Our Health

Archive for the ‘Our minds’ Category

ఆమె మనసు, ఆమె ముఖం చూసి ఎట్లా తెలుసుకోవచ్చు ?.4.

In ప్ర.జ.లు., మానసికం, Our minds on అక్టోబర్ 24, 2012 at 10:51 సా.

ఆమె మనసు, ఆమె ముఖం చూసి ఎట్లా తెలుసుకోవచ్చు ?.4.

క్రితం టపాలో ఆమె మనసు, ఆమె చూపుల వాలకం చూసి,  ఆ ఎక్కు పెట్టిన చూపుల బాణాల వాడి చూసి , ఎట్లా తెలుసుకో వచ్చో , తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు ఆమె ముఖం చూసి , ఆమె మనసు ఎట్లా  తెలుసుకో గలమో చూద్దాము !  గుర్తు ఉంచుకోండి , మనం, ఎంత తెలుసుకున్నా ,  కేవలం ఆమె మనో సముద్ర తీరం లో గులక రాళ్ళు ఏరుకునే వాళ్ళమే ! ఆమె మనసు లోతు తెలుసుకో గలిగే డీప్ సీ  డైవర్స్ ము  కాము కదా ! 
3.ముఖం పరిశీలించండి : మీ మీద మనసు పడే యువతి ముఖం లో ఆమె మనో భావాలు ప్రస్పుటం గా కనిపిస్తాయి , ఆ ముఖాన్ని  పరిశీలించి , అర్ధం చేసుకునే వారికి ! ఎందుకంటే , ఆ ముఖం, మీ మీద మనసు పడ్డ నాటి నుంచీ , పున్నమి చంద్రుడి లా దిన దినాభి వృద్ధి చెందుతూ ఉంటుంది, కాంతి తో !  ప్రత్యేకించి ఒక స్థిరమైన చోట నుంచి ఆ వెలుగు రాక పోయినా  హాలు మొత్తం మీద  ఆ ముఖం కాంతులు వెద  జల్లుతుంది ! ఆ వెలుగు లో కూడా మీరు,  తడుము కుంటూ, ఆమె మనసు అర్ధం చేసుకోలేక పొతే,  అంతే  సంగతులు ! 
మీరు ప్రత్యేకించి ఆమె కను బొమ్మలూ , కనులూ , ఆమె పెదవులూ పరిశీలించండి ! 
ఆమె కను బొమ్మలు అంటే ఐ బ్రోస్  కనుక పైకి పోనిస్తే అంటే రైజ్ చేస్తే , ఆమె మీరు చెప్పే విషయం శ్రద్ధ తో  , వింటున్న దన్న మాట  !  ఆ ఎగరేసిన కను బొమ్మలతో జత గా ఆమె చిరు నవ్వును కూడా కలిపితే , మీరు చెప్పే విషయాలను ఆమె అంగీకరిస్తున్న దన్న మాట !  యువతులు తాము తమ కళ్ళను మీ కళ్ళతో కలిపి , తమ కను బొమ్మలను కూడా పైకి చేస్తే , వారు  ( మిమ్మల్ని )  ఇష్ట పడుతున్నట్టు అనుకోవాలి ! 
పెదవులు : ఆమె పెదవుల గురించి ఎంత చెప్పినా తక్కువే కదా !  ఇప్పటికే అనేక మంది కవులు ఆమె పెదవులను , దొండ పండు వంటి వి గానూ , తమలపాకుల లాగానూ వర్ణించారు. లేత ఎరుపు రంగులో ఉన్నా ,  ఆ పెదవులు ప్రతి పురుషుడి జీవితం లో ఇంద్ర ధనుస్సు లో ఉన్న రంగులన్నీ తెచ్చి, ఆ పురుషుడి చేత మన్మధ బాణాన్ని ఎక్కు పెట్టిస్తాయి !  వణుకుతున్న ఆమె పెదవులు, ప్రతి పురుషుడి  లోనూ  ఎక్కడ లేని వేడి పుట్టిస్తాయి ! పట్టు వంటి సుతి మెత్తని ఆమె పెదవులు  గుట్టుగా ప్రేమ పట్టును పురుషుడి పైన అతి గట్టిగా  బిగిస్తాయి. అందు వల్లనే, ప్రతి సినిమాలో ,హీరోయిన్  చేత పెదవులు  కొరికించు తాడు, తల కాయలో ‘ రస కాయ ‘ ఉన్న  ప్రతి దర్శకుడూ , నిర్మాతా కూడా ( లేక పొతే  కలెక్షన్  లేక వాళ్ళు  నాలిక కరుచు కోవలసి  ఉంటుంది కదా ! ) అంతటి మహాత్తరమైనవి ఆమె పెదవులు ! 
మీ పొందులో , లేదా మీ సమీపం లో , తడబడుతూ ఉన్న ఆమె పెదవులూ, లేదా  నాలుక కొద్దిగా బయటకు తెచ్చి , తడి ఆరకుండా నా అన్నట్టు చప్పరించ బడుతున్న ఆ పెదవులు, ఆమె మీ  అ టెన్షన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు !  మీ మీద ఆమె తన ఆసక్తి ని ఆ విధం గా తెలుపుతూ ఉండ వచ్చు !  తన పెదవుల తడి ఆరకుండా ఆమె చేసే ప్రయత్నాలూ ,  పడే తంటాలూ , మీరు ఆమె మీద చూపించే ఆసక్తిని ఎండి  పోకుండా  అప్రయత్నం గా చేసే ప్రయత్నం కూడా కావచ్చు !  ఇక శాస్త్రీయం గా చెప్పుకోవలసి వస్తే ,  ఆమె కామ పరం గా నైనా , లేదా ప్రేమ పరం గా నైనా ఉత్తేజం చెంది, అరౌజల్  లేదా ఉద్రేక పడుతున్నప్పుడు , ఆమె పెదవులూ , నోరూ కూడా వాటి తడి ఆరిపోయి , డ్రై  గా అవుతాయి !  తాను  వలచిన పురుషుడి అధర  సంగమం తో నే  ఆ తృష్ణ  తీర గలదు అన్న కోరిక ఉన్నట్టు గా  ! 
కను రెప్పలు :  ఆమె కను రెప్పలు, మీ పైన కనుక ఆసక్తి ఉంటే  , టపా టపా అని కొట్టుకుంటూ ఉంటాయి ( అంటే బ్లాగు లో టపా అనుకోకండి పొరపాటు పడి ! )  మరి మామూలు గా కను రెప్పలు టిపా టిపా  అని కొట్టు కుంటాయా  అని మీరు సందేహ పడ  వచ్చు.  ఎవరి కను రెప్పలూ , శబ్దం చేస్తూ కొట్టు కోవు కదా ! ఇట్లా రాయడం లో ఉద్దేశం ఏమిటంటే , సామాన్యం గా కొట్టుకునే వేగం కన్నా ఎక్కువ సార్లు కొట్టుకుంటాయి ఆమె కనురెప్పలు , ప్రత్యేకించి మీ మీద ఆసక్తి ఉంటే  ! 
కను పాపలు : అంటే ప్యూపిల్స్   అంటే మళ్ళీ విద్యార్ధులని అర్ధం చేసుకోకండి !  మన కంటి లో వెలుగును నియంత్రిస్తూ ఉండే భాగం, దీనినే ప్యూపిల్  అంటారు. వెలుగు ఎక్కువగా ఉన్నప్పుడు , ప్యుపిల్ వ్యాసం తక్కువ అయి  కంటి లో ఉన్న రెటీనా  అనే భాగాన్ని రక్షిస్తుంది. అట్లాగే వెలుగు తక్కువ గా ఉన్నప్పుడు, ఉత్తేజం పొందినప్పుడూ , అంటే ప్రత్యేకించి ప్రేమోత్తేజం కానీ, కామోత్తేజం కానీ పొందినప్పుడు   ఈ ప్యూపిల్  వ్యాసం ఎక్కువ అయి దృష్టి సరిగా ఉండడానికి సహాయ పడుతుంది, తక్కువ వెలుతురూ లో కూడా !  మీ మీద ఆసక్తి ఉన్న ఆమె కనుపాపలు  పెద్దవి గా అవుతాయి,  మీతో నీలి నీడలలో సరస సల్లాపాల కోసం  అలవాటు పడుతున్నట్టు గా ! 
నాసికా పుటాలు అంటే నాస్ట్రిల్స్  : మీ మీద ఆసక్తి ఉన్న యువతి నాసికా పుటాలు అంటే నాసికా రంధ్రాలు, అప్రయత్నం గానే పెద్దవి అవుతాయి.  తీవ్ర మైన ఉత్తేజం పొందితే , ఇట్లా జరుగుతుంది.
ఇట్లా పెద్దవైన నాసికా పుటాలతో  పెద్దవైన కనుపాపలు ,  తడి ఆరుతున్న , వణుకుతున్న పెదవులు,  ఈ లక్షణాలు మీరు ఆమెలో గమనించితే ,  మీరు తక్షణమే కర్తవ్యోన్ముఖులు కావాలి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని ఆమె దేహ బాషలు !  

ఆమె మనసు , దేహ భాష లో ఎట్లా తెలుసుకోవచ్చు ?3.

In ప్ర.జ.లు., మానసికం, Our minds on అక్టోబర్ 24, 2012 at 1:06 సా.

ఆమె మనసు , దేహ భాష లో ఎట్లా తెలుసుకోవచ్చు ?3.

ఆమె మనసు , సముద్రమంత  లోతైనది, విశ్వమంత  విశాలమైనది !  ఆమె మనసు తెలుసుకోవడం అంటే సాహసం చేయడమే ! మనం ఎంత తెలుసుకోవాలని ప్రయత్నించినా ,  ఆమె మనో సముద్ర  తీరాలలో గులక రాళ్ళు ఏరుకునే వాళ్ళమే !  కానీ మానసిక విశ్లేషకులు కొన్ని దేహ భాషా సూచనలతో ఆమె మనసు  కనుక్కోవచ్చు అని అంటున్నారు  ( సాహసం చేస్తున్నారు ! ).  మరి ఆ వివరాలు తెలుసుకుందాం !  
అతడి మనసు  ను అతడి దేహ భాషలో కేవలం పది పదిహేను  శరీర కదలికలతోనే అవగాహన చేసుకోవచ్చు కానీ ఆమె మనసు తెలుసుకోవాలంటే ఆమెలో , కనీసం ఒక యాభై శరీర కదలికలను మనం ఔపోసన పట్టాలి  అని మనో వైజ్ఞానికుల అభిప్రాయం ! 
మీరంటే ఆమెకు ఇష్టమని ఆమె దేహ భాషలోమరి  మీరు ఎట్లా కనుక్కోవచ్చు?: 
1.వాలు చూపులు : మీ మీద మనసు పడ్డ యువతి , మీరు , ఆమె ఉన్న ప్రదేశం లో ఎంత దూరం లో ఉన్నా ,  తన వాలు చూపులు వాడి గా చేసి మీ వైపు ఎక్కు పెట్టి చూస్తుంది ! 
ఆ చూపులు  విరి తూపులలా మీ మనసులో సుతి  మెత్తగా  గుచ్చుకోవలసిందే !  మీ లోని  ప్రణయ రక్తం బయటకు చిందాల్సిందే ! అంతే  కాక ఆమె మీరు తనను గమనిస్తున్నారో లేదో కూడా అవే వాడి చూపులతో మీకు తెలిసీ తెలియకుండా తను గమనిస్తూ ఉంటుంది !   ప్రత్యేకించి , ఆ చూపుల వాడి తో తన చిరు దరహాసాన్ని( అంటే ఓ స్మైల్  ) కూడా ‘ రంగరించి ‘  మీ వైపు వదిలిందంటే ,  మీ మనసు విరిగి రసామృత  భాండం  లో పడ్డట్టే ! 
2. మీ ‘  ప్రేమాయస్కాంతం వైపు ఆమె  రస రజను ‘ : అంటే మీరు ఉన్న స్థానం వైపు ఆమె కు తెలియకుండానే ! ఆమె ఆకర్షింప బడుతుంది. అంటే భౌతికం  గా ఆమె మీరు ఉన్న స్థానం దిశగా తిరగటమూ , లేదా జరగట మూ , లేదా కదలడమూ  చేస్తుంది.  టేబుల్ వద్ద కనుక కూర్చుంటే , ఆమె తన చేతులు ఆమె ముఖం క్రింద ఉంచి మీ వైపు ఆసక్తి కరం గా  చూస్తుంది. అదే టేబుల్ వద్ద ఆమె తన చేతులు కట్టుకుని కూర్చుంటే , మీ  మీద ఆమెకు ఆసక్తి లేదని తెలుసుకోవాలి !  ఆ సమయం లో ( మీకు ఆమె మీద ఇంకా  ఆసక్తి ఉంటే ! ) ఆమె గురించిన విషయాలూ , ఆమె జీవితం గురించీ ఉత్సాహం గా మాట్లాడి , ఆమెను కూడా మాట్లాడించ దానికి ప్రయత్నించండి !  అప్పుడు కూడా ఆమె మీ మీద , మీ మాటల మీదా ఏమాత్రం ఆసక్తి కనపరచక పొతే , ఎవరికీ వారే , యమునా తీరే ! 
వచ్చే టపాలో ఇంకొన్ని ఆమె మనసు దేహ బాసలు ! 

దేహ భాష ( బాడీ లాంగ్వేజ్ ).2.

In మానసికం, Our minds on అక్టోబర్ 23, 2012 at 6:55 సా.

దేహ భాష ( బాడీ లాంగ్వేజ్ ).2.

ముంజేతులు  పరిశీలించండి : 
సామాన్యం గా మీతో మాట్లాడే వాళ్ళు చేతులు కట్టుకుని మాట్లాడుతూ ఉంటే  వారు సామాజిక అంటే సోషల్ గా రిజర్వ్  గా ఉండడానికీ , ఎక్కువగా వారి గురించి చెప్పడానికి ఇష్ట పడకుండా ఉంటున్నట్టు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే  కాక వారు సోషల్ గా అంటే నలుగురితో ఉన్నప్పుడు  అన్  కంఫర్టబుల్  గా ఫీల్ అవుతున్నట్టు కూడా భావించ వచ్చు. కొందరు పురుషులూ , స్త్రీలూ కూడా వారి కాళ్ళను వారి భుజాల వైశాల్యం కన్నా ఎక్కువగా చాచి నుంచుంటే , వారు , వారి అధికారాన్ని , పవర్ నూ ఇతరులకు తెలియ చేస్తున్నారని గమనించాలి.
ఇంకొందరు ఇతరులతో ఉన్నప్పుడు వారి చేతులతో, వారి ముంజేతుల ను వారు తుడుచు కుంటూ ఉంటె ( తరచుగా ) వారు ఆ కలయిక తో సుముఖం గా లేరని గ్రహించాలి. ఆ సమయం లో వారు ‘ ఆ కలయిక ఎంత త్వరగా ముగుస్తుందో ‘ అనుకుంటూ ఉంటున్నట్టు ఆ ప్రవర్తన తెలియ చేస్తుంది.
కొందరు ఇతరులతో ఉంటున్నప్పుడు , లేదా ఇతరులు చెప్పేది వింటున్నప్పుడు , వారి ముంజేతులు వారి తల వెనుక భాగం మీద కానీ , లేదా వారి మెడ వెనుక భాగం మీద కానీ పెట్టుకుని ఉంటే , వారు ఇతరులు చెప్పేది  శ్రద్ధ తో వింటున్నట్టు అనుకోవచ్చు.అదే , వారు వారి చేతులను అంటే పిడికిలి బిచించి ఉంచితే , క్రోధం , విసుగు, తో నూ , లేదా అసహనం తోనూ మీరు చెప్పేది వింటున్నట్టు గ్రహించాలి.
నెర్వస్  గా ఉండడం ఎట్లా తెలుసుకోవచ్చు? :  కొందరు మీతో మాట్లాడు తూ ఉన్నప్పుడు వారి తల వెనుక భాగం లో ఉన్న జుట్టును వారి చేతులతో సవరిస్తూ ఉంటే  , మీరు చెప్పే విషయం వారి ఆలోచనలతో పొందిక లేనట్టు వారు అనుకుంటున్నట్టు గ్రహించాలి. మిమ్మల్ని ఇష్ట పడే సమయం లో కూడా ఇట్లా చేయ వచ్చు కొందరు. కొందరు కళ్ళజోడు పెట్టుకునే  అలవాటు ఉన్న వారు , అదే పనిగా వారి కళ్ళ జోడును సవరించుతూ ముక్కు మీదకు తోసుకుంటూ ఉంటె , వారు మీరు చెప్పేదాన్ని అంగీకరించట్లేదని గ్రహించాలి. కానీ యధాలాపం గా ఆ పని చేస్తూ ఉంటె , దానికి ప్రత్యెక మైన అర్ధాలు తీయడం అనవసరం.
కాళ్ళు : వడి  వడి గా పాద రక్షల శబ్దం టక టక మని చేసుకుంటూ నడిచి వచ్చే వారు , నెర్వస్ గా ఉన్నట్టూ, తొందరలో ఉన్నట్టూ , లేదా వారు ఏ  విషయానికో భయ పడుతూ ఉన్నట్టు అనుకోవచ్చు. అదే  సీటు మీద కూర్చుని కాళ్ళు టప టప  మని ట్యాప్  చేస్తూ ఉండే వారు , ఆ ప్రదేశం నుంచి వెళ్ళే తొందర లో అసహనం గా ఉంటున్నట్టు గ్రహించాలి. కానీ సీటు మీద కూర్చుని కాళ్ళు కట్టుకుని ఉన్న వారు సావధానం గా మీరు చెప్పేది వినడానికి ఓపికతో ఉన్నట్టు  అనుకోవచ్చు. మీరు మీ కాళ్ళు ట్యాప్ చేస్తూ ఎదురుగా కూర్చుని ఉన్న యువతీ కాళ్ళను కనుక తాకితే , వారికి  ఇష్టమైతే వారి కాళ్ళు ఆ ప్రదేశం లోనే ఉంటాయి !  వారు ఆ సమయం లో మీ ( కాళ్ళకు ) దూరం గా వారి కాళ్ళను జరుపుకుంటే , మిమ్మల్ని ( వారికి ) దూరం గా ఉండమని హెచ్చరిక చేస్తున్నట్టు  గ్రహించాలి.  కొందరు వారి కాళ్ళను  తమకు ఇష్టమైన వారి దిశగా పెడతారు. అంతే కాక  వారి కాళ్ళను ( వారికి ఇష్టమైన ) ఇతరుల కాళ్ళకు తరచూ తాకిస్తూ ఉంటారు. 
వచ్చే టపాలో మరి కొంత దేహ భాష ! 

దేహ భాష , ( బాడీ లాంగ్వేజ్ ) .1.

In మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 21, 2012 at 6:05 సా.

దేహ భాష   ( బాడీ లాంగ్వేజ్ ) .1.

బాడీ లాంగ్వేజ్ లేదా దేహ భాష  మానవులు తమ శరీర కదలికలతోనూ, కళ్ళ  కదలికలతోనూ , ముఖంలో చూపించే హావభావాలతోనూ తమ  మనసులో భావాలను , మాట్లాడకుండానే ఎదుటి వారికి ఎట్లా తెలియ చేస్తారో తెలిపే ‘ భాష ‘ .జేమ్స్  బోర్గ్ అనే శాస్త్రజ్ఞుడి అంచనా ప్రకారం, మానవుల పరస్పర సంబంధాలు తొంభై మూడు శాతం కేవలం వారి దేహ భాష తోనూ , కేవలం ఏడూ శాతం మాత్రమె వారి మాటల ద్వారానూ తెలియ చేసుకుంటారు .వివిధ పరిశోధనల ప్రకారం , అరవై నుంచి డెబ్బై శాతం మానవుల కమ్మ్యునికేషన్స్ ,  దేహ భాష ద్వారానూ ,  మిగతా ముప్పై నుంచి నలభై శాతం మాత్రమె  మానవుల మాటల ద్వారానూ తెలుసుకోవచ్చు ఆని తేలింది. మానవులలోని అనేక లక్షణాలు కేవలం వారి దేహ భాష ద్వారా తెలుసుకోవచ్చు. ఆనందం , క్రోధం, విచారం , దుఖం , ఆశ్చర్యం , ఇట్లా అనేక భావాలు భాష తో అవసరం లేకుండా కేవలం దేహభాష ద్వారా కనుక్కోవచ్చు. ఇట్లా మన దేహం కదలికలనూ , ముఖ కవలికలనూ అధ్యయనం చేసే శాస్త్రాన్ని కైనెసిక్స్  (  kinesics ) అని అంటారు. 
మనం ఇప్పుడు ఈ దేహ భాష లో కొన్ని అర్ధాలు పరిశీలిద్దాం ! 
1. ఇరువురి మధ్య దూరం : మీరు మీతో మాట్లాడుతున్న వారు మీకు ఎంత దగ్గర గా వస్తున్నారో గమనించండి.  సూత్రం:  మీ ఇరువురి మధ్య దూరం  పెరిగితే  వారు  కూడా  మీతో స్నేహానికి తొందర పడడం  లేదని గమనించాలి. ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , వారు మీకు దగ్గర గా వచ్చి మాట్లాడడం చేస్తూ ఉంటె , మీ పొందు కోసం లేదా స్నేహం కోసం  ‘ చేతులు చాస్తున్నారని ‘ అనుకోవచ్చు.  ఇంకో అడుగు మీరు నిజం గానే ముందుకు వేశి ఎదుటి వారి తో మాట్లాడడానికి , లేదా సమయం గడపదానికీ మీరు ప్రయత్నించారనుకోండి . ఆ సమయం లో ఎదుటి వారు కూడా అక్కడే ఉండి  కానీ, మీకు దగ్గర గా జరిగి కానీ మీతో మాట్లాడడం చేస్తూ ఉంటె  వారు మీకు దగ్గరగా  ఉండడానికీ , మీ స్నేహానికీ  సుముఖత గా ఉన్నట్టు భావించ వచ్చు.  ఈ రకం గా దగ్గర అవుతే పొందు కోరుతూ ఉన్నట్టు అనుకోవడం , వివిధ దేశాల లో ఉన్న ఆచార వ్యవహారాల మీద కూడా ఆధార పడి ఉంటుంది. 
2. తల గమనించండి : అంటే ఎదుటి వారి హెడ్  పొజిషన్ ఎట్లా ఉంటుందో గమనించండి: కొంత వంచిన తలతో మీతో ఎవరైనా మాట్లాడుతుంటే , వారు మీతోనూ , మీ విషయాలనూ సానుభూతి తో అర్ధం చేసుకోడానికే ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు. వారు వారి తలను వంచి మీవైపు చూస్తూ మీతో ఒక చిరు మంద హాసం చేస్తే , వారు మీతో కొంత చిలిపి గా కూడా ఉంటున్నట్టు అనుకోవచ్చు.  అట్లా కాకుండా తలను ముందుకు వంచితే , అది చాలా అర్ధాలకు తావిస్తుంది.  వినయం తో నూ , లేదా నేర భావనతోనూ , లేదా బిడియం తోనూ కూడా తలను ముందు కు వంచినట్టు అనుకోవచ్చు. ఈ పరిస్థితి కూడా వివిధ దేశాల ఆచార వ్యవహారాల మీద ఆధార పడి ఉంటుంది. మీరు ఏదైనా చెప్పినప్పుడు ఎదుటి వారు తల ముందుకు వంచితే , మీరు చెప్పినది వారికి అర్ధం కాక తికమక పడుతున్నట్టూ , లేదా ఆ విషయం మీద ఆలోచిస్తున్నట్టూ కూడా అనుకోవచ్చు. మీరు యువకుడైతే , మీ ఎదురుగా మీ దగ్గరగా ఉన్న అమ్మాయి ముందుకు తల వంచి కొద్దిగా చిరునవ్వు నవ్వితే , ఆమె కు  మీతో పొందు ఇష్టమైనట్టు అనుకోవచ్చు. ( కనీసం తాత్కాలికంగా అయినా ! )  ( పైన ఉన్న చిత్రం చూడండి )
3. కళ్ళు :  మన హావ భావాల ప్రకటన లో మన కళ్ళు చాలా ముఖ్యమైనవి.  అనేక రకాల భావనలు , మాటలతో పని లేకుండా , కేవలం మన కళ్ళతో నే ఎదుటి వారికి తెలియ చేయ వచ్చు. మీ ఎదురు గా ఉన్న వారు పక్క చూపులు చూస్తూ ఉంటె , వారు  నెర్వస్ గా ఉన్నారనీ , లేదా వారి దృష్టి వేరే వైపుకు మళ్ళింది అనీ , లేదా వారు మీతో అబద్ధాలు ఆడుతున్నారనీ కూడా అనుకోవచ్చు.  అట్లాగే నేల  వైపు చూస్తూ ఉంటె కూడా వారు బిడి యస్తులనీ , లేదా వారు ఎమోషనల్ గా అప్సెట్  అయ్యారనీ కూడా అనుకోవచ్చు.అందుకే అంటూ ఉంటాము ‘ వాడు ఏంటో  నేల  చూపులు చూస్తున్నాడు ‘ అని ( అంటే ‘ వాడి  ప్రవర్తన సందేహ కరం గా ఉందని అర్ధం వచ్చేట్టు అంటాము ) 
కళ్ళు చెప్పే భావనలు మన తెలుగు సినీ కవులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదంటే ఆశ్చర్య పడనవసరం లేదు కదా ! 
ఉదా:  ‘ నీ కళ్ళు చెపుతున్నాయీ నను ప్రేమించావనీ !  అని ఒక పాట .  కనులు కనులు కలిసెలే  , కన్నె మనసు తెలిసే లే , విసురులన్ని పై పై నే అసలు మనసు తెలిసే లే ! అనీ ఇట్లా అనేకమైన పాటలు ఉన్నాయి. మీకు సమయం ఉంటె , పాటలు వినండి , ఇంకా సరదా గా యు ట్యూబ్  లో ఆ పాటలు చూస్తూ కూడా వినండి. 
వచ్చే టపాలో  బాడీ లాంగ్వేజ్ గురించి ఇంకొంత !
ఈ లోగా మీ అభిప్రాయాలు కొంత తెలియ చేయండి.! 

దేహ భాష ( బాడీ లాంగ్వేజ్ ):

In ప్ర.జ.లు., మానసికం, Our minds on అక్టోబర్ 20, 2012 at 1:35 సా.

దేహ  భాష ( బాడీ లాంగ్వేజ్ ):

 

 
ప్రశ్న : బాడీ లాంగ్వేజ్ , అదే  అచ్చ తెలుగులో దేహ భాష  అంటే ఏమిటి ?
జవాబు: మన శరీరం మనకు తెలియకుండా మన గురించి ఎదుటి వారికి  తెలియ చేస్తూ ఉంటుంది. మన నడక, మన చేతి కదలికలూ , మన ముఖం మీద కనపడే మన హావ భావాలూ , ఇవన్నీ  కూడా మన గురించి ఎదుటి వారికి తెలియచేస్తాయి.ఇక్కడ గమనించ వలసినది , మనం ఒక్క మాట కూడా మాట్లాడకుండా నే, మన గురించి తెలియ చేస్తూ ఉంటామన్న మాట. దీనినే దేహ భాష లేదా బాడీ లాంగ్వేజ్  అంటారు. ఈ బాడీ లాంగ్వేజ్ నిత్య జీవితం లో  మనకు ఎంతో  ముఖ్యం.విద్యార్ధ్లులకు లిఖిత పరీక్షల తరువాత , మౌఖిక పరీక్ష సమయం లో , ఆ తరువాత ఉద్యోగాల వేట లో ఉండే ( అనేక ? !!! ) ఇన్తర్వ్యూ  లలోనూ , బాడీ లాంగ్వేజ్ ప్రాముఖ్యత  ఎంతో  ఉంది. ( లంచాలు ఇచ్చి తెచ్చుకునే ఉద్యోగాల ఇంటర్వ్యూ  లలో ఎక్కువగా ప్రయాస పడనవసరం లేదు , అంటే  అసలు ‘బాడీ ‘ ఇంటర్వ్యూ  లో లేక పోయినా ఉద్యోగాలు వస్తాయి కదా ! )
అట్లాగే  ఒక యువకుడు , యువతి తో పరిచయం   అవుతున్నప్పుడూ ,  అట్లాగే  యువతి , యువకుడి తో  స్నేహం కోరుతున్నప్పుడూ ,  టీచర్లు , లెక్చరర్లు  పాఠాలు చెపుతున్నప్పుడూ కూడా , ఈ బాడీ లాంగ్వేజ్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది.ఇక నటులు , నటీ మణులు కావాలనుకునే వారికి ఈ బాడీ లాంగ్వేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు , ఎందుకంటే , వారు బాడీ లాంగ్వేజ్ నేర్చుకోకుండా  నటనకు పనికి రారు కదా అప్పుడు వారితో సినిమా తీస్తే  వారే  పెట్టుబడి పెట్టి తీసినది గా మనం సులభం గా అర్ధం చేసుకోవచ్చు కదా ! 
మనం  సామాన్యం గా అంటూ ఉంటాము , ‘ వాడు ఏంటో కొండ ముచ్చు లా కూర్చున్నాడు ‘ ! అని. అంటే కోతులు, కొండముచ్చులూ కొండల మీద ఈ కదలికా లేకుండా కూర్చుంటూ ఉంటాయి. అంటే మన హావ భావాలూ , శరీర కదలికలూ మనకు జీవం పోస్తాయి, కేవలం చెట్లూ చేమలూ లాగా కాకుండా !  బాడీ లాంగ్వేజ్ లేకపోతే మనం కూడా ( ?!!! ) 
ప్రేమ భావనలూ , కామ భావనలూ , స్నేహ భావనలూ కూడా నోటి భాష  అవసరం లేకుండానే , మనం తెలుసుకోవచ్చు కదా కేవలం బాడీ లాంగ్వేజ్ , అదే దేహ భాష ను తెలుసుకుంటే ! 
మరి ఈ బాడీ లాంగ్వేజ్ గురించి వచ్చే టపా నుంచి వివరం గా తెలుసుకుందాము ! 
 

ఎట్లా నవ్వాలి ?.7. నవ్వడం ముఖ్యం !

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 13, 2012 at 7:21 సా.

ఎట్లా నవ్వాలి ?.7. నవ్వడం ముఖ్యం ! 

క్రితం టపాలో మనము ఎట్లా నవ్వాలో కొంత వరకు తెలుసుకున్నాము కదా!   మరి నవ్వడానికి విషయాలు ఏముంటాయి ? అని అనుకుంటే , మనకు ‘  మెదడుకు మేత ‘  లాగా, నవ్వుకు కూడా ‘ తినగలిగినంత ‘ అంటే నవ్వ గలిగినంత మేత  పుష్కలం గా లభిస్తుంది మనకు ! 
ఎందుకంటే , మనం ఆంద్ర దేశం లో పుట్టాము !  తెలుగు వారం మనమందరం !  ఎందరు నాయకులు మనలను  సమస్యల వలయాలలో ముంచే సినా  , మనం మాత్రం నవ్వుల  నావలలో తేలి పోగలము !  కష్టాల కడలిలో  నవ్వుతూ ఈదుకుంటూ , దరి చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము నిరంతరం ! రాష్ట్రాన్ని , దేశాన్ని , చివరకు మనుషులను కూడా చీల్చే , మహా మోసగాళ్ళు వివిధ రూపాలలో మనలను ప్రలోభ పెడుతున్నా , వారు జోకర్లు అనుకుంటూ కూడా ,  నవ్వుతూ , వారి ప్రలోభాలకు పొంగి పోతూ ఉంటాము ! నవ్వుతూ ఓట్లు వేస్తాము ! ( ఈ మాట, వోట్లు వేసే వారికే వర్తిస్తుంది ! ) ఇతర రాష్ట్రాల వారు ఆనకట్టలు కట్టి , మనకు అంద  వలసిన నీరు అందక  పోయినా  మనకూ, ముఖ్యం గా మన ‘ నాయకులకూ ‘ ఏమాత్రం పట్టదు  !   అఖండ భారత దేశం లో అపారం గా ఉన్న ఖనిజ సంపదను  అప్పనం గా దోచుకుంటూ ఉన్న వారికి మనం నవ్వుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ,చట్ట సభలకు కూడా వారిని గెలిపిస్తాము,  నవ్వుతూ !  అడవుల ను నాశనం చేసి వాతావరణాన్ని చిన్నా భిన్నం చేసే పరిణామాలను కూడా మనం పట్టించుకోము ! ఎందుకంటే మనం, మన ఇంటి చుట్టూ గ్రీన్ బెల్టు లు పెంచమని మహా మేదావులైన మన నాయకులు ( జోకు )  సలహా ఇచ్చారు కదా అందువల్ల మనం విపరీతం గా ఆనంద పడి పోతాము, మన వంతు , వాతావరణం కోసం చేస్తున్నందుకు ! కుహానా నాయకులు, ఏనుగంత సమస్యలను చీమంత చేసీ , చీమంత సమస్యలను ఏనుగంత చేసి మాయ చేస్తున్నా , మనకు నవ్వు మాత్రమె వస్తుంది !  ఏ  రక్షణ ఏర్పాట్లూ లేని  అపార్ట్ మెంటు  లో మనకు ఒక ఫ్లాటు దొరికిందని సంతోష పడి , మన పాట్లు మనం పడే , అల్ప సంతోషు లం మనం !  ట్రాఫిక్ నిరంతరం  నత్త నడక లా సాగినా , నవ్వుతూ మన కార్య క్రమాలను చేసుకుంటూ ఉంటాము రోజూ !  మతం మానవులకు మత్తు మందు అని అన్నాడు మార్క్స్ . అదే విధం గా  సినిమా మనకు ఆనందాన్ని కలిగించే మత్తు మందు. ‘ ఆ మందు ‘ ను ‘ ఆస్వాదించు తూ , అన్ని బాధలనూ మరిచిపోయి , ‘ హాయి ‘ గా మనలను నవ్వించ  డానికీ , నవ్వుకొడానికీ , మనకు అనేక మంది హాస్య నటులు  ఉన్నారు.  ఇప్పుడు తెలిసింది కదా ! మనకు నవ్వుకోడానికి ఎంత ‘మేత ‘  లభిస్తుందో !  అందు వల్లనే మనం, కనీసం మనుగడ సాగించ గలుగుతున్నాము ! సుఖాల మాట దేవుడెరుగు ! ఎందుకంటే , ఆమాత్రం  ‘ హాస్య పోషణ ‘ మనలను  ‘ఆమాత్రం ‘ ఆరోగ్యం గా ఉంచుతుంది !  మిగతా వారెవరైనా , ఇప్పటికీ  నవ్వని వారు కనుక ఉంటే , ఇక ఆలస్యం చేయ నవసరం లేదు !  ‘ ఈ నవ్వుల బండి ని ఎక్కండి !  ‘ నవ్వుకుంటే ‘ బలుసాకు తినవచ్చు !  ‘ సుఖం గా ‘ ! అసలు సుఖాల మాట ఎట్లా ఉన్నా !  ఎవడు మనలను, ఎడా పెడా  దోచి పారేస్తున్నా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

మరి నవ్వడం ఎట్లా ? 6.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 12, 2012 at 8:03 సా.

మరి నవ్వడం ఎట్లా ? 6.

3.  హా హా హా అనండి,  బూ హూ హో అని కాదు : 
మనం నవ్వే సమయం లో సాధారణం గా హా హా హా అని నవ్వుతాము. కొందరు ‘ నవ్వు సాంగులు ‘ ఉంటారు . వారు వెకిలి నవ్వులు నవ్వుతారు. ఉదా:  హా హా హా కు బదులు బో హూ హో అనో లేదా  సివంగి అరిచి నట్టో,  పిల్లి  క్రోధం తో వికృతం గా అరిచినట్టో  నవ్వుతారు. ఇంకొందరు నవ్వితే ఏవో వింత వింత ధ్వనులు – మనం అంతకు క్రితం ఎప్పుడూ వినని ధ్వనులు విన్పిస్తూ ఉంటాయి. మరి కొందరు నవ్వుతూ ఉంటే,  వారు నవ్వుతున్నారో , ఏడుస్తున్నారో తెలియదు. మనసులో ఏడుస్తున్నా కనీసం పైకి నవ్వే సమయం లో కూడా వారి ఏడుపు నవ్వు కనిపిస్తుంది , వినిపిస్తుంది కూడా ! అందువల్లనే మనం నవ్వుతూ ఉన్నప్పుడు సహజం గా హ్హ హ్హ ,హ్హ  అని  నవ్వుకుంటే నిజం గా సహజమైన నవ్వు లా ఉంటుంది ,  ఇంకో విధం గా నవ్వే నవ్వు , అసహజం గానూ , ఏవగింపు కలిగించేది గానూ ఉంటుంది. 
4. మీ పొట్టలో నవ్వును ఫీల్ అవ్వండి : అంటే మీరు నవ్వే నవ్వు , మీ పొట్టలో నుంచి పుట్టాలి ! మీరు  మీ పొట్ట లోనుంచి కాక పై పైకి హ హ హ అన్నారనుకోండి. అది నవ్వులా లేకుండా , పేలవం గా జీవం లేకుండా ఉంటుంది. అది నవ్వు అని పించుకోదు కూడా ! మనస్పూర్తి గా నవ్వే నవ్వు ,మీ ఉదర కండరాలను కూడా బాగా సంకోచింప చేస్తుంది. అంటే మీ అబ్డామినల్ మసుల్స్ ను సంకోచ వ్యాకోచ పరుస్తుంది. అది మీ ఆరోగ్యానికి ఎంతో  ఉపయోగ కరం కూడానూ !  అందుకే మనం అంటూ ఉంటాము, సామాన్యం గా బాగా నవ్వితే ‘ పొట్ట చెక్కలయ్యే లాగా నవ్వాము  ‘ అని.ఇట్లా నవ్వుకునే నవ్వు కొన్ని తరంగాల లాగా వస్తుంది కూడా ! 
5. మీ నవ్వును కుదించండి : అంటే మనం నవ్వే నవ్వు సహజం గా మొదట ఎక్కువ శబ్దం చేస్తూ  కొంత సమయం కాగానే ఆ శబ్దం తగ్గి మనం నవ్వడం క్రమం గా ఆపేస్తాము.  కానీ కొందరు నవ్వు మొదలెట్టారంటే ఆపకుండా , విపరీతమైన శబ్దం చేస్తూ  చుట్టూ ఉన్న వారు నివ్వెర పోయేట్టు చేస్తారు. ఇంకొందరు తడిసి పోయిన  దీపావళి చిచ్చు బుడ్లలా  ‘ పుసుక్కు ‘ మని నవ్వుతూ ఉంటారు. మరి కొందరు పెద్దగా నవ్వడం మొదలు పెట్టి , సడన్  గా ఆపేస్తారు. ఇట్లా ఆకస్మికం గా నవ్వు ఆపే వారినీ , లేదా  ఒక మాదిరి శబ్దం చేస్తూ మొదలు పెట్టిన నవ్వును  క్రమేణా ఎక్కువ చేస్తూ నవ్వే వారిని అనుమానించ వలసినదే !  ప్రతి వ్యక్తికీ  ఒక ప్రత్యెక మైన నవ్వు ఉంటుంది.  నవ్వడం సహజమైన ఆనంద మైన భావన ను సంతోషం గా వ్యక్తం చేయడం. మీరు నవ్వుతూ ఉన్నారంటే , మీరు మీ చుట్టూ ఉన్న వారికే మీరు ఆనందం గా ఉన్నారని కూడా తెలియ చేస్తూ ఉన్నారన్న మాటే కదా ! అందు వల్ల  మీరు ఈ మాత్రం బిడి య  పడకుండా , సందేహించ కుండా సహజం గా నవ్వండి  ఆనందం తో , ఆ నవ్వు మీ ఆరోగ్యాన్ని కూడా ఆనంద పరుస్తుంది ! 
మీకు తెలిసిన వారు నవ్విన నవ్వు మీకు బాగా నవ్వు తెప్పిస్తే , తెలియ చేయండి , నవ్వుతూ ! 
వచ్చే టపాలో ఇంకొన్నినవ్వు  సంగతులు తెలుసుకుందాం ! 

నవ్వు నాలుగు విధాల గ్రేటు . 5. మరి నవ్వడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 11, 2012 at 9:31 సా.

నవ్వు  నాలుగు విధాల గ్రేటు . 5. మరి నవ్వడం ఎట్లా ? 

 
ప్రశ్న: నవ్వు మనకు ఎంత లాభమో తెలుసుకున్నాము కదా మరి  నవ్వడం ఎట్లా ?
జవాబు: ఇది ఒక తిక్క ప్రశ్న గా అనిపించ వచ్చు చాలా మంది కి. కానీ చాలా మందికి జీవితం లో,  లేదా నిత్య జీవితం లో మనసారా నవ్వడం ఎట్లాగో తెలియదు. మనం ఇప్పుడు కారణాలు వెదక కుండా అసలు నవ్వడం ఎట్లాగో నేర్చుకుందాం.
1.  ఫన్నీ  సంగతి ఏదైనా  మననం చేసుకోండి ! : నవ్వు మొదలు పెట్టడానికి  ఒక అతి సులువైన మార్గం , మీ జీవితాలలో మీకు ఎదురైన ఏ  హాస్య సంఘటన అయినా మననం చేసుకోండి.  అది మీకు ఎదురైన మనుషులు తెప్పించిన నవ్వే కావచ్చు,లేదా వారు ప్రవర్తించిన తీరే కావచ్చు, లేదా వారు మాట్లాడిన మాటలే కావచ్చు.  ఉదా:  భాషలో యాస:  మన తెలుగు భాష లో వివిధ ప్రాంతాలలో ఉండే ప్రజలకు  ఒక్కో ప్రత్యేకమైన యాస లేదా యాక్సెంట్  ఉంటుంది.  ఆ యాస మిగతా ప్రాంతం లో ఉండే ప్రజలకు చాలా వింతగా నవ్వు పుట్టించే ట ట్టు ఉంటుంది.  దీనిని మనం ఆ ప్రాంత ప్రజలను హేళన చేస్తున్నట్టు అనుకోకూడదు.  ప్రపంచం లోని ప్రతి భాషా కాలాన్ని బట్టి  పరిణామం చెందుతూ ఉంటుంది.  అంటే ఒక ఆదర్శ మైన  భాష అంటూ ఉండదు. కానీ మనం  ఆ యాసలను  సరదా గా నవ్వు పుట్టించే ట ట్టు  ఊహించు కోవచ్చు. ఇక్కడ గమనించ వలసినది మనం భాష  తీరు తెన్నులు తెలుసుకోవడానికి కాదు, కేవలం నవ్వుకో డానికే !  ఇక  మీ ఇష్టమైన సినిమాలో మీ అభిమాన హాస్య నటులు  మిమ్మల్ని బాగా  నవ్వించిన సంఘటన లు గుర్తు చేసుకొండి !  ఇది కూడా అతి తేలిక అయిన  పధ్ధతి మనసారా నవ్వుకోడానికి !  నలుగురి తో నవ్వడం కూడా ఒక సులభమైన మార్గం ! 
2. ఒక చిరునవ్వు  ఒలికించండి  !:    మీ అమూల్యమైన ఒక చిరు నవ్వు ను ఒలికించండి.  మీ చిరునవ్వు మిమ్మల్ని ఎంతో  అందం గా మారుస్తుంది. అంతే  కాక మీకు ఉల్లాసాన్ని కలగ చేస్తుంది.  ఇంకా మీలో మీరు బాగా ఫీల్ అవుతున్న భావనను కలిగిస్తుంది మీ చిరునవ్వు.  చిరు నవ్వులు తరువాత పెద్ద నవ్వు లకు  దారి తీస్తాయి. అంటే  మీరు మీ చిరునవ్వు తో మీ అసలు నవ్వును ఆహ్వానిస్తూ ఉన్నారన్న మాట !  ”  ఒక సారి ఆనందం గా మనసారా నవ్విన నవ్వు మీ ముఖం లోని పదిహేను  కండరాలను  సంకోచింప చేస్తుంది  ” అని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు  . అంటే   మీ ముఖ కండరాలలో రక్త ప్రసరణ ఎంతో  బాగా జరుగుతుంది మీరు నవ్వుతున్న సమయం లో !  అంతే  కాక , మీరు మీ చిరునవ్వు తో ఎన్ని ముఖం లోని కండరాలను సంకోచింప చేస్తారో అన్ని కండరాలూ మీరు విపరీతం గా నవ్వు తూ ఉన్నప్పుడు కూడా అదే విధం గా సంకోచ వ్యాకోచాలు చెందుతాయి.  ఇక్కడ  మనం గమనించ వలసినది ఏమిటంటే  మన చిరునవ్వులు, మన నవ్వులు , మనలను ఆనందింప చేయడమే కాకుండా , మన రక్త ప్రసరణను కూడా అధికం చేస్తాయి.  మునుపటి టపాలలో తెలుసుకున్నాము కదా , రక్త ప్రసరణ అధికం చేయడం అంటే , మన శరీరం లో ఉన్న వివిధ కణాలకు ప్రాణ వాయువు అధికం గా అందచేయడమే !  
తెలుసుకున్నాము కదా ఇప్పుడు మన చిరునవ్వులు , నవ్వులూ , మన శరీరానికి ప్రాణ వాయువును అధికం చేయడమే కాకుండా , మన జీవితాలకు ‘ ప్రాణం పోస్తాయి కూడా ! నవ్వు లేని , నవ్వ లేని మన జీవితాలను ఊహించుకో గలమా ??? !!!
అందుకే అన్నాడు ఒక కవి ” నవ్వుతూ బతకాలి రా తమ్ముడూ , నవ్వుతూ చావాలి రా , చచ్చినాక నవ్వలేవు రా , ఎందరేడ్చినా తిరిగి రావు రా ” అని ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు  నవ్వు తూ తెలుసుకుందాము ! 

నవ్వితే లాభాలు.4. ‘ నవ్వు అత్యుత్తమ ఔషధం ! ‘

In మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 7, 2012 at 10:22 ఉద.

నవ్వితే లాభాలు.4. ‘ నవ్వు అత్యుత్తమ ఔషధం ! ‘

శతాబ్దాల తరబడి వివిధ దేశాలలో నవ్వు ఒక అత్యుత్తమ ఔషధం గా పరిగణింప బడుతుంది.మన శరీరం లో ని వివిధ హాని కర హార్మోనులను తగ్గించి ‘ హాయి కర ‘ హార్మోనులను ఎక్కువ చేస్తుంది నవ్వు. అదేంటో కానీ  కొందరు మానవులు నవ్వు మొహం పెట్టడానికి ఉత్సాహ పడి అనేక ‘ఆనంద కర ‘ హావ  భావాలను ప్రదర్శించడానికి తంటాలు పడుతూ ఉంటారు కానీ మనస్పూర్తిగా ఆ హావ భావాలను మనస్పూర్తి గా వచ్చే నవ్వుతో కలగాలపడానికి అంతగా ఉత్సాహం చూపరు.  ఆ పరిస్థితి అప్పుడు ఏదో వాసన లేని పూవు ను చూసినట్టు గా ఉంటుంది. నవ్వు శరీరానికి కూడా ఎంతో ఆరోగ్య కరమైనది. రోజులో ఒక వంద సార్లు నవ్వితే జరిగే శరీర వ్యాయామం , పది నిమిషాల రోవింగ్ తోనూ , పదిహేను నిమిషాల బైక్ మీద చేసే ఎక్సర్సైజ్ తోనూ సమానం అని నిరూపించ బడింది.మనసారా నవ్వుకునే నవ్వు , మనలను నిరాశా నిస్పృహల నుంచి  మైళ్ళ దూరం తీసుకు వెళ్లి , మనలో, మన జీవితాలలో  ఆశావాద దృక్పధాన్ని కలిగిస్తుంది.
ఉదా: రవి తండ్రి  గుమాస్తా. తల్లి  కుటుంబ పోషణ చేస్తుంది. రవి కాలేజీలో చాలా  పాపులర్.  అమ్మాయిలతో సరే సరి. చదువులో మాత్రం సరాసరి.  బాగా చదువుతూ మంచి మార్కులు తెచ్చుకుని , అమ్మాయిలను ఇంప్రెస్ చేద్దామని తహతహ లాడే మిగతా అబ్బాయిలకు రవి అంటే ఎంతో అసూయ.  వారికి ఎంత ఆలోచించినా  రవి లో ఉన్న ప్రత్యేకతలు అంతు పట్టవు.  రవి కి కూడా  ఆ ప్రత్యేకతలు తెలియవు. ఎందుకంటే రవి , సహజం గా ఉంటాడు. సహజమైన నవ్వుతో.  కాలేజీ లో లెక్చరర్స్ ను అనుకరిస్తాడు , అమ్మాయిల దగ్గర.  లేడీ లెక్చరర్లను కూడా వదలడు. ఆడ గొంతు తో వారిని అనుకరించి చెపుతూ ఉంటే , చుట్టూ ఉన్న వారు నవ్వు ఆపుకోవడం చాలా కష్టం !  ఎప్పుడూ  పరీక్షలూ , అస్సెస్ మెంట్  లతో సతమత మయే మిగతా స్టూడెంట్స్ అందరికీ రవి దగ్గర  ఉంటే  వత్తిడులన్నీ తగ్గి పోయి , ఏదో సేద తెర్చుకున్నట్టు గా , ఉల్లాసం గా ఉంటుంది. రవి  తన మటుకు తను ఆనందం గా ఉంటాడు , తన తోటి వాళ్ళను ఆనందం గా ఉంచుతాడు. అందుకు తగినట్టుగా , రవి ది ఆశావాద మనస్తత్వం.  తనకు విపరీతం గా మార్కులు రాక పోయినా , జీవితం లో రాణించ గలననే ఆత్మ విశ్వాసమూ , ధీమా ఉంది.  రవికి తెలుసు , ప్రపంచం లోని ప్రముఖులందరూ , ఎక్కువ గా చదువుకున్న వారు కాదని. అయినా వారు రాణించారని. 
నవ్వుతూ , ఆశావాద దృక్పధం తో జీవితాలు గడిపే వారు , ఉసూరు మంటూ , ఈ లోకం లోకి ఎందుకు వచ్చామురా , అన్నీ సమస్యలే,  అనుకుంటూ  బిక్కు బిక్కు మంటూ జీవించే వారికన్నా ఎక్కువ కాలం ఆనందం గా జీవించుతారు అని అనేక పరిశోధనల వల్ల స్పష్టమైంది.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు నవ్వుతూ తెలుసుకుందాము ! 

నవ్వితే లాభాలు. 3. కారణం లేకుండా నవ్వండి !

In మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 6, 2012 at 4:52 సా.

నవ్వితే లాభాలు. 3. కారణం లేకుండా నవ్వండి ! 

మనసారా మనం బాగా నవ్వితే , ఆ నవ్వు మన హృదయాలనూ , మెదడు నూ , ఆత్మనూ తాకి వాటిని ఉత్తేజ పరుస్తుంది. మన కందరికీ తెలుసు కదా , మనం ఒక మంచి హాస్య సంఘటననో , లేదా భాగా నవ్వు పుట్టించే జోకునో ఇతరులతో పంచుకుని ,మనం కూడా నవ్వితే అది ఏంటో ఆనంద కర మైన అనుభూతి అని ! ఆ అనుభూతి మనం ఒక విషాద సంఘటనను ఇతరులతో పంచుకున్నప్పుడు ఎట్లా అనుభూతి చెందుతామో అట్లాగే ఉంటుంది. అందుకే ఈ ఎమోషన్స్ , అంటే హావ భావాలు, వాటికి చాలా సారూప్యం ఉండడం వల్లనే , మనం బాగా ఆనందం తో నవ్వినా , లేదా విషాదం తో ఏడ్చినా  కూడా మన కళ్ళ నుంచి ఆశ్రువులు రాలుతాయి కదా ! 
అదే కారణం చేత నే మనం సామాన్యం గా నవ్వడం కూడా మరచి పోతూ ఉంటాము. ఎందుకంటే విషాదం లాగానే ఇతరులతో అంత తేలిక గా పంచుకోడడానికి సహజం గా సుముఖం గా ఉండము. మనకు చాలా సన్నిహితం గా ఉండే స్నేహితులతో కానీ, బంధువులతో కానీ మాత్రమె మనం పంచుకోగలం ఆ ఎమోషన్స్ ను !  అదే కారణం చేత నే మనం ఎంతో ఆరోగ్య కరమైన నవ్వును దాచుకుని  యాంత్రికం గా జీవితాలు గడపడానికి అలవాటు పడుతున్నాము. ఈ పరిస్థితిని మార్చి మనలను లాఫుతూ ఉండమని చెపుతూ అనేకమంది లాఫింగ్ గురూ లు పుట్టుకొచ్చారు. వీరిలో ప్రముఖులు డాక్టర్  మదన్ కటారియా. ఈ యన గారు , మనం మనస్పూర్తి గా నవ్వుకోడానికి ఎప్పుడూ మన అంతరంగిక మిత్రుల కోసమో , బంధువుల కోసమో వేచి చూస్తూ , మన నవ్వులను  దాచుకో నవసరం లేదని చెపుతూ , పబ్లిక్ లాఫింగ్ డేస్ ఏర్పాటు చేసి , అందరూ ( ఏ సంబంధం లేని వారు కూడా , కేవలం నవ్వు అనే బంధాన్ని ఏర్పరుచుకుని ) హాయి గా తనివి తీరా నవ్వు కోండని  ప్రవచించు తున్నారు ,  ఈ పధ్ధతి బాగుంది కదూ నవ్వుకోడానికి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని లాఫింగ్  సంగతులు !