Our Health

Archive for the ‘ప్ర.జ.లు.’ Category

మరి గంజాయి పీలిస్తే ప్రమాదాలేంటి ?2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 19, 2017 at 9:09 ఉద.

మరి గంజాయి పీలిస్తే ప్రమాదాలేంటి?2.

Related image

1. గంజాయి పీల్చాక వాహనం నడిపితే  స్వర్గ ద్వారాలకు చేరువ అవడం ఖాయం :
గంజాయి పీల్చి డ్రైవింగ్ చేసే వారు,  విచక్షణ, సమయ స్ఫూర్తి  లోపించి , ప్రమాదాలకు లోనవడమే కాకుండా , ఇతర వాహన చోదకుల , పాద చారుల ప్రాణాలకు కూడా హాని కలిగిస్తారు ! ఈ విషయం
అనేక పరిశోధనల ఫలితం !
2. గంజాయి ఊపిరి తిత్తుల క్యాన్సర్ కు ( లంగ్ క్యాన్సర్ ) కు హేతువు :
బాగా పట్టు బిగించి గంజాయి దమ్ము లాగే వారి ఊపిరితిత్తులను , వారి జీవితాలనూ కూడా ఆ గంజాయి లాక్కెళుతుంది !
పొగాకు లో ఉన్న విషపదార్ధాల లాంటి విషాలే , గంజాయి లో కూడా ఉన్నాయని పరిశోధనల ద్వారా తెలిసింది !
3. గంజాయి స్కిజోఫ్రీనియా కి కారకం :
గంజాయి పీల్చే వారి మానసిక స్థితి క్రమేణా అధ్వాన్నం అవుతుంది !
వారు తరచూ ,  మనుషులు లేని చోట మనుషులను చూడడం , లేదా మనుషుల మాటలను లేదా ఇతర శబ్దాలను , ఎవరూ లేని చోట వినడం అంటే శూన్యం లో శబ్దాలను వినడం జరుగుతుంది !
అంటే వారు హాలూసినేషన్స్  అనే  విచిత్ర అనుభూతి చెందుతూ ఉంటారు !
ఈ హాలూసినేషన్స్ తరచూ వస్తూ ఉంటే , వారు క్రమేణా విపరీతమైన భయం చెందుతూ , ఇతర వ్యక్తులు కొందరు కానీ , లేక అందరూ కానీ , వారి కి ఎప్పుడూ హాని తలపెట్టే ఉద్దేశం లో ఉన్నారని భావిస్తూ ఉంటారు !  ఈ భ్రమ నే ‘ పారనోయియా ‘ అంటారు !
ఈ పారనోయియా తీవ్రం గా ఉన్న వారు , వారి పక్కన ఉన్న వారి మీద అకారణంగా దాడికి దిగడమూ , వారిని  కొట్టడం లేదా ఇతర రకాలు గా గాయ పరచడం కూడా చేస్తూ ఉంటారు !
4. గంజాయి వంధత్వానికి కారణం ( infertility ):
చాలా కాలం గంజాయి దమ్ము లాగే పురుషులలో శుక్ర కణాలు తగ్గి  అంటే స్పెర్మ్ కౌంట్ తగ్గి పోయి ,వారు  తండ్రులు కాలేక పోవడం , అట్లాగే స్త్రీలలో అండాలు  తగ్గి , వారు గర్భవతులు కాలేక పోవడం కూడా జరుగుతుంది !
5. గంజాయి పీలిస్తే , వికలాంగ శిశువుల జననం :
బాగా గంజాయి పీల్చే స్త్రీలు గర్భవతులవుతే , వారికి కలగ బోయే శిశువులు అవయవ లోపాలతో పుట్టే ప్రమాదాలు  ఎక్కువ అవుతాయి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

ఒథెల్లో సిండ్రోమ్. 6 మరి చికిత్స ఏమిటి ?

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on ఏప్రిల్ 9, 2017 at 6:03 సా.

ఒథెల్లో సిండ్రోమ్. 6 మరి చికిత్స ఏమిటి ? 

Related image

క్రితం టపాలలో  ఒథెల్లో సిండ్రోమ్ అంటే ఏమిటి ? , దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి ? అనే సంగతుల గురించి తెలుసుకున్నాం కదా !? ఇప్పుడు దానికి చికిత్స ఏమిటో కూడా తెలుసుకుందాం !
ముఖ్యమైన మొదటి విషయం : 
ఒథెల్లో సిండ్రోమ్ ను మొదట నిర్ధారించుకోవాలి ! అది తమంత తాము చేయలేక పొతే , స్పెషలిస్ట్ సహాయం తీసుకోవాలి !
ఈ రుగ్మత ఉన్న వారికి , మద్యం అలవాటు ఉందో లేదో ,  అంతకు ముందు ఆ అలవాటు లేక పొతే , ఈ మధ్య కొత్తగా ఆ అలవాటు అయిందో  లేదో అని కూడా పరిశోధన చేయాలి , లోతు గా !
ఎందుకంటే , మూలకారణం,  చికిత్స కు కొంత వరకు మాత్రమే లొంగుతుంది , కూడా ఉన్న , లేదా ఉండే , మద్యం , ఇంకా ఇతర వ్యసన పదార్ధాల వాడకం ( అంటే ముఖ్యం గా మత్తు మందులు ) కూడా ఈ ఒథెల్లో సిండ్రోమ్ ను బాగా ప్రభావితం చేస్తుంది , కాబట్టి వాటిని కూడా సమూలం గా ఒదిలించు కోవాలి !
 రెండో విషయం :  ఈ రుగ్మత ఉన్న వారికి  డిప్రెషన్ లేదా కుంగుబాటు కూడా ఉండ వచ్చు , దాని చికిత్స  తప్పనిసరిగా జరగాలి !
దానితోపాటుగా , తరచు  కనిపించే పారనోయియా , లేదా సైకోసిస్ అనే మానసిక పరిస్థితి ని కూడా  మందులతో కంట్రోల్ చేయాలి !
ఇక మూడో విషయం : 
సైకాలజిస్ట్ ద్వారా , ఈ రుగ్మత ను దీర్ఘ కాలికం గా చికిత్స జరిపించి , ఈ ఒథెల్లో సిండ్రోమ్ ఉన్న వారి మానసిక  విపరీత పరిస్థితి లో సమూలమైన మార్పులు తీసుకు రావాలి !
పైన చెప్పిన ఈ మూడు ముఖ్యమైన చికిత్సా పద్ధతులు  అనుసరిస్తూ , క్రమం తప్పకుండా , ఈ ఒథెల్లో సిండ్రోమ్ తీవ్రత ను అంచనా వేస్తూ , లేదా వేయిస్తూ ఉండాలి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
మీ అభిప్రాయాలూ , ప్రశ్నలూ ,  తెలుపగలరు ! 

5. ఒథెల్లో సిండ్రోమ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి ?!

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఫిబ్రవరి 18, 2017 at 7:22 సా.

5. ఒథెల్లో సిండ్రోమ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి ?!

Image result for mental tension

క్రితం టపాలో చదివినట్టు , ఈ రుగ్మత ఉన్న వారు , తమ భార్యల సాంఘిక పరిచయాలను కంట్రోల్ చేస్తూ ఉంటారు.
వారి భార్యలు , ఆ కంట్రోల్ ను తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే , అప్పుడు , వారి మీద లేని పోని అపనిందలూ , ఆపవాదులూ వేస్తూ ఉంటారు !
వారికి ఇతర పురుషులతో రహస్య సంబంధాలు ఉన్నాయంటూ , వారిని మానసిక హింసకు గురి చేస్తారు !
క్రమేణా , వారిని శారీరకం గా కూడా హింసించడం మొదలు పెడతారు !
వారి దాంపత్య జీవితాన్ని చిన్నా భిన్నం చేసుకుంటారు !
వారి తప్పులకు కారణమంతా , వారి భార్యలే అని విమర్శిస్తూ ఉంటారు , వారిని ! తమ తప్పులను ఎప్పుడూ ఒప్పుకోకుండా ! 
అంతే కాకుండా , ఎప్పుడూ , తమ భార్యలను విపరీతమైన మానసిక వత్తిడికి గురి చేస్తారు !
ఆ వత్తిడి తగ్గి పోతుంటే , తాము బతకలేమనీ ,  తమకు ఆత్మ హత్యే శరణ్యమనీ  , తమ భార్యలను బెదిరిస్తూ ఉంటారు , తరచూ ! 
తరువాతి టపాలో ఇంకొన్ని సంగతులు !

ఒథెల్లో సిండ్రోమ్ గురించి యువత ఎందుకు తెలుసుకోవాలి ? 1.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 22, 2016 at 8:21 సా.

ఒథెల్లో సిండ్రోమ్ గురించి యువత ఎందుకు తెలుసుకోవాలి ? 1. 

Image result for woman in a wine bottle

నవీన్ ఓ ఐటీ  కంపెనీ లో పని చేస్తున్నాడు !  చాలినంత జీతం. ముందే  మనసులు కలిసిన మగువతో పెళ్లయింది కూడా !  వనిత  కూడా ఇంకో ఐటీ  కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ !
కొంత కాలానికి  సంతానం మాట దాటవేస్తూ , తమ పొందు లో అంతులేని  ఆనందం అనుభవిస్తూ ఉన్నారు, పగలూ రాత్రీ కూడా !
వనిత , అధునాతన మైన హేర్ స్టైల్  తో ,  పిచ్చెత్తించే తన అందాలను కూడా,  తీరిక గా చూసుకోవడం, వాటి పై  శ్రద్ధ తీసుకోవడం  నేర్చుకుంటూ  ఉంది  ! ఇతర కొలీగ్స్ కూడా అసూయ పడే అందం ఆమెది ! ఆ వయసులో కనిపించే  ఆమె  ముక్కు సూటి గా పోయే స్వభావం , కొంత చిలిపితనం , చుట్టూ ఉన్న అందరినీ ‘ కట్టి పడేస్తాయి’  ! దానికి తోడు , వర్క్ కూడా అంకిత భావం తో చేస్తూ ఉండడం తో  ప్రమోషన్ కూడా వచ్చింది,  ఈ మధ్యనే !
గత కొన్ని నెలలు గా నవీన్ , వనితను ‘ ఇంకోలా ‘ చూడడం మొదలెట్టాడు ! ఇంటికి రావడం కాస్త ఆలస్యం అయినా, ఆరాలు తీస్తున్నాడు ! వనిత , అది విరహం అనుకుంది !
ట్రాఫిక్ ను దాటుకుంటూ , ఇంటికి  రావడం ఆలస్యం అయినా కూడా , ఆ అలసట కనబడ నీయక , ప్రేమ భావనతో , చక చకా వంట చేసి , ఇద్దరూ తిన్నాక  ,ఎర్ర బడుతున్న బుగ్గలతో , నవీన్ తో  సరసాల కు సమయం కేటాయించింది !
నవీన్ మాత్రం , ముభావం గా ఉంటున్నాడు !
‘ ఏంటి,  నవీన్ గారు ఈ రోజు అంత ఫ్రిజిడ్ గా ఉన్నారు ?! ‘ అంది !
‘ ఎందుకు ఇంత ఆలస్యం అయింది ?’
‘ నీకు తెలుసు కదా ,నా రూట్ లో  వెధవ ట్రాఫిక్  సంగతి ? డ్రైవింగ్ నత్త నడక అయింది ! ‘
కొంత వర్క్ ఉంది చేయాల్సి ఉంది  ‘ అని ల్యాప్ టాప్ ఆన్ చేసి , అందులో మునిగి పోయాడు నవీన్ !
తన అందాలను అతి సున్నితం గా ‘ స్పృశించే ‘ నవీన్ ‘ మడి ‘ కట్టుకోవడం అసాధారణం గా అనిపించింది వనితకు !
నిరాశ కు అలసట  కూడా తోడై , బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుంది , ఎప్పుడు నిద్ర వచ్చిందో తెలియ లేదు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

ఫెటిషిజానికి చికిత్స ఏమిటి ? 5.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 16, 2016 at 7:55 సా.

ఫెటిషిజానికి చికిత్స ఏమిటి ? 5. 

Image result for Indian women in blouse

ఫెటిషిజం ఒక జిడ్డు లాంటి మానసిక రుగ్మత ! ఈ సమస్య ఉన్న వారికి చికిత్స చేయ వచ్చు ! కానీ ఒక రోజో , రెండు రోజులో చికిత్స చేయించుకుంటే సరిపోదు ! దీర్ఘకాలికం గా , అంటే , కొన్ని నెలలూ , సంవత్సరాల తరబడీ చేయించుకుంటే , ఆ చికిత్స కు ఫలితం ఉంటుంది !
సాధారణం గా చికిత్స , మానసిక చికిత్స అంటే సైకోథెరపీ , మంచి ఫలితాలను ఇస్తుంది !
కొన్ని రకాలైన మందులు కూడా , కొంత వరకూ , పదే  పదే వచ్చే , చెడు ఆలోచనలను తగ్గిస్తాయి !
ఫలితాలు చాలా బాగా ఉండాలనుకుంటే ,  సైకో థెరపీ తో పాటుగా , మందులు కూడా తీసుకోవాలి ! 
ఈ  సైకో థెరపీ కానీ మందులు కానీ , క్షుద్ర విద్యలు చేసే వారూ , చేత బడులు చేసే వారూ కాకుండా ,
అనుభవజ్ఞులైన  , స్పెషలిస్ట్ డాక్టర్ ల వద్ద తీసుకుంటే బాగుంటుంది !
ఈ కండిషన్ , ప్రధానం గా యువకులలో ఉంటుంది కాబట్టి , కొన్ని , కొన్ని ప్రత్యేకమైన కేసులలో
పురుష హార్మోను లను తగ్గించే మందులు కూడా పైన చెప్పిన చికిత్సా పద్ధతు లల్లో కలపడం జరుగుంది !
పదే పదే వచ్చే కామ పరమైన ఆలోచనలను , కొన్ని కొన్ని ఆర్డర్ ల ద్వారా ఆపడం , లేదా , ఆ ఆలోచనల దిశను మార్చడం ద్వారా  ఫెటిషిజం తీవ్రత ను క్రమేణా తగ్గించడం , సైకో థెరపీ లో ప్రధానం గా జరుగుతుంది !
కొన్ని ప్రత్యేక మైన , మొండి కేసుల్లో ,  కామ పరమైన ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు , వాటిని వెంటనే ‘ చల్లార్చడానికి ‘ ఒక దుర్గంధమైన వాసన ను  పేషేంట్ ఉన్న గది లో ప్రవేశ పెట్టడం లాంటి చికిత్సలు కూడా చేస్తూ ఉంటారు !
ఫెటిషిజం అనే రుగ్మతను , దాని తీవ్రతనూ , గుర్తించడం , అందుకు తగిన చికిత్స తీసుకోవడం ,
నిపుణులైన వైద్యుల వద్దనే చేయాలి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

ఫెటిషిజం అంటే ? 2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 14, 2016 at 11:08 ఉద.

ఫెటిషిజం అంటే ? 2. 

 ‘ ఫెటికోస్ ‘ అనే పోర్చు గీస్  పదం నుంచి  పుట్టింది ‘ ఫెటిషిజం ‘  దీని నిర్వచనం : అదేపనిగా ఒక నిర్జీవ వస్తువు ను చూస్తూ కానీ , తాకుతూ కానీ , కామోద్రేకం పొందడం.  మానవులు యుక్త వయసు వచ్చినప్పటి నుంచీ , తమకు నచ్చిన , అందమైన స్త్రీలను చూసినప్పుడు , ఆకర్షింప బడి , వారి లో  , కామ భావనలు కలగడం , సహజమే , కానీ నిర్జీవ వస్తువులు  అంటే , లంగాలో, బ్రా లో , హ్యాండ్ బ్యాగు లో , లేదా హై హీల్ పాద రక్ష లో చూసినప్పుడు , కామానుభూతులు పొందడాన్ని  ‘ ఫెటిషిజం ‘ అంటారు !’  ఆ డ్రెస్ లో ఆ యువతి బాగుంటుంది , లేదా ,ఆ గెట్ అప్ లో అతడు బాగుంటాడు ‘ అనే భావనలు సహజం గా వచ్చేవే ! ఇక్కడ బట్టలు నిర్జీవమైన వస్తువులయినప్పటికీ , ఆ భావనలు వచ్చిన వారికి , ఫెటిషిజం ఉన్నట్టు కాదు ! ఫెటిషిజం తీవ్రం గా ఉంటే , వారు  , అంతకు ముందు ఏ ఏ వస్తువులయితే , తమకు కామోత్తేజం కలిగించాయో , ఆ వస్తువులు లేనిదే , కామ క్రియ లో పాల్గొన లేరు !వారికి ఆ వస్తువులు అందుబాటులో  ఉండక పొతే , కామ క్రియ అసాధ్యం అవుతుంది , భౌతికం గా ఏ అవయవ లోపమూ లేనప్పటికీ ! 
ఫెటిషిజం,  స్త్రీలకంటే , పురుషులలోనే ఎక్కువ గా కనబడుతుంది ! అరుదుగా స్త్రీలలో కూడా ఉంటుంది . అందుకు కారణాలు స్పష్టం గా తెలియలేదు , ఇప్పటి వరకూ !
ఫెటిషిజం లో రకాలు ఉంటాయా ?:
ఫెటిషిజం ప్రధానం గా రెండు రకాలు :
1. ఆకార ఫెటిషిజం( ఫార్మ్ ఫెటిషిజం )  :  ఈ రకమైన  ఫెటిషిజం ఉన్న వారు , ప్రత్యేకమైన ఆకారం లో ఉన్న వస్తువులను చూస్తేనే , కామోత్తేజం చెందుతారు ! ఉదాహరణకు ,  ఒక యువతి  , సాధారణ ఆకారం లో ఉన్న చెప్పులు వేసుకుంటే , పెద్దగా ఆకర్షింపబడరు , ఆ  యువతి అందం గా ఉన్నా కూడా ! ఇంకో యువతి  హై హీల్స్ వేసుకుని నడుస్తూ ఉంటే , కామోత్తేజం కలుగుతుంది , కేవలం ఆ హై హీల్స్ కనబడగానే , ఆ యువతి ని  పూర్తి గా చూడక పోయినా కూడా ! 
2. పదార్ధ  ఫెటిషిజం:  దీనిని మీడియా ఫెటిషిజం అని అంటారు . ఈ రకమైన ఫెటిషిజం ఉన్న వారు , స్త్రీలు ధరించే బట్టలు లేదా ఇతర వస్తువులు తయారు చేయబడ్డ పదార్ధం తో కామోత్తేజం చెందుతారు !
ఒక యువతి , ఉతికి , ఇస్త్రీ చేసిన నూలు (కాటన్ ) బట్టలు వేసుకుని కనిపిస్తే కానీ , లేదా ఇంకొందరు ,యువతి,    పట్టు వస్త్రాలు ధరిస్తే కానీ ,  జంతు చర్మం తో చేసిన జాకెట్ ధరిస్తే కానీ , అమితం గా ఉత్తేజం చెందుతారు !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు !
మీ స్పందనలూ , సందేహాలూ తెలపండి , ఏమైనా ఉంటే  ! 

( రోడ్డు రేజ్ ) దారి క్రోధం ఎందుకు వస్తుంది ? 3.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జూన్ 11, 2016 at 10:50 ఉద.

దారి క్రోధం వచ్చే వారి మానసిక స్థితి ఎట్లా ఉంటుంది ?: 

road rage

1. ఇతర వాహన దారుల మీద ఎక్కువ కోపం : వారికి , వారు వాహనం నడుపుతూ చేసే తప్పులకన్నా , ఇతర డ్రైవర్ లు నడిపే పధ్ధతి ని వెంటనే   జడ్జ్ చేస్తూ అంటే నిర్ణయం చేస్తూ , వారిని విమర్శించడమే కాకుండా , వారిని అవమాన పరుస్తూ , వారి మీద హింసాత్మక దాడి చేయడానికి కూడా పూనుకుంటారు !
2. వారు అధిక రిస్క్ తీసుకుంటారు : అధిక క్రోధం తెచ్చుకునే వారు ,  వారి వాహనాలను నియమిత వేగం కన్నా  ఎక్కువ వేగం తో నడపడమే కాకుండా , వేగం గా లేన్లు మారుస్తూ , లేదా ముందు వెళుతున్న వాహనాలకు అతి దగ్గరగా నడుపుతూ ఓవర్ టేక్ చేస్తూ వాహనాలను నడుపుతారు కూడా !
3. త్వరగా ఉద్రేకం రావడమే కాకుండా ,  వారు  ఆ క్రోధం తో ఇతరులను తిట్టడమూ, కొట్టడానికి కూడా వెనుకాడరు !
4. వారు వారి వాహనాలలో కూర్చునే ముందే , క్రోధం తో  ఉంటారు , అంటే , వారి ఇంటి లో గొడవ పడడమో , లేదా ఆఫీసులో , ఏదో సంఘటన మీద  ఉద్రేకం చెందడమో జరుగుతుంది ! అంటే వారి ఆలోచనలు , ఉద్రేకం చెంది ఉంటాయి , వారు వాహనం నడిపే ముందే !
ఇక వాహనం నడుపుతూ ఉన్న సమయం లో , ఇతర వాహన దారులు చేసే , చిన్న తప్పిదాలకైనా , విపరీతం గా స్పందించి , వారిని దూషించడం , లేదా వారి మీద దాడి చేయడం కూడా చేస్తారు !  వారికి ఇంప ల్సివిటీ  అంటే , క్షణి కోద్రేకం  అధికం గా ఉంటుంది !
5. దారి క్రోధం తెచ్చుకునే వారు తరచూ వాహన ప్రమాదాలకు లోనవుతూ ఉంటారు , వారి ఆ మానసిక స్థితి తో ! 
మరి అట్లాంటి వాహన దారులు మీకు ఎదురైతే , మీరు చేయ వలసినది ఏమిటి ? : 
1. వారి చర్యలతో , మీరు ఉద్రేకం చెందక పోవడం ఉత్తమం ! :  ఒకరు ఉద్రేకం చెందితే నే , అక్కడ పరిస్థితి  ఆందోళన కరం గా మారుతుంది , అందుకు మీ ఉద్రేకం కూడా తోడ వుతే , ఆ పరిస్థితి విషమిస్తుంది . అందుకే , మీ క్రోధాన్ని అదుపులో ఉంచుకోవాలి ! మీరు మీ సహనం కోల్పోకూడదు !
2. అధిక ఉద్రేకం చెంది , దానిని ఇతరుల మీద చూపే వాహన దారులకు మీ మీద వ్యక్తి గత ద్వేషం లేదు ! :
వారు ఆ సందర్భం లో , ఆ స్థానం లో మీరు కాక , ఇంకెవరైనా ఉన్నా కూడా అదే రకం గా ప్రవర్తిస్తారు , అంటే , సమస్య వారికే ఉంది , మీకు కాదు కదా ! అందువల్ల , వారి ప్రవర్తన ను మీరు తీవ్రం గా పరిగణించ కూడదు !
వచ్చే టపాలో , దారి క్రోధం చూపుతున్న వారితో ఎట్లా ప్రవర్తించితే , మనకు  క్షేమమో తెలుసుకుందాం ! 

( రోడ్డు రేజ్ ) దారి క్రోధం ఎందుకు వస్తుంది ? 2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జూన్ 5, 2016 at 8:06 సా.

 

( రోడ్డు రేజ్ ) దారి క్రోధం ఎందుకు వస్తుంది ? 2.

మునుపటి టపాలో  దారి క్రోధం, ఏ,  ఏ  రకాలు గా ఉంటుందో తెలుసుకున్నాం కదా !
అకస్మాత్తు గా  వాహన చోదకులలో , మిగతా డ్రైవర్ ల మీద  వచ్చే కోపాన్నే , రోడ్ రేజ్ లేదా ‘ దారి క్రోధం ‘ అంటారు !
మరి నివారణ చర్యలు ఏమిటి ? :
1. నిద్ర :
 సరిగా నిద్ర పోకుండా , ఏ  వాహనాన్నీ నడప కూడదు !  నిద్ర లేమి , అనేక రుగ్మతలకు కారణం !  ఏకాగ్రత లేకపోవడం , చీటికీ మాటికీ  చికాకు పడడం , ఓరిమి తగ్గడం , ఇవన్నీ నిద్ర లేక పోవడం వల్లనే !
2. మద్యం  నిషిద్ధం ! : 
 అతిగా కానీ , కొద్దిగా కానీ , మద్యం సేవిస్తే , ఆ ప్రభావం డ్రైవింగ్ మీద తప్పకుండా పడుతుంది !  సామాన్యం గా  జనాలు , ‘ రాత్రి కదా, తాగింది , ఇప్పుడు పరవాలేదు లే ‘అనుకుని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు !  కానీ ఎంత తాగారో మర్చి పోతారు !
12 నుంచి 24 గంటల వరకూ కూడా , మద్యం మన రక్తం లో ఉంటుంది , తాగాక ! అంటే మద్యం రక్తం లో ఉన్నంత కాలం , ఆ తాగిన మద్యం ప్రభావం కూడా మన లో కనబడుతుంది ! 
ఇది శాస్త్రీయం గా నిరూపించ బడింది కూడా !  క్రోధం ఎక్కువ అవడం , మద్యం చేసే అనేకరకాలైన హాని లో ఒకటి ! 
3. ప్రయాణ పధకం : 
 ఎక్కడికి వెళ్ళాలో , ఆ చోటికి వెళ్ళడానికి , ముందే ఒక పధకం వేసుకుని , అంటే , ఎంత సమయం పడుతుంది , ప్రయాణానికి , ట్రాఫిక్ ఎక్కువ గా ఉంటే , ఎంత సమయం పడుతుంది ? ఆ సమయం లో  వాతావరణ ప్రభావాలు ఏమిటి ? అనే విషయాలు కూడా ముందే ఆలోచించుకుని ,
తదనుగుణం గా, వాహనం లో ముందుగానే బయలు దేరడం ,  మనలను , ఆ ప్రయాణానికి సిద్ధ పరిచి , శాంత పరుస్తుంది కూడా !
4. వాహనం లో సంగీతం :
  శాంత పరిచే ,మనసుకు నచ్చే ,  ఉత్తేజ పరిచే సంగీతాన్ని వినడం కూడా ఉపయోగకరం !
5. మీకు ప్రియమైన వారి ఫోటోలు కారులో మీకు కనిపించేట్టు ఉంచుకోవడం కూడా , వారి మీదా , వారితో గడిపే మీ జీవితం విలువ ను కూడా మీరు డ్రైవింగ్ చేస్తున్నంత సేపూ మీకు గుర్తుకు తెస్తాయి ! 
6. సెల్ ఫోన్ నిషిద్ధం :
డ్రైవింగ్ చేసే సమయం లో సెల్ ఫోన్ రిసీవ్ చేసుకోవడం గానీ ,  ఆ ఫోన్ లో మాట్లాడడం కానీ , చేయకూడదు ! కేవలం కొన్ని గంటల డ్రైవింగ్ సమయం లో , ఆ ఫోను చేసిన అవతలి వారు ఆగ గలరు !
మన  జీవితం కన్నా , ఆ ఫోన్ కాల్ ముఖ్యం కాదు కదా !?
7. అతి ముఖ్యమైన విషయం :
 డ్రైవింగ్ సమయం లో మీ అజాగ్రత్త , డ్రైవింగ్ నడిపే వారికీ , వారి కుటుంబానికే కాకుండా , ఆ సమయం లో  రోడ్డు మీద వాహనం నడుపుతున్న వారికి  కూడా అపాయకరం ! 
మిగతా విషయాలు , వచ్చే టపాలో !

ఫైటో న్యూట్రి ఎంట్ ల ( phytonutrients ) గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి ?3.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మార్చి 20, 2016 at 12:52 సా.

ఫైటో  న్యూట్రి ఎంట్ ల ( phytonutrients ) గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి ?3. 

లైకో పీన్  : 
ఈ జీవ రసాయనం , పండ్లకు  ఆకర్షణీయమైన రంగు ను ఇవ్వడమే కాకుండా , ప్రోస్టేట్ గ్రంధి
( పురుషులలోనే ఉంటుంది ) కి వచ్చే క్యాన్సర్ ను నివారిస్తుంది !
 ఈ లైకో పీన్ , రామ ములగ పండ్ల లోనూ ( టమాటా , లేక తక్కాళీ పండు అని కూడా అంటారు  ఒక్కో ప్రాంతం లో )  , కర్బూజా పండు లోనూ , గ్రేప్ ఫ్రూట్ లోనూ పుష్కలం గా లభిస్తుంది  !
ల్యూటిన్ :ఈ   జీవ రసాయనం కూడా ,  ఆకుకూరల లో పుష్కలం గా ఉండి , అనేక రకాలైన కంటి జబ్బులను నివారించడం లో సహాయ పడుతుంది !
ఎల్లాజిక్ ఆమ్లం :
అనేకరకాలైన బెర్రీస్ లోనూ , ఇంకా , దానిమ్మ పండు లోనూ పుష్కలం గా ఉంటుంది ! ( బెర్రీస్ అంటే స్ట్రా బెర్రీస్ , రాస్ప్ బెర్రీస్ , బ్లాక్ బెర్రీస్ మొదలైనవి ). అనేక రకాలైన క్యాన్సర్ లను నివారించడం లోనూ , వాటి తీవ్రత ను తగ్గించడం లోనూ , ఎల్లాజిక్  ఆమ్లం ఉపయోగ పడుతుందని తేలింది , కానీ మానవుల లో , ఈ  జీవ రసాయనం ఎట్లా పని చేస్తుందో వివరం గా తెలియ లేదు, ఇంకా !
ఫ్లావినాయిడ్స్: 
క్యా టె చిన్ లూ , హెస్పరిడిన్ లూ , ఫ్లావినాల్ లూ , వివిధ రకాలైన ఫ్లావినాయిడ్స్ ! ఈ జీవ రసాయనాలు , పండ్లలో , ముఖ్యం గా యాపిల్ పండ్ల లోనూ , బెర్రీస్ లోనూ , ఇంకా ఉల్లిపాయలలోనూ , కూడా లభిస్తాయి ! ఫ్లావినాయిడ్స్ , క్యాన్సర్ నివారణ లోనే కాకుండా , ఆస్త్మా ( ఉబ్బసం ) , గుండె జబ్బు ఉన్న వారికి కూడా అనేక రకాలు గా  ఉపయోగ పడతాయి !
( తేయాకు లేదా టీ  లో పుష్కలం గా లభిస్తుంది , క్యా టెచిన్ అనబడే ఫ్లావినాయిడ్ ! ) 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

అనుమానం, పెనుభూతం . 2. పారనోయియా !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 22, 2014 at 10:23 ఉద.

అనుమానం, పెనుభూతం . 2. పారనోయియా ! 

ఈ అనుమానం పెనుభూతం అయిన వాళ్ళ అనుభవాలు ఎట్లా ఉంటాయో వారి మాటల్లోనే చదవండి !
సాల్లీ  ( అమెరికా ) 
” నాకు చిన్న తనం నుంచీ చీకటంటే భయం ! ఆ భయం తోనే నేను పెరిగాను కూడా , కానీ ఇప్పుడు నాకు చీకటంటే ఎక్కువ భయం లేక పోయినా , నేను ఉంటున్న రూమ్ లో నాకు కనబడనివి ఏమున్నాయో అనే భావన కలుగుతూ ఉంటుంది !  నా రూమ్ లో ఎవరో ,నన్ను కిడ్నాప్ చేయడమో , రేప్ చేసి చంపేయ డానికి ప్రయత్నం చేస్తున్నారనే భయం నన్ను ఎప్పుడూ వెంటాడుతుంది ! నేను ఒంటరి గా ఇంట్లో ఉన్నా , ఎవరో ఒకరు , తలుపులు పగలగొట్టి , ఇంట్లో ప్రవేశించి , నాకు హాని తలపెడతారనిపిస్తూ ఉంటుంది !  నేను ఒక్కదానినే ఇంట్లో ఉంటే , ఇంట్లో అన్ని గదులూ , మారు మూలలూ , పదే ,పదే  వెదికి , ఎవరూ లేరని నిర్ధారించుకుంటాను !
నేను బాత్ రూమ్ లోకి వెళ్ళినా కూడా షవర్ కర్టెన్ ను తొలగించి , ఆ కర్టెన్ వెనక ఎవరూ లేరని నిశ్చయం చేసుకుంటాను ! నేను ఒంటరిగా , బయటకు వెళ్ళినా కూడా , ఎవరో ఒకరు నన్ను బలవంతాన ఎక్కడికో తీసుకు వెళ్లి మానభంగం చేస్తారని భయ పడుతూ ఉంటాను ! ”
వివియన్ ( అమెరికా )
” నేను బయట ఎక్కడ డ్రైవ్ చేస్తున్నా , నా వెనక కారులో ఉన్న వారు నన్ను వెంతాడుతున్నారనే భయం నాకు ఉంటుంది !  నేను ఏ పార్టీకి వెళ్ళినా , అక్కడ ఎవరో ఒకరు , నా డ్రింకు లో మత్తు మందు కలిపి ఇస్తారనే భయం ఎప్పుడూ కలుగుతుంది ! ”
సారా ( ఇంగ్లండ్ )
” నేను నా స్నేహితురాలితో వాదులాట  కు దిగి నా స్నేహం చెడ గొట్టుకున్నా ! ఇప్పుడు , ఆ స్నేహితురాలు నన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తుందని భయం గా ఉంది !  ఆమె మా ఇంటికి కూడా కొన్ని సార్లు వచ్చింది !  ఒక సారి నేను ఇంట్లో ఉన్న ఆహారాన్ని కూడా  చెత్త కుండీ లో పారవేశా , ఆ ఆహారం లో విషం కలిపారేమో అన్న భయం తో ” !
అహ్మద్ ( ఇండియా ) 
నేను బహిరంగ ప్రదేశాలలో వెళుతూ ఉన్నప్పుడు , మిగతా వాళ్ళంతా , నా మీసాలనూ , నా కళ్ళనూ , నా ముక్కునూ , తదేకం గా పరిశీలిస్తూ , నా మీద అభిప్రాయాలు ఏర్పరుచు కుంటున్నారని అనిపిస్తూ ఉంటుంది !  ఆ జనాలలోనుంచి , ఎవరో ఒకరు , ఏదో ఒకరోజు అకస్మాత్తుగా , నా మీద పడి , నా కళ్ళు పీకేయడమో , ఓ కత్తి తో నా ముక్కు కోసేయడమో చేస్తారనే భయం నన్ను పీడిస్తూ ఉంటుంది ! 
పైన ఉన్న అనుభవాలు చదువుతుంటే , మనకు ( బాగా విశ్లేషణ చేయగలిగే అనుభవం ఉన్న వారికి )  కలిగే అభిప్రాయం ఒకటే !  అది వారికి ఇతరుల మీద ఉన్న వక్ర అభిప్రాయం ! దానినే అట్రి బ్యూ షనల్ బయస్ అంటారు ! ( attribution bias ) అంటే , వారికి ఇతరుల మీద ఎప్పుడూ , వారు తమకు హాని కలిగిస్తారనే చెడు భావన మాత్రమే ఉంటుంది ! ఉదాహరణకు ,  ఒక బహిరంగ ప్రదేశం లో ఒక వంద మంది మనుషులు ఒక సమయం లో ఉన్నారనుకుంటే , అందులో కనీసం 90 మంది , వారి పని , వారు చేసుకు పోయే వారే ఉంటారు ! ఈ 90 మంది  ని విస్మరించి , కేవలం మిగతా పది మందీ , తమకు హాని కలిగిస్తారనే , విపరీతమైన భయం తో కాలం గడుపుతారు , ఈ పారనోయియా ఉన్న వారు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !