Our Health

Archive for జూన్, 2015|Monthly archive page

మనసుపడ్డ అమ్మాయిని, ఎట్లా కౌగిలించుకోవాలి ?1.

In Our Health on జూన్ 19, 2015 at 1:10 సా.

మనసుపడ్డ  అమ్మాయిని, ఎట్లా కౌగిలించుకోవాలి ?1. 

అంతర్జాల ‘ మహిమ ‘ అంతా ఇంతా కాదు !  గుండు సూది ఉపయోగాల నుంచి బ్రంహాండం ఎట్లా బద్దలవుతుందో కూడా  అత్యంత వివరం గా అందరికీ అందుబాటు లో ఉంచారు, మానవులు ! మరి మనసుపడ్డ అమ్మాయిని ఎట్లా కౌగిలించుకోవాలి ? అనే సందేహం కూడా , అనేకమంది యువకులకు , యుక్తవయసులో కలగడం  సహజమే ! 

మరి ఆ వివరాలు తెలుసుకుందాం ! ముఖ్యం గా గుర్తు ఉంచుకోవలసిన విషయం : అంతర్జాలం ప్రపంచం లో అందరికీ  అందుబాటు లో ఉన్నా , అందులో రాసే ప్రతి విషయమూ ,  ప్రపంచమంతా , ఒకే తీరు గా అమలు పరచడం అసాధ్యం !   అంతర్జాలం లో రాసిన విషయాలను , ప్రతి దేశ , ప్రాంత , భాష , సంస్కృతు లకు  అనుగుణం గా ప్రవర్తించాలి !  ఇంకో రకంగా చెప్పుకోవాలంటే , ప్రపంచీకరణ, కేవలం వస్తువులకు మాత్రమే , పరిమితం అవుతుంది , ప్రస్తుతం ! మానవ  సంబంధాలు చాలా వరకూ , ఆయా దేశాల  ప్రజల ఆచారాలూ , అలవాట్లతో ముడి పడి ఉంటాయి !  ఆ ఆచారాలలోనూ , అలవాట్లలోనూ మార్పులు  రావడానికి సమయం పడుతుంది ! 
అందుకే , క్రింద రాసిన సలహాలు ( అంతర్జాలం నుంచి సేకరించినవే ! ) ఎదుటి వ్యక్తి  ఇష్టా ఇష్టాలతో ప్రమేయం లేకుండా , మక్కీ కి మక్కీ గా, అమలు పరచడానికి ప్రయత్నించకూడదు ! 
1. సమయం , సందర్భం !: 
లేడి కి లేచిందే పరుగు అన్నట్టు , ఇష్టపడ్డ ప్రతి వారినీ , కనిపించినప్పుడల్లా కౌగిలించలేము కదా !? అందుకే ,  ఆ పవిత్ర మైన , అమూల్యమైన కార్యానికి , చక్కటి సమయం , సందర్భం చూసుకోవడం కూడా ముఖ్యమే !  అది పాటించక పొతే , మీ అనుభూతులు  చప్పగా ఉండడమే కాకుండా , మీరు  అనుకున్న పని కూడా బెడిసి కొట్ట వచ్చు ! 
తొలిసారి :  ఇష్టమైన అమ్మాయిని తొలిసారి చూసినప్పుడే , మనసు ‘ పారేసుకుంటే ‘  ఓ కమ్మని కౌగిలింత కోసం ప్రయత్నించడం  !
విజయం సాధిస్తే :  మీరు , మీకు నచ్చిన అమ్మాయి జతలో , కఠిన మైన పోటీలో విజయం పొందితే , మీరు  ఆమెకు ఇచ్చే కౌగిలి , లేదా ఆమె నుంచి స్వీకరించే కౌగిలి , అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది ! 
రోజు కఠినం గా ఉంటే : అన్ని రోజులూ , సరదా గా , గడచి పోవు ! కొన్ని రోజులు కష్టం గా , చాలా నిదానం గా , నిరుత్సాహ కరం గా గడుస్తూ ఉంటాయి ! చాలా శ్రమ పడడం , అలసట చెందడం కూడా జరుగుతూ ఉంటుంది , కొన్ని రోజులలో ! ఆ రోజులలో  మీరు  , ఆమె కు ఇచ్చే కౌగిలి , ఎంతో  స్వాంతన తో , ఓదార్పు తోనూ , ఉత్సాహ పరిచే ,శక్తి వంతం చేసే , ‘ కౌగిల్టిన్ ‘  అవుతుంది ! 
విడి పోయే సమయాలలో : ఈ విశాల ప్రపంచం లో అనేక మంది వ్యక్తులతో వివిధ సందర్భాలలో కలుస్తూ ఉంటాము ! అన్నికలయికలూ  , జీవితాలతో ముడి పడి పోవు ! పవిత్రమైన లేదా ప్రేమ పూర్వకమైన , లేదా స్నేహ పూర్వకమైన పరిచయాలు గా మిగిలిపోతాయి !  మీ జీవితాన్ని  చై తన్యం చేసిన , ఆ మ్మాయిని  , వీడి పోయే సమయం కూడా , మీరు ఇచ్చే ,  స్నేహ పూర్వకమైన , కృతజ్ఞతా పూర్వకమైన కౌగిలి కి  మరపు రాని సమయం అది ! 
వచ్చే టపాలో మిగతా సంగతులు ! 

బంధాలు ఎందుకు తెగుతాయి ?12. మొండి వాదన !

In Our Health on జూన్ 7, 2015 at 4:42 సా.

బంధాలు ఎందుకు తెగుతాయి ?12. మొండి వాదన !

ఒక బంధం ఏర్పడే మొదటి దశలలో కానీ , ఏర్పడ్డాక కానీ ,  స్త్రీ పురుషుల మధ్య , అనేక సందర్భాలలో వాదోప వాదాలు జరుగుతూ ఉంటాయి ! ఆ సందర్భాలలో , సాధారణం గా పురుషులు  , తమ   పెద్ద గొంతు తోనో , లేదా మొండి వాదనతోనో , స్త్రీల  నోరు మూయించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ! స్త్రీలు కూడా , కొన్ని , కొన్ని సమయాల లో , తమ ఇంట్లో వారికీ , తమ వీధిలో వారందరికీ కూడా , వినపడేంత గొంతుతో , తమ వాదనను వినిపిస్తారు !  మరి, ఆ వాదనలను ,  తమ జీవితాలకు ఉపయోగ కరం గా  మార్చుకోవడం ఎట్లా ? :
1. విరామం !:
వాదనలు , తారాస్థాయి కి చేరుకునే సమయం లో , రక్త పీడనం హెచ్చుతుంది ! అంటే అధిక బీపీ ! దానితో , ఆందోళన , మానసిక వత్తిడి కూడా ఎక్కువ అవుతాయి ! చాలా మందికి కోపం వస్తే, వారి గుండె కాయ , ఎక్కువ వేగం గా కొట్టుకుంటూ ఉంటుంది !   కొందరు శివాలు ఎత్తినట్టు , ఊగి పోతూ ఉంటారు , చెప్పలేనంత కోపం తో ! 
ఎక్కువ కోపం వచ్చిన వారు , పక్షవాతమూ , గుండె జబ్బు ( హార్ట్ ఎటాక్ ) బారిన అకస్మాత్తు గా పడిన సందర్భాలు కూడా అనేకం !  కోపం లోనూ , ఆవేశం లోనూ , మానవులు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతారు ! కేవలం , గుస గుసలు కూడా ఇతరులకు వినిపించే  చోట , నోరు పెద్దది చేసుకుని , అరవడం మొదలు పెడతారు !  అంటే , వారు ఏ సమస్య గురించి ఆలోచిస్తున్నారో , ఆ సమస్య  ను సరిగా , అంటే హేతుబద్ధం గా  అర్ధం చేసుకోలేక పోతారు ! అట్లాగే , పరిష్కారం కూడా కనుగొన లేక పోతారు !   అందుకని ,  కోప తాపాలు , ఆ బంధం లో ఎవరికి  ఎక్కువ గా అవుతున్నాకూడా ,  వారిరువురూ , వెంటనే విరామం తీసుకోవడం , అతి ముఖ్యమైన చర్య !  వెంటనే ఆ స్థానం నుంచి , వెళ్ళిపోవడం , చేయవలసిన పని ! 
2. మీ వాదన లక్ష్యం   ఏమిటి ?:  మీరు , మీ వాదనతో , ఏమి సాధిద్దామని అనుకుంటున్నారు ?  ఈ విషయం ముందుగానే  ఆలోచించుకోవాలి !  లేకపోతే , మీ వాదన  కు ఫలితం ఉండదు !  అంతే కాకుండా , మీరు  , మీ వాదన ఎట్లా ఉంటే  ,  మీ ‘ బంధం ‘ లో ఉన్న సమస్య పరిష్కారం అవుతుందో కూడా , ముందుగానే , ఆలోచించుకోవాలి ! 
కేవలం, మీరు వాదించే , మీ ఎదుటి వారి మనసును  గాయ పరచడమే , మీ లక్ష్యం కాకూడదు !  సమస్యను ,   పరిష్కార దిశగా , మీరు చూడ గలుగు తే , మీరు  నిదానం గా ఆ సమస్య గురించి ఆలోచించ గలగడమే కాకుండా , మీ ఎదుటి వారి  అభిప్రాయాలను కూడా గౌరవించి , వాటిని కూడా ఓపికతో వినే అలవాటు చేసుకుంటారు ! 
ఎవరి మనసులో ఉన్నది వారు, బయటకు చెప్పుకోకుండా , ‘ బాటిల్ ‘ చేసుకోవడం కూడా , అధిక రక్త పీడనకూ , ఇతర మానసిక రుగ్మత లకూ దారి తీస్తుందని , అనేక శాస్త్రీయ పరిశీలన ల ద్వారా తెలిసింది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: