Our Health

Archive for the ‘మానసికం’ Category

ప్ర.జ.లు. 7. స్త్రీలలో కూడా ఇన్ ఫిడిలిటీ ఉంటుందా ?:

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 26, 2012 at 6:05 సా.

ప్ర.జ.లు. 7. స్త్రీలలో కూడా ఇన్ ఫిడిలిటీ ఉంటుందా ?: 

ప్రశ్న:  ఇంత వరకూ , పురుషులలో ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ గురించి వివరం గా తెలుసుకోవడం జరిగింది కదా , మరి స్త్రీలలో కూడా ఇన్ ఫిడిలిటీ ఉంటుందా? :
జవాబు: ఇది ఆసక్తి కరమైన ప్రశ్న.  ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘ ఉంటుంది’. అతివల ఇన్ ఫిడిలిటీ కి అయిదు ముఖ్య కారణాలున్నాయి.
1. లో సెల్ఫ్ ఎస్టీం ( low self esteem ) అంటే ఆత్మ న్యూనతా భావం:  కొందరు స్త్రీలు , తమ కుటుంబాలలో , కేవలం  పిల్లలను కనే మెషీను లలాగా  యాంత్రికమైన జీవితం గడుపుతుంటారు.  కేవలం కనడమే కాకుండా , వారి పోషణా బాధ్యతా, ఇల్లు గడవడం , రోజూ ఇంటి లోకి కావలసిన అవసరాలు కనిపెట్టి ,  వాటిని కూర్చడం చేస్తూ ఉంటారు.  ఈ విధమైన యాంత్రిక జీవనం , వారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. కాల క్రమేణా వారు తమ వ్యక్తి గత పోషణ ను అంటే కేవలం శారీరికం గానే కాకుండా , మానసికం గా కూడా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దానితో  , ఎప్పుడూ జవ సత్వాలు ఉడిగి పోయిన వారిలా , నిరాసక్తత తో ఉంటారు. ‘   పాపను కనక ముందు , వారికి నా మీద ఎంతో ప్రేమ గా ఉండేది. జీవితం  మూడు ముద్దులూ , ఆరు కౌగిళ్ల లా సాగి పోయేది.  పాప పుట్టగానే , వారి ప్రవర్తన మారి పోయింది. ఎప్పుడూ ఆఫీసూ , మీటింగులూ ,  టూర్లూ !  నేను ఉన్నాను , పడి అడ్డమైన చాకిరీ చేస్తూ , ఇళ్ళూ, వాకిళ్ళూ చూసుకుంటూ ,  పాప ను కనిపెట్టుకుని ఉండడానికి ! ‘  ఈ రకం గా ఉంటుంది వారి ఆలోచనా ధోరణి.
2. ఎమోషనల్ స్టార్వేషన్  అంటే భావావేశాల  లంఖణాలు :  ఇళ్ళూ , వాకిళ్ళూ , ఉంటాయి , పిల్లలూ , నౌకర్లూ ఉంటారు. ఆమె తెలివి గలది. విద్యార్హతలతో పాటుగా, వాటికి తగినట్టు , మంచి హోదా కలిగిన ఉద్యోగం కూడా ఉంది. భర్త కు కూడా  పగలు వెళ్లి రాత్రి దాకా పని చేసి వచ్చే బాధ్యతా యుతమైన ఉద్యోగం ఉంది. కానీ జీవితం యాంత్రికం అయి పోయింది. ఉదయం నిద్ర లేచిన టైం నుంచీ పరుగు, ఇక భావావేశాల  ను పంచుకోవడం మాట దేవుడెరుగు ! చీకటి పడే దాకా రారు.  చక్కగా షవర్ చేసి , వారికి ఇష్టమైన రంగు లోని సల్వార్ కమీజ్ వేసుకుని బాల్కనీ లోంచి చూసి మందస్మిత వదనం తో ఎన్ని సార్లు ఎదురు చూడలేదు ఆమె ! దానికి సమాధానం చెప్పేది  చిరు నవ్వు తో కాక , తీవ్రమైన అలసట తో, ఆకలి తో కూడిన భర్త ముఖం ! ఇద్దరికీ ఆకలి !  ఆమెది భావోద్వేగాల ఆకలి. ఆయన ది , కడుపు మండిన ఆకలి ! ఆయన ఆకలి మంటను ఆమె తీర్చ గలదు. ఆమె  భావావేశపు  ఆకలి ని ఆయన అర్ధం చేసుకుంటే గా , తీర్చడానికి ! సస్య శ్యామల గృహ  క్షేత్రం లో ప్రేమానుభూతుల దుర్భర క్షామం !  కాల క్రమేణా భావా వేశాల లంఖణాలు , అనుభవిస్తూ , శుష్కించి పోతారు ! 
3. కోమలి కోపం :  ఆమె చక్కనిది. చాక్లెట్ రంగులో ఉండి ,తీయగా  మాట్లాడడమే కాకుండా , ఆయన  తో లెక్క లేనన్ని మార్లు తీయని అనుభూతులు కూడా పంచు కున్నది తను. ‘  కానీ జరిగిందేమిటి ? తన ఫామిలీ ఫ్రెండ్  ను ‘ ప్రేమించి ‘  ఇంకో టౌన్ ట్రాన్స్ఫర్  చేయించుకుని , అక్కడ ఉంటున్నాడు ఆమె తో !   అంతటి కృతఘ్నుడు నాకు కనపడకుండా పోవడమే మంచిదయింది. నేనూ నా దారి చూసుకో గలను , ఆయన లేక పోయినా , ప్రపంచం అంతా ఇంకా నా ఎదుటే ఉంది ‘ అనుకునే అంతు లేని క్రోధం !  
మిగతా కారణాలు వచ్చే టపాలో ! 

ప్ర.జ.లు. 6. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 26, 2012 at 9:43 ఉద.

ప్ర.జ.లు. 6. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ ! 

ప్రశ్న: మిగతా కారణాలు ఏమిటి మగ వారి ఇన్ ఫిడిలిటీ కి ? 
జవాబు: ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
19. ప్రతీకార వాంఛ : మూడు సంవత్సరాల నుంచీ తాను ఎంతగానో   ప్రేమించుతున్న  తన ఇల్లాలు కేవలం తన మద్య పానం వల్ల వదిలేసి పోయింది. వాళ్ళ తల్లిదండ్రులకు బాగోలేదనీ , వారి దగ్గర తాను ఉండాలనీ కూడా చెప్పింది.కానీ చేసిందేమిటి?తల్లి దండ్రులు కుదిర్చిన ఇంకో సంబంధం చేసుకుని హాయి గా ఉంది. తనకేమీ తక్కువ కాలేదు , మద్యం ముట్టుకోవట్లేదు ఇప్పుడు , మగువలు కావాలనుకుంటే తప్పేంటి ? అనుకునే స్వభావం.ప్రతీకార భావం.
20. ‘ అది ‘ ఇంకా ఉందో లేదో ! : పిల్లలు  కాలేజీ కీ వెళుతున్నారు. అయితే ఏం ? తనలో ఏమాత్రం  ‘ అది ‘ తగ్గి పోవడం లేదు కదా , ఇంకా ఎక్కువ గా ఉంటుంది. ఈ రోజులలో ! తన భార్యామణి చాలా మంచిది. కానీ ‘ ఆ ‘ విషయాని కొస్తే , ‘ బాగా అలసి పోయాను ,మళ్ళీ పొద్దున్నే లేచి ఆఫీసు కు తయారవాలి అంటుంది. ఇక ఆది వారాలు   పూజలూ , పునస్కారాలతో సతమతం అవుతుంది. తాను , తనకు తోచిన విధం గా ఇంకో దేవి  పూజ చేసుకుంటే సరిపోతుంది ‘ అనుకునే ఆత్మ సమర్ధనాభావం. ఈ వయసులో వారు సామాన్యం గా తమ భార్య కంటే , తక్కువ వయసు వారితో కామ క్రీడలకు వ్యామోహ పడుతుంటారు.
21. రూల్స్ తనకు కాదు : తాను , చిన్న తనం నుంచీ , పెద్దగా రూల్స్ పట్టించు కున్నది లేదు. స్కూల్ లోనూ , కాలీజీ లోనూ తనకు మాత్రం లేవు రూల్స్. తన ఉద్దేశం లో రూల్స్ ను పట్టించుకునే వారు ఫూల్స్. ఒకరి కన్నా ఎక్కువ మంది స్త్రీలతో పొందు, తన రూలు.భార్య తోనే జీవితాంతం గడపడం ఏమి రూలు  ?!  అనుకునే  ధిక్కార స్వభావం. 
22. తాను ఆ పని చెయ్య గలడు : తనకు ఏ విధం గానూ లోపం లేదు ! మరి  ఆ పని తాను ఎందుకు చేయ కూడదు ? అనుకుని   పట్టుదలతో  ఇంకో యువతిని పట్టుకునే స్వభావం.
23. నైతికమైన అంటే నీతి బద్ధమైన జీవితం మీద ఏమాత్రం నమ్మకం లేక పోవడం:  వీరి దృష్టి లో మిగతా మగ వారంతా  స్త్రీ లోలురే , మరి తాను ఎందుకు కాకూడదు అనే పొరపాటు స్వీయ సమర్ధనా భావం. 
24. వ్యసన లోలురు అవడం అంటే వ్యసనాలకు అలవాటు పడడడం :  సామాన్యం గా మూడు  W లు అని అంటుంటారు  ( Wealth, Wine and Women ).  డబ్బు  ఉండగానే ,  అలవాట్లకు అవకాశం ఎక్కువ అవుతుంది. అది మద్యమే  కావచ్చు , ఇతర మాదక ద్రవ్యాలే కావచ్చు. వాటి తో  ఇన్హి బిషన్స్  కోల్పోవడం సామాన్యం గా జరిగేదే. అంటే ,  యుక్తా యుక్త విచక్షణ , కామ వాంఛ ల మీద నియంత్రణ , కోల్పోవడం జరుగుతుంది.  ఆ తరువాత ,  వేరే యువతి తో  శృంగారం కూడా ‘ ఎంతో మత్తు గా ‘  ఉంటుంది. 
25. సెక్స్ అడిక్షన్ :  పైన ఉదాహరించిన వాటన్నిటి లోకీ , సెక్స్ అడిక్ షన్  ఒకటే అతనికి ఉంటే, అది క్షమార్హం.  సెక్స్ అడిక్ షన్ అనే పరిస్థితి ఒక మెడికల్ కండిషన్.  ఈ పరిస్థితి ఉన్న వారు నిరంతరం  కామ వాంఛ తో ఉండి , అనేక మంది ఇతర యువతులతో,కామ క్రీడలకు ఎప్పుడూ  అర్రులు చాస్తూ ఉంటారు.  వారికి  నిరంతరం  కామ నామ స్మరణే !  కామ కార్య  వాంఛ లే !  వారి ఆలోచనలు, వారి మెదడు కే పరిమితం కాక , వారు  ఏమాత్రం సంకోచించ కుండా అనేక మంది స్త్రీలతో సంబంధాలు కూడా పెట్టుకుంటారు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు  ! 

ప్ర.జ.లు. 5. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 24, 2012 at 11:37 సా.

ప్ర.జ.లు. 5. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ ! 

 

ప్రశ్న: మగ వారి కామ చంచలత్వానికి  ఇంకా కారణాలు ఉన్నాయా ? :
జవాబు: ఆ హా ! ఎందుకు లేవూ , ఇంకా చాలా ఉన్నాయి ! 
11. తగిన అర్హతలు : ప్రతి మగ దీరుడూ , తానూ ,  అంద గాడిననీ , హ్యాండ్సం గా  ఉన్నాడనీ  , ధనికుడిననీ , సంఘం లో చాలా పాపులర్ అనీ , అంతే కాక ముఖ్యం గా కామ కేళీ విలాసం లో  చతురుడనీ  సంపూర్ణం గా నమ్ముతూ , ఆత్మ విశ్వాసం తో ఉంటాడు. ఇవన్నీ మంచి గుణాలే కదా ? ఆత్మ విశ్వాసం తో ఉండడం కూడా, కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయి , ఇతర స్త్రీల తో ఎఫైర్స్ కు దారి తీసి , అతివలు  ‘ అందు బాటులో ‘ ఉంటే, వారి  పొందు కోరడం లో తప్పేమిటీ అనే  భావన కలుగుతూ ఉంటుంది కొందరిలో .
12. ఎక్కువ మంది స్త్రీలతో  తో కామం,  మగ ధీరతకు చిహ్నం ! :  , ఒకరి కన్నా ఎక్కువ మంది స్త్రీలతో కామ కేళీ కలాపాలు జరుపుతూ ఉంటే ఎంతో ఆనంద దాయకం గా , కామ వాంఛలు తీరుతూ ఉంటే చాలా సంతృప్తి కరం గా ఉంటుంది  ఇవి , కొందరు పురుషులలో నాటుకున్న  భావనలు. 
13. చాటు మాటు ఎఫైర్ లు రేపుతాయి గుండెలో వేడి ఫైర్ లు ! :   రమణి తో రస భావనలు ! ఆహా ఎంత ఆహ్లాద కరం గా ఉంటాయి ? ప్రత్యేకించి,   ఆ చిలిపి ఈ  మెయిల్స్  , ఇంట్లో భార్య  ఆద మరిచి నిద్ర పోతున్నప్పుడు తనకు వచ్చే టెక్స్ట్ మెసేజెస్, ఆ తరువాత  కలయికలు , మనసులో వెచ్చని కోరికల కుంపట్లు రేపుతాయి కొందరికి.
14. తాను వలచిన ‘ రంభలు ‘ తన గురించి కీచు లాడుకుంటూ ఉంటే ,  భలే సరదా గా ఉంటుంది ! :  రాధ కు తెలుసు నేను ఎంత ఆనందాన్ని తనకు ఇచ్చానో ! అట్లాగే  సుమ కూ ,  మాధవి కు కూడా తెలుసు ‘ తన ప్రతాపం ‘ ఇక వారు ముగ్గురూ కలిసినప్పుడు చూడాలి వారి రొషాలూ, పోట్లాటలూ , చాలా సరదా గా ఉంటుంది ‘ అనుకునే  మనస్తత్వం కొందరిలో.
15.  అతడికి తెలుసు ఆమె క్షమించి  మళ్ళీ తనతో రమిస్తుందని !  : నా  రుక్మిణి  ఎంతో మంచిది !  నా సుఖం ఎప్పుడూ  కాదనదు. ఇంతకు ముందు , ఆ ఇద్దరితో  నేను ‘ కుర్ర తనం ‘ ప్రదర్శించినా , ఎంతో ప్రేమ తో నన్ను క్షమించి తన వేడి కౌగిలి లో చేర్చుకుంది.ఇప్పుడు కోమలి తో  వ్యవహారం పరవాలేదు ! అనుకునే భరోసా భావం ! 
16. స్వచ్చమైన ప్రేమ ! :  సుశీల నిజం గా నన్ను ప్రేమిస్తూంది ! నాలో కూడా ఏదో తెలియని ఆత్మీయతా భావం నిండు కుని , ప్రేమ మొగ్గ తొడుగుతుంది ! పిచ్చి వాణ్ని చేసి వేస్తుంది నన్ను !  ఇక  భార్యామణి స్వాతంత్ర్యానికి తానూ అడ్డు చెప్ప నవసరం లేదు అనుకుని సమాధాన పరుచుకునే స్వభావం  కొందరిది ! 
17, (  రస ) దారి చూపే వారి  అడుగు జాడలలో ! :  తన బాబాయి   భలే సరదా మనిషి ! అమలాపురం లో ఉన్నప్పుడు , తన చిన్న తనం లో ఎన్ని సార్లు  బాబాయి  స్నేహితురాళ్ళ ఇళ్ళకు తీసుకు పోలేదు ? ఎందుకో ఎప్పుడూ బెడ్ రూం లో తాను ఆంటీ తో  మాట్లాడుతూ , తనను బయట గుమ్మం దగ్గర జామ  చెట్టు నీడ లో  ఆడుకుంటూ ఉండమనే వాడు.  తాను పెద్ద అయ్యాక గానీ తెలియ లేదు , బాబాయి  పడక గది లో  ఉన్న’  జామ పండు ‘  ను ఒక ‘  చిలక కొట్టుడు ‘ కొడుతున్నాడని ! 
తన చిన్న  మామయ్య సంగతి సరే సరి !  ఆయన కళా పోషణ సరాసరి  మద్రాసు లో చిన్న వేషాల ‘ నటీ మణుల ‘  మీద ఉండేది ! మరి ఇందరు  మహా మహుల కుటుంబం లో పెరిగిన తను  ఇంత స్తబ్దత ఎందుకు ప్రదర్శించడం !  వారి   రసిక  మడుగు జాడలలో తప్పటడుగు   వేస్తె తప్పేంటి అనే భావన !  ‘  వంశ ప్రతిష్ట ను  ‘ నిలబెట్టా లనుకునే కళా తపన  కొందరిది. 
18. జవరాలి ప్రత్యేకతలు ఇల్లాలిలో ఏవీ ? : ఆమె  ప్రత్యేకత ఆమె  దే !    తన భార్య లా కేవలం బుగ్గల మీద చిట్టి ముద్దులు మాత్రమె కాదు,   షవర్ నుంచి బయటకు వచ్చి ,  నూట ఎనిమిది  వేడి  ముద్దులు కావాలంటుంది, నా మీద అతి భక్తి తో !  ఖచ్చితం గా నూట ఎనిమిది ముద్దులు అతి జాగ్రత్త గా ఆమె ‘ మీద ‘ పెట్టినా  నన్నే బోల్తా కొట్టించి ,  లెక్క సరిగా లేదని , మూడు వందల ముద్దులు పెట్టించుకున్న రోజులు ఎన్నో ! లెక్కలు సరిగా రాక పోవడాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి ఇంతకన్నా మించిన అవకాశం నాకు మాత్రం  ఎప్పుడు ఉంటుంది కనుక ?  తన భార్య మాత్రం ,   ఇట్లాంటి విషయాలలో ‘ తాను ‘  మడి ‘  కట్టుకుని కూర్చుని  తన  ‘ వేడి నంతా ‘ చల్లారుస్తుంది’ .అనుకునే మనస్తత్వం  ఇంకొందరిది.
వచ్చే టపాలో ఇంకొన్ని  ఇన్ ఫిడిలిటీ సంగతులు ! 

ప్ర.జ.లు.4.ఎఫైర్ లూ, ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 23, 2012 at 8:47 సా.

ప్ర.జ.లు.4.ఎఫైర్ లూ, ఇన్ ఫిడిలిటీ లూ ! 

ప్రశ్న:  మరి పురుషులు ఎఫైర్ లు ఏర్పరుచు కోవడానికి కారణాలు ఏమిటి ? : 
జవాబు: పురుషులు ఎఫైర్ లు పెట్టుకోడానికి చాలా కారణాలు ఉన్నాయి.  
1. కాదనలేక పోవడం:  అందమైన, ఆకర్షణీయ మైన యువతి ఎదురుగా ఉంది. మనసు లో రస మన్మధుడు వేయి గుర్రాల మీద స్వారీ చేస్తూ ఉంటాడు.ఆ వేగం లో భావావేశాలు కూడా కనీసం వేయి మైళ్ళ దూరం వెళతాయి. ఇంక కాదనడానికి  సమయం ఏదీ ? 
2. అహం సింహాసనం ఎక్కుతుంది. : తనకు  తెలివి ఉన్నా , సరి అయిన అవకాశాలు లేక ఆమె తో పోటీ గా పెద్ద ఉద్యోగం లేదు. తీవ్రమైన ఆత్మ న్యూనతా భావానికి విరుగుడు వీలైనంత మంది  యువతులతో   ‘ నవ జీవనం ‘ రుచి చూస్తె సరే అనే భావన ! ( ఇగో బూస్టు చేసుకోవడం  ) 
3. తోటి వారితో పోటీ ! :  రమేష్  చాలా లక్కీ , భార్యకు  రవంత అయినా తెలియకుండా , కనీసం  ముగ్గురు యువతులతో శృంగారం ‘ వెలగ పెడుతున్నాడు ‘ , ఇక మధు విషయం సరే సరి !  ఆఫీసులోనే ఇద్దరితో చనువు గా ఉంటాడు. ఈ చనువు ఆఫీసు అయిపోగానే , ఏ రూపం లో ఉంటుందో ఊహించుకోడానికి మధు వారికి ఆఫీసులోనే చాటు మాటుగా చేసే  ఈ మెయిల్స్  చూపించినప్పుడే తెలిసింది. మరి తనకు ఏమి తక్కువ , ఆ మాత్రం తీసి పోనా ! అనే భావన , ‘ పోటీ ‘ తత్వం !( పీర్ ప్రెషర్ ) 
4. ఉన్న సంబంధానికి ఉద్వాసన చెప్పే విధం : తనతో నాకు పడట్లేదు ఎట్లాగూ ! ప్రయత్నం చేసినా ! ఇక ‘ కాదనుకున్నప్పుడు ‘ ఎఫైర్ ఇంకొకరి తో ఉంటే తప్పా ? అన్న భావన.  ఇంకొందరు  తాము ఇంకో ఎఫైర్ పెట్టుకున్న తరువాత కూడా , తాము ఉంటున్న వారితో వీడ్కోలు , ఆ విధం గా తీసుకుంటారు. 
5. ఆమె అమాయకత్వం :  అనసూయ కు  అతని మీద ఎంతో నమ్మకం.’  డ్యూటీ చేసి నేరుగా ఇంటికి వస్తాడు. మల్లె పూలు తెస్తాడు. దేవి భక్తీ , దైవ భక్తీ రెండూ ఉన్నాయి ‘ అని సంబర పడి పోతూ , తన ‘ భాగ్యానికి ‘ రోజూ అనేక పూజలు చేస్తూ , గుళ్ళో ప్రదక్షిణాలు కూడా చేస్తూ ‘ కాలం , ఆనంద మయం గా ‘ వెళ్ళ బుచ్చుతూ ఉంటుంది , అమాయకం గా  అనసూయ , అతను  చేసే కొన్ని డ్యూటీ లు, నేరుగా  ‘ రెండో  దేవి ‘ వద్ద కూడా చేస్తూ , తన దేవి భక్తి  చాటు మాటు గా చాటుతున్నాడని తెలియక  ! 
6. ‘ రస కీర్తి కిరీటం లో ఇంకో మణి పూస ‘ :  అందమైన యువతి తో పొందు , ఎంతో పొందిక గా అనిపిస్తుంది , భార్య కన్నా !  ఆమె చతురత , తన ఇల్లాలికి ఏదీ  అనే అభిప్రాయం ఏర్పడుతుంది. ‘ ఆ  ఆమె చతురత ‘  ను ఆస్వాదిస్తున్న వారి వరుసలో తాను మూడో వాడు అనే  వాస్తవం ( ఆమె చతురత తో ! ), మరుగున పడుతుంది.
7. ఇతర స్త్రీ ( ల ) తో పొందు కోసం తహతహ ! : తాను  తన భార్య పొందు తో ఆనందం అనుభవిస్తూ ఉన్నాడు.  కానీ  ‘  ఆ యువతి తో పొందు ఆ హా ! ఎంత బాగుంటుందో ! అని  ఎమోషనల్ అలల మీద తేలి పోతూ ‘ ఆ యువతి ‘ పొందు కోసం తహ తహ లాడుతారు కొందరు ! 
8. కామ విశృంఖలత : కొందరు ద్విలింగ సంపర్కులు, తాము భార్య తో సహజీవనం చేస్తూనే , ఇతర మగ వారితో సంబంధాలు ఎర్పరుచుకుంటారు.
9. మొదటి సారి , ఎవరికీ తెలియలేదు కదా ! :  ఆ తోలి రాత్రి ,  రమ్య  తో గడిపిన క్షణాలు, ఎంతో కొత్తగా ఉన్నాయి , మళ్ళీ  ఆ క్షణాలు ‘ రిప్లే ‘ చేసుకుంటే సరిపోదూ ! అందులో  తన  శ్రీమతి కి కూడా ఏ అనుమానమూ లేదు కదా !   మతులు పోగొట్టే అందాలు రమ్య లో మళ్ళీ ఆస్వాదిస్తే తప్పేంటి ? అనే భావన.  
10.   మహత్తర అవకాశం !  :  తాను వచ్చింది ఢిల్లీ కి టూరు మీద ! అందులో నవంబరు మాసం అవడం తో చాలా చిల్లీ గా కూడా ఉంది !   ఉండే హోటల్ లో  ‘ అన్ని హంగులూ ఉన్నాయి ‘ ఇక  అందాలు పొంగుతున్న అతివల కు కూడా కొదవ  ఉండదు అక్కడ ‘  అని క్రితం టూరు కు వెళ్ళిన తన కొలీగు చెప్పిన చిదంబర రహస్యం  ఒక్క సారిగా  కోటి కిరణాల సూర్య భానుడి వేడి పుట్టించింది తనలో !  ఇక హైదరాబాదు లో  ఉండే తన ఇల్లాలికి ఎందుకు  ఈ  ‘ గొడవలూ ‘ అను కొనే వారు కొందరు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని ఇన్ ఫిడిలిటీ క్వాలిటీ లు ! 

ప్ర.జ.లు. 3. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 22, 2012 at 8:12 సా.

ప్ర.జ.లు. 3. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ ! 

ప్రశ్న: స్త్రీల లోనూ  పురుషులలోనూ   ఇన్ ఫిడిలిటీ కి  తేడాలు ఉన్నాయా ? 
జవాబు: మంచి ప్రశ్న. భావావేశాలు అంటే ఎమోషన్స్ ,  అవి అనుభవించే  స్త్రీలను బట్టీ , పురుషులను బట్టీ మారుతూ ఉంటుంది. అంటే స్త్రీలకూ, పురుషులకూ ,  వారి లో నిరంతరం కలిగే భావావేశాలకూ అవినా భావ సంబంధం ఉంది. కాక పొతే వారు ఈ భావావేశాలను అనుభవించే విధం వేరుగా ఉంటుంది.  ఇంకో విధం గా చెప్పుకోవాలంటే భావావేశాల వాహనాలలో స్త్రీలూ , పురుషులూ వేరు వేరు దారులలో ప్రయాణం చేసి ‘ సుఖ గమ్యం ‘ చేరుకుంటారు.  ఈ వేరు దారుల ప్రయాణం , వారి కామ ప్రేరణలనూ , ఎమోషన్స్ ను  కూడా వేరుగా ప్రభావితం చేస్తుంది. స్త్రీలూ , పురుషులూ , వారి వారి రీతులలో  కలిసి  సంసార సుఖాల గమ్యం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు , మార్గ మద్యం లో  చిన్న బస అంటే కొన్ని షార్ట్ స్టే లు కూడా చేస్తుంటారు ! ఆశ్చర్య కరం ఏమిటంటే , ‘ కలిసి ‘ ప్రయాణం చేస్తూ కూడా , ‘ చిరు బస ‘లు అంటే షార్ట్ స్టే లు మాత్రం ఇంకొకరికి తెలియ కుండా చేస్తుంటారు ! ( అందరూ కాదు ! ) 
ఉదాహరణకు , పురుషులు ఎఫైర్స్ ఏర్పరుచు కునే సమయం లో, ( ఇతర ) స్త్రీల మీద ఎక్కువ గా ఆధార పడుతూనూ ,  వల్నరబుల్ గానూ  ఉంటారు.దీనిని స్త్రీ లోలత అనవచ్చు. అదే స్త్రీల విషయం లో ఇందుకు భిన్నం గా , ఎఫైర్స్ ఏర్పరుచుకునే సమయం లో, స్వేచ్చా యుతం గానూ , వారు ఎక్కువ శక్తి వంతం గానూ అవుతున్నట్టు ఫీల్ అవుతారు. ఎఫైర్స్ లో సామాన్యం గా పురుషులు ఇంటిమసీ కోసం అంటే చనువు , ఆప్యాయతల కోసం వెదుకుతూ ఉంటారు, అదే సమయం లో స్త్రీలు , వారి  భావావేశాలను అంటే కామ పరం గానూ , ఇతర విధం గానూ , వారి కి  ( వివాహ బంధం లో ) ఉన్న స్వేచ్చా స్వాతంత్ర్యాల పరిమితులు  ఛేదించడానికి  ఉవ్విళ్ళూరుతూ ఉంటారు ! ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , స్త్రీ లకు తమ వివాహ బంధం లో కనుక , వారికి సంపూర్ణ స్వేచ్చా స్వాతంత్ర్యాలు  ఉన్నట్టు నమ్మకం కలిగితే , వారు ఎఫైర్స్ కు అంతగా ఆకర్షితులవ్వరు. అట్లాగే పురుషులు, తమ వివాహ బంధం లో సంతృప్తి కరమైన  అనుబంధం , ఇంటిమసీ , ఇంకా ఆప్యాయత కనుక పొందుతూ ఉంటే , ఎఫైర్స్ వైపు దృష్టి మరల్చరు.  ప్రేమ , ఆప్యాయతల ‘ ఇంధనం ‘ తో పాటు గా కామ తృప్తి కూడా కలిసిన ‘ జీవిత ‘ వాహనం లో ప్రయాణం చేస్తున్న వారి ప్రయాణం సాఫీ గా గమ్యం వైపు సాగి పోతుంది, అప్పుడు వారికి చిరు ‘ బస’ లు అంటే షార్ట్ స్టే లు ఏవీ అవసరం ఉండవు! ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లాంటి ఇంధనాలు వారికి అవసరం ఉండదు ! 
లింగ పరం గా ఎఫైర్స్ కానీ ఇన్ ఫిడిలిటీ కానీ  పురుషులలో రావడానికి కారణం, వారు వారి ‘ ప్రేయసి కానీ,  ‘భార్య ‘ కానీ , ఇతర వ్యక్తులతో కామ పరమైన సంబంధం ఏర్పరుచు కుంటే కానీ , లేదా ఏర్పరుచు కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే కానీ తెలిస్తే , తీవ్రం గా కలత చెందడం వలన అని కూడా భావించడం జరుగుతుంది. కానీ స్త్రీల విషయం లో వీటికి  ( ఇన్ ఫిడిలిటీ కీ ఎఫైర్స్ కూ ) కారణం , తమ ప్రియులు ఇతరులతో భావావేశ పూరితం గా అంటే ఎమోషనల్ గా సంబంధాలు పెట్టుకుంటే సహించ లేక పోవడం అని కూడా భావించ బడుతుంది. అనేక మంది స్త్రీలనూ పురుషులనూ ప్రశ్నిస్తే , ఈ విషయం తెలిసింది , ఒక పరిశీలనలో. జీవ పరిణామ శాస్త్ర వేత్తలు స్త్రీలలోనూ , పురుషుల్లోనూ వంశ పారంపర్యం గా వచ్చే జన్యువులు అంతే జీన్స్ , వారి ఎఫైర్స్ లేదా ఇన్ ఫిడిలిటీ   ప్రవర్తనలను నిర్ణయిస్తాయి అని  నమ్ముతారు.  ఎఫైర్స్ విషయం లో  జన్యువులు ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో  స్పష్టమైన విధం గా జెలసీ ను అంటే అసూయను చూపే లక్షణం కానీ బిహేవియర్ ను కానీ  నిర్ణయిస్తూ ఉంటాయి. 
వచ్చే టపాలో ఇంకొన్ని ఇన్ ఫిడిలిటీ సంగతులు ! 

ప్ర.జ.లు.2. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 21, 2012 at 10:27 సా.

 ప్ర.జ.లు.2. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ ! 

అఫైర్ కానీ ఇన్ ఫిడిలిటీ కానీ , భౌతికం గా అంటే శారీరికం గా సంబంధం కావచ్చు, లేదా ఎమోషనల్ గా సంబంధం కావచ్చు. అంతే కాక , కేవలం ఎమోషనల్ , ఇంకా శారీరికం గానే కాక ఈ సంబంధాలు , ఇరువురి మధ్యా ఉన్న నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తాయి. అప్పుడు  ఆ సంబంధాలు మోస పూరితం కూడా అవుతాయి.  ఒక దేశం లో బహిరందం గా ఒకరి తో  సంబంధం కలిగి ఉన్న ఒక వ్యక్తి , అఫైర్ ఇంకో వ్యక్తి తో కలిగి ఉండవచ్చు.భావావేశ పూరితమైన అఫైర్స్ లేక సంభంధాలు  కూడా శారీరికం గా ఇంకొకరికి కలిగించేంత బాధ కలిగించ గలవు.మానవ  పరిణామం జరుగుతున్న కొద్దీ , ప్రపంచం లో వివిధ దేశాలలో ఈ అఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ , ఆ యా దేశ నాగరికతా సంస్కృతుల బట్టి మారుతూ ఉంటాయి.
ప్రశ్న:  ఈ ఎఫైర్ లూ ఇన్ ఫిడిలిటీ లూ మన సమాజం లో ఎంత సామాన్యం ? : 
జవాబు: కొందరు  పరిశోధకుల అభిప్రాయం ప్రకారం , ఈ రోజుల్లో ,  సంబంధం కలిగి ఉన్న ఇద్దరిలో ఒకరు, శారీరికం గా కానీ , మానసికం గా అంటే ఎమోషనల్ గా కానీ ఇంకొకరితో సంబంధం కలిగి ఉండడానికి, కనీసం 50- 50  చాన్స్ ఉంటుంది . అమెరికాలో వివాహం చేసుకున్న వారిలో 30 నుంచి 60  శాతం మంది, తమ జీవిత కాలం లో ఎప్పుడో ఒకప్పుడు  ఎఫైర్స్ కలిగి ఉంటారని ఒక అంచనా !  ఇంకో అంచనా ప్రకారం , విడాకులు తీసుకున్న వారిలో, కనీసం తొంభై శాతం మంది , ఎఫైర్స్ అంటే వివాహేతర సంభంధాలు కలిగి ఉన్నారని తెలిసింది. అంతే కాక , ఇరవై ఏడు శాతం మంది ( అమెరికాలో ) వివాహం చేసుకుని ఆనందం గా ఉన్నామని చెప్పిన వారు వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నారు !
ఇటీవల యాభై మూడు దేశాలలో విశ్వ విద్యాలయాలలో చదువుతున్న పదహారు వేల మంది విద్యార్ధులలో జరిపిన ఒక పరిశీలన లో 20 శాతం మంది దీర్ఘ కాలిక సంబంధాలు ఏర్పరుచుకున్న వారు, అప్పటి కే ఇంకోరితో కూడా సంభంధాలు కలిగి ఉన్నారు. ఇంకా పరిశీలనలలో తెలిసిన నిజం. నలభై శాతం మంది అవివాహితులూ , ఇరవయి శాతం మంది దాకా వివాహితులూ కూడా , కనీసం ఒకటైనా కామ పరమైన సంబంధం కలిగి ఉన్న వారే !  స్త్రీల కన్నా , పురుషులు అధికం గా ఈ ఇతర సంబంధాలు కలిగి ఉంటారు.
2003 లో ఇంగ్లండు లో ఉన్న ఒక యాభయి మంది లాయర్లను ఒక ప్రశ్న అడిగారు ఒక పరిశీలనలో. అతి సామాన్యం అయిన కారణం ఏమిటి మీ దగ్గరకు విడాకుల కోసం వచ్చే వారికి ‘ అని  అడిగినప్పుడు , యాభై అయిదు శాతం విడాకులు పురుషులు ఇతర సంబంధాలు కలిగి ఉండడం వల్ల నో , లేక నలభయి  అయిదు  శాతం  విడాకులలో స్త్రీలు ఇతర సంబంధాలు కలిగి ఉండడం వల్ల నో విడాకులు సంభవిస్తున్నాయి అని తెలిసింది.  ఈ విధమైన వివాహేతర  సంబంధాలు ఏర్పడడానికి ప్రధాన కారణం , వారు వారి భాగస్వాములతో తక్కువ సమయం గడపడం వలెనే అనీ , ఇంకా విద్యార్ధులు , వారి వివాహం అయ్యే లో గా వీలైనంత మంది తో శారీరిక సంభంధం కలిగి ఉండాలనుకునే కామ వాంఛ తో పాటు గా యునివర్సిటీ విద్యాలయాలలో వారికి కలుగుతున్న అవకాశాలు కూడా అని పరిశీలనలలో తెలిసింది.అంతే కాక వయసు మీద పడుతున్న వారి లో కూడా ఈ వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి అని తెలిసింది.
ప్రశ్న : మరి ఈ ఎఫైర్స్ , ఇన్ ఫిడిలిటీ లు కలిగి ఉండడం లో పురుషులు స్త్రీల కంటే ఎందుకు ముందున్నారు ?:
జవాబు: వచ్చే టపాలో  తెలుసుకుందాము ! 

ప్ర.జ.లు.1. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 20, 2012 at 11:39 సా.

 ప్ర.జ.లు. 1.ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !  

ప్రశ్న:  ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ అంటే ఏమిటి ? 
జవాబు: ఇన్ ఫిడిలిటీ   ని సామాన్యం గా  ‘ మోసం చేయడం ‘ ద్రోహం చేయడం’ లేదా ‘ ఎఫైర్స్ ఉండడం ‘  అని కూడా చెప్పుకుంటూ ఉంటాము. భాగ స్వాములు , అంటే వారు భార్యా భర్తలే కావచ్చు , లేదా  ప్రత్యెక సంబంధం ఉన్న స్నేహితులు కావచ్చు. స్త్రీ పురుషులు  కావచ్చు. ఇన్ ఫిడిలిటీ నిర్వచనం ఏమిటంటే , ఇరువురి మధ్య  ‘ సహజం గా ‘ ప్రత్యేకం గా ఉండే  ఎమోషన్స్ కానీ , కామ పరమైన అనుభూతులు కానీ వారిరువురికే  చెందక, ఇతర వ్యక్తుల తో పంచుకోవడం. అంటే ఇక్కడ ఇరువురి మధ్య ఉన్న ప్రగాఢమైన సంబంధం ఒకరికి తెలియ కుండా ఒకరు మూడో వ్యక్తీ , లేదా నాలుగో వ్యక్తి తో పంచుకోవడం. ఇక్కడ ‘ మోసం చేయడం, ద్రోహం చేయడం  అనే పదాలు  రెండో వ్యక్తి నుంచి డబ్బూ , లేక ఆస్తులు , దోచేయడం అనే అర్ధం తీసుకో రాదు. 
 నవీన కంప్యుటర్ యుగం , ఇంటర్నెట్ యుగం లో  ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ చాలా సామాన్యం అవుతున్నాయి.  ఒక ముఖ్య విషయం ఏమిటంటే , సర్వ సామాన్య మవుతున్న ఈ ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ  మనం తెలుసుకున్నంత మాత్రాన ఎక్కువ అవ్వవు. తెలుసుకో నందు వల్ల తక్కువా అవ్వవు కదా ! 
మనం ఈ ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ వాటి తీరు తెన్నులు పరిశీలిద్దాం , వచ్చే టపా నుంచి ! 
 

‘ పిచ్చి ‘ సంగతులు, తెలుసుకుంటే మంచిదే !. 7.

In మానసికం, Our minds on జూలై 14, 2012 at 10:30 ఉద.

‘ పిచ్చి ‘ సంగతులు, తెలుసుకుంటే మంచిదే !. 7.

పైన ఉన్న కార్టూను , మందుల కంపెనీలవారి వ్యాపార పోకడలను ఎండ గట్టుతూ చూపుతున్న కార్టూన్. ( మన జీవితాలలో , సమస్యలు ఉండడం సహజమే కదా, కానీ కార్టూను లో ఆ సమస్యలను ఒక బై పోలార్ డిసార్డర్ గా ( తప్పు గా ) నిర్ధారించి దానికి , మందులు తీసుకోవడమే ఉత్తమం అంటూ సలహా ఇస్తున్న డాక్టర్ ను చూడ వచ్చు ! ) అందు వల్ల నే మనం ,   వ్యాధి నిర్ధారణ అత్యంత జాగరూకత తో చేయించుకోవాలి.  అంటే నిపుణులైన వైద్యుల సలహా తీసుకోవాలి. 

పిచ్చి కుదిరేది ఎట్లా ? : 
ఒక సామెత మనం తరచుగా వింటూ ఉంటాము. ‘ పెళ్లయింది , పిచ్చి కుదిరింది ‘  అని. అట్లా పెళ్లి జరిగినతరువాత, పిచ్చి కుదిరిన సంఘటనలు మీ ఎరుక లో ఉంటే తెలియ చేయండి. నా అనుభవం లో ,పెళ్లి అయిన తరువాత, పిచ్చి కుదరడం మాట అటుంచి , పిచ్చెక్కడం చాలా మంది లో చూశాను. ! క్రితం టపాలలో చూసినట్టు, ఈ రకమైన పిచ్చి , పలు రకాలు గా ఉండడం కూడా గమనించాను.  ఇక పిచ్చి కుదరడానికి శాస్త్రీయం గా మందుల తో చికిత్స గురించి తెలుసుకుందాము ! ఈ మందులు కొన్ని రకాలు గా ఉంటాయి. 
1. mood stabilizers. వీటిని మన మూడ్ ను స్థిత పరిచే మందులు గా చెప్పుకోవచ్చు:
లిథియం : లిథియం ఒక ఖనిజం అంటే మినరల్. ఈ ఖనిజం యొక్క ఔషధ గుణాలూ , దానిని పిచ్చి చికిత్స లో చాలా కాలం నుంచీ ఉపయోగిస్తూ ఉన్నారు. పాశ్చాత్య దేశాలలో కొన్ని క్షార సరస్సులలోని నీరు తాగమని సలహా ఇచ్చే వారు. మీకు తెలిసే ఉంటుంది కదా ఆమ్లాలు పుల్ల గా ఉంటాయనీ క్షారాలు ఉప్ప గా ఉంటాయనీ. క్షార సరస్సులలో నీరు తాగిన వారికి పిచ్చి కుదిరేది. కానీ ఇటీవల పరిశోధనల వల్ల, ఆ క్షార సరస్సులలో ఉన్న నీటి లో ఖనిజాలు , ప్రత్యేకించి లిథియం అనే ఖనిజం ఉందని కనుక్కునారు. జాన్ కేడ్ అనే ఆస్త్రేలియన్  మొట్టమొదటి సారి శాస్త్రీయం గా లిథియం యొక్క ఔషధ గుణాలను, పిచ్చి కి చికిత్సలో లిథియం యొక్క ఉపయోగాలూ వివరించాడు తన పరిశోధనా పత్రం లో.( 1949 ). గత యాభై ఏళ్ల గా లిథియం ను మానియా లేదా పిచ్చి చికిత్సకూ , నివారణకూ , ప్రపంచం అంతా ఉపయోగిస్తున్నారు. లిథియం ఒక మోతాదు లో తీసుకుంటే పిచ్చి పోవడమే కాకుండా , నివారణ కు కూడా ఒక మంచి ఔషధం గా పనిచేస్తుంది. కాక పొతే  ఈ లిథియం తీసుకుంటున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  వారు కిడ్నీ అంటే మూత్ర పిండాలు , ఇంకా థైరాయిడ్ పరీక్షలు ప్రతి ఆరు నెలలకు ఒక సారి చేయించు కుంటూ ఉండాలి. అంతే కాక  వారి రక్తం లో లిథియం ఏ పాళ్ళ లో ఉందో కూడా క్రమం గా పరీక్ష చేయించు కుంటూ ఉండాలి. దీనిని లిథియం లెవెల్స్ టెస్ట్ అంటారు.
2. anti psychotics:  వీటిని మన ఆలోచనలను సవ్యం చేసే మందులు గా చెప్పుకోవచ్చు.  కొట యపిన్ , రిస్పరిడోన్, ఒలాంజాపిన్ అనే మూడు ప్రధానమైన యాంటీ సైకాటిక్ మందులు పిచ్చి చికిత్స లో వాడ బడుతున్నాయి.
3. anti epileptics: వీటిని మూర్చ నివారణ మందులు అని తెలుగులో అంటారు.  వాల్ప్రోఎట్ , కార్బమజపిన్ అనే మందులు ప్రధానం గా మూర్చల నివారణకు వాడుతారు. కానీ ఈ మందులు పిచ్చి నివారణకు కూడా బాగా ఉపయోగ పడతాయి. ఈ విషయం అనేక పరిశోధనల వల్ల తెలిసింది. అందువల్ల ఈ మందులను కూడా విరివి గా పిచ్చి నివారణలో కూడా వైద్యులు రికమెండ్ చేస్తారు. 
4.anti depressants: ఈ మందులను యాంటీ దిప్రేస్సేంట్ లు అంటారు. ఈ మందులు ప్రధానం గా వెన్లా ఫాక్సిన్ , ఫ్లూఆక్సిటిన్ వంటి డిప్రెషన్ కు చికిత్స గా ఉపయోగించే మందులు. కానీ పిచ్చి లో కూడా ఈ మందులు ఎందుకు ఉపయోగిస్తారంటే, పిచ్చి తగ్గగానే వారు డిప్రెషన్ కు లోనవటానికి అవకాశాలు ఎక్కువ. ఆ సమయం లో వారు డిప్రెషన్ తో బాధ పడకుండా యాంటీ దిప్రేస్సంట్ లు వేసుకుంటూ ఉండాలి.  మనకు తెలుసు కదా డిప్రెషన్లో  మానసిక స్థితి క్రుంగి పోయే విధం గా ఉంటుందని. ఈ మూడ్ పైకి పోయి పిచ్చి రూపం లో ఉండడం , అట్లాగే క్రుంగి పోయి , డిప్రెషన్ రూపం లో ఉండడం వల్లే  ఈ వ్యాధిని రెండు భిన్న ధ్రువాల వ్యాధి అంటే బై పోలార్ డిసార్డర్  అంటారు శాస్త్రీయం గా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

‘ పిచ్చి’ సంగతులు, తెలుసుకోవడం మంచిదే !.6.

In మానసికం, Our minds on జూలై 13, 2012 at 11:36 ఉద.

పిచ్చి సంగతులు తెలుసుకోవడం మంచిదే !.6.

మెదడులో ఏ మార్పులు పిచ్చి కి కారణమవుతాయి?: 
ఈ కారణాలను మనం అయిదు రకాలు గా తెలుసుకోవచ్చు.
1. ( మెదడు లో ) నిర్మాణాత్మక తేడాలు, మార్పులు: 
పక్ష వాతం అంటే స్ట్రోక్ వచ్చిన వారిలోనూ, ప్రమాద వశాత్తూ తలకు గట్టి దెబ్బ తగిలి తద్వారా మెదడు లో కొంత భాగం దెబ్బ తిన్న వారిలోనూ , ఇంకా మెదడు లో కంతులు అంటే ట్యూమర్లు   ఉన్న వారిలోనూ పిచ్చి లక్షణాలు ఉండడం జరుగుతుంది. దీని వల్ల వైద్యులకు, మెదడు లో నిర్మాణాత్మక మార్పులు వస్తే, ఆ మార్పులు పిచ్చి కి దారి తీస్తాయి అని తెలిసింది.
2. ( మెదడు ) పని చేయడం లో తేడాలు , మార్పులు: మెదడు రక్త సరఫరా లో జరిగే మార్పులను విశదం గా అధ్యయనం చేసి ( అంటే ప్రత్యేకమయిన స్క్యాన్ ల ద్వారా , వీటిని ఫంక్షనల్ మాగ్నెటిక్ రిసోనేన్స్  fMRA  స్క్యాన్ అంటారు ) పిచ్చి వచ్చిన వారి మెదడు లో ఒక భాగం లో ( దీనిని DLPFC అంటారు ) రక్త సరఫరా లోపం ఉందని గమనించడం జరిగింది.
3. ( మెదడు లోని ) జీవ రాసాయనాలలో తేడాలు , మార్పులు: నార్ ఎపినెఫ్రిన్ , డోపమిన్, గ్లుటామేట్, ఇంకా జీ ప్రోటీన్లు అనే జీవ రసాయనాలూ , సి ఆర్ ఎఫ్ ( CRF ) అనే హార్మోను లో మార్పులు కూడా పిచ్చి ఉన్న వారి మెదడు లో గమనించడం జరిగింది.మిగతా జీవ రసాయనాల వివరాలు పైన ఉన్న పటం లో చూడ వచ్చు. ఈ చిత్రం లో ఆకు పచ్చ గానూ , పర్పుల్ రంగులోనూ రెండు బుడిపెలు గమనించారా ? అవి బాగా స్థూలం గా చూప పడిన , యదార్ధానికి అతి సూక్ష్మం గా ఉండే నాడీ తంత్రుల చివరలు లేదా మొనలు. ఆ ప్రదేశం లో జీవ పటం లో వివరించినట్టు గా, వివిధ జీవ రసాయనాలు , వివిధ సంజ్ఞలను , లేదా సిగ్నల్స్ ను ఒక నాడీ తంత్రి చివర నుంచి, ఇంకో తంత్రి చివరకు సరఫరా చేస్తాయి. ఇట్లా సిగ్నల్స్ ప్రయాణం చేయడం లో లోపం అంటే అవి ఎక్కువగా , అతి వేగం గా ప్రయాణం చేసినా , లేదా తక్కువ గా, అతి నెమ్మది గా ప్రయాణం చేసినా , ఆ ప్రభావం మన ఆలోచనల మీద ఉంటుంది. చిత్రం గా ఉంది కదూ సృష్టి రహస్యం ! 
4. ( మెదడు లో ) సిగ్నల్ ట్రాన్స్ డక్ షన్  లో మార్పులు: 
మన దేహం లో ప్రతి కణమూ , అత్యంత సున్నితం గా ఉంటుంది. అంతే కాక , ప్రతి కణమూ, కొన్ని ప్రత్యేకమైన జీవ రసాయనాలను, హార్మోనులను మాత్రమే తనలోకి , అంటే కణం లోపలికి అనుమతిస్తుంది. మన దేహం లో ప్రతి చర్యా , హార్మోనులూ, జీవ రసాయనాలూ , ఒక చోటినుంచి అంటే ఒక కణం నుంచి , ఇంకో కణానికి పంపటం వలననే జరుగుతాయి. అట్లాగే మన మెదళ్ళలో కూడా , ప్రతి  సంజ్ఞా , ప్రతి ఆలోచనా , ఒక కణం నుంచి, ఇంకో కణానికి ప్రయాణం చేస్తే నే మన ఆలోచనలు క్రియా రూపం దాల్చుతాయి. ఈ ఆలోచనలు క్రియా రూపం దాల్చడానికి సిగ్నల్ ట్రాన్స్ డక్ షన్  అనే జీవ క్రియ చాలా ముఖ్యమైనది. క్రింద ఉన్న చిత్రం చూడండి.
 పిచ్చి ఉన్న వారిలో ఈ సిగ్నల్ ట్రాన్స్ డక్ షన్ లో మార్పులు వస్తాయి.
పై కారణాలు తెలుసుకోవడం ఎందుకంటే , చికిత్స జరిగే సమయం లో , మనకు  మందులు ఎందుకు వాడడం జరుగుతుందో అర్ధం కావడానికి.   ఉదాహరణకు , మూడవ కారణాన్ని సరి చేయడానికి కొన్ని మందులు పనికి వస్తాయి. అట్లాగే నాల్గవ కారణమైన సిగ్నల్ ట్రాన్స్ డక్ షన్ ను సరి చేయడానికి కొన్ని మందులు ఉపయోగ పడతాయి.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

పిచ్చి సంగతులు , తెలుసుకోవడం మంచిదే !.5.

In మానసికం, Our minds on జూలై 12, 2012 at 5:25 సా.

పిచ్చి సంగతులు , తెలుసుకోవడం మంచిదే !.5.

క్రితం టపాలో మరి పిచ్చి వస్తే, ఎట్లా కనుక్కోవచ్చో , దాని గురించి కొంత తెలుసుకున్నాము కదా !  పిచ్చి, మానవ మస్తిష్కం విపరీతమైన వేగం తో ఆలోచనలు వచ్చినప్పుడు , ఆ వేగం తో వస్తూన్న ఆలోచనల ప్రభావం , మన ప్రవర్తన లో కూడా కనిపించి , ప్రవర్తన అస్తవ్యస్త మవటం వల్ల  వస్తుంది. మస్తిష్కం లో ఆలోచనలు సామాన్యం గా ఉంటే ఆ స్థితి ని నార్మల్ మూడ్ లేదా యూ తైమిక్ మూడ్ అంటాము. అదే అత్యంత వేగానికి విరుద్దం గా , ఆలోచనలు కనుక అత్యంత నిదానం గా వస్తూ ఉంటే, మనం స్లో అవుతాము. డిప్రెషన్ వచ్చినప్పుడు అట్లా జరుగుతుంది. ఈ క్రింది పటం గమనించి నట్టయితే మనకు విశదమవుతుంది ఈ మూడ్ స్థితులు. ఆంగ్లం లో ఉన్నాయి పదాలు కానీ శులభం గా అర్ధమవుతాయి , అందరికీ ! 
 
ఇప్పుడు మనం మానియా కూ , హైపో మానియా కూ తేడాలు చూద్దాము. హైపో అంటే  తక్కువ , లేదా క్రింద అని అర్థం. మనం సాధారణం గా చూస్తూ ఉంటాము , అనుకుంటూ కూడా ఉంటాము ఎవరైనా , విపరీతం గానూ , ఎక్కువ హడావిడి గానూ ప్రవర్తిస్తూ , అటూ ఇటూ తిరుగుతూ ఉంటే , వీడెవడో యమ హైపర్ ‘ అని. హైపర్ అంటే ఎక్కువ లేదా ఎగువ అని అర్థం. మనం సామాన్యం గా అనుకునే హైపర్  స్థితి  శాస్త్ర రీత్యా  హైపో మానియా గా చెప్పుకోవచ్చు.  అంటే హైపో మానియా లక్షణాలు, వంద శాతం పిచ్చి లక్షణాలు గా కాక , ఏ యాభై , అరవై శాతమో ఉంటాయి. అంటే ఈ హైపో మానియా లక్షణాలు, ఉన్న వారు , సమాజం లో చాలా మంది ఉంటారు. బహుశా , నిజం గా పిచ్చి ఉన్న వారికంటే ఎక్కువ శాతం ఉంటారు. వారిలోని పిచ్చి లక్షణాలు, ఆందోళన పడ వలసిన లక్షణాలైనా,  మరీ విపరీతం గా , వెంటనే ఆస్పత్రి లో చేర్పించ వలసినంత అత్యవసరం గా ఉండవు. వీరిలో అంటే హైపో మానియా ఉన్న వారిలో రిస్కు టేకింగ్ బిహావియర్ రవంత తక్కువ గా ఉంటుంది , మానియా ఉన్న వారిలో ఉండే దానికంటే ! 
 
ఈ క్రింద పటం చూడండి , మీకు  శులభం గా అర్ధమవుతాయి , ఈ తేడాలు ! 
ఇక్కడ మొదట ఉన్నది  డిగ్ ఫాస్ట్ అనే పదం అంటే ఆంగ్లంలో ఉన్న అక్షరాలు DIGFAST  ఈ అక్షరాలతో ప్రారంభ మయే  ఆంగ్ల పదాలు, మానియా లో అంటే వంద శాతం పిచ్చి లో ఉండే లక్షణాలు. ( మానియా ను బై పోలార్ వన్ అని శాస్త్రీయం గా అంటారు )దాని క్రింద ఉన్న పటం లో ఉన్నవి , హైపో మానియా లక్షణాలు ( దీనినే బై పోలార్ టూ అని శాస్త్రీయం గా అంటారు , ఎపిసోడ్ అంటే ఒక సారి వచ్చిన వ్యాధిని సింగిల్ ఎపిసోడ్ అంటారు. )
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !