Our Health

Archive for the ‘Our minds’ Category

” బాగు” సందర్శకులందరికీ దీపావళి శుభాకాంక్షలు !

In మానసికం, Our Health, Our minds on నవంబర్ 12, 2012 at 10:05 సా.

” బాగు ” సందర్శకులందరికీ దీపావళి శుభాకాంక్షలు !

Wish you a happy Diwali ! 

నిజమైన ప్రేమ.3.

In ప్ర.జ.లు., మానసికం, Our minds on నవంబర్ 11, 2012 at 9:21 సా.

నిజమైన ప్రేమ.3.

ఎటాచ్ మెంట్ : నిజమైన ప్రేమ ఆప్యాయత తో నిరంతరం వర్ధిల్లుతూ ఉంటుంది. ఒక మాత్రు మూర్తి శిశువు తన గర్భం లో ప్రవేశించిన సమయం నుంచీ , తాను తుది శ్వాస తీసుకునే వరకూ , తన సంతానం మీద ఒకే రకమైన అవ్యాజమైన అనురాగం , ఆప్యాయత చూపిస్తూ ఉంటుంది. ఆ ఆపేక్ష లేదా ఎటాచ్ మెంట్ ఆ రకం గా వర్ధిల్లుతూ ఉంటుంది.
అదే రకం గా నిజమైన ప్రేమికుల ప్రేమ కూడా ఆప్యాయత , ఆపేక్ష తోలి చూపు నుంచి చిగురించి , దిన దిన ప్రవర్ధ మానమవుతుంది ! ఆ ఎటాచ్ మెంట్ అట్లా ప్రేమికులిరువురి లోనూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక విధం గా చెప్పుకోవాలంటే దీర్ఘ కాలిక ప్రేమే ఎటాచ్ మెంట్ ! ప్రేమ పెరుగుతూ ఉంటే , దానితో పాటుగా ఎటాచ్ మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది !

కమిట్ మెంట్ : ప్రేమ పురోగమిస్తూ ఉన్న కొద్దీ ప్రేమికులు ఇరువురూ పరస్పరం కమిట్ మెంటు తో ( ప్రేమ ) జీవితం సాగిస్తూ ఉంటారు. ప్రేమ సాగర మధనం చేస్తూ ఉంటారు! ఎవరైనా ప్రియుడి ప్రవర్తన కామెంట్ చేసి ” అతడు ఎప్పుడూ చాలా సైలెంట్ గా ఉంటాడు. ఎక్కువగా మాట్లాడడు ” అని ఎవరైనా అంటే మీరు వెంటనే ” ఔను. అతను చాలా గంభీరం గా , ధైర్యం గా, ధీమా గా ఉంటారు ” అని అతని లోని పాజిటివ్ లక్షణాలను  తెలియ చేస్తారు, మీ ఇరువురి మధ్య ప్రేమ ఘాటు గా ఉంటే ! అంటే కమిట్ మెంటు తో ఉంటే ! అదే కమిట్ మెంటు కనుక లోపిస్తే ” అతను నాతోటీ అంతే ! ఒక పట్టాన మాట్లాడడం అతి కష్టం ! మనసులో ఏమి ఆలోచిస్తూ ఉంటాడో ఏమిటో !? అని అతని నెగెటివ్ లక్షణాలను అంటే లోపాలను వల్లె వేస్తూ ఉంటారు !
ఇంటిమసీ : నిజమైన ప్రేమ అంటే సన్నిహితం కూడా ! మనసులు కలిసినప్పుడు , పరస్పరం ఇరువురూ ఎప్పుడూ సన్నిహితం కోరుకుంటూ ఉంటారు! క్రమేణా , అతని లోని ప్రతి అణువూ ఆమెకు పిండి కొట్టినట్టు , ఆమెలోని ప్రతి అణువూ అతనికి కూడా అట్లాగే సంపూర్ణం గా అవగాహన అవుతుంది. గౌరీ శంకరులలాగా లో ఒకరు మమైకం అవుతారు. సన్నిహితం , స్నేహం గా మారి ఒకరి ఊపిరి లో ఇంకొకరి ఊపిరి గా ప్రేమ ప్రాణ వాయువు అవుతుంది !
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు !

నిజమైన ప్రేమ ఏంటి ?.2.

In మానసికం, Our Health, Our minds on నవంబర్ 9, 2012 at 9:11 సా.

 నిజమైన ప్రేమ ఏంటి ?.2.

మరి అసలైన ప్రేమ ఎట్లా ఉంటుంది?:

నిజమైన ప్రేమ అంటే కేరింగ్ ( caring ) : గ్రీకులు ప్రేమను పలు విధాలు గా నిర్వచించారు. ఆపేక్ష , వాత్సల్యం, ఆప్యాయతా , అనురక్తి – ఇట్లా అనేక రకాలు గా ప్రేమ లక్షణాలను నిర్వచించారు. ఏ లక్షణాలతో నిర్వచించి నా , ప్రేమలో అతి ముఖ్యం గా కనిపించే ప్రధాన లక్షణం ,ప్రేమించిన వారు ప్రేమించ బడుతున్న వారిని ఎంతో కేరింగ్ గా చూసుకుంటారు. ఈ కేరింగ్ అనే ఆంగ్ల పదాన్ని సరిగ్గా తెనిగీకరించాలంటే ‘ అనురాగం ‘ అనే పదం వాడ వచ్చు నెమో ! ఈ అనురాగం నిరంతరం ఉంటుంది ప్రేమిస్తున్న వారిలో. ప్రేమించ బడుతున్న వారి మీద.
ఈ ప్రేమికులు , ప్రేమ పాత్రులు ఏ విధమైన శారీరిక లేక మానసిక బాధ కు లోనైనా తట్టుకోలేరు ‘ ప్రియా నీ వేలికి  గాయమయింది, నేను కట్టు కడతాను, ఆ వేలు నీ కుడి చేతి వేలు కూడా అయింది కదా ! నీవు ఆందోళన పడకు , ఆ గాయం మానే వరకూ నేను నీకు భోజనం స్పూన్ తో నీకు తినిపిస్తాను. సరేనా ” అంటారు. ” నీ ఒళ్ళు చూడు ఎంతగా మసిలి పోతుందో , తీవ్రం గా జ్వరం వచ్చినట్టు ఉంది, షాల్ కప్పుతాను నీ మీద , వెళ్లి పారాసేటమాల్ త్యాబ్లేట్స్ తెస్తాను వేసుకుని ఏ పనీ చేయకుండా రెస్ట్ తీసుకో బెడ్ లో అని చేతి లో చేయి వేసి తన పెదవులు ఆమె బుగ్గల మీద ఆనించి ధైర్యం చెప్పి స్వాంతన చేకూరుస్తారు ! చిన్న బాబో , పాపో పుడితే , అతి జాగ్రత్తగా వారిని తమ ఒడి లో కి తీసుకుని ముద్దాడతారు , వారి ఒడి లో ఒక అతి అందమైన ఆకర్షక పత్రాలున్న పుష్పం ఉన్నట్టు అనుభూతి చెందుతూ , ఆ ” పుష్పాన్ని ” ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ” అలాగే ప్రేమించే వారు , తమ తల్లి తండ్రులు కానీ , బంధువులు కానీ, వృద్ధులు గా ఉంటే వారిని అతి జాగ్రత్తగా నడిపించడమూ , లేదా వారికి కావలసిన పనులు శ్రద్ధ తో చేయడమూ కూడా చేస్తుంటారు. ఈ చర్యలు అన్నింటి లోనూ కేరింగ్ , లేదా అనురాగం ప్రేమించే వారిలో కలగలిసి ఉంటుంది. ఈ అనురాగం , రాగ ద్వేషాలకు అతీతం గా ఉంటుంది. సమయానుకూలం గా మారక ప్రేమించే వ్యక్తి జీవితాంతం ఉంటుంది. అది ప్రేమ లక్షణం !
నిజమైన ప్రేమ లో ఆకర్షణ ఉంటుంది ( attraction ) :
ఆకర్షణ ! ఎంతో అత్భుతమైన పదం ! సృష్టి లో ఆకర్షణ లేని జీవం , జీవితం లేదంటే అతిశయోక్తి కాదు ! ఉప్పొంగి లేచే కెరటాలు తీరం తాకడానికి ఉబలాట పడతాయి. అంటే కెరటాలు తీరం చేత ఆకర్షించ బడతాయి.
తుమ్మెద ఆకర్షణీయ మైన పుష్పం లోని మకరందం చేత ఆకర్షింప బడుతుంది. చిగురించే ప్రతి మొక్కా , ప్రతి ఆకూ , తమలో ఉత్తేజం కలిగించే , స్ఫూర్తి కలిగించే సూర్యుడి కాంతి వైపు ఆకర్షించ బడతాయి.
అంత సహజం గానే మనసు ప్రేమ మయం అయినప్పుడు , ఆకర్షణ ఆ ప్రేమలో నిక్షిప్తమై ఉంటుంది ఆమెలో ప్రతి ఆణువూ ఆకర్ష ణీయం అవుతుంది అతనికి ! ఆమె కాంతికి అతని ముఖం వికసిస్తుంది. అతని కాంతికి ఆమె హృదయం పులకరిస్తుంది. ఆమె వలపు తోట లో తీపి తలపుల పూలు విర బూస్తాయి ! నిజమైన ప్రేమలో ఉన్న ప్రేయసీ ప్రియుల మధ్య కోటి అయస్కాంతాల ఆకర్షణ పుడుతుంది. నిజమైన ప్రేమ లో వికర్షణ కు తావు ఉండదు, ఉంటే నిజమైన ప్రేమ అనిపించుకోదు !

వచ్చే టపాలో ఇంకొన్ని నిజమైన ప్రేమ లక్షణాలు తెలుసుకుందాం !

ప్రేమంటే ఏమిటి?.1.

In మానసికం, Our Health, Our minds on నవంబర్ 6, 2012 at 11:14 ఉద.

ప్రేమంటే ఏమిటి?.1.

 
నిజమైన ప్రేమంటే ఏమిటో తెలుసుకునే ముందు మనం ఏది ప్రేమ అనిపించుకోదో చూద్దాము.
1. మ్యానిప్యులేషన్ : ” ప్రియా , నీవు నన్ను నిజం గా ప్రేమిస్తే , నాతో వెంటనే వచ్చేయి , మీ అమ్మకూ నాన్నకూ ఇప్పుడే ఏమీ తెలియ నవసరం లేదు మన గురించి ! మనం ఎవ్వరికీ కనపడని దూర తీరాలకు వెళదాం , ఆనందం గా ఎంజాయ్ చేద్దాం లైఫ్ ను.”
ఈ ధోరణిలో ఉంటుంది , ప్రేమ పేరుతొ ఇతరులను మ్యానిపులేట్ చేసే వాళ్ళ ప్రవర్తన.
2. కామ వాంఛ : ( లస్ట్ ): నా జీవితం అంతా నీ ఒడి లోనే గడపాలని ఉంది , నీ వెచ్చటి కౌగిటిలో నా ఆనందం నీతో పంచుకోవాలని ఉంది. నీతో పగలు కూడా శృంగార రాత్రులు గా మార్చి ఆనందం అనుభవించాలని ఉంది ” ఇట్లా ప్రవర్తించే వారు ప్రేమ కు దూరమై ‘ కామ దాసు లవుతారు ” . వీరి ప్రవర్తన కేవలం తనను ‘ వలచిన ‘ యువతి తో ప్రేమను పంచు కోవడం కాక నిరంతరం కామ వాంఛ లతో సతమతం చేసి అవాస్తవిక జీవితాలు గడుపుదామని ప్రయత్నాలు చేస్తుంటారు. అంతే కాక వారు గాఢమైన ప్రేమ లో ఉన్న నమ్మకం తో ఉంటారు. ఇక్కడ కేవలం శారీరిక తృప్తి మాత్రమె ముఖ్యమైన జీవితావసరం లా అనిపిస్తుంది.
3.నియంత్రణ ( కంట్రోలు ) : ఇంకో రకానికి చెందిన వారు తమ ప్రియులను , లేదా ఎక్కువగా తమ ప్రియు రాళ్ళను ఇరవై నాలుగు గంటలూ తమ సంపూర్ణమైన కంట్రోలు లో ఉంచు కుందామనే కృత నిశ్చయం తో ఉంటారు. ఆఫీసు నుంచి కానీ కాలేజీ నుంచి కానీ ఎక్కడికీ వెళ్ళకుండా నేరుగా ఇంటికే రావాలనీ , స్నేహితులకు ఎవరికీ ఫోను చేయడం కానీ , లేదా ఏవిధమైన సంబంధాలు పెట్టుకోవడం కానీ చేయకూడదనీ , తాము చెప్పిన బట్టలే వేసుకోవాలనీ, ఇట్లా విపరీతమైన ఆంక్షలు పెట్టి , తమను ‘ ప్రేమించిన ‘ వారి వ్యక్తిత్వాన్ని కించ పరుస్తూ , వారు ఆత్మ న్యూనతా భావం తో నూ , తమ కంటూ ఉన్న ఒక వ్యక్తిత్వాన్న్ని కోల్పోయే పరిస్థితులు కల్పిస్తారు. మిగతా సమయాలలో ‘ వారిని ఎంతో ప్రేమిస్తున్నారనే ‘ మాయ మాటలు చెపుతూ ! ఈ పరిస్థితులలో ఉన్న వారు తమ సహజ వ్యక్తిత్వాన్ని కోల్పోయి , తమ ప్రియుడు , లేదా ప్రియురాలు చెప్పినట్టు ( తమకు ఇష్టం లేక పోయిన పనులు ) చేస్తూ తమ జీవితాలతో రాజీ పడుతుంటారు. ఈ విధం గా విపరీతమైన నిరంకుశ మైన నియంత్రణ ప్రేమ అనిపించుకోదు.
4. హింస : ఈ హింస మానసికం గానూ , శారీరికం గానూ ఉండవచ్చు. సామాన్యం గా తమ ప్రియురాలిని కానీ భార్య ను కానీ , లేదా స్నేహితురాలిని కానీ తీవ్రమైన , పరుషమైన పద జాలం తో మానసికం గా హింసించ దమూ , లేదా శారీరికం గా హింసించడం కూడా జరుగుతుంటాయి.ఈ శారీరిక హింస కేవలం కొట్టడమూ , తీవ్రం గా ఊపడమూ , జుట్టు గట్టిగా లాగడమూ మాత్రమె కాకుండా , తమ ప్రియురాలికీ , భార్యకూ ఎంత మాత్రం ఇష్టం లేని సమయాలలో వారిని కామ పరం గా బలవంతం గా అనుభవించడం , రతి క్రియలో పాల్గొనడం కూడా.

ఈ సంఘటనలలో ప్రేమ అనే మాట పరాజయం పొంది ఆ హింసను అనుభవిస్తున్న స్త్రీ నిఘంటువు నుంచి సంపూర్ణం గా చెరిపి వేయ బడుతుంది ! ఇది సహజమే కదా !

( Domestic violence in India is endemic and widespread predominantly against women.[1] Around 70% of women in India are victims to domestic violence according to Renuka Chowdhury junior minister for women and child development. National Crime Records Bureau reveal that a crime against a women is committed every three minutes, a women is raped every 29 minutes, a dowry death occurs every 77 minutes and one case of cruelty committed by either the husband or relative of the victim.[2] )

పైన ఉదాహరించిన కారణాలన్నీ నిజమైన ప్రేమ ను ప్రతి బింబించక పోవడమే కాకుండా , నిజమైన ప్రేమను అవహేళన చేస్తాయి.

మరి నిజమైన ప్రేమ ఏంటో వచ్చే టపాలో తెలుసుకుందాం !

ప్రేమంటే ఏమిటి?

In మానసికం, Our minds on నవంబర్ 4, 2012 at 5:45 సా.

ప్రేమంటే ఏమిటి?

ప్రేమ : మానవ జీవితం లో అతి విలువైన పదం. జీవితం లో వివిధ దశలలో వివిధ రకాలు గా ఈ ప్రేమ మానవులకు పరిచితం.
మానవుడి ప్రత్యెక అనుభూతులు , ఎమోషన్స్ లో అతి ముఖ్యమైనది ప్రేమ. దీనికి చదువు తో సంబంధం లేదు , ధనం తో సంబంధం లేదు. రంగు రూపాలతో పని లేదు.
కుల మతాలతో పని లేదు. దేశ జాతులతో ప్రమేయం లేదు. ప్రాణం ఉన్న ప్రతి మానవుడి జీవితం లో అనివార్యమై ఉంటుంది ప్రేమ. మానవ జీవితం లో ఇంత లోతు గా పెన వేసుకు పోయిన ఈ ప్రేమ అంటే ఏమిటి ? దేనిని మనం ప్రేమ అంటాము ? ఏది ప్రేమ కాదు ? ఇష్టమైన ప్రతి వారినీ ‘ ఐ లవ్ యు  ‘అంటే వారిని ప్రేమిస్తున్నట్టేనా ? అది ప్రేమ అవుతుందా ? ఈ ప్రేమ కు ఏమైనా ప్రత్యెక లక్షణాలు ఉంటాయా ?  కేవలం ఇవ్వడమేనా ? పుచ్చుకోవడం ఏమీ ఉండదా ? అట్లాగే , కేవలం  పుచ్చుకొవడమే నా  ఇచ్చే అవసరం ఏమీ  ఉండదా ? అసలు  ఈ  ప్రేమ వ్యవహారం చాలా సులభమే నా?  లేదా జటిలమా ? 
అమూల్యమైన ఈ ప్రేమ అనే ఎమోషన్ ఉచితం అయినప్పటికీ , మానవులు   మరి ఎందుకు ఆ పని చేయలేక పోతున్నారు  ? ఆధునిక ప్రపంచం లో ప్రేమను తిరిగి పొందలేక పోతున్నా రా 

ఈ విషయాల గురించి వచ్చే టపా నుంచి తెలుసుకోవడం మొదలెడదాం !

మీ అనుభవం లో మీకు ప్రేమ మీద ఉన్న అభిప్రాయాలు తెలపండి !

మిమ్మల్ని ఇష్ట పడితే , అతడి బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది ?.9.

In మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 31, 2012 at 6:30 సా.

మిమ్మల్ని ఇష్ట పడితే , అతడి బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది ?.9. 

క్రితం టపాలో మీ మీద అతని చూపులు ఎట్లా ఉంటాయో తెలుసుకున్నారు కదా ! 
అతడి వాలకం  పరిశీలించండి : 
మీ  ప్రశంస  పొందాలనుకునే లేదా మీ అంగీకారం పొందాలనుకునే మగ వాడు  మీ ముందు , చాలా దర్పం , ఠీవీ ప్రదర్శిస్తాడు. తన కాళ్ళు రెండూ వెడల్పు గా చేసి నుంచుంటాడు. అంతే  కాకుండా , తన చాతీనీ , భుజాలనూ మీ వైపు తిప్పి ఉంచుతాడు , మీరు ఎదురు గా ఉన్నంత సేపూ  !  తన చేతులు తన బెల్ట్ లోనో లేదా రెండు సైడ్ పాకెట్స్ లోనో  ఉంచుతాడు. మీతో మాట్లాడే సమయం లో తన రెండు చేతులూ  తన హిప్స్ మీద ఉంచి కూడా మాట్లాడతాడు. అంటే , తాను  శక్తి వంతుడినని  మీకు తెలియ చేయటం అన్న మాట. 
ఇంకా అతడి చేతులు శ్రద్ధ గా గమనించండి : 
మీరు అతడున్న రూమ్ నుంచి వెళుతూ ఉంటే , అప్రయత్నం గా  తన చేతులతో తన హెయిర్  స్టయిల్ సవరించుకుంటాడు , మీకు తాను  ఆకర్షణీయం  గా కనిపించడానికీ , మీ మెప్పు పొందడానికీ కూడా ! 
అంతే  కాక తను తన చేతులు తరచూ , తన గడ్డం మీదా , తన పెదవుల మీదా , బుగ్గల మీదా ఉంచి వాటిని రుద్దుతూ ఉండడం గమనించండి. ఇట్లా ఎందుకు జరుగుతుందంటే , మీ మీద ఆకర్షణ ఏర్పడినప్పుడు , అతని ముఖ బాగాలు అత్యంత సెన్సిటివ్ అవుతాయి. అతను  తరచూ తన పెదవులను తడి చేసుకోవడం కూడా జరగ వచ్చు. ఇట్లా అతను  అష్ట కష్టాలు పడడం,  తన ఇష్ట సఖి తో జీవితం గడపడం  కోసమే ! 
కొన్ని సమయాలలో తన పొట్ట మీద  చేతి తో రుద్దడమూ , తన  పాంటూ  , షర్టూ కూడా చాలా సార్లు ముడతలు పోయే వరకు సవరించు కోవడమూ  కూడా చేస్తాడు . ఆ ప్రయత్నాలన్నీ మీ అటె న్షన్ కోసమే ! 
మీతో పరిచయం ఎక్కువ అవుతున్న కొద్దీ ,తను మిమ్మల్ని తాకడానికి ఉబలాట పడుతూ ఉంటాడు. ఈ తాకడం పని కట్టుకుని కాక , యాదాలాపం గా తాకినట్టు కనిపించడానికి ప్రయతిస్తాడు.  ముఖ్యం గా మీ మెడ వెనుక భాగమూ , మీ చెవుల వెనుక భాగమూ , మీ నడుమూ, వీపూ  , మీ తొడల పైభాగం  కూడా అతని లిస్టులో ముందుగా ఉంటాయి. కొన్ని సమయాలలో కేవలం మీ  అందమైన కను బొమ్మలు సవరించుతాడు , సున్నితం గా స్ట్రోక్  చేస్తాడు. 
మీ వైపు అతని చేతిని కూడా అంటే అరచేతిని ఆకాశం వైపు మళ్ళించి మీకు చూపించడం కూడా గమనించ వచ్చు. ఇట్లా చేయడం లో ఉద్దేశం, కేవలం మీ చేయి పట్టుకుని నడవడానికి ఆసక్తి మాత్రమె కాక , తన జీవన యాత్ర కూడా మీతో కలిసి చేయాలనే తలంపుతో ! 
అందుకే ఒక  సినిమా కవి రాశాడు చక్కటి  పాట  ” చేయీ చేయీ తగిలిందీ , హాయి హాయి గా ఉందీ , పగలు రేయి గా మారిందీ , పరువం ఉరకలు వేసింది ! అని !   వీలుంటే వినండి , ఇంకా వీలుంటే యూ  ట్యూబ్  లో చూడండి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

మరి మీరు కావాలనుకునే అతడి దేహ భాష ఏమిటి ? .8.

In మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 29, 2012 at 12:46 సా.

మరి మీరు కావాలనుకునే  అతడి దేహ భాష ఏమిటి ? .8.

 
5.వాడి చూపులు : మీ మీద మనసు పడే  వాడి చూపులు చాలా వాడి గా ఉంటాయి.  ఆ చూపులు మొదటి దశలో , తరచూ మీరు తనను గమనిస్తున్నారో లేదో అని తెలుసుకోడానికి .కానీ మీరు అతడి ని చూసినప్పుడు మాత్రం , తన చూపులు తిప్పుకుని ,  మిమ్మల్ని పట్టించుకున్నట్టు గా కనపడడు .  అంటే మొదటి దశలో ఆ వాడి చూపులు మీతో దొంగాట ఆడతాయి. కానీ మీతో పరిచయం ఎక్కువ అవుతున్న కొద్దీ , అతడి చూపులు , తీక్షణం గా ఉండడమే కాకుండా , తదేకం గా కూడా ఉంటాయి. అంటే అదే పని గా మిమ్మల్ని వీక్షించడం జరుగుతుంది. కొన్ని సమయాలు ఆ చూపులు మీ ముఖాన్నే పరీక్షించుతూ ఉంటాయి. ముఖ్యం గా మీ కళ్ళు , పెదవులు , బుగ్గలు,  మీ నడుము ………….. , అతడి మెమరీ కెమెరా లో మీ ఫోటోలు వివిధ భంగిమలలో అనేక వందల గిగా బైట్లను ఆక్రమించుకుంటూ ఉంటాయి. అన్ని ఫొటో లూ  సప్త వర్ణాలలో ఉంటాయి ! మీ చిలిపి నవ్వులు , లేక మీరు ఎదో పని లో ఉండి , మీ తల మీద జుట్టు సవరించుకున్నప్పుడో , లేదా మీరు మీ మెడ ను సున్నితం గా మీ అందమైన వేళ్ళతో తాకు తున్నప్పుడో , లేదా మీరు తత్తర పడుతూ అతని ముందర మీ స్థన  సౌందర్యం అతనికి  కనపడకూడని , సిగ్గుతో మీ బట్టలను సవరించుకుంటున్న సమయం లోనో, లేదా ముందుకు వంగినప్పుడో – ఇట్లా అనేక పోజులు చక చకా అతని మనో ఆల్బం  లో చేరి పోతూ ఉంటాయి.  మీరు  అతని సమీపం లో ఉన్నప్పుడు , అతని మీద ఆసక్తి తో , ఉద్వేగం చెంది,  ప్రేమ వాంఛ , క్రమం గా కామ వాంఛ  గా పరిణామం చెందుతుంది ! ఆ క్షణాలలో మీరు మధుర భావనల నావ లో సాగి పోతూ ఉంటారు.  మీరు అనుభవించే ఆ ఉద్వేగం , మీ మనసులోనే ఉండక , మీ హృదయ వేగాన్ని ఎక్కువ చేస్తుంది , దానితో మీ గుండె కొట్టుకోవడం మీకు తెలుస్తుంది. ( శాస్త్రీయం గా ఆ పరిస్థితిని    పాల్పి టే షన్స్  అని అంటారు ) మీరు, ఎగసి పడుతున్న మీ హృదయం, మీ అందాలను కూడా ఎక్కడ బయట పెడుతుందో అని అప్రయత్నం గానే తల వంచి మీ చాతీ వైపు చూసుకుంటూ, అతడు గమనిస్తున్నాడో లేదో అని రెప్ప పాటు లో మీ చూపులు మీ సౌందర్యాన్ని కాక అతడి చూపులను వెతుకుతుంటాయి. అవే క్షణాలలో ఆ మధుర దృశ్యాలు అనేక వందలు, తన కళ్ళతోనే ఫ్లాష్ కెమెరా లా తీసి తన మనో మెమరీ లో నిక్షిప్తం చేశాడని మీకు తెలియదు . ఎందుకంటే అతడు, మిమ్మల్ని గమనించనట్టు  అమాయకత్వం నటిస్తాడు.  
మీతో పరిచయం, కొంత దూరం ప్రయాణం చేసి , ప్రణయం గా పరిణామం చెందినప్పుడు , అతడి చూపులు మన్మధ బాణాలు  గా మారి మీ హృదయాన్ని తాకుతుంటాయి. అప్పుడే మీకు కలిగే బాధను అనేక మంది కవులు ‘ తీయని బాధ ‘ గా వర్ణిస్తారు. ఆ దశలో , పరిచయమూ  ,  చనువూ ఎక్కువ అయినా కూడా , చిత్రం గా మాటలు తక్కువ అవుతూ ఉంటాయి. 
కానీ అతడి తీక్షణమైన చూపులు , మీ మతి పోగొడతాయి. ఎందుకంటే , అతడి చూపులు కేవలం మీ అందాలను చూడడమే కాకుండా , శయన మందిరం లో  మీ అందాలను ఏ  విధం గా ఆస్వాదించాలో  అని కూడా , అతడు , తన యాక్షన్ ప్లాన్  ను , మీ అందాలతో సింక్రొనైజ్ చేస్తూ ఉంటాడు. అతడి మైండ్ ఒక మల్టీ కోర్ ప్రాసెసర్ లా అత్యంత వేగం గా ప్రాసెస్ చేస్తూ ఉంటుంది,  మీ గురించిన మానసిక , భౌతిక  ఇన్ఫర్మేషన్  అంతా  ! ఆ సంగతి మీకు కూడా స్పష్టం గా తెలుస్తూ ఉంటుంది ! అందుకే మీలో తీయని బాధ !  ఆ మధుర క్షణాల కోసం మీరు వేచి ఉండాల్సి వచ్చినప్పుడు ఆ బాధ ఇంకా తీయని బాధ అవుతుంది ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

మరి మీ మీద మనసు పడే అతడి బాడీ లాంగ్వేజ్ ఏమిటి?.7.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 28, 2012 at 6:54 సా.

మరి మీ మీద మనసు పడే అతడి బాడీ లాంగ్వేజ్  ఏమిటి?7. 

 

క్రితం టపా వరకూ , ఆమె మనో భావాలు , మాటలతో కాక తన బాడీ లాంగ్వేజ్ తో ఎట్లా తెలియ చేస్తుందో కొంత వరకు తెలుసుకున్నాం కదా  ! మరి అతడు తన మనసైన మగువ దగ్గర  ప్రవర్తన , మాట లేకుండా, అతడి బాడీ లాంగ్వేజ్ తో ఎట్లా కనుక్కోవచ్చు? 
జవాబు: కొంత వరకూ పురుషుడి బాడీ లాంగ్వేజ్ కూడా , తను మనసు  వారి దగ్గర ,   ఒకే లా ఉంటుంది. 
1. తలను  వంచడం: తాను  మనసు పడే  తరుణీ వైపు అతని తల సూర్య కాంతికి వంగే సూర్య కాంతి పుష్పం లా వంగుతుంది, అప్రయత్నం గానే ! మరి ఎందుకు వంగదు , తన జీవితం లో ఎంతో  కాంతి నింపే  కాంత  మీద మనసు పడి నప్పుడు ! 
2.ఎగరేసే అతడి  కనుబొమ్మలు ! : నిను వలచిన వాడి కనుబొమ్మలు కూడా  మీ మీద ఆసక్తి తో ఎగురుతూ ఉంటాయి తరచూ , మీరు ప్రక్కనే ఉన్నప్పుడు , లేదా ఎదురు గా ఉన్నప్పుడు ! 
3.నాసికా పుటాలు అంటే నాస్త్రిల్స్ : మీరు తనకు ఇష్టమైతే, ఆ పురుషుడి నాసికా పుటాల వ్యాసం పెరుగుతుంది. అంటే నాసికా రంధ్రాలు పెద్దవవుతాయి. మీరు దగ్గర ఉన్నప్పుడు , ఉద్వేగానికి లోనయినప్పుడు , జరిగే చర్య అది !  మీరు వెదజల్లే ప్రేమ సుగందానికి ముగ్దుడై కూడా   ఆ విధం గా జరగ వచ్చు ! 
4.చిలిపి నవ్వు : మీ మీద మనసు పడిన మగ వాడు , మీతో పరిచయం ఎక్కువ అవుతున కొద్దీ , చిలిపి నవ్వు లు కూడా ఎక్కువ చేస్తాడు !  మీ పొందు , మీతో పొందు , అతనికి చాలా సంతోషం గా ఉండడమే కాకుండా , అతనితో చిలిపి నవ్వులు చిందించి ,  మీలో ప్రేమ మొగ్గలు తొడిగిస్తుంది  !
ఈ నవ్వు అనేక రకాలు గా ఉండవచ్చు. కొన్ని సమయాలలో అతడు  పూర్తి  గా ఉండక తన  నోటిలో ఒక వైపు నుంచి కానీ లేక అన్ని వైపుల నుంచి కానీ వస్తుంది. కొన్ని సమయాలలో అతడు నోరు అంటే పెదవులు తెరవ కుండానే చిలిపి గా నవ్వుతాడు ! కానీ అన్ని ప్రయత్నాలూ , మీ మనసు తలుపులు మీరు తనకోసమై తెరవాలనే ఒకే ఒక్క తలపు తో ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! .

మీ కలయిక లో ఆమె బాడీ లాంగ్వేజ్ ?. 6.

In మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 27, 2012 at 8:36 సా.

మీ కలయిక  లో ఆమె బాడీ లాంగ్వేజ్  ?. 6.

 
ఆమె తో కలయిక, అదే డేటింగ్  జరిగినప్పుడు , ఆమె మీరంటే ఆసక్తి ,  ఇష్టం కనబరుస్తున్నప్పుడు ( ఆ విషయం మాట్లాడకుండా )  ,  ఒక పట్టాన ఆమె బాడీ లాంగ్వేజ్  అర్ధం చేసుకోవడం కష్టం. కానీ  మానసిక విశ్లేషకులు , కొన్ని కిటుకులు వివరిస్తున్నారు.
1. ఆమె స్పర్శ :  సామాన్యం గా ప్రతి వ్యక్తికీ ఒక వ్యక్తిగత స్పేస్ ఉంటుంది. అంటే తన చుట్టూ  ఆవరించి ఉన్న స్పేస్  అంటే స్థలం.  అది వ్యక్తిగతమైనది. అంటే మిగతా వ్యక్తులు అత్యంత పరిచయం ఉన్న వారైతేనే ఆ స్పేస్ ను అతిగ్రమించి చేరువ అవగలరు.ఈ వ్యక్తిగత స్పేస్ లేదా స్థలం , ప్రత్యేకించి ఏ  గీతలూ గీయక పోయినప్పటికీ , రమారమి ఒక  అడుగున్నర అంటే పద్దెనిమిది – ఇరవై అంగుళాలు ఉంటుంది.  మిమ్మల్ని ఇష్టపడే ఆమె , ఆ  వ్యక్తి  గత స్థలాన్ని అతిక్రమించి మీ మనో భావాన్ని పరీక్షిస్తుంది.అంటే  మీకు చాలా దగ్గరగా రావడం కానీ , లేదా యాదాలాపం గా మిమ్మల్ల్ని  స్ప్రుస్శించడం  కానీ చేస్తుంది ఆమె. అప్పుడు మీ రెస్పాన్స్ రొమాంటిక్ గా లేక  పేలవం గా ఉంటే , ఆ చిన్న కధ  అంతటితో నే ముగుస్తుంది.
2. ‘కనులు కనులు కలిసెను ‘ కన్నె మనసు తెలిసెను ‘ : ఆమె మీ కళ్ళలో తదేకం గా స్టేర్  చేస్తే , మీరు ఆమెకు  చాలా ఇంటరెస్టింగ్ పర్సన్ అన్న విషయాన్ని మీకు తెలుపుతున్నట్టే !  మామూలు గా చూసే సమయం కన్నా కొన్ని క్షణాలు ఎక్కువ గా చూస్తుంది. ఇంకా ఎక్కువ సమయం , మీతో పరిచయం ఎక్కువ అవుతున్న కొద్దీ , చూడడం జరుగుతుంది.  అప్పుడు మీరు కూడా ఆమె చూపులకు అనుగుణం గా ఆమెను చూడవచ్చు, మీకు కూడా సమ్మతం గా ఉంటే !
3. మీతో నవ్వుల పువ్వులు ! : మిగతా వ్యక్తుల కంటే , మీ  పొందులో ఆమె నవ్వులు ఎక్కువ గా ఉంటాయి . ఆ నవ్వుల పువ్వుల మాదుర్యాలతో మీ మతి పోతుంది. మీకు ఎంతో  ఆనందం గా ఉంటుంది ఆ పరిస్థితి ( ఆమె మీకు కూడా నచ్చితేనే ! ) ఆ సమయాలలో , మీతో ఎక్కువ సమయం , సంభాషణలు జరుగుతాయి. ఆమె తరచూ  మీ కళ్ళ  లోకి చూస్తూ , చిరు నవ్వులు చిందిస్తూ ఉంటుంది. కొన్ని సమయాలలో మీకు మీరు వేసిన జోకు మీకే సుత్తి  జోకులా అనిపించినా , ఆమె కు అది బ్రంహాండం అయిన జోకు అయి ఆమెను విపరీతం గా నవ్విస్తుంది !
4. కొన్ని సమయాలలో ఆమె మీ సమీపం లో  ఆమె తన బాహువులను అంటే  భుజాలను సున్నితం గా ఎగర వేయడం కానీ , లేదా తన అర చేతులను పైకి తిప్పి ఉంచడం కానీ చేస్తుంది. అట్లా చేయడం  కూడా ఆమెకు మీరంటే ఉన్న ఆసక్తిని ఆ విధం గా తెలియ చేస్తుందని అనుకోవచ్చు !
5. ఆమె  హృదయ స్పందన పరిశీలించండి ! : మీకు ఆమె తో పరిచయం ఒక మాదిరిగా ఏర్పడితే , ఆమె  కు సమీపం గా మీరు ఉన్నప్పుడు , ఆమె ఉచ్చ్వాస , నిశ్వాస  లు అంటే ఆమె శ్వాస లోపలి తీసుకోవడమూ  , బయటకు వదిలేయడమూ , ఈ పని చాలా సహజమైనది అయినప్పటికీ ,  ప్రస్పుటం గా గనిపిస్తూ ఉంటుంది.   ఆమె చేతిని మీ చేతి లో పెట్టుకుని ఆమె నాడి  ఎంత వేగం గా కొట్టుకుంటుందో  పరీక్షించండి ! మీకు తెలుసు కదా  నార్మల్ గా ఎంత వేగం తో కొట్టుకుంటుందో  , నార్మల్ కన్నా తక్కువ గా కొట్టుకుంటూ ఉంటే  , మీరు ఆమె దగ్గర నుంచి శలవు తీసుకోవచ్చు !   చాలా వేగం గా కొట్టుకుంటూ ఉంటే  , మీరు ఒక అడుగు ముందుకేసి మీ చేయిని ఆమె హృదయం మీద ఉంచండి !  అప్పుడు కూడా ఆమె హృదయం వేగం, మీ చేతికి మెత్తగా, తీయగా కూడా తెలుస్తుంది ! ( మీకు ఆమె తో  పరిచయం బాగా ఉంటేనే ఈ పని చేయాలి మీరు , లేక పొతే  జరిగే  పరిణామాలకు  ఈ టపా రచయిత  బాధ్యుడు  కాదు  ! )
6. మిర్రరింగ్  : ( mirroring ) :  మీతో ఆమెకు పరిచయం ఎక్కువ అవుతూ , ఆ పరిచయం ఆమెకు , ప్రీతి పాత్రమైనదీ కూడా అవుతే , ఆమె మీ కదలికలను అప్రయత్నం గానే అనుకరిస్తూ ఉంటుంది.  దీనినే మిర్రరింగ్  అని అంటారు.   డాన్సు లోనూ , లేదా ఇతర  భౌతిక కార్యక్రమాలలోనూ కూడా  ( అంటే ఫిజికల్ యాక్టివిటీ )  ఈ మిర్రరింగ్ ప్రముఖం గా కనిపిస్తుంది.   మీరు ఇరువురూ పాల్గొన్న ఆ డాన్స్   లయ బద్ధం గా ఉంటుంది  ఎందుకంటే అంతకు ముందే మీ మనసులు ‘love ‘ బద్ధం అయి ఉంటాయి కనుక !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

మీ మీద మనసు పడితే , మాట్లాడకుండా ఎట్లా తెలియ చేస్తుంది ఆమె?.5.

In మానసికం, Our minds on అక్టోబర్ 26, 2012 at 11:22 సా.

మీ మీద మనసు పడితే ,  మాట్లాడకుండా  ఎట్లా తెలియ చేస్తుంది ఆమె?.5.

4. కురులు సవరించుకోవడం పరిశీలించండి : 
ఆమె కురులు , అదే,  కేశాలు గల గల పారే ఆమె కోరికల సెలయేరులు !  వదులు  గా ఉన్న ఆమె కురులు, ప్రతి పురుషుడి లో మరులు రేపుతాయి.  వత్తు గా ఉన్న ఆమె పొడవాటి కేశాలు ,  అతి వీర , మగ దీరులను కూడా  క్షణం లో చిత్తు చేయగలవు ,’ బలవంతంబైన సర్పంబు చలిచీమల చేత చిక్కి చావదె  సుమతీ ‘ అన్నట్టుగా , అతి సుతారం గా తూనీగ రెక్కల లాంటి ఆమె కురులు , ఎంతటి మగ వాడినైనా వలపు బంధనాలలో కట్టి పడ  వేయ గలవు ! 
అంత   ‘ రొమాన్ చక్ ‘  కురులను ఆమె తన ముని వేళ్ళతో మెలి  తిప్పుతూ , అలవోకగా , యదాలాపం గా సవరించుకుంటూ ఉంటె,  లేదా తన నాజూకైన వేళ్ళ ను అతి సున్నితం గా తన కురులలోకి  పోనిస్తూ , ఆమె ఆలోచనలు వేరే ఎదో లోకం లో విహరిస్తూ ఉంటే ,  ఆమె మీద ఆసక్తి కనబరుస్తున్నదని  అనుకోవచ్చు.  గుర్తు ఉంచు కొండి !  ఆమె ఇట్లా  తన ముంగురులు సవరించుకోవడం , మీరు ఎదురుగా , లేదా కొద్ది దూరం లో ఉన్నప్పుడు చేస్తుంటే నే ఈ విధం గా భావించండి ! ఇంకో విషయం : ఆమె  దగ్గర మీకు కనపడకుండా ఏ  ఐ  ప్యాడో , లేదా సెల్ ఫోనో ఉందనుకోండి !   , అప్పుడు ఆ సంగీత లోకం లో విహరిస్తూ కూడా ఆమె ప్రవర్తన అట్లా ఉండ వచ్చు , కాబట్టి కాస్త  శ్రద్ధ గా గమనించండి. అదే, కాస్త తొందరగా, ఆత్రుత గా, ఆకస్మికం గా కనుక ఆమె తన చేతులు శిరోజాల లోకి పోనిస్తే , తను తడ  బడుతున్నది గానూ , ఇబ్బంది కరం గానూ ఫీల్ అవుతున్నట్టు అనుకోవచ్చు, ప్రత్యేకించి, ఆమె బిత్తర చూపులు చూస్తుంటే కూడా ఇట్లా అనుకోవచ్చు.
5. ఆమె చేతి వేళ్ళు  గమనించండి: ఆమె, మీరు సమీపం లో ఉన్నప్పుడు ,   తన చేతి వేళ్లతో  తన అధరాలు , అంటే  పెదవు లను కానీ మెడ భాగం గానీ , లేదా కాలర్ బోన్  ప్రదేశం కానీ తడుము కుంటూ ఉండడం కానీ, సున్నితం గా స్పృశిస్తూ, మసాజ్ చేస్తూ ఉండడం  కానీ ,  చేయడం జరిగితే ,  ఆమెకు  మీరు కావాలని నోటితో  చెప్పకుండానే , మీకు చెపుతుంది ! మరి అప్పటికీ మీరు  ఆమె ‘మూగ ‘ భాష , రాగ బాసా అర్ధం చేసుకోలేకపోతే  పప్పులో కాలేసి నట్టే ! అట్లా చేసి , ఆమె తాను రమణీయం గా ఉన్నాననీ , ‘ఇక మీదే ఆలస్యం ‘ అని కూడా మీకు చెపుతున్నట్టే ! 
6. సొమ్ముల తో చోద్యం :  ఆమె కు ఇష్టమైన పురుషుణ్ణి  చూసినప్పుడు , ఆమె హృదయం మత్తు గా తేలిపోతుంది.  వేగం గా కొట్టుకుంటుంది , తన మది లో మదనుడి అలజడికి ! 
ఆ హడావిడి లో ఆమె ఆతురత ఎక్కువ అవుతుంది. తన వేళ్ళ  తో తన ఉంగరాన్ని తడుముతుంది, ముందుకూ వెనుకకూ జరుపుతుంది, చేతికి ఉన్న బంగారు గాజును తన ముని వేళ్ళ  తో నిమురుతుంది , తిప్పుతుంది. చెవులకు ఉన్న రింగులను తన వేళ్ళతో సుతారం గా సవరించు కుంటుంది , తన వేళ్ళు  తగిలీ తగలకుండా ! తన మెడలోని గొలుసును తన వేలి  చుట్టూ చుట్టు కుంటుంది పదే  పదే  ! ఆమె మనసు పరి పరి విధాల ఆలోచనల ఉప్పెనలో కొట్టు మిట్టాడుతూ ఉంటుంది ! 
7. గ్లాసులతో ఆటలు : ఆమె హోటల్ లో టేబుల్ దగ్గర మీ ఎదురుగా  ఉంటే  తన డ్రింకు  గ్లాసు ను అతి నిదానం గా నిమరడం కానీ , లేదా ఆ గ్లాసు అంచులు తన ముని వేళ్ళ  తో అతి సున్నితం గా చుట్టూ స్పృశిస్తుంది, మీరంటే ఆసక్తీ , ఇష్టమూ ఉంటే ,  మీతో కూడా  తను కలిసి, ఆనందపు అంచులు చేరుకోవాలనే ఆశతో ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !