Our Health

ఉండే చోటు మీద ఆపేక్ష ! 1.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఫిబ్రవరి 21, 2014 at 11:09 సా.

ఉండే చోటు మీద ఆపేక్ష  ! 1. 

 
మానవులు ఉండే చోటు మీద,  వారికి కలిగే ఆపేక్ష గురించి శాస్త్రీయం గా ఒక పరిశీలన ! 
మానవులకు తాము నివశించే స్థానం మీద వారికి కలిగే   భావోద్వేగాల బంధమే   ‘ ఉండే చోటు మీద ఆపేక్ష ‘ !  సామాజిక మనస్తత్వం లేదా పర్యావరణ మనస్తత్వం లో  ‘ ఉండే చోటు మీద కలిగే ఆపేక్ష లేదా ఎటాచ్ మెంట్  ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ! 
మనం ఉండే చోటు మీద మనకు కలిగే ఈ ఆపేక్ష , మన మీదా , మన  వ్యక్తి గత అనుభవాల మీదా  ఆధార పడి  ఉంటుంది ! అంటే , మనకు ఒక చోటు మీద ఎటాచ్ మెంట్ ఉందంటే ,   ఆ ఎటాచ్ మెంట్  , మన మీదా , మనకు ఆ స్థానం తో కలిగిన అనుభవాల మీదా ఆధార పడి  ఉంటుంది ! సహజం గా మనం ,  ఇతర దేశాల కు వెళ్ళినప్పుడు ,  ఆ యా దేశాల , ప్రాంతాల , జన జీవనాలనూ , జనావాసాలనూ పరిశీలిస్తూ ఉన్నా కూడా , అవకాశం వచ్చి , ఆ యా దేశాలలో ఉండ వలసి వచ్చినా కూడా , ‘ మన దేశమూ కాదు , మన భాషా కాదు !  అని అనుకుంటూ ఉంటాము ! ( మనకు ఆ దేశ భాష వచ్చినా కూడా ! ) ఇట్లా , మనం నివశించే స్థానం మీద , మనకు ఏర్పడే ఎటాచ్ మెంట్ లేదా ఆపేక్ష  కు కారణాలు తెలుసుకోడానికి కొంత పరిశోధన జరిగింది ! 
ష్రో డ ర్  అనే శాస్త్ర వేత్త  ఈ ఎటాచ్ మెంట్ రెండు రకాలు గా ఉంటుందని తెలిపాడు ! ఒకటి మనం ఒక ప్రాంతం లో నివశిస్తూ , ఆ  ప్రాంతం మీద మనకు కలిగే , అనుభూతులూ , భావోద్వేగాలూ , అనుభవాలూ , వీటి ద్వారా ఏర్పడే ఎటాచ్మెంట్ ఒక రకమైనది గానూ , మనం ప్రస్తుతం ఉంటున్న ప్రాంతాన్ని , అంతకు పూర్వం ఉన్న ప్రాంతం తో పోల్చుకుని , మనం ఏర్పరుచుకునే అనుభూతుల ఎటాచ్ మెంట్  ఇంకో రకమైనది గానూ ! అంటే  ఈ రెండో రకమైన ఇష్టం , కేవలం , రెండు స్థానాలనూ పోల్చి ఏర్పరుచుకునే  అభిప్రాయం ! 
మరి మనం ఉండే చోటు మీద మనకు కలిగే ఆపేక్ష , ఎట్లా ఏర్పడుతుంది ? అనే సంగతి ని వచ్చే టపాలో తెలుసుకుందాం ! 
  1. good.
    ”జననీ జన్మభూమీశ్చ స్వర్గాదపి గరీయసీ” తల్లి,జన్మభూమి స్వర్గంకంటే ఎక్కువవని శ్రీరాముని ఉవాచ!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: