Our Health

Archive for the ‘ప్ర.జ.లు.’ Category

విటమిన్లూ ( ఖ ) నిజాలూ !

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 5, 2012 at 8:10 సా.

విటమిన్లూ ( ఖ ) నిజాలూ ! :


విటమిన్లు, ఖనిజాలూ, మన దేహం లో ఉండవలసిన అతి ముఖ్యమైన పదార్ధాలు ! అవి మనం రోజూ తినే ఆహారం ద్వారా మన శరీరం లో ప్రవేశిస్తాయి. అన్నం, పప్పు, కూరలు ,లాగా మనకు కనిపించే పరిమాణం లో కాక చాలా సూక్ష్మ పరిమాణం లో మన శరీరానికి అందాలి విటమిన్లూ , ఖనిజాలూ ! అంటే మిల్లీ గ్రాములూ , మైక్రో గ్రాముల పరిమాణం లో ఇవి మనకు కావాలి ! కానీ ఈ సూక్ష్మ పరిమాణం లో కూడా మనకు రోజూ అంద వలసిన విటమిన్లూ , ఖనిజాలూ మనకు ఏ కారణం చేతనైనా అందక పొతే , వాటి పరిణామాలు విపరీతం గా ఉంటాయి ! అంతేకాదు , మన ప్రాణాలకే ముప్పు కావచ్చు , ఈ విటమిన్లూ , ఖనిజాలూ మన దేహం లో ఉండ వలసిన పరిమాణం కన్నా తక్కువ గా ఉంటే !
మనం కొంత కాలం ఆహారం లేక పోయినా , బలహీన పడతాము కానీ పరిస్థితులు చాలా రోజుల వరకూ విషమించవు , కానీ విటమిన్లూ ఖనిజాలూ – వీటి లోపం తీవ్రం గా ఉంటే , చాలా తక్కువ సమయం లోనే తీవ్ర పరిణామాలను మన దేహం ఎదుర్కోవలసి వస్తుంది !
ఇంకో ముఖ్య విషయం : విటమిన్లూ , ఖనిజాలూ కేవలం వయసు మీరిన వారికే కాక , అన్ని వయసుల వారి ఆరోగ్యానికీ అత్యవసరం ! అందు వల్ల అందరూ ఈ విటమిన్లూ , ( ఖ ) నిజాలూ తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది !

వచ్చే టపా నుంచి ఈ విషయాలు తెలుసుకుందాం ! మన ఆరోగ్యం కోసం ! మన బాగు కోసం !

కలలూ – వాటి అంతరార్ధాలూ. 8.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 2, 2012 at 5:32 సా.

కలలూ – వాటి అంతరార్ధాలూ. 8.

పక్షులు కలలో కనిపిస్తే: ఈ రకమైన కలలు అనేక విధాలు గా అర్ధం చెపుతాయి. సామాన్యం గా ఒక పక్షుల గుంపు కనక కలలో కనిపిస్తే , అది మీరు కోరుకునే స్వేచ్చ , స్వాతంత్ర్యానికి ప్రతీక ! మీకు ( కలలో ) కనిపించే పక్షులు కనుక తెలుపు రంగులో ఉంటే అది మీ ప్రేమ, దయా గుణాలను సూచిస్తుంది. పక్షులు నల్ల రంగులో ఉంటే మీరు మంచి వార్తలను , చెడు వార్తలను కూడా త్వరలో విన బోతున్నారని సంకేతం ! ఎర్ర రంకులో కనుక ఆ పక్షులు వుంటే అది మీ హృదయాన్ని తెలుపుతుంది , మీ హృదయం విశాలమైనదని కూడా తెలుపుతుంది. నీలం రంగు పక్షులను కలలో చూస్తే , అది మీ భవిష్యత్తు దిశా నిర్దేశనం చేస్తున్నట్టు ! పసుపు పచ్చని పక్షులు కలలో వస్తే , అది ఆనందాన్నే కాకుండా , కొంత పిరికి తనాన్ని కూడా తెలుపుతుంది , సందర్భాన్ని బట్టి ! పక్షుల గుడ్లు కనుక కలలో కనిపిస్తే మీకు త్వరలో ధన యోగం ఉందని అర్ధం. అంటే మీకు ధనం చేకూరుతుంది త్వరలో !
పడక గది : పడక గది మీకు కలలో కనిపిస్తే , అది మీలో ఉన్న , నిగూఢ మైన , రహస్యమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. అంతే కాక అది మీ లో ఉన్న సృజనాత్మక శక్తి ని కూడా తెలుపుతుంది. పడక గది లో ఇంకో వ్యక్తి తో కనుక ప్రణయం , రతి క్రియలో పాల్గొన్నట్టు కల వస్తే , మీకు ఆ వ్యక్తి తో ఉన్న గాఢ సంబంధాన్ని సూచిస్తుంది. మీ సృజనాత్మక శక్తి ని కూడా ప్రతి బింబిస్తుంది. అదే మీరు మీ పడక మీద నిద్ర సరిగా పోక , పీడ కలలు వస్తూ ఉంటే , మీ ఇరువురి మధ్య , ఉన్న కలతలను , సమస్యలను సూచిస్తుంది.

పడవ : మీ కలలో మీరు పడవ మీద ప్రయాణం చేస్తున్నట్టు అనిపిస్తే , మీ హృదయాంత రాళాల ను , మీరు తరచి చూసుకుంటున్నారని అర్ధం ! అంటే మీ మనసు మూలల్లో ఉన్న అనేక అనుభూతుల పరంపరను మీరు జాగ్రత్తగా విశ్లేషణ చేయడానికి పూనుకుంటున్నట్టు ! మీరు ఆ పడవ తో పాటుగా నీటి లోతుల్లోకి పోతూ ఉంటే , మీ ఎమోషన్స్ ను సరిగా విశ్లేషించు తున్నట్టు , అదే మీరు , అలల తాకిడి కి తట్టుకుని , ఆ పడవలో తీరాలకు పోతూ ఉంటే , మీ లో ఉన్న వివిధ అనుభూతులను, భావోద్రేకాలనూ, అధిగమించి , తీరాన్ని చేరుకున్తున్నట్టు సూచన ! అదే పడవ ఆటు పోట్లకు తట్టుకో లేక ముక్కలయినట్టు కల వస్తే , మీరు, మీ ప్రణయ సంబంధాలలో , తొందర పడుతున్నారనడానికి సూచన. అప్పుడు , మీరు , ఆచి , తూచి, అడుగులు వేయాలి , నిర్ణయాలు తొందర పడకుండా, తీసుకోవాలి !

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కలలూ – అంతరార్ధాలూ.7.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 1, 2012 at 7:12 సా.

కలలూ – అంతరార్ధాలూ.7.


ఉచ్చారణ :
కలలో మీకు వివిధ యాక్సెంట్ లతో అంటే వేరు వేరు ఉచ్చారణ లతో మాట్లాడుతున్న వారు కనిపించడం జరిగితే , అది మీకు అర్ధం కాక పోతూ ఉంటె , మీరు మీ భావాన్ని, మీ అనుభూతులనూ , సరిగా ఇతరులకు , తెలియ చేయ లేక పోతున్నట్టు అనుకోవచ్చు. అంతే కాక , మీరు మీ జీవితం లో ఎదుర్కునే అనేక పరిస్థితులలో , మీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేక , తడ బడుతున్నారనుకోవచ్చు.
ప్రమాదం జరిగినట్టు కల వస్తే : ఈ విధం గా కల రావడం సామాన్యం గా జరుగుతూ ఉంటుంది. ఈ కల ముఖ్యమైనది కూడానూ ! అందువల్ల మీకు వీలైనంత గా ఈ కల గురించి నోట్ చేసుకోవాలి ! ఏ ప్రమాదమైనా జరిగినట్టు కల కనుక వస్తే , అది , మీలో పేరుకు పోయిన లేదా నిగూ ఢ మై ఉన్న అనేక మానసిక సంఘర్షణలు , ఉద్రిక్త హావ భావాలూ , కోపోద్రేకాలకూ సంకేతం ! అంటే ఈ రకమైన ఎమోషన్స్ ఎదో విధం గా బయట పడడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అందువల్ల మీరు ఈ అపరిష్కృతం గా ఉన్న ఎమోషన్స్ మీద మీ దృష్టి కేంద్రీకరించి , వాటి పరిష్కార మార్గాలు వెతకాలి ! వివిధ వాహనాలలో ప్రయాణం , ప్రమాదానికి లోనవుతే , వివిధ అర్ధాలు ఉంటాయి.
విమానాలు: చాలా మంది కి విమానాలు కలలో వస్తూ ఉంటాయి. ఈ కలల అర్ధాలు పరిశీలిద్దాము.
విమానాశ్రయం : మీరు కేవలం విమానాశ్రయం కలలో చూస్తే మీ జీవితం లో ఒక ముఖ్యమైన ఘట్టం జరగ పోతున్నట్టు , అంటే ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ అన్న మాట. మీరు ఆ పరిస్థితి లో ఏ నిర్ణయం సమంజసమైనదో తెలియక సందిగ్ధం లో ఉంటారు. అంతేకాక విమానాశ్రయం మీకు ఒక హాలిడే ఆవశ్యకతను కూడా సూచిస్తుంది.
విమానం లో ఎగురుతూ ఉంటే : విమానాన్ని మీరే నడిపిస్తూ ఎగురుతూ ఉంటే , మీ జీవిత గమనం లో మీరు పూర్తి కంట్రోలు తో అంటే నియంత్రణ తో ముందుకు సాగి పోతున్నట్టు. అదే ఇంకెవరైనా విమానాన్ని నడుపుతూ , మీరు కేవలం వారితో ప్రయాణం చేస్తూ ఉంటె , మీ జీవితాన్ని ఇంకెవరో నియంత్రించు తున్నట్టు , అందులో మీ ప్రమేయం తక్కువ గా ఉన్నట్టు అనుకోవాలి.
మీ ఎదురుగా విమానం ఎగురుతూ ఉంటే : మీరు నుంచుని చూస్తూ ఉన్నప్పుడు, మీ ఎదురుగా విమానం గాలిలో ఎగురుతున్నట్టు కల వస్తే, మీరు మీ ఆశయాలనూ, గమ్యాలనూ సరిగా, ఉన్నతం గా నిర్దేశించు కున్నారనీ , ఆ గమ్యాలు మీరు అందుకో గలవేననీ కూడా అనుకోవచ్చు.కానీ మీ ఎదురుగా విమానం కూలి పోయినట్టు కల వస్తే, మీ పధకాలు సఫలీకృతం కాలేక పోతాయి అని సూచిస్తుంది. అప్పుడు మీ పధకాలను రివ్యూ అంటే పునశ్చరణం చేసుకుని, లోపాలను సరి దిద్దుకోవాలి !
మీరు విమానం, అంటే  ఫ్లయిట్  మిస్ అయినట్టు కల వస్తే : ఈ కల మీ లో ఉన్న ప్రయత్న లోపాన్ని తెలియ చేస్తుంది. అంటే మీరు తీసుకో బోయే కీలకమైన నిర్ణయాలలో , ఎదో లోపం ఉందని . అప్పుడు మీరు మీ నిర్ణయాలనూ , లక్ష్యాలనూ మళ్ళీ పరీక్షించుకుని , తదనుగుణం గా మార్పులు చేసుకోవాలి విజయ పధం వైపు దూసుకు పోయే విధం గా !

వచ్చే టపాలో ఇంకొన్ని కలలూ , వాటి అంతరార్ధాలూ !

కలలూ , అంతరార్ధాలూ . 6.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on నవంబర్ 30, 2012 at 7:57 సా.

కలలూ , అంతరార్ధాలూ . 6.

https://i0.wp.com/www.buzzle.com/img/articleImages/401219-109-8.jpg

1. వదిలి వేయడం  :
నిద్రలో మిమ్మల్ని మీ తల్లి దండ్రులు గానీ , స్నేహితులు గానీ , లేదా భార్య , లేదా ప్రియురాలు , లేదా ప్రియుడు ఏ ప్రదేశం లో నైనా వదిలి వెళ్లి పోతున్నట్టు మీకు కల వస్తే , అది మీలోని అభద్రతా భావాన్ని తెలియ చేస్తుంది.
మీకు సహకారమూ , సహాయమూ అవసరమని కూడా సూచన ఇస్తుంది. ఈ సహాయ సహకారాలు మీరు చేస్తున్న లేదా చేయబోయే కార్యాల లో కావచ్చు , లేదా మీ జీవిత గమనం లో కావచ్చు. లేదా నిజ జీవితం లో మీరు నిజం గా మీరు కోల్పోయిన అత్యంత విలువైన వ్యక్తులను  స్పురణ కు తెస్తూ వచ్చే కల కావచ్చు ! ఇట్లా కల రావడం మీ లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించు కోవలసిన అవసరాన్ని తెలియ చేసే సూచన కావచ్చు !
ఇట్లాంటి కల కనుక మీకు తరచూ వస్తూంటే , మీ బాల్యం నుంచీ మనసు మూలల్లో దాగున్న అభద్రతా భావాన్ని సూచిస్తున్నట్టు భావించ వచ్చు ! ఆ సందర్భం లో మీరు ఆ కారణాలను విశ్లేషించుకుని , సరి చేసుకుంటే , అట్లా కలలు రావడం తగ్గుతుంది. అదే, మీ అంతట మీరు ఎవరి ప్రమేయమూ లేకుండా మీరు ఉన్న చోటిని కానీ , చేస్తున్న పనిని కానీ అసంపూర్ణం గా వదిలి వేసి వెళ్లి పోతున్నట్టు కల కనుక వస్తే , అది మీ బాధ్యతా రాహిత్యాన్ని చెపుతుంది ! అంటే మీరు చేస్తున్న పనిని శ్రద్ధ తో చేయకుండా ” ఆ పనిని దాటవేయ డానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా అనుకోవచ్చు. మీరు మీ జీవితం లో ముఖ్య మైన నిర్ణయాలు తీసుకోవడం లో మీరు సందిగ్ధం లో పడతారని కూడా ఇట్లాంటి కలలు తెలియ చేస్తాయి. అప్పుడు మీరు తక్షణ కర్తవ్యం గా ఆ పనిని బాధ్యతా యుతం గా చేయడానికి పూనుకోవాలి ! 

2. ఎత్తుకు పోవడం , అమాంతం గా తీసుకు పోవడం :
మీకు కలలో మిమ్మల్ని అమాంతం గా , అంటే ఒక్క సారిగా , లేదా బలవంతం గా మీరు ఉన్న చోటి నుంచి కానీ , మీరు నిద్రలో ఉన్నప్పుడు తట్టి లేపి కానీ, మీకు తెలియని చోటికి కనుక తీసుకు వెళుతున్నట్టు కల వస్తే , వెంటనే మీకు మెలకువ కూడా వచ్చి చాలా ఆందోళన పడడం కూడా జరుగుతుంది. ఈ రకమైన కల సామాన్యం గా మీకు బాగా సన్నిహితం గా ఉన్న వ్యక్తులు , మీ ఇష్టా ఇష్టాలతో ప్రమేయం లేకుండా , మీ జీవితాన్ని నియంత్రించు తున్నట్టు , లేదా తమ గుప్పెట లో పెట్టుకోవాలని చూస్తున్నట్టు అనుకోవచ్చు. ఆ పరిస్థితులలో మీరు , మీ జీవిత నావ చుక్కాని ని మీరే తీసుకుని అలలు , ఆటు పొట్ల దిశ గా కాకుండా , ఆనంద తీరాల వైపు మరల్చు కోవాలి ! అంటే , ఇతరుల ” మాయ ” మాటలకు తల ఊపకుండా , మీ సహజ వ్యక్తిత్వాన్ని బలోపేతం చేసుకోవాలి. ఒకరు ఇంకొకరిని బలవంతం గా తీసుకు పోతుంటే , మీరు కేవలం మూడో వ్యక్తిగా ఆ ప్రదేశం లో ఏమీ చేయకుండా నుంచున్నట్టు కనుక కల వస్తే , అది మీ జీవితం లో మీరు తీసుకునే నిర్ణయాల లో మీ నిస్సహాయ స్థితిని సూచిస్తుంది.

వచ్చే టపాలో ఇంకొన్ని కలల అర్థాలు తెలుసుకుందాం !

కలలు నిజమేనా?1.

In ప్ర.జ.లు., మానసికం, Our minds on నవంబర్ 17, 2012 at 9:29 ఉద.

 కలలు నిజమేనా?.1.

కలలు నిజమో కాదో తెలుసుకునే ముందు మనం అసలు కలలు ఏమిటో చూద్దాం!
కలలు శాస్త్రీయం గా, మన అనుభూతులు, ఆలోచనలల ప్రవాహాలు. ఈ ప్రవాహాలలో అత్భుత చిత్రాలు అంటే ఇమేజెస్ ఉండవచ్చు , లేదా మనసుకు నచ్చే ( లేదా భరించ లేని ) శబ్దాలు కానీ సంగీతం గానీ ఉండవచ్చు!
ఈ వివిధ భావోద్వేగాల ప్రవాహాలు అప్రయత్నం గా అంటే మన ప్రమేయం లేకుండా నే నిద్రలో నిద్రలో ఉన్నప్పుడు వస్తుంటాయి. వీటినే మనం కలలు అంటాము !
ఈ  అనుభూతులు, అనుభవాలు కలలో ఎందుకు వస్తాయీ అన్న ప్రశ్నకు ఇంత వరకు ఖచ్చితమైన సమాధానం దొరకలేదు !
మన నిద్ర సహజం గా కొన్ని దశలలో ఉంటుంది , ఒక కారు కనక వివిధ వేగాలతో రోడ్డు మీద ప్రయాణం చేసినట్టు ! ఆ వివిధ దశలలో మన మెదడు లో కూడా తదనుగుణం గా మార్పులు వస్తూ ఉంటాయి. నిద్రలో ఒక దశను రెమ్ స్లీప్ అంటారు అంటే REM sleep or Rapid Eye Movement sleep అని. ఈ దశ మనకు ఎందుకు ముఖ్యం అంటే కలలు సామాన్యం గా ఈ దశలో నే వస్తూ ఉంటాయి. ఈ దశలో మన కళ్ళు తదేకం గా కదులుతూ ఉంటాయి మనకు తెలియ కుండానే ! నిద్రలో మిగతా దశలలో కూడా కలలు వచ్చినా అవి అస్పష్టం గా ఉండి మనం తేలిక గా మర్చిపోయే లా ఉంటాయి. అంటే ఆ కలలను మనం అంత సులువు గా స్పష్టం గా గుర్తు కు తెచ్చుకోలేము !
మరి మన కలలు ఎంత సేపు వస్తాయి ?: సామాన్యం గా కొన్ని క్షణాలు మాత్రమె ఉంటాయి ఈ స్వప్నాలు. కానీ అధికం గా ఇరవై నిమిషాల వరకూ ఉండవచ్చు కొన్ని సమయాలలో !
మనకు వచ్చే ఈ కలలు రెమ్ స్లీప్ లో కనక మనం ఆ నిద్ర నుంచి లేస్తే కానీ లేదా ఎవరైనా మనలను నిద్ర నుంచి లేపితే కానీ , ఆ సమయం లో వచ్చిన కలను మనం చాలా వరకు గుర్తు కు తెచ్చుకో గలము !
ఒక నిద్రలో ఎన్ని కలలు వస్తాయి ?: సామాన్యం గా మనం మూడు నుంచి అయిదు కలలు కంటాము ఒక నిద్ర లో కానీ కొందరు డ్రీ మర్స్ ఏడు కలలు కూడా కనగలరు !
మనం రమారమి ఎనిమిది గంటలు కనక నిద్ర పొతే , ఆ నిద్రలో కనీసం రెండు గంటలు కలల ప్రపంచం లో విహరిస్తూ ఉంటాం!

కలలు మన నిజ జీవితానికీ , మన అంతర్ముఖానికీ అంటే మన మనసులలో ( అంటే మస్తిష్కాలలో ) దాగిన అనుభూతుల, లేదా ఆలోచనల పరంపర లకు ఒక వారధి గా భావించ బడుతుంది. ఈ కలలు అనేక విధాలు గా ఉండవచ్చు. ఏవిధం గా ఉన్నా మన కలలను మనం నియంత్రించ లేము ! అంటే ఆ కలలు మన స్వాధీనం లో ఉండవు ! కేవలం ఆ కలల అనుభూతులు మాత్రమె మనకు మిగులుతాయి !
కొన్ని సమయాలలో ఆనూహ్యం గా మన కలలు, మన జీవితాలలో స్ఫూర్తి ని కలిగించి మనకు ఒక మంచి ఆలోచనను కలిగించడమో లేదా ఒక ఉన్నత భవిష్య మార్గ నిర్దేశనం చేయడమో చేస్తాయి !
ఉదా : కేకులె అనే ఒక జర్మన్ రసాయన శాస్త్రజ్ఞుడు బెంజీన్ అనే ఒక రసాయన నిర్మాణం తనకు కలలో కనిపించిన్దన్నాడు. ఆ నిర్మాణం శాస్త్రీయం గా రుజువు అవడమే కాకుండా , ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా సేంద్రియ రసాయన శాస్త్రం లో జరిగిన అత్యత్భుత ఆవిష్కారం గా ఇప్పటికీ పరిగణింప బడుతుంది !

మరి ఈ కలల శాస్త్రాన్ని ఏమంటారో చెప్పలేదు కదూ , దానిని ఒనీరాలజీ అంటారు( Oneirology ) ( కంగారు పడకండి పదం చూసి , గ్రీకు బాష లో ఒనీరోస్ అంటే నిద్ర , లజీ అంటే శాస్త్రం )

 

ఇంకొన్ని వివరాలు వచ్చే టపాలో తెలుసుకుందాం !

 

 

నిజమైన ప్రేమ.3.

In ప్ర.జ.లు., మానసికం, Our minds on నవంబర్ 11, 2012 at 9:21 సా.

నిజమైన ప్రేమ.3.

ఎటాచ్ మెంట్ : నిజమైన ప్రేమ ఆప్యాయత తో నిరంతరం వర్ధిల్లుతూ ఉంటుంది. ఒక మాత్రు మూర్తి శిశువు తన గర్భం లో ప్రవేశించిన సమయం నుంచీ , తాను తుది శ్వాస తీసుకునే వరకూ , తన సంతానం మీద ఒకే రకమైన అవ్యాజమైన అనురాగం , ఆప్యాయత చూపిస్తూ ఉంటుంది. ఆ ఆపేక్ష లేదా ఎటాచ్ మెంట్ ఆ రకం గా వర్ధిల్లుతూ ఉంటుంది.
అదే రకం గా నిజమైన ప్రేమికుల ప్రేమ కూడా ఆప్యాయత , ఆపేక్ష తోలి చూపు నుంచి చిగురించి , దిన దిన ప్రవర్ధ మానమవుతుంది ! ఆ ఎటాచ్ మెంట్ అట్లా ప్రేమికులిరువురి లోనూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక విధం గా చెప్పుకోవాలంటే దీర్ఘ కాలిక ప్రేమే ఎటాచ్ మెంట్ ! ప్రేమ పెరుగుతూ ఉంటే , దానితో పాటుగా ఎటాచ్ మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది !

కమిట్ మెంట్ : ప్రేమ పురోగమిస్తూ ఉన్న కొద్దీ ప్రేమికులు ఇరువురూ పరస్పరం కమిట్ మెంటు తో ( ప్రేమ ) జీవితం సాగిస్తూ ఉంటారు. ప్రేమ సాగర మధనం చేస్తూ ఉంటారు! ఎవరైనా ప్రియుడి ప్రవర్తన కామెంట్ చేసి ” అతడు ఎప్పుడూ చాలా సైలెంట్ గా ఉంటాడు. ఎక్కువగా మాట్లాడడు ” అని ఎవరైనా అంటే మీరు వెంటనే ” ఔను. అతను చాలా గంభీరం గా , ధైర్యం గా, ధీమా గా ఉంటారు ” అని అతని లోని పాజిటివ్ లక్షణాలను  తెలియ చేస్తారు, మీ ఇరువురి మధ్య ప్రేమ ఘాటు గా ఉంటే ! అంటే కమిట్ మెంటు తో ఉంటే ! అదే కమిట్ మెంటు కనుక లోపిస్తే ” అతను నాతోటీ అంతే ! ఒక పట్టాన మాట్లాడడం అతి కష్టం ! మనసులో ఏమి ఆలోచిస్తూ ఉంటాడో ఏమిటో !? అని అతని నెగెటివ్ లక్షణాలను అంటే లోపాలను వల్లె వేస్తూ ఉంటారు !
ఇంటిమసీ : నిజమైన ప్రేమ అంటే సన్నిహితం కూడా ! మనసులు కలిసినప్పుడు , పరస్పరం ఇరువురూ ఎప్పుడూ సన్నిహితం కోరుకుంటూ ఉంటారు! క్రమేణా , అతని లోని ప్రతి అణువూ ఆమెకు పిండి కొట్టినట్టు , ఆమెలోని ప్రతి అణువూ అతనికి కూడా అట్లాగే సంపూర్ణం గా అవగాహన అవుతుంది. గౌరీ శంకరులలాగా లో ఒకరు మమైకం అవుతారు. సన్నిహితం , స్నేహం గా మారి ఒకరి ఊపిరి లో ఇంకొకరి ఊపిరి గా ప్రేమ ప్రాణ వాయువు అవుతుంది !
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు !

మరి మీ మీద మనసు పడే అతడి బాడీ లాంగ్వేజ్ ఏమిటి?.7.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 28, 2012 at 6:54 సా.

మరి మీ మీద మనసు పడే అతడి బాడీ లాంగ్వేజ్  ఏమిటి?7. 

 

క్రితం టపా వరకూ , ఆమె మనో భావాలు , మాటలతో కాక తన బాడీ లాంగ్వేజ్ తో ఎట్లా తెలియ చేస్తుందో కొంత వరకు తెలుసుకున్నాం కదా  ! మరి అతడు తన మనసైన మగువ దగ్గర  ప్రవర్తన , మాట లేకుండా, అతడి బాడీ లాంగ్వేజ్ తో ఎట్లా కనుక్కోవచ్చు? 
జవాబు: కొంత వరకూ పురుషుడి బాడీ లాంగ్వేజ్ కూడా , తను మనసు  వారి దగ్గర ,   ఒకే లా ఉంటుంది. 
1. తలను  వంచడం: తాను  మనసు పడే  తరుణీ వైపు అతని తల సూర్య కాంతికి వంగే సూర్య కాంతి పుష్పం లా వంగుతుంది, అప్రయత్నం గానే ! మరి ఎందుకు వంగదు , తన జీవితం లో ఎంతో  కాంతి నింపే  కాంత  మీద మనసు పడి నప్పుడు ! 
2.ఎగరేసే అతడి  కనుబొమ్మలు ! : నిను వలచిన వాడి కనుబొమ్మలు కూడా  మీ మీద ఆసక్తి తో ఎగురుతూ ఉంటాయి తరచూ , మీరు ప్రక్కనే ఉన్నప్పుడు , లేదా ఎదురు గా ఉన్నప్పుడు ! 
3.నాసికా పుటాలు అంటే నాస్త్రిల్స్ : మీరు తనకు ఇష్టమైతే, ఆ పురుషుడి నాసికా పుటాల వ్యాసం పెరుగుతుంది. అంటే నాసికా రంధ్రాలు పెద్దవవుతాయి. మీరు దగ్గర ఉన్నప్పుడు , ఉద్వేగానికి లోనయినప్పుడు , జరిగే చర్య అది !  మీరు వెదజల్లే ప్రేమ సుగందానికి ముగ్దుడై కూడా   ఆ విధం గా జరగ వచ్చు ! 
4.చిలిపి నవ్వు : మీ మీద మనసు పడిన మగ వాడు , మీతో పరిచయం ఎక్కువ అవుతున కొద్దీ , చిలిపి నవ్వు లు కూడా ఎక్కువ చేస్తాడు !  మీ పొందు , మీతో పొందు , అతనికి చాలా సంతోషం గా ఉండడమే కాకుండా , అతనితో చిలిపి నవ్వులు చిందించి ,  మీలో ప్రేమ మొగ్గలు తొడిగిస్తుంది  !
ఈ నవ్వు అనేక రకాలు గా ఉండవచ్చు. కొన్ని సమయాలలో అతడు  పూర్తి  గా ఉండక తన  నోటిలో ఒక వైపు నుంచి కానీ లేక అన్ని వైపుల నుంచి కానీ వస్తుంది. కొన్ని సమయాలలో అతడు నోరు అంటే పెదవులు తెరవ కుండానే చిలిపి గా నవ్వుతాడు ! కానీ అన్ని ప్రయత్నాలూ , మీ మనసు తలుపులు మీరు తనకోసమై తెరవాలనే ఒకే ఒక్క తలపు తో ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! .

ఆమె మనసు, ఆమె ముఖం చూసి ఎట్లా తెలుసుకోవచ్చు ?.4.

In ప్ర.జ.లు., మానసికం, Our minds on అక్టోబర్ 24, 2012 at 10:51 సా.

ఆమె మనసు, ఆమె ముఖం చూసి ఎట్లా తెలుసుకోవచ్చు ?.4.

క్రితం టపాలో ఆమె మనసు, ఆమె చూపుల వాలకం చూసి,  ఆ ఎక్కు పెట్టిన చూపుల బాణాల వాడి చూసి , ఎట్లా తెలుసుకో వచ్చో , తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు ఆమె ముఖం చూసి , ఆమె మనసు ఎట్లా  తెలుసుకో గలమో చూద్దాము !  గుర్తు ఉంచుకోండి , మనం, ఎంత తెలుసుకున్నా ,  కేవలం ఆమె మనో సముద్ర తీరం లో గులక రాళ్ళు ఏరుకునే వాళ్ళమే ! ఆమె మనసు లోతు తెలుసుకో గలిగే డీప్ సీ  డైవర్స్ ము  కాము కదా ! 
3.ముఖం పరిశీలించండి : మీ మీద మనసు పడే యువతి ముఖం లో ఆమె మనో భావాలు ప్రస్పుటం గా కనిపిస్తాయి , ఆ ముఖాన్ని  పరిశీలించి , అర్ధం చేసుకునే వారికి ! ఎందుకంటే , ఆ ముఖం, మీ మీద మనసు పడ్డ నాటి నుంచీ , పున్నమి చంద్రుడి లా దిన దినాభి వృద్ధి చెందుతూ ఉంటుంది, కాంతి తో !  ప్రత్యేకించి ఒక స్థిరమైన చోట నుంచి ఆ వెలుగు రాక పోయినా  హాలు మొత్తం మీద  ఆ ముఖం కాంతులు వెద  జల్లుతుంది ! ఆ వెలుగు లో కూడా మీరు,  తడుము కుంటూ, ఆమె మనసు అర్ధం చేసుకోలేక పొతే,  అంతే  సంగతులు ! 
మీరు ప్రత్యేకించి ఆమె కను బొమ్మలూ , కనులూ , ఆమె పెదవులూ పరిశీలించండి ! 
ఆమె కను బొమ్మలు అంటే ఐ బ్రోస్  కనుక పైకి పోనిస్తే అంటే రైజ్ చేస్తే , ఆమె మీరు చెప్పే విషయం శ్రద్ధ తో  , వింటున్న దన్న మాట  !  ఆ ఎగరేసిన కను బొమ్మలతో జత గా ఆమె చిరు నవ్వును కూడా కలిపితే , మీరు చెప్పే విషయాలను ఆమె అంగీకరిస్తున్న దన్న మాట !  యువతులు తాము తమ కళ్ళను మీ కళ్ళతో కలిపి , తమ కను బొమ్మలను కూడా పైకి చేస్తే , వారు  ( మిమ్మల్ని )  ఇష్ట పడుతున్నట్టు అనుకోవాలి ! 
పెదవులు : ఆమె పెదవుల గురించి ఎంత చెప్పినా తక్కువే కదా !  ఇప్పటికే అనేక మంది కవులు ఆమె పెదవులను , దొండ పండు వంటి వి గానూ , తమలపాకుల లాగానూ వర్ణించారు. లేత ఎరుపు రంగులో ఉన్నా ,  ఆ పెదవులు ప్రతి పురుషుడి జీవితం లో ఇంద్ర ధనుస్సు లో ఉన్న రంగులన్నీ తెచ్చి, ఆ పురుషుడి చేత మన్మధ బాణాన్ని ఎక్కు పెట్టిస్తాయి !  వణుకుతున్న ఆమె పెదవులు, ప్రతి పురుషుడి  లోనూ  ఎక్కడ లేని వేడి పుట్టిస్తాయి ! పట్టు వంటి సుతి మెత్తని ఆమె పెదవులు  గుట్టుగా ప్రేమ పట్టును పురుషుడి పైన అతి గట్టిగా  బిగిస్తాయి. అందు వల్లనే, ప్రతి సినిమాలో ,హీరోయిన్  చేత పెదవులు  కొరికించు తాడు, తల కాయలో ‘ రస కాయ ‘ ఉన్న  ప్రతి దర్శకుడూ , నిర్మాతా కూడా ( లేక పొతే  కలెక్షన్  లేక వాళ్ళు  నాలిక కరుచు కోవలసి  ఉంటుంది కదా ! ) అంతటి మహాత్తరమైనవి ఆమె పెదవులు ! 
మీ పొందులో , లేదా మీ సమీపం లో , తడబడుతూ ఉన్న ఆమె పెదవులూ, లేదా  నాలుక కొద్దిగా బయటకు తెచ్చి , తడి ఆరకుండా నా అన్నట్టు చప్పరించ బడుతున్న ఆ పెదవులు, ఆమె మీ  అ టెన్షన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు !  మీ మీద ఆమె తన ఆసక్తి ని ఆ విధం గా తెలుపుతూ ఉండ వచ్చు !  తన పెదవుల తడి ఆరకుండా ఆమె చేసే ప్రయత్నాలూ ,  పడే తంటాలూ , మీరు ఆమె మీద చూపించే ఆసక్తిని ఎండి  పోకుండా  అప్రయత్నం గా చేసే ప్రయత్నం కూడా కావచ్చు !  ఇక శాస్త్రీయం గా చెప్పుకోవలసి వస్తే ,  ఆమె కామ పరం గా నైనా , లేదా ప్రేమ పరం గా నైనా ఉత్తేజం చెంది, అరౌజల్  లేదా ఉద్రేక పడుతున్నప్పుడు , ఆమె పెదవులూ , నోరూ కూడా వాటి తడి ఆరిపోయి , డ్రై  గా అవుతాయి !  తాను  వలచిన పురుషుడి అధర  సంగమం తో నే  ఆ తృష్ణ  తీర గలదు అన్న కోరిక ఉన్నట్టు గా  ! 
కను రెప్పలు :  ఆమె కను రెప్పలు, మీ పైన కనుక ఆసక్తి ఉంటే  , టపా టపా అని కొట్టుకుంటూ ఉంటాయి ( అంటే బ్లాగు లో టపా అనుకోకండి పొరపాటు పడి ! )  మరి మామూలు గా కను రెప్పలు టిపా టిపా  అని కొట్టు కుంటాయా  అని మీరు సందేహ పడ  వచ్చు.  ఎవరి కను రెప్పలూ , శబ్దం చేస్తూ కొట్టు కోవు కదా ! ఇట్లా రాయడం లో ఉద్దేశం ఏమిటంటే , సామాన్యం గా కొట్టుకునే వేగం కన్నా ఎక్కువ సార్లు కొట్టుకుంటాయి ఆమె కనురెప్పలు , ప్రత్యేకించి మీ మీద ఆసక్తి ఉంటే  ! 
కను పాపలు : అంటే ప్యూపిల్స్   అంటే మళ్ళీ విద్యార్ధులని అర్ధం చేసుకోకండి !  మన కంటి లో వెలుగును నియంత్రిస్తూ ఉండే భాగం, దీనినే ప్యూపిల్  అంటారు. వెలుగు ఎక్కువగా ఉన్నప్పుడు , ప్యుపిల్ వ్యాసం తక్కువ అయి  కంటి లో ఉన్న రెటీనా  అనే భాగాన్ని రక్షిస్తుంది. అట్లాగే వెలుగు తక్కువ గా ఉన్నప్పుడు, ఉత్తేజం పొందినప్పుడూ , అంటే ప్రత్యేకించి ప్రేమోత్తేజం కానీ, కామోత్తేజం కానీ పొందినప్పుడు   ఈ ప్యూపిల్  వ్యాసం ఎక్కువ అయి దృష్టి సరిగా ఉండడానికి సహాయ పడుతుంది, తక్కువ వెలుతురూ లో కూడా !  మీ మీద ఆసక్తి ఉన్న ఆమె కనుపాపలు  పెద్దవి గా అవుతాయి,  మీతో నీలి నీడలలో సరస సల్లాపాల కోసం  అలవాటు పడుతున్నట్టు గా ! 
నాసికా పుటాలు అంటే నాస్ట్రిల్స్  : మీ మీద ఆసక్తి ఉన్న యువతి నాసికా పుటాలు అంటే నాసికా రంధ్రాలు, అప్రయత్నం గానే పెద్దవి అవుతాయి.  తీవ్ర మైన ఉత్తేజం పొందితే , ఇట్లా జరుగుతుంది.
ఇట్లా పెద్దవైన నాసికా పుటాలతో  పెద్దవైన కనుపాపలు ,  తడి ఆరుతున్న , వణుకుతున్న పెదవులు,  ఈ లక్షణాలు మీరు ఆమెలో గమనించితే ,  మీరు తక్షణమే కర్తవ్యోన్ముఖులు కావాలి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని ఆమె దేహ బాషలు !  

ఆమె మనసు , దేహ భాష లో ఎట్లా తెలుసుకోవచ్చు ?3.

In ప్ర.జ.లు., మానసికం, Our minds on అక్టోబర్ 24, 2012 at 1:06 సా.

ఆమె మనసు , దేహ భాష లో ఎట్లా తెలుసుకోవచ్చు ?3.

ఆమె మనసు , సముద్రమంత  లోతైనది, విశ్వమంత  విశాలమైనది !  ఆమె మనసు తెలుసుకోవడం అంటే సాహసం చేయడమే ! మనం ఎంత తెలుసుకోవాలని ప్రయత్నించినా ,  ఆమె మనో సముద్ర  తీరాలలో గులక రాళ్ళు ఏరుకునే వాళ్ళమే !  కానీ మానసిక విశ్లేషకులు కొన్ని దేహ భాషా సూచనలతో ఆమె మనసు  కనుక్కోవచ్చు అని అంటున్నారు  ( సాహసం చేస్తున్నారు ! ).  మరి ఆ వివరాలు తెలుసుకుందాం !  
అతడి మనసు  ను అతడి దేహ భాషలో కేవలం పది పదిహేను  శరీర కదలికలతోనే అవగాహన చేసుకోవచ్చు కానీ ఆమె మనసు తెలుసుకోవాలంటే ఆమెలో , కనీసం ఒక యాభై శరీర కదలికలను మనం ఔపోసన పట్టాలి  అని మనో వైజ్ఞానికుల అభిప్రాయం ! 
మీరంటే ఆమెకు ఇష్టమని ఆమె దేహ భాషలోమరి  మీరు ఎట్లా కనుక్కోవచ్చు?: 
1.వాలు చూపులు : మీ మీద మనసు పడ్డ యువతి , మీరు , ఆమె ఉన్న ప్రదేశం లో ఎంత దూరం లో ఉన్నా ,  తన వాలు చూపులు వాడి గా చేసి మీ వైపు ఎక్కు పెట్టి చూస్తుంది ! 
ఆ చూపులు  విరి తూపులలా మీ మనసులో సుతి  మెత్తగా  గుచ్చుకోవలసిందే !  మీ లోని  ప్రణయ రక్తం బయటకు చిందాల్సిందే ! అంతే  కాక ఆమె మీరు తనను గమనిస్తున్నారో లేదో కూడా అవే వాడి చూపులతో మీకు తెలిసీ తెలియకుండా తను గమనిస్తూ ఉంటుంది !   ప్రత్యేకించి , ఆ చూపుల వాడి తో తన చిరు దరహాసాన్ని( అంటే ఓ స్మైల్  ) కూడా ‘ రంగరించి ‘  మీ వైపు వదిలిందంటే ,  మీ మనసు విరిగి రసామృత  భాండం  లో పడ్డట్టే ! 
2. మీ ‘  ప్రేమాయస్కాంతం వైపు ఆమె  రస రజను ‘ : అంటే మీరు ఉన్న స్థానం వైపు ఆమె కు తెలియకుండానే ! ఆమె ఆకర్షింప బడుతుంది. అంటే భౌతికం  గా ఆమె మీరు ఉన్న స్థానం దిశగా తిరగటమూ , లేదా జరగట మూ , లేదా కదలడమూ  చేస్తుంది.  టేబుల్ వద్ద కనుక కూర్చుంటే , ఆమె తన చేతులు ఆమె ముఖం క్రింద ఉంచి మీ వైపు ఆసక్తి కరం గా  చూస్తుంది. అదే టేబుల్ వద్ద ఆమె తన చేతులు కట్టుకుని కూర్చుంటే , మీ  మీద ఆమెకు ఆసక్తి లేదని తెలుసుకోవాలి !  ఆ సమయం లో ( మీకు ఆమె మీద ఇంకా  ఆసక్తి ఉంటే ! ) ఆమె గురించిన విషయాలూ , ఆమె జీవితం గురించీ ఉత్సాహం గా మాట్లాడి , ఆమెను కూడా మాట్లాడించ దానికి ప్రయత్నించండి !  అప్పుడు కూడా ఆమె మీ మీద , మీ మాటల మీదా ఏమాత్రం ఆసక్తి కనపరచక పొతే , ఎవరికీ వారే , యమునా తీరే ! 
వచ్చే టపాలో ఇంకొన్ని ఆమె మనసు దేహ బాసలు ! 

దేహ భాష ( బాడీ లాంగ్వేజ్ ):

In ప్ర.జ.లు., మానసికం, Our minds on అక్టోబర్ 20, 2012 at 1:35 సా.

దేహ  భాష ( బాడీ లాంగ్వేజ్ ):

 

 
ప్రశ్న : బాడీ లాంగ్వేజ్ , అదే  అచ్చ తెలుగులో దేహ భాష  అంటే ఏమిటి ?
జవాబు: మన శరీరం మనకు తెలియకుండా మన గురించి ఎదుటి వారికి  తెలియ చేస్తూ ఉంటుంది. మన నడక, మన చేతి కదలికలూ , మన ముఖం మీద కనపడే మన హావ భావాలూ , ఇవన్నీ  కూడా మన గురించి ఎదుటి వారికి తెలియచేస్తాయి.ఇక్కడ గమనించ వలసినది , మనం ఒక్క మాట కూడా మాట్లాడకుండా నే, మన గురించి తెలియ చేస్తూ ఉంటామన్న మాట. దీనినే దేహ భాష లేదా బాడీ లాంగ్వేజ్  అంటారు. ఈ బాడీ లాంగ్వేజ్ నిత్య జీవితం లో  మనకు ఎంతో  ముఖ్యం.విద్యార్ధ్లులకు లిఖిత పరీక్షల తరువాత , మౌఖిక పరీక్ష సమయం లో , ఆ తరువాత ఉద్యోగాల వేట లో ఉండే ( అనేక ? !!! ) ఇన్తర్వ్యూ  లలోనూ , బాడీ లాంగ్వేజ్ ప్రాముఖ్యత  ఎంతో  ఉంది. ( లంచాలు ఇచ్చి తెచ్చుకునే ఉద్యోగాల ఇంటర్వ్యూ  లలో ఎక్కువగా ప్రయాస పడనవసరం లేదు , అంటే  అసలు ‘బాడీ ‘ ఇంటర్వ్యూ  లో లేక పోయినా ఉద్యోగాలు వస్తాయి కదా ! )
అట్లాగే  ఒక యువకుడు , యువతి తో పరిచయం   అవుతున్నప్పుడూ ,  అట్లాగే  యువతి , యువకుడి తో  స్నేహం కోరుతున్నప్పుడూ ,  టీచర్లు , లెక్చరర్లు  పాఠాలు చెపుతున్నప్పుడూ కూడా , ఈ బాడీ లాంగ్వేజ్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది.ఇక నటులు , నటీ మణులు కావాలనుకునే వారికి ఈ బాడీ లాంగ్వేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు , ఎందుకంటే , వారు బాడీ లాంగ్వేజ్ నేర్చుకోకుండా  నటనకు పనికి రారు కదా అప్పుడు వారితో సినిమా తీస్తే  వారే  పెట్టుబడి పెట్టి తీసినది గా మనం సులభం గా అర్ధం చేసుకోవచ్చు కదా ! 
మనం  సామాన్యం గా అంటూ ఉంటాము , ‘ వాడు ఏంటో కొండ ముచ్చు లా కూర్చున్నాడు ‘ ! అని. అంటే కోతులు, కొండముచ్చులూ కొండల మీద ఈ కదలికా లేకుండా కూర్చుంటూ ఉంటాయి. అంటే మన హావ భావాలూ , శరీర కదలికలూ మనకు జీవం పోస్తాయి, కేవలం చెట్లూ చేమలూ లాగా కాకుండా !  బాడీ లాంగ్వేజ్ లేకపోతే మనం కూడా ( ?!!! ) 
ప్రేమ భావనలూ , కామ భావనలూ , స్నేహ భావనలూ కూడా నోటి భాష  అవసరం లేకుండానే , మనం తెలుసుకోవచ్చు కదా కేవలం బాడీ లాంగ్వేజ్ , అదే దేహ భాష ను తెలుసుకుంటే ! 
మరి ఈ బాడీ లాంగ్వేజ్ గురించి వచ్చే టపా నుంచి వివరం గా తెలుసుకుందాము !