పరీక్షా ఫలితాల తరువాత!
పరీక్షలు జరిగాయి , చాలా పరీక్షల ఫలితాలూ తెలిశాయి !
చాలామంది విద్యార్థులు కృతార్ధు లయ్యారు , వారికి అభినందనలు !
ఇక విజయం పొందని విద్యార్థులకు కూడా నా అభినందనలు !
ఎందుకంటే , ఫలితం ఎట్లా ఉన్నా కూడా , వారు కూడా కష్ట పడి , పరీక్షలు రాశారు కాబట్టి !
మార్కులూ , ఫలితాలూ , కేవలం ఆ యా పరీక్షల కు సంబంధించినవే !
అవి జీవితం లో జయాప జయాలను నిర్ణయించే ఫలితాలు ఎంత మాత్రం కావు !
విజయానికి రహస్యాలు ఏమీ లేవు ! సరిగా సిద్ధం అవడం , అందుకు తగినంత శ్రమ పడడంతో పాటుగా , అపజయాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు పోవడమే !
అంతే కాదు ! శ్రమ పడకుండా విజయాన్ని పొందు దామనుకోవడం , కేవలం భూమిలో విత్తనం వేయకుండా , పండు కోసుకు ని తిందామనుకోవడం లాంటిదే !
విజయం అనేది , మనం ప్రతి రోజూ చేసే చిన్న చిన్న శ్రమల పూర్తి ఫలితమే !
వేయి మైళ్ళ దూర ప్రయాణం కూడా మనం వేసే ఒక్క చిన్న అడుగుతోనే మొదలవుతుంది ! కష్ట సమయం శాశ్వతం కాదు ! కానీ ఆ కష్ట సమయాలను ధైర్యం గా ఎదుర్కునే వారే పురోగతి సాధిస్తారు !
అందుకే సఫలీకృతులు కాలేక పోయిన విద్యార్థులందరూ , ఏమాత్రం నిరాశ చెందక ,మళ్ళీ ప్రయత్నించండి ! మీ జీవితాలు విలువైనవి !
అపజయాలు , మీ జీవితాలను తిప్పే మలుపులు గా భావించి , పట్టు వదలకుండా , శ్రమించి విజయం పొందండి !
ఈ బ్లాగులోనే , క్రితం పోస్టు చేసిన ‘ చదువుకోవడం ఎట్లా ? ‘ అనే వ్యాసాలను ఒకసారి చదవండి !
విజయీభవ !