Our Health

డిప్రెషన్ ఆత్మకథ

డిప్రెషన్ ఆత్మకథ

నా కథ మీరు తప్పకుండా తెలుసుకోవాలి:
నా పేరు డిప్రెషన్ నేను మానవులను పలు విధాలుగా బాధిస్తూ వుంటాను.
సముద్రం లో అల్ప పీడనాలు ఉన్న సమయాలలో నేను ప్రత్యక్షం అయి తుఫాను సృష్టిస్తాను ఆరకమయిన తుఫానులు ఏవిధంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగిస్తాయో నేను ప్రత్యేకంగా మీకు వివరించనవసరం లేదనుకుంటాను. ఆర్ధిక రంగం లో నేను ఉన్నప్పుడు ఆర్ధిక వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తూ ఉంటాను. ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక స్థితి నా గుప్పిట నే వుంది.
ఆంగ్లంలో నన్ను డిప్రెషన్ అంటారు. చాలా తరుచు గా మనుషులలో ఒక మనో వ్యాధి ని నా పేరు తో పిలుస్తూ ఉంటారు.
తెలుగు లో చాలా పేర్లు ఉన్నాయి నాకు. కొందరు ‘ గుబులు’ అని అంటారు. కొందరు ‘ నిస్పృహ’ అంటారు. కొందరు దుక్ఖోద్వేగం అంటారు.
నన్ను తెలుగులో గుబులు అనటమే సరియినదేమో!
నాకు స్థల భేదం లేదు ప్రపంచం లో ఏ ప్రాంతం లో ఉన్నవారినయినా పట్టి పీదిస్తాను. పల్లె లలో ఉండేవారికంటే పట్టణాలలో ఉండేవారిని ఎక్కువగా బాధిస్తా. నాకు వయో భేదం కూడా లేదు. బాల్యం, యవ్వనం, బాలింత, ముదుసలి – మీరు మీ మీ జీవితాలలలో ఏ దశ లో ఉన్నా నేను పట్టించుకోను.
నేను చాల చెడ్డ వాడిని లేక చెడ్డ దానిని అనండి ఎందుకంటే నాకు లింగ భేదం ఏమీ లేదు. ఆడ వారయినా మగ వారయినా , పట్టి పీడి స్తూ ఉంటాను.
నా కధ సంపూర్ణంగా తెలుసుకోవాలి మీరందరూ. ఎందుకంటే నా చెడు గుణాలు అన్నీ మీరు తెలుసుకుంటేనే నన్ను మీ దరి చేరకుండా మీ జీవితాలను మీరు ప్రేమించి, మీ జీవితాలలోని మంచిని, మాధుర్యాలను బాగా చవి చూడ గలరు.
నా కథ అయిదు భాగాలు గా మీకు చెపుతాను. మొదటి భాగం లో నేను మీ వద్దకు ఏ పరిస్థితులలో వస్తానో వివరిస్తాను. రెండో భాగం లో నేను మీతో ఉన్నప్పుడు మీలో వచ్చే మార్పులు తెలియ చేస్తాను. మూడో భాగంలో నా అజ్ఞాత ఉనికిని ఏ విధంగా మీరు కనుక్కోవచ్చో మీకు నేనే చెపుతాను. నాలుగో భాగం లో ఇక నాకు మీరు ఎలా ఉద్వాసన చెప్పాలో సవివరంగా తెలియ చేస్తాను. ఇక ఐదో భాగం లో నన్ను మీ జీవితాలతో ఎప్పుడూ ఆడుకోకుండా ఉండాలంటే మీరు ఏమి చేయాలో ఆ జాగ్రత్తలు మీకు వివరిస్తాను.
మీరు ఇందుకు తగిన ప్రతిఫలంగా నా ఆత్మకథను మీ జీవితాంతం గుర్తుంచుకోండి. కాని నన్ను మీ దరికి మాత్రం ఎప్పుడూ చేరనీయకండి. మీ విలువయిన జీవితాలను సంపూర్ణంగా అనుభవించండి, ఆనందించండి.
( తరువాతి టపాలో నా కథ మొదటి భాగం )

  1. chala bagundi alage migilina bhagalanu pampandi pls
    ma amma dipression tho ano rojuluga bada paduthu undi naku thagina solution ivagalaru

Leave a reply to kavya స్పందనను రద్దుచేయి