మళ్ళీ ఆస్వాదిస్తే తప్పేంటి ? అనే భావన.  
10.   మహత్తర అవకాశం !  :  తాను వచ్చింది ఢిల్లీ కి టూరు మీద ! అందులో నవంబరు మాసం అవడం తో చాలా చిల్లీ గా కూడా ఉంది !   ఉండే హోటల్ లో  ‘ అన్ని హంగులూ ఉన్నాయి ‘ ఇక  అందాలు పొంగుతున్న అతివల కు కూడా కొదవ  ఉండదు అక్కడ ‘  అని క్రితం టూరు కు వెళ్ళిన తన కొలీగు చెప్పిన చిదంబర రహస్యం  ఒక్క సారిగా  కోటి కిరణాల సూర్య భానుడి వేడి పుట్టించింది తనలో !  ఇక హైదరాబాదు లో  ఉండే తన ఇల్లాలికి ఎందుకు  ఈ  ‘ గొడవలూ ‘ అను కొనే వారు కొందరు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని ఇన్ ఫిడిలిటీ క్వాలిటీ లు ! 

ప్ర.జ.లు. 3. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 22, 2012 at 8:12 సా.

ప్ర.జ.లు. 3. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ ! 

ప్రశ్న: స్త్రీల లోనూ  పురుషులలోనూ   ఇన్ ఫిడిలిటీ కి  తేడాలు ఉన్నాయా ? 
జవాబు: మంచి ప్రశ్న. భావావేశాలు అంటే ఎమోషన్స్ ,  అవి అనుభవించే  స్త్రీలను బట్టీ , పురుషులను బట్టీ మారుతూ ఉంటుంది. అంటే స్త్రీలకూ, పురుషులకూ ,  వారి లో నిరంతరం కలిగే భావావేశాలకూ అవినా భావ సంబంధం ఉంది. కాక పొతే వారు ఈ భావావేశాలను అనుభవించే విధం వేరుగా ఉంటుంది.  ఇంకో విధం గా చెప్పుకోవాలంటే భావావేశాల వాహనాలలో స్త్రీలూ , పురుషులూ వేరు వేరు దారులలో ప్రయాణం చేసి ‘ సుఖ గమ్యం ‘ చేరుకుంటారు.  ఈ వేరు దారుల ప్రయాణం , వారి కామ ప్రేరణలనూ , ఎమోషన్స్ ను  కూడా వేరుగా ప్రభావితం చేస్తుంది. స్త్రీలూ , పురుషులూ , వారి వారి రీతులలో  కలిసి  సంసార సుఖాల గమ్యం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు , మార్గ మద్యం లో  చిన్న బస అంటే కొన్ని షార్ట్ స్టే లు కూడా చేస్తుంటారు ! ఆశ్చర్య కరం ఏమిటంటే , ‘ కలిసి ‘ ప్రయాణం చేస్తూ కూడా , ‘ చిరు బస ‘లు అంటే షార్ట్ స్టే లు మాత్రం ఇంకొకరికి తెలియ కుండా చేస్తుంటారు ! ( అందరూ కాదు ! ) 
ఉదాహరణకు , పురుషులు ఎఫైర్స్ ఏర్పరుచు కునే సమయం లో, ( ఇతర ) స్త్రీల మీద ఎక్కువ గా ఆధార పడుతూనూ ,  వల్నరబుల్ గానూ  ఉంటారు.దీనిని స్త్రీ లోలత అనవచ్చు. అదే స్త్రీల విషయం లో ఇందుకు భిన్నం గా , ఎఫైర్స్ ఏర్పరుచుకునే సమయం లో, స్వేచ్చా యుతం గానూ , వారు ఎక్కువ శక్తి వంతం గానూ అవుతున్నట్టు ఫీల్ అవుతారు. ఎఫైర్స్ లో సామాన్యం గా పురుషులు ఇంటిమసీ కోసం అంటే చనువు , ఆప్యాయతల కోసం వెదుకుతూ ఉంటారు, అదే సమయం లో స్త్రీలు , వారి  భావావేశాలను అంటే కామ పరం గానూ , ఇతర విధం గానూ , వారి కి  ( వివాహ బంధం లో ) ఉన్న స్వేచ్చా స్వాతంత్ర్యాల పరిమితులు  ఛేదించడానికి  ఉవ్విళ్ళూరుతూ ఉంటారు ! ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , స్త్రీ లకు తమ వివాహ బంధం లో కనుక , వారికి సంపూర్ణ స్వేచ్చా స్వాతంత్ర్యాలు  ఉన్నట్టు నమ్మకం కలిగితే , వారు ఎఫైర్స్ కు అంతగా ఆకర్షితులవ్వరు. అట్లాగే పురుషులు, తమ వివాహ బంధం లో సంతృప్తి కరమైన  అనుబంధం , ఇంటిమసీ , ఇంకా ఆప్యాయత కనుక పొందుతూ ఉంటే , ఎఫైర్స్ వైపు దృష్టి మరల్చరు.  ప్రేమ , ఆప్యాయతల ‘ ఇంధనం ‘ తో పాటు గా కామ తృప్తి కూడా కలిసిన ‘ జీవిత ‘ వాహనం లో ప్రయాణం చేస్తున్న వారి ప్రయాణం సాఫీ గా గమ్యం వైపు సాగి పోతుంది, అప్పుడు వారికి చిరు ‘ బస’ లు అంటే షార్ట్ స్టే లు ఏవీ అవసరం ఉండవు! ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లాంటి ఇంధనాలు వారికి అవసరం ఉండదు ! 
లింగ పరం గా ఎఫైర్స్ కానీ ఇన్ ఫిడిలిటీ కానీ  పురుషులలో రావడానికి కారణం, వారు వారి ‘ ప్రేయసి కానీ,  ‘భార్య ‘ కానీ , ఇతర వ్యక్తులతో కామ పరమైన సంబంధం ఏర్పరుచు కుంటే కానీ , లేదా ఏర్పరుచు కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే కానీ తెలిస్తే , తీవ్రం గా కలత చెందడం వలన అని కూడా భావించడం జరుగుతుంది. కానీ స్త్రీల విషయం లో వీటికి  ( ఇన్ ఫిడిలిటీ కీ ఎఫైర్స్ కూ ) కారణం , తమ ప్రియులు ఇతరులతో భావావేశ పూరితం గా అంటే ఎమోషనల్ గా సంబంధాలు పెట్టుకుంటే సహించ లేక పోవడం అని కూడా భావించ బడుతుంది. అనేక మంది స్త్రీలనూ పురుషులనూ ప్రశ్నిస్తే , ఈ విషయం తెలిసింది , ఒక పరిశీలనలో. జీవ పరిణామ శాస్త్ర వేత్తలు స్త్రీలలోనూ , పురుషుల్లోనూ వంశ పారంపర్యం గా వచ్చే జన్యువులు అంతే జీన్స్ , వారి ఎఫైర్స్ లేదా ఇన్ ఫిడిలిటీ   ప్రవర్తనలను నిర్ణయిస్తాయి అని  నమ్ముతారు.  ఎఫైర్స్ విషయం లో  జన్యువులు ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో  స్పష్టమైన విధం గా జెలసీ ను అంటే అసూయను చూపే లక్షణం కానీ బిహేవియర్ ను కానీ  నిర్ణయిస్తూ ఉంటాయి. 
వచ్చే టపాలో ఇంకొన్ని ఇన్ ఫిడిలిటీ సంగతులు ! 

ప్ర.జ.లు.2. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 21, 2012 at 10:27 సా.

 ప్ర.జ.లు.2. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ ! 

అఫైర్ కానీ ఇన్ ఫిడిలిటీ కానీ , భౌతికం గా అంటే శారీరికం గా సంబంధం కావచ్చు, లేదా ఎమోషనల్ గా సంబంధం కావచ్చు. అంతే కాక , కేవలం ఎమోషనల్ , ఇంకా శారీరికం గానే కాక ఈ సంబంధాలు , ఇరువురి మధ్యా ఉన్న నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తాయి. అప్పుడు  ఆ సంబంధాలు మోస పూరితం కూడా అవుతాయి.  ఒక దేశం లో బహిరందం గా ఒకరి తో  సంబంధం కలిగి ఉన్న ఒక వ్యక్తి , అఫైర్ ఇంకో వ్యక్తి తో కలిగి ఉండవచ్చు.భావావేశ పూరితమైన అఫైర్స్ లేక సంభంధాలు  కూడా శారీరికం గా ఇంకొకరికి కలిగించేంత బాధ కలిగించ గలవు.మానవ  పరిణామం జరుగుతున్న కొద్దీ , ప్రపంచం లో వివిధ దేశాలలో ఈ అఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ , ఆ యా దేశ నాగరికతా సంస్కృతుల బట్టి మారుతూ ఉంటాయి.
ప్రశ్న:  ఈ ఎఫైర్ లూ ఇన్ ఫిడిలిటీ లూ మన సమాజం లో ఎంత సామాన్యం ? : 
జవాబు: కొందరు  పరిశోధకుల అభిప్రాయం ప్రకారం , ఈ రోజుల్లో ,  సంబంధం కలిగి ఉన్న ఇద్దరిలో ఒకరు, శారీరికం గా కానీ , మానసికం గా అంటే ఎమోషనల్ గా కానీ ఇంకొకరితో సంబంధం కలిగి ఉండడానికి, కనీసం 50- 50  చాన్స్ ఉంటుంది . అమెరికాలో వివాహం చేసుకున్న వారిలో 30 నుంచి 60  శాతం మంది, తమ జీవిత కాలం లో ఎప్పుడో ఒకప్పుడు  ఎఫైర్స్ కలిగి ఉంటారని ఒక అంచనా !  ఇంకో అంచనా ప్రకారం , విడాకులు తీసుకున్న వారిలో, కనీసం తొంభై శాతం మంది , ఎఫైర్స్ అంటే వివాహేతర సంభంధాలు కలిగి ఉన్నారని తెలిసింది. అంతే కాక , ఇరవై ఏడు శాతం మంది ( అమెరికాలో ) వివాహం చేసుకుని ఆనందం గా ఉన్నామని చెప్పిన వారు వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నారు !
ఇటీవల యాభై మూడు దేశాలలో విశ్వ విద్యాలయాలలో చదువుతున్న పదహారు వేల మంది విద్యార్ధులలో జరిపిన ఒక పరిశీలన లో 20 శాతం మంది దీర్ఘ కాలిక సంబంధాలు ఏర్పరుచుకున్న వారు, అప్పటి కే ఇంకోరితో కూడా సంభంధాలు కలిగి ఉన్నారు. ఇంకా పరిశీలనలలో తెలిసిన నిజం. నలభై శాతం మంది అవివాహితులూ , ఇరవయి శాతం మంది దాకా వివాహితులూ కూడా , కనీసం ఒకటైనా కామ పరమైన సంబంధం కలిగి ఉన్న వారే !  స్త్రీల కన్నా , పురుషులు అధికం గా ఈ ఇతర సంబంధాలు కలిగి ఉంటారు.
2003 లో ఇంగ్లండు లో ఉన్న ఒక యాభయి మంది లాయర్లను ఒక ప్రశ్న అడిగారు ఒక పరిశీలనలో. అతి సామాన్యం అయిన కారణం ఏమిటి మీ దగ్గరకు విడాకుల కోసం వచ్చే వారికి ‘ అని  అడిగినప్పుడు , యాభై అయిదు శాతం విడాకులు పురుషులు ఇతర సంబంధాలు కలిగి ఉండడం వల్ల నో , లేక నలభయి  అయిదు  శాతం  విడాకులలో స్త్రీలు ఇతర సంబంధాలు కలిగి ఉండడం వల్ల నో విడాకులు సంభవిస్తున్నాయి అని తెలిసింది.  ఈ విధమైన వివాహేతర  సంబంధాలు ఏర్పడడానికి ప్రధాన కారణం , వారు వారి భాగస్వాములతో తక్కువ సమయం గడపడం వలెనే అనీ , ఇంకా విద్యార్ధులు , వారి వివాహం అయ్యే లో గా వీలైనంత మంది తో శారీరిక సంభంధం కలిగి ఉండాలనుకునే కామ వాంఛ తో పాటు గా యునివర్సిటీ విద్యాలయాలలో వారికి కలుగుతున్న అవకాశాలు కూడా అని పరిశీలనలలో తెలిసింది.అంతే కాక వయసు మీద పడుతున్న వారి లో కూడా ఈ వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి అని తెలిసింది.
ప్రశ్న : మరి ఈ ఎఫైర్స్ , ఇన్ ఫిడిలిటీ లు కలిగి ఉండడం లో పురుషులు స్త్రీల కంటే ఎందుకు ముందున్నారు ?:
జవాబు: వచ్చే టపాలో  తెలుసుకుందాము ! 

ప్ర.జ.లు.1. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 20, 2012 at 11:39 సా.

 ప్ర.జ.లు. 1.ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !  

ప్రశ్న:  ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ అంటే ఏమిటి ? 
జవాబు: ఇన్ ఫిడిలిటీ   ని సామాన్యం గా  ‘ మోసం చేయడం ‘ ద్రోహం చేయడం’ లేదా ‘ ఎఫైర్స్ ఉండడం ‘  అని కూడా చెప్పుకుంటూ ఉంటాము. భాగ స్వాములు , అంటే వారు భార్యా భర్తలే కావచ్చు , లేదా  ప్రత్యెక సంబంధం ఉన్న స్నేహితులు కావచ్చు. స్త్రీ పురుషులు  కావచ్చు. ఇన్ ఫిడిలిటీ నిర్వచనం ఏమిటంటే , ఇరువురి మధ్య  ‘ సహజం గా ‘ ప్రత్యేకం గా ఉండే  ఎమోషన్స్ కానీ , కామ పరమైన అనుభూతులు కానీ వారిరువురికే  చెందక, ఇతర వ్యక్తుల తో పంచుకోవడం. అంటే ఇక్కడ ఇరువురి మధ్య ఉన్న ప్రగాఢమైన సంబంధం ఒకరికి తెలియ కుండా ఒకరు మూడో వ్యక్తీ , లేదా నాలుగో వ్యక్తి తో పంచుకోవడం. ఇక్కడ ‘ మోసం చేయడం, ద్రోహం చేయడం  అనే పదాలు  రెండో వ్యక్తి నుంచి డబ్బూ , లేక ఆస్తులు , దోచేయడం అనే అర్ధం తీసుకో రాదు. 
 నవీన కంప్యుటర్ యుగం , ఇంటర్నెట్ యుగం లో  ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ చాలా సామాన్యం అవుతున్నాయి.  ఒక ముఖ్య విషయం ఏమిటంటే , సర్వ సామాన్య మవుతున్న ఈ ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ  మనం తెలుసుకున్నంత మాత్రాన ఎక్కువ అవ్వవు. తెలుసుకో నందు వల్ల తక్కువా అవ్వవు కదా ! 
మనం ఈ ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ వాటి తీరు తెన్నులు పరిశీలిద్దాం , వచ్చే టపా నుంచి !