Our Health

బాగు గురించి

తెలుగు ( తెలిసిన ) వారందరికీ స్వాగతం!
ఆరోగ్య విషయాల పైన మీకు అవగాహన పెంచాలని ,  ప్రయత్నం.
వాణిజ్య ప్రకటనలు ఏవీ లేకుండా, కేవలం విజ్ఞానం అందచేయాలనే  ధ్యేయాన్ని ,  విజయవంతం  చేస్తారని  ఆశిస్తూ, 
మీ ‘ బాగు’ కోసం ,
సంక్రాంతి శుభాకాంక్షలతో  !
  1. this is a very good attempt from your end, particularly when medical knowledge and treatment have bbecome provibitively costlier. Wish you all the best.
    best regards

  2. Many thanks ‘ Sumana ‘ gaaru,
    Please also click on the widget ‘ MedlinePlus ‘ at the bottom of the page to enter into the US national library of medicine website for a very comprehensive information about all types of illnesses.( but only in English language ! )
    This is exclusively for the benefit of ‘ baagu ‘ readers !!! ( most of them I think are also good in English )
    sincerely
    Dr.Sudhakar.

  3. Thank you Sir,You are doing awesome job,keep going,God Bless You !!

  4. మీ ప్రయత్నానికి అభినందనలు.మీ నుండి మరింత సమాచారం కోసం ఎదురుచూస్తుంటాను.ఆరోగ్యపరం గా వాస్తవ సమాచారం చెప్పేవారు కరవయ్యారు.
    రవిశేఖర్ ఒద్దుల

    • రవి శేఖర్ గారూ,

      మీ అభిప్రాయాలకు చాలా ధన్య వాదాలు. ‘ గురు దేవోనమః ‘ అన్న నానుడి మీరు నిజం చేస్తున్నారు. ప్రత్యేకించి ఆరోగ్య విషయాల మీద మీ జ్ఞానం పెంపొందించు కుంటూ.

      వీలైనంత మంది కి ఈ బ్లాగు గురించి తెలియ చేయండి. ఆరోగ్య విషయాలను మీ విద్యార్ధులకు పంచండి.

      ఇంకా మంచి విజ్ఞాన దాయకమైన వ్యాసాలు మీకు అందించాలనే అభిలాష తో

      Dr.సుధాకర్.

  5. సుధాకర్ గారూ,
    ఆరోగ్య సంబంధిత రకరకాల విషయాల్ని అందరికీ అర్థమయ్యేలా ఇంత వివరంగా రాయడం చాలా గొప్ప విషయమండీ.. అందరికీ ఉపయోగపడాలని ఇంత శ్రమ తీసుకుని చక్కటి బ్లాగు రాస్తున్న మీరు అభినందనీయులు. ఇలాగే రాస్తుండండి.. 🙂

  6. నమస్కారం సుధాకర్ గారు..
    ఈ మద్యనే నాకు నిశ్చితార్దం అయ్యిందండి. పెళ్లి తర్వాత 1 సంవత్సరం వరకు పిల్లలు వద్దని అనుకున్తున్నామండి. తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్దతుల గురించి కొంచెం ఇంటర్నెట్ లో చదివాను. కానీ ఏ పద్దతి మంచిది అనే విషయంలో ఇంకా సందేహం తీరలేదు. మీరు దాని గురించి వివరిస్తే చాలా సంతోషిస్తాను..
    ధన్యవాదాలు,
    ఈశ్వర్

  7. ఈశ్వర్ గారు, ముందుగా మీ ఇరువురికీ అభినందనలు.
    మీరు ఒక సంవత్సరం వరకూ తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిద్దామని అని నిర్ణయం తీసుకోవడం కూడా అభినందనీయమే.
    ఇక పద్ధతుల మాట వస్తే, టాబ్లెట్ లు , ఇంజెక్షన్ లు , లేక చర్మం కింద పెట్టించుకునే ఇంప్లాంట్ లు, లేక స్త్రీల గర్భాశయం లో అమర్చే లూప్ లు లేక IUD/ IUS లు అందుబాటులో ఉన్నాయి. ( ఈ పైన వివరించిన పద్ధతులలో చాలావరకు హార్మోనులతో చేసినవే ! ) అలా కాక మీ ఇద్దరికీ హార్మోనులు వాడడం ఇష్టం లేక పొతే, రిధం పధ్ధతి అని ఉంటుంది.
    ఈ పధ్ధతి స్త్రీకి ఋతుక్రమం సక్రమం గా ఉన్నప్పుడు మాత్రమె అవలంబించాలి. కాక పొతే ఈ పధ్ధతి లో మీరు ఇరువురూ తప్పనిసరిగా , నెలలో ఒక నిర్ణీత రోజులలోనే రతిక్రియలో
    పాల్గొనాలి. మిగతా రోజులలో సంభోగం జరిగితే, గర్భం వచ్చే అవకాశం ఎక్కువ గా ఉంటుంది.
    ఇక ఇంజెక్షన్ ల గురించి : LARC అంటే లాంగ్ యాక్టింగ్ రివర్సిబుల్ కాంట్రా సెప్షన్ అంటే ఈ పద్ధతులలో మీరు ఇరువురూ లేదా స్త్రీ కావాలనుకున్నంత వరకూ ఒక క్రమ పద్ధతిలో ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉండాలి. అంటే హార్మోను ఇంజెక్షన్లు.
    డిపో ప్రోవేరా ( Depo provera ) అనే ఇంజెక్షన్ మంచిది గా తోస్తున్నది. ఈ ఇంజెక్షన్ స్త్రీ ఒకసారి తీసుకుంటే , అది పన్నెండు వారాలు అంటే మూడు నెలలు గర్భ నిరోధకం గా పని చేస్తుంది. మీరు సంతానం కావాలనుకున్నప్పుడు ( స్త్రీ ) ఆ ఇంజెక్షన్ తీసుకోకుండా ఉంటె సరిపోతుంది.
    మీరు ఇద్దరూ ఏ పధ్ధతి అవలంబించాలని అనుకున్నా , గైనకాలజిస్ట్ ను సంప్రదించి మీ సందేహాలు తీర్చుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

  8. articles are informative, for weight loss,gaining and maintain shall we use nutrion milk shake, please give me clarification.

    • Surya gaaru,
      Nice to know that you are benefiting from ‘ baagu ‘ articles. You have not given any further details regarding weight. Nutrition milk shakes do not automatically reduce weight. Weight reduction measures are many and one needs follow all the measures over a long period, may be all their lives. Let me know if you need more information.
      best wishes.

  9. thank u for immediate response, my mother weighs 98 kgs, one of my friend suggested for weight loss he is using herbalife protien based nutrition shake mix with non fat milk two times a daily, only taking lunch. he reduced 95 kgs to 65 with in 12 months. and he invited for their seminar there is lot of people gathered and all are using this, they are some gained using this product 3 times shake + 3 meals a day, for weight mangement 1 shake and 2 meals. i have some confusion, please advise.

    • Surya gaaru, Weight reduction has to be done under the guidance of a physician ( preferably an MD ) and a dietician. You must not rush to reduce weight quickly. Also the person who is trying to reduce weight must be free from any medical disorders or conditions. And also, weight reduction has to be done very gradually. So, do not be carried away by those advertisements. Treatment depends on individulal circumstances. I hope this is helpful. best wishes. Dr.Sudhakar.

  10. ఈ ప్రయత్నం మా కొసమే అనుకుంటున్నాం. (మా బాగుకొసమే ) తప్పకుండా చదవాల్సిన టపాలు ఇవి.

  11. ఇది చాలా ఉపయోగకరమైన బ్లాగు. దీనిని ఆపవద్దు. ఆరోగ్యం గురించి కొత్త కొత్త తెలియచేయగలరు.

  12. నమస్కారం డా.సుధాకర్ గారు!! మీ బ్లాగు అద్భుతమండీ!! ఆరోగ్య సంబంధ విషయాలాను మరియు వైద్యశాస్త్ర విషయాలను మరియు వైద్యశాస్త్ర సాంకేతిక పదాలను సులభమైన తెలుగులో అర్థమయ్యే విధంగా వ్రాస్తున్నారు!! నేను మీ బ్లాగు నుంచి చాలా విషయాలను తెలుసుకొని నా సన్నిహిత వర్గంతో కూడా పంచుకుంటున్నాను!! ముఖ్యంగా మధుమేహం గురించి మీరు వ్రాసిన ధారావాహిక వ్యాసాలను చాలా చాలా ఉపయోగకరమైనవి నేను వాటినన్నింటిని సంకలనం చేసిపెట్టుకున్నాను!!

    మరో మారు మీకు ధన్యవాదాలతో

    భవదీయుడు
    -శశి కుమార్

  13. శశికుమార్ గారికి ,
    బాగు లోని ఆరోగ్య సంబంధ టపాలు , మీకు ఉపయోగ పడుతున్నందుకు సంతోషం !
    బాగు ఉద్దేశం అదే కదా !
    అభినందనలు !

  14. హలో సుధాకర్ గారు…
    “ఈనాడు” దినపత్రిక గ్రూప్ నుంచి వెలువడుతున్న “తెలుగు వెలుగు” మాసపత్రికలో మీ బ్లాగు గురించి పరిచయం చేద్దామనుకుంటున్నాం. దానికి సంబంధించి కొంత సమాచారం కావాలి. మీ మెయిల్ ఐడీ ఇస్తే ప్రశ్నావళి పంపిస్తాను.

    ధన్యవాదాలతో

    శైలేష్ నిమ్మగడ్డ
    సీనియర్ సబ్ ఎడిటర్
    96523

Leave a reply to the tree స్పందనను రద్దుచేయి