Our Health

Archive for the ‘మన ఆరోగ్యం.’ Category

ప్రేమించడం ఎట్లా? 5.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 18, 2013 at 6:37 సా.

ప్రేమించడం ఎట్లా? 5. 

 

ఎంతో కొంత ఇవ్వడం:  ప్రేమించడం ఎట్లాగో తెలుసుకునే ముందు , మన లక్షణాలు కొన్ని ఎట్లా ఉండాలో క్రితం టపాల లో తెలుసుకున్నాం కదా !  మరి ఎంతో కొంత ఇవ్వడం ఏమిటి ? ఒక సంబంధం ప్రేమ మయం గా చేసు కోవడం లో మీరు చేయవలసినది ,  మీరు ప్రేమించే వారికి ఎంతో కొంత ఇవ్వ గలగడం !  ఏ  సంబంధం అయినా , మీరు కేవలం స్వీకరించే పరిస్థితి లోనే ఉంటే , అంటే , అది ప్రేమ కానీ , లేదా ఇతర వస్తు వాహనాలు కానీ , లేదా సేవలు కానీ , మీరు ఏమీ ఇవ్వకుండా ( ఇవ్వ గలిగే పరిస్థితి లో ఉండి కూడా ) ఎదుటి వ్యక్తి నుంచి వీలైనంత స్వీకరించాలనే అనుకుంటే , ఆ సంబంధం ఎక్కువ కాలం నిలువదు !  బీటలు బారుతుంది ! పెళు సవుతుంది ! ఏ క్షణాన్నైనా , తెగి పోయేంత సున్నితం అవుతుంది ! ఘర్షణలకు ఆలవాలం అవుతుంది ! స్పర్ధ లకు మూలం అవుతుంది !  ఇట్లా చేస్తూ ప్రేమిస్తున్నాం అనుకునే వ్యక్తులను , అవతలి వ్యక్తులు , జలగలు గా ముద్ర వేయడానికి అవకాశం హెచ్చుతుంది ! తీసుకునే దానికన్నా ఎక్కువ గా ఇవ్వగలిగే లక్షణం అలవరచు కుంటే , ఆ సంబంధం  పలు శాఖలు గా పెనవేసుకుని , గట్టి పడుతుంది ! వృద్ధి చెందుతుంది ! 
మనసు విప్పడం :  మీరు ప్రేమించే వ్యక్తి ప్రేమను పొందాలంటే , దాగుడు మూతలు తొలి నాళ్ళ లో సరదాగా ఉన్నా కూడా , మీ మనసు విప్పి సాధక బాధకాలు పరస్పరం తెలుసుకోక పొతే కూడా , మీ ప్రేమ లోతు లేకుండా ఉంటుంది !  పైపైనే  తేలి పోతూ ఉంటుంది మీ జీవిత నావ ఆ ప్రేమ లో ! అదే ప్రేమ గాఢమైనది గా అవ్వాలంటే , మనసు విప్పి మాట్లాడుకోవడం ముఖ్యం ! 
ఓపిక తో వెలుగును, ప్రేమ దీపిక !  : మీరు ప్రేమను పరిగెత్తించ లేరు అంటే , తొందరపెడితే , ప్రేమ కంగారు పడుతుంది !  మీరు ఓపిక గా అంటే నిదానం గా ప్రేమ లతలను అల్లుకోనివ్వాలి ! అప్పుడే ప్రేమ దీపం వెలుగుతుంది ! మీరు మీ ప్రేమ ను ఎవరి మీదా కూడా బలవంతం గా రుద్ద లేరు కదా ! అట్లాంటి పరిస్థితి మీలో,  భావోద్వేగ పరం గా చాలా అలసి పోయేట్టు చేసి , అసంతృప్తి కలిగిస్తుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

ప్రేమించడం ఎట్లా ? 4.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 16, 2013 at 6:22 సా.

ప్రేమించడం ఎట్లా ? 4. 

 
నిన్ను నీవు క్షమించుకో !  :  వయసు పెరుగుతున్న కొద్దీ , మనసు కూడా పెరిగి , చాలామంది , ఆత్మ శోధన చేసుకుంటూ ఉంటారు ( రాజకీయ నాయకులు తప్ప ).  ఇట్లా ఆత్మ శోధన చేసుకోవడం లో ఉద్దేశం , తాము చేసిన తప్పులు పొర పాట్లను , బేరీజు వేసుకుని , ముందు ముందు అట్లాంటి పొర పాట్లు కానీ , తప్పులు కానీ చేయకుండా  జాగ్రత్త పడడానికి ! అంత వరకూ బాగానే ఉంది కానీ , ఆ చేసిన పొరపాట్లు మానవులను కృంగ దీయ కూడదు !  ఈ అనంత కాల చక్రం లో, మానవ జీవితం,  లిప్త కాలమే !  అంటే ఎవరూ శాశ్వతం కాదు !  తప్పులు చేయడం , మనవల్ల తప్పులు  జరుగుతూ ఉండడం కూడా సహజమే ! అవి  పొరపాట్లు ఏవీ జరగక పోవడమంత సామాన్యం ! 
తెలిసి , తెలిసి  చేసే తప్పులు క్షమించ రానివి ! అట్లాగే , కొన్ని తప్పులు తెలియకుండా కూడా జరుగుతుంటాయి ! ఈ తప్పు ఒప్పులు కూడా సాపేక్ష  సూత్రాలను పాటిస్తాయి ! అంటే  ఒకరికి  ఒక విషయం తప్పు అనిపిస్తే , ఇంకొకరికి అది ఒప్పు అనిపిస్తుంది ! అంటే, కేవలం  ఎవరికి వారు  ఆ సందర్భం లో , ఆ సంఘటన ను అంచనా వేసుకుని ,తమ తమ అభిప్రాయాలను ఏర్పరుచు కోవడం ! మరి మనల్ని ,  మనం కేవలం అంతా ఖచ్చితం గా తప్పులు లేకుండా జీవిస్తున్నప్పుడే  , ప్రేమించు కుందామా ? అంటే  అప్పుడు మనం  ఆ విషయం లో తప్పు చేస్తున్నామనే చెప్పుకోవాలి ! ఇందుకు కారణాలు రెండు !  ఒకటి : ఈ భూగోళం లో తప్పులు చేయని మానవులు అంటూ ఎవరూ లేరు ! దేవుడిని నమ్మే వారుకూడా , దేవుడు కూడా చాలా రకాలు గా తప్పులు చేయడం వారి జీవితం లో ఏదో ఒక దశలో అనుభవ పూర్వకం గా తెలుసుకుంటారు !  రెండు : మీరు కనుక ఎదుటి వారెవరూ పర్ఫెక్ట్ కాదు అని ఒక అభిప్రాయం కనుక ఏర్పరుచుకుంటే , మరి ఆ అభిప్రాయానికి మీరు ఎందుకు మినహాయింపు కావాలి ? మీరు కూడా అదే ప్రమాణాన్ని పాటించాలి ! అంటే ,  ఇతరులలో అస్సలు తప్పే చేయని వారు లేరు అని అనుకుంటున్నప్పుడు ,  ఆ అభిప్రాయం మీకూ వర్తిస్తుంది !  మనం పొరపాట్లూ , తప్పులూ చేయకుండా , జ్ఞానం సముపార్జించ లేము కదా !    ముందుగా, మనం ఈ విషయాన్ని సరిగా అవగాహన చేసికొని ,  అంటే పొరపాట్లు, లోపాలూ , మానవ సహజం అనీ ,  అందుకు ఎవరూ మినహాయింపు కాదనే సత్యాన్ని అంగీకరిస్తే , అప్పుడు మనలో క్షమా గుణం చిగురిస్తుంది ! ఇతరులలో, మనకు గోచరించే తప్పులు , పొర పాట్లూ , కూడా క్షమార్హం అవుతాయి ! అంటే మనం ప్రేమించే వ్యక్తులు కూడా మన ప్రేమకు పాత్రు లవుతారు ! అంటే,  మనం ప్రేమించే వారిలో మనం లోపాలు ఎత్తి చూపడం చేయం ! వారిలో మనకు అభినందనీయ గుణాలే గోచరిస్తాయి !  మనం ఇతరులను ప్రేమించ గలగడం లో ఒక ముఖ్య సూత్రం , మనల్ని మనం క్షమించుకోవడం , ఇతరుల లోపాలను క్షమించ గలగడం ! బాల రాజు కధ సినిమా లో ,  ఈ విషయాన్ని ముళ్ళ పూడి రమణ గారు చక్కగా చెప్పారు ఒక సూత్రం ‘ ఒక్క వేలు చూపి ఒరులను వెక్కిరింప , వెక్కిరించు నిన్ను మూడు వేళ్ళు ‘  అని !   
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

ప్రేమించడం ఎట్లా ? 3.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 13, 2013 at 8:23 సా.

ప్రేమించడం ఎట్లా ? 3. 

 ప్రేమించడం ఎట్లాగో తెలుసుకునే  ప్రయత్నం లో ,  ఏది ప్రేమ అనిపించుకోదో తెలుసుకున్నాం కదా , క్రితం టపాలలో !  ప్రేమించడం నేర్చుకునే ముందు ప్రప్రధమం గా చేయ వలసినది,  మనలను మనం ప్రేమించడం ! మీరు మిమ్మల్ని , ప్రేమించడం తెలుసుకుంటేనే , ఇతరులను ప్రేమించ గలరు !  అంటే ,  మనం మనలను ప్రేమించడం లోనే , ప్రేమ స్వభావాన్ని సరిగా అర్ధం చేసుకోగలం ! 
ఉదా:  ప్రమోద్  ఒక మాదిరిగా చదువు కుని , ఒక ప్రైవేట్  సంస్థలో ఉద్యోగం చేస్తూ, బొటా బొటీ జీతం   తో జీవితం గడుపుతుంటాడు !  పెళ్లి వయసు కు పెళ్లి చేసుకున్నాడు , తాను ‘ప్రేమించిన’  యువతినే !   తన ప్రేమను ఆమె కు తనదైన రీతి లో చూపించే వాడు మొదట్లో ! క్రమేణా ,  ఆర్ధిక సమస్యలు తట్టుకోలేక ‘ మద్యం ‘ తాగడం మొదలు పెట్టాడు ! తన ‘ వత్తిడులు ‘ తప్పించుకోవడం కోసం !  క్రమేణా , ఈ రకం గా ‘ వత్తిడులు ‘ తప్పించుకోవడం, ఎక్కువ సమయం చేయడం మొదలు పెట్టాడు అంటే తరచు గా తాగడం !  తాను ప్రేమించిన యువతిని అశ్రద్ధ చేయడమే కాకుండా ,చీటికీ మాటికీ , సూటి పోటి మాటలతో , ఆమెను అవమాన పరుస్తూ , అప్పుడప్పుడూ చేయి చేసుకుంటూ కూడా , మందు ప్రభావం దిగి నప్పుడు ‘ నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను ‘ అని  ఆమె  ‘ గాయాలకు ‘ వెన్న పూసే ప్రయత్నం చేస్తాడు !  మరి ప్రమోద్ ప్రేమ ఏమైంది ? ప్రమోద్ ప్రేమిస్తున్నాడా ?  లేదా మందు ప్రభావం లో పడి మాత్రమే , ప్రమోద్ , తన ‘ ప్రేయసి ని మానసికం గానూ , శారీరికం గానూ హింసిస్తున్నాడా ?
విశ్లేషణ:  ప్రమోద్  ఒక  సగటు మనిషి . అందులో ఏ తప్పూ లేదు కదా ! విశాల ప్రపంచం లో ఎంతో మంది సగటు మనుషులు ఉన్నారు !  కానీ , క్రమేణా , పెళ్లి చేసుకున్నాక ,  ఎదురయే సమస్యలను , పరిష్కార మార్గం కనుక్కోలేక , తాత్కాలిక ఉపశమనాలకు , మద్యం అలవాటు చేసుకున్నాడు ! క్రమేణా మద్యం తరచూ తాగడం మొదలెట్టాడు !  చీకాకులూ , ఆందోళన లూ సామాన్యం అయ్యాయి , ప్రమోద్ జీవితం లో ! దానితో , విచక్షణా  జ్ఞానం  కొర వడింది ! ,  వాటితో పాటుగా , ప్రమోద్ లో, తాను ఆశక్తుడి ననే , ఆత్మ న్యూనతా భావాలు ఎక్కువ అయ్యాయి ! తనంటే తనకు ఏహ్య భావం కలుగుతుంది ! కానీ  ఆ విషయాన్ని , తను అంగీకరించే పరిస్థితి లో లేడు !   అగ్నికి ఆజ్యం తోడైనట్టు , మద్యం  ఆ పరిస్థితిని  ఇంకా అధ్వాన్నం చేసింది !  తన చీకాకులూ, కోప తాపాలూ , తాను ఎంతగానో ప్రేమించిన ప్రేయసి మీద చూపించడం మొదలు పెట్టాడు !  ప్రతి సారీ , తన ప్రతాపం, ప్రేయసి మీద చూపించాక , విపరీతం గా పశ్చాతాప పడుతూ , ఏడుస్తాడు !  తన జీవితం తో పాటు గా , తన ప్రేయసి జీవితాన్ని కూడా , ఒక విష వలయం లోకి లాక్కున్నాడు !  తన బలహీనతలూ , తన బాధలూ , తన ప్రేయసి మీద  చూపిస్తూ ,  తన సమస్యలకు తాత్కాలిక ఉపశమనం , మద్యం తోనూ , తన భార్య మీద తన ఆధిపత్యం తోనూ , చేసుకుంటున్నాడు ! ఆ రకం గా చేయి జారిన తన పరిస్థితులు , తన నియంత్రణ లోనే లోనే ఉన్నాయనే  ప్రమాద కరమైన భ్రమ లో జీవితం గడుపుతాడు ప్రమోద్ ! 
ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి మనం !  ప్రమోద్ పరిస్థితి ని గమనిస్తూ ,  అతనిలోని మార్పులను పరిశీలిస్తూ కూడా ఏమీ చేయ లేని అసహాయ స్థితి లో భార్య కుమిలి పోతుందే కానీ , క్రియాశీలం గా ఆ పరిస్థితి నుంచి తాను బయటపడ డానికి   , లేదా ప్రమోద్ ను బయట పడేయడానికీ ఏ రకమైన ప్రయత్నమూ చెయ్యట్లేదు ! అందుకు కారణం ఏమిటి ?   మీరు చెప్ప గలరా ? ముందు ముందు తెలుసు కుందాం !
మనలను మనం ప్రేమించడం అంటే , మన అవసరాలు , ఇతరుల అవసరాల కన్నా ముందు ఉండాలనే తాపత్రయం కాదు !  మన మీద మనకు ఆత్మ విశ్వాసం ఏర్పరుచుకుని , మన  బలాలను మనం ప్రశంశించు కుంటూ , బలహీనతలను అంగీకరిస్తూ ,  ఆ బలహీనతలను కేవలం కప్పి పుచ్చడానికి ప్రయత్నాలు చేయకుండా , వాటిని వీలైనంత వరకూ సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ,  ఆ బలహీనతలను ఇతరుల మీదకు ఏదో విధం గా రుద్దే ప్రయత్నం చేయకుండా,   జీవితం గడపడం నేర్చుకోవాలి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

ప్రేమించడం ఎట్లా ?.2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 12, 2013 at 3:51 సా.

ప్రేమించడం ఎట్లా ?.2. 

క్రితం టపాలో ప్రేమ స్వభావం, ప్రేమ పరిధులూ తెలుసుకున్నాం కదా ! మరి ఏది ప్రేమ కాదు ? అనే సంగతి కూడా తెలుసుకుందాం , ప్రేమించడం ఎట్లాగో తెలుసుకునే ముందు ! 
ఏది ప్రేమ కాదు ? :
1. కేవలం కామ ప్రధాన మైన సంబంధం లో ప్రేమ కొరవడుతుంది ! అంటే సామాన్యం గా , ఒక స్త్రీని, పురుషుడు కేవలం కామాతురత తోనే చూస్తూ , తమ కామ వాంఛ లను తీర్చు కోడానికి  ఎంతో అనువైన  వ్యక్తి గా చూడడం అలవరచుకున్నప్పుడు , ఆ సంబంధం  లో ముందుండేది ప్రేమ కాదు , కామ వాంఛ మాత్రమే ! అనేక సంబంధాలలో, తుఫానులు సంభవిస్తూ ,అవి  తరచూ ఆటు పోట్లకు గురి అవుతూ ఉండడానికి  ఇది ఒక ప్రధాన కారణం ! 
2. సంపూర్ణా ధిపత్యం , నియంత్రణ  అంటే డామి నెన్స్ , అండ్ కంట్రోల్ :  ఒక సంబంధం లో ఒక వ్యక్తి , ఇంకో వ్యక్తి ని పూర్తి గా తన నియంత్రణ లో ఉంచుకుని ,  తన ఆజ్ఞలు శిరసావహించే,  విధేయులైన వ్యక్తి గా మసలుకోవాలని, తన సంబంధం లో ఆశిస్తే ,  ఆ సంబంధం లో ప్రేమ లోపిస్తుంది ! ఇట్లా సర్వ సాధారణం గా పురుషుడు , తను సంబంధం ఏర్పరుచుకున్న స్త్రీ తో ప్రవర్తించడం జరుగుతుంది . కేవలం చాలా అరుదు గానే , స్త్రీ , పురుషుని మీద ఇట్లా  ఆధిపత్యం చేయడం జరుగుతుంది ! ఈ రకమైన సంబంధాలలో  ప్రేమ ‘ బూజు పట్టి ‘ ఒక మూల దాక్కుంటుంది !  ఆ సంబంధం ప్రేమమయమైన సంబంధం అనిపించుకోదు , సహజం గానే ! 
3. సంబంధం ఏర్పరుచుకున్న వ్యక్తి గురించి అదే పని గా చింతించడం అంటే వర్రీ అవడం ! :  ఇట్లా , తల్లి తన పిల్లల గురించి కానీ , లేదా భార్య , తన భర్త గురించి కానీ విపరీతం గా వర్రీ అవుతూ , వారు తమకు దూరం గా ఉన్నప్పుడు , ప్రతి క్షణమూ ,వారి గురించి ఆలోచిస్తూ , వారి క్షేమం గురించి ఆందోళన పడుతూ ఉండడం జరుగుతుంది ! ఇట్లా అబ్ సెసివ్  వ్యక్తిత్వం ఉన్న వారు , వారి సంబంధం లో ప్రేమను సమ పాళ్ళలో పొంద లేరు , పంచ లేరు కూడా ! 
4. అనవసరమైన అభద్రతా భావన , లేదా ఆత్మ న్యూ నతా భావనల తో కొనసాగుతున్న సంబంధం లో ప్రేమ ప్రవృద్ధి చెందదు ! :  ఈరకమైన మనస్తత్వం ఉన్న వారు ,  ఇతర వ్యక్తులను తమతో ,’  ప్రేమ ‘ అనే ‘ సాధనం’  తో ‘ కట్టి వేయాలని’ అనుకోవడం జరుగుతుంది ! అది కూడా పొర పాటే ! అది కూడా ప్రేమ అనిపించుకోదు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

మరి ప్రేమించడం ఎట్లా ? 1.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 11, 2013 at 9:31 సా.

మరి ప్రేమించడం ఎట్లా ? 1. 

క్రితం టపాలలో, మానవులకు సంక్రమించిన అమూల్యమైన లక్షణాలలో ఒకటైన ప్రేమ వల్ల, అంటే ప్రేమించడం వల్ల కలిగే  శారీరిక , మానసిక లాభాలు తెలుసుకున్నాం కదా ! మరి ఎట్లా ప్రేమిద్దాం ? ! అంటే ప్రేమించడం ఎట్లా ?  ఈ విషయం చాలా మంది ని, వారి వారి జీవిత  గమనం లో , అనేక దశలలో సందిగ్ధం లో పడ వేస్తుంది ! వివిధ సందర్భాలలో అనేక రకాలు గా  మధన పడుతూ కూడా ఉంటాం , మన అనుభూతులు మనం వ్యక్తం చేస్తున్నప్పుడు , మనలో జనించేది ప్రేమా కాదా అనే విషయం కూడా తెలియక తిక మక పడుతూ ఉంటాం ! మరి అది  తెలుసుకునే ముందు , ఏది ప్రేమ అవుతుందో ఏది ప్రేమ కాదో తెలుసుకోవడం ముఖ్యమే కదా !  
ప్రేమ అంటే ప్రణయం మాత్రమే కాదు !
ప్రేమను కేవలం ప్రణయం తోనే ముడి వేస్తే , ప్రేమ సింధువు లో కేవలం ఒక  బిందువును మాత్రమే  ఆస్వాదించడం తో పోల్చ వచ్చు !  ప్రేమ ఒక  సుందరమైన అనుభూతి ! ఆ అనుభూతిని మనం సామాన్యం గా ఇతర వ్యక్తుల తో పరస్పరం  స్పందన, ప్రతి స్పందన ల లో  పొందుతాము !  వివిధ పరిస్థితులలో , వివిధ సందర్భాలలో కూడా, వివిధ మానవ సంబంధాలలో కూడా మనం ఈ ప్రేమానుభూతిని చెందవచ్చు ! 
ప్రేమ వివిధ వ్యక్తుల మధ్య పంచుకోబడుతుంది: ప్రియులు , సోదరులు సోదరీ మణులు , బంధువులు , స్నేహితులు , సన్నిహితులు , ఆప్తులు , ఇట్లా అన్ని తరహాల వ్యక్తుల మధ్యా ప్రేమ పంచుకోవచ్చు !  
ప్రేమ మనం చేసే వివిధ పనుల లో కూడా మనం పొందుతాము:  మనం చేసే పని లో పూర్తి గా నిమగ్నమై చేసినా , లేదా మనకు చాలా ఇష్టమైన ( దానినే ‘ప్రియమైన’  అని కూడా అంటారు కదా ! ) హాబీ లేదా వ్యాపకం , అది చిత్ర లేఖనం కావచ్చు , నృత్యం , సంగీతమైనా కావచ్చు , ఆ యా వ్యాపకాలను పూర్తి గా నిమగ్నమై సృజనాత్మకత తో , కొనసాగిస్తున్నప్పుడు కూడా ఆ వ్యాపకాలను ప్రేమిస్తూ , ఫలితాన్ని పొంది ఆనంద పడతాము ! దీనినే మానసిక శాస్త్ర రీత్యా ‘ flow ‘ లేదా ఫ్లో అని అంటారు. ఈ ఫ్లో గురించి వివరం గా క్రితం టపాల లో తెలియ చేయడం జరిగింది ( ఉత్సాహం ఉన్న వారు, బాగు ఆర్కైవ్ లలో వెదికితే దొరుకుతాయి ). 
సృష్టి  రహస్యాలు తెలుసు కుంటున్నప్పుడు , ఈ విశ్వం ఎంత విశాలమైనదో , ఎంత సంక్లిష్టమైనదో , ఎంత జటిలమైనదో , వివిధ అనుభవాల ద్వారా తెలుసు కుంటున్నప్పుడు  కూడా మనం,  జీవితాన్నీ , మన జీవితాన్నీ ప్రేమించడం అలవాటు చేసుకుంటాం ! జీవితం విలువ గ్రహిస్తూ ! 
ప్రేమ ను  పొందడం , ప్రకృతి ని ఆరాధిస్తూ , ఆస్వాదిస్తూ , ఈ  ప్రకృతి లో ఉన్న వివిధ జీవ జంతు జాలాల జీవన శైలి గమనిస్తూ , భూత దయ  చూపిస్తూ ఉన్నప్పుడు కూడా జరగ వచ్చు ! 
ప్రేమను, కేవలం ఇవ్వడం ద్వారా కూడా పొంద వచ్చు :  ఏమీ ఇతరులనుంచి కానీ , ఇతర వస్తువులనుంచి కానీ తీసుకోక పోయినా , ఆశించక పోయినా కూడా ! అంటే ప్రేమ స్వభావం  ఎప్పుడూ భౌతిక లాభం కోసమే కాదు !  ఈ రకం గా ప్రేమ ఎప్పుడూ ఒక్క గుణమే కలిగి ఉండదు !  మన హృదయం స్పందింప చేసే ఏ సంఘటన , ఏ వ్యక్తులు , అయినా కూడా , మనలో ప్రేమ ను పొంగిస్తాయి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

ప్రేమ తో ఆరోగ్యం. మిగతా లాభాలు.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 5, 2013 at 6:29 సా.

ప్రేమ తో ఆరోగ్యం. మిగతా లాభాలు. 

ప్రేమ తో  సౌందర్యం :  ప్రేమ మయమైన జీవితాలు గడిపితే , చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది !   ఊక దంపుడు  మాటలు అనుకుంటున్నారు కదూ ! కాదు యదార్ధమే !  ప్రేమ , మానసిక వత్తిడిని అనేక విధాలు గా తక్కువ చేస్తుంది,  దానితో , తీవ్రమైన మానసిక వత్తిడి కలిగినప్పుడు,  మన దేహం లో విడుదల అయే  కార్టి సోల్ అనే స్టీరాయిడ్ హార్మోనులు తక్కువ గా విడుదల అవుతాయి ! శాస్త్రీయం గా  ఈ కార్టి సోల్ హార్మోనులు  ముఖం మీద మొటిమ లకు కారణం !    ఎక్కువ వత్తిడి తో ఎక్కువ మొటిమలు , తక్కువ వత్తిడి తో తక్కువ గా మొటిమలు ! ఆ కారణం గానే, చర్మం నవ నవ లాడుతూ ఉంటుంది, ఏ క్రీమూ పట్టించక పోయినా ! 
హృదయం లో ప్రేమ నిండితే , గుండె ఆరోగ్యం పదిలం :   హృదయాన్ని కేవలం రక్త నాళాల తోనూ ,  రక్తం తోనూ నింపి ఉంచితే ,  ఆ గుండె బరువవుతుంది ! గుండె జబ్బులు రావడానికి అవకాశం హెచ్చుతుంది !   ప్రేమ ను గుండె నిండా నింపితే , ఆ గుండె తేలిక అవుతుంది !  దీనికి కూడా శాస్త్రీయం గా రుజువులు ఉన్నాయి ! ప్రేమ నిండిన హృదయాలు , తక్కువ వత్తిడి తో పని చేస్తూ ఉంటాయి ! అందువల్ల   మతలబు కేవలం లబ్ , డబ్ అనే శబ్దాలతోనే  కొట్టుకుంటూ ఉంటుంది !   అదే  ప్రేమ వెలితి అయిన గుండె డబ డబా ,  డబ డబా ,  డబ డబా , దడ  దడా , దడ  దడా,  కొట్టుకుంటూ , ఆందోళన లో డోల లాడుతూ , మనలను కూడా ఆందోళనల లో పడేస్తుంది ! 
ప్రేమ తో నొప్పి  తక్కువ : ఒక పరిశోధన లో ,   రెండు ప్రేమించే హృదయాలు,   వారి వారి చేతులను పరస్పరం పెనవేసుకుని , ఎలెక్ట్రిక్ షాక్ కనుక ఎదుర్కుంటే ( అంటే మన ఇళ్ళలో లా గా ప్రమాదకరమైన ఓల్టేజి కాదు ! )  వారిరువురిలోనూ ఆ ఎలెక్ట్రిక్ షాకు ను తట్టుకో గలిగే ఓరిమి ఎక్కువగా ఉండడమే కాకుండా , దానివలన వారు అనుభవించే నొప్పి కూడా తక్కువ అయిందిట ! 
ప్రేమ తో  ఋతు స్రావం సవ్యం :   యుక్త వయసు వచ్చిన యువతులు కూడా , ప్రేమ ను పొందుతూ ,  మానసిక ప్రశాంతత తో జీవనం గడుపుతూ ఉంటే , వారి నెల వారీ ఋతు స్రావం , ఏ ఒడు దుడుకులూ లేకుండా , సవ్యం గానూ , సహజం గానూ జరుగుతుందని  పరిశోధనల వల్ల తెలుసుకోవడం జరిగింది !  తీవ్రమైన మానసిక వత్తిడి తో పాటుగా , ప్రేమ కొర వడిన  స్త్రీలలో వారి గర్భం కూడా ఆ బాధను అనుభవిస్తూ ,  పర్యవసానాలు ,  అధిక ఋతు స్రావం అవడమూ , ఎక్కువ రోజులు అవడమూ జరుగుతుంది. అంతే కాకుండా , కనీసం వారానికి ఒకసారి రతి లో పాల్గొనే స్త్రీలలో , ఋతు స్రావం సరళం గా సామాన్య పరిమాణం లోనే అవుతుందని స్పష్టమయింది !  కారణం, వారి లో సహజ ఋతు స్రావానికి అవసరమయే , ఈ స్ట్రో జెన్ హార్మోను  సమ పాళ్ళ లో విడుదల అవుతూ ఉంటుంది ! 
ప్రేమతో మానసిక శాంతి ! : ప్రేమ వలలో చిక్కుకుని , పరస్పరం ఇరుక్కున్న వారి మనసులు విశాలం గా ఉండడమే కాకుండా ,  గాఢమైన వారి ప్రేమ , వారి మెదడు లో కూడా అనేక రకాలైన ఆరోగ్య కరమైన  జీవ రసాయనాలను ప్రేరేపిస్తూ , డోపమిన్  అనే అతి ముఖ్య మైన రసాయనాన్ని విడుదల చేస్తూ , వారిని , జీవితం లో ఎక్కువ శక్తి వంతం గానూ , ఎక్కువ ఆశావాద దృక్పధం తోనూ , అంటే పాజిటివ్ గా ఆలోచింప చేస్తూ , డిప్రెషన్ కు దూరం గా ఉంచుతుంది ! 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు ! 

ప్రేమ తో ఆరోగ్యం !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 4, 2013 at 9:58 సా.

ప్రేమ తో ఆరోగ్యం ! 

సృష్టి లోని అనేక జీవ జాతులకు సంక్రమించిన  అనేక  ప్రత్యేక లక్షణాలలో , ప్రేమ  ఒకటి !   ప్రేమ అనిర్వచనీయం ! ప్రేమ పండితులు అనేక రకాలు గా నిర్వచించారు ప్రేమను !  ఆధునీకరణం చెందుతున్న ప్రపంచం లో, భౌతిక అవసరాలకు అధిక ప్రాముఖ్యత ఇచ్చి , అతి విలువైన , అతి ప్రధానమైన ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నారు మానవులు! ప్రేమ అనేక రకాలైన జీవ రసాయన చర్యల పర్యవసానం  !  మనం సామాన్యం గా ప్రేమను, మన చర్యల రూపం లో, అంటే మన చేతల ద్వారా చూపిస్తాం ! కానీ  తిరిగి , ఆ చూపిన ప్రేమను , కేవలం మన అనుభూతుల ద్వారానే ఆస్వాదించ గలుగుతాము ! మరి మనం పొందే ప్రేమ , వలన మనకు ప్రయోజనాలేమైనా ఉన్నాయా ?  మన మానసిక శాంతి కీ , శారీరిక ఆరోగ్యానికీ , మనం ఇచ్చే ప్రేమా , మనం తిరిగి పొందే ప్రేమా ఏ రకం గా   ఆరోగ్య దాయకం ?  మనం ఉదయం లేచిన దగ్గరి నుంచీ , పడుకునే వరకూ , కేవలం  మనం తినే ఆహారం , దాని పోషక విలువల లెక్కలతోనే మన ఆరోగ్యాన్ని అంచనా వేసుకుంటూ ,జీవితం గడిపేద్దామా ?
ప్రేమ తో రోగ నిరోధక శక్తి : అంటే ఇమ్యునిటీ : ప్రేమ మనలో రోగ నిరోధక శక్తిని  శక్తి వంతం చేస్తూ ఉంటుంది ! ప్రేమ జంటలు , తమకు ఎదురైన వ్యక్తి గత సంబంధాల విషయాలలో , వివాదాలు ఏర్పడినప్పుడు ,  తరచూ ఘర్షణ పడుతూండడం సామాన్యమే !   ఆ  సందర్భాలలో ,  నిరాశా జనకం గా , నెగెటివ్ దృక్పధం తో   విసుగు తో , వాదనలతో , ఆ ఘర్షణ వాతావరణాన్ని కలుషితం చేసుకునే  ప్రేమ జంటల శారీరిక స్థితి మీద అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు , వారిలో రోగ నిరోధక శక్తి ,  చెప్పుకో దగినంత గా అంటే సిగ్ని ఫికెంట్ గా తగ్గుతుందని  కనుక్కున్నారు !   అట్లాంటి సందర్భాలను , ప్రేమ తో , ఆశావాద దృక్పధం అంటే పాజిటివ్ దృక్పధం తో  నవ్వుతూ ఎదుర్కుని , వాటి పరిష్కారాలను  వెదికి  అన్యోన్యం గా కాపురాలు కొన సాగించే ప్రేమ జంటల రోగ నిరోధక శక్తి ,  సమపాళ్ళలో, శక్తి వంతం గా ఉంటున్నట్టు విశదమైంది ! 
ప్రేమ గా వ్యాయామం ! : ప్రేయసీ ప్రియులు ప్రేమ గా కలిసి జిమ్ లో వ్యాయామాలు చేస్తే  వ్యాయామం ఉత్సాహం తో చేయడమే కాకుండా , ‘ పది కాలాల పాటు ‘ ఆ వ్యాయామాన్ని కొనసాగిస్తారు కూడా !  ఒక పరిశీలనలో ,  ఒంటరి గా వ్యాయామం చేసే వారిలో, సగం మంది , ఒక సంవత్సరం కాగానే , వ్యాయామం చేయడం మానేశారు ! అదే సమయం లో, జంటగా ప్రేమ గువ్వలు గా, జిమ్ లో వ్యాయామం చేసే వారు,  మూడు వంతుల మంది,  ఒక సంవత్సరం దాటినా కూడా , వ్యాయామం కొన సాగించారు !  అంటే , ప్రణయం తో,  వ్యాయామం కుంటు పడదన్న మాట ! 
ప్రేమ తో దీర్ఘాయిషు : ప్రేమ మయమైన జీవితాలు గడిపే జంటలు , ఎక్కువ కాలం జీవిస్తారని అనేక పరిశీలనల వల్ల తెలిసింది !  తమ జీవితాలను ఇంకొకరికి అంకితం ఇచ్చి , ఒక ప్రేమ బంధాన్ని ఏర్పరుచుకుని , సహచర జీవితం గడిపే వారు , నిశ్చింత గా ఏ రకమైన మానసిక వత్తి డీ లేకుండా , ఆనందం గా జీవిస్తున్నారని కూడా స్పష్ట పడింది !  అంతే కాకుండా ,  వారు ఆ  పరిస్థితులలో , దీర్ఘ కాలం , ఆనందం గా జీవించగలగడానికి  పురుషులు , ఒంటరి గా ఉన్నప్పుడు తమకు ఉన్న తాగుడు , పొగ తాగడం , మొదలైన వ్యసనాలకు , ఒక ( వివాహ ) బంధం ఏర్పడ్డాక , కళ్ళెం వేసి , ఆ అలవాట్లను బాగా నియంత్రణ లో ఉంచడమూ , చాలా సందర్భాలలో , ఆ అలవాట్లను పూర్తి గా  మానేయడం వల్ల కూడా అని విశదమైనది ! 
వచ్చే టపాలో ప్రేమ తో ఇంకొన్ని లాభాలు తెలుసుకుందాం ! 
 

చుంబన రహస్యాలు. 13. అడ్వాన్స్ డ్ కిటుకులు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 29, 2013 at 1:49 సా.

చుంబన రహస్యాలు. 13. అడ్వాన్స్ డ్  కిటుకులు !   

కలగలుపు ! : అంటే,  మిక్స్ అండ్ మ్యాచ్ !  ముద్దులు మంచు పూవుల లాంటివి ! అంటే , ఏ ఒక్క మంచు పూవూ ఇంకో దానిని పోలి ఉండదు ! కానీ అన్నీ మంచు పూవులే ! ఒక మారు, మీరు ఫ్రెంచ్ కిస్ ( ఇవ్వడానికీ , తీసుకో డానికీ ) కు కనుక అలవాటు పడితే , మళ్ళీ , మళ్ళీ అదే ఫ్రెంచి ముద్దు పెడదామని తహ తహలాడడం సహజమే !  వేగం మారుస్తూ , ఆమెలో  కామాతురత కు కళ్ళెం వేస్తూ  ముందుకు సాగడం !  మీరు ఇప్పుడు నిదానం గా ఫ్రెంచి ముద్దు ఇవ్వడం తెలుసుకున్నాక ,  ‘సమయానుకూలం ‘ గా మీ చుంబన వేగం మారుస్తూ , వివిధ వేగాలతో ముద్దులు ‘గుప్పిస్తూ ‘ ఉంటే ,  ఆ చేసే పని లో కాస్త  వెరైటీ వస్తుంది ! ఉద్వేగం వేస్తుంది , ఇరువురిలోనూ ! 
లోతు గా :  కొంత సేపు పై పై ముద్దులు ఇచ్చాక , చిలిపి గా  డీప్ కిసెస్ , అంటే గాఢమైన ముద్దులు ఇవ్వడం చేస్తే , మీ ప్రేమ రస పాకం లో పడుతుంది ! 
వత్తిడి గా : మీ ప్రేయసి తో పరిచయం పెరుగుతున్న కొద్దీ , మీ ముద్దులలో గాఢ త కూడా పెంచితే మీ తప్పు ఏమీ ఉండదు !  మీరిరువురూ ,  ఒకరి పొందులో ఇంకొకరు స్వాంతన పొందే స్థితికి వచ్చే ఉంటారు కదా  , ఈపాటికి !  దానితో లోతైన ముద్దులతో పాటుగా , ఆముద్దులను  శక్తి వంత మైనవి గా కూడా మీరు మార్చవచ్చు  , కాస్త వత్తిడి పెంచి !  కానీ మీ నాలుక ను ఆమెలో మెది లించడం మాత్రం మాన కూడదు ! 
దంత స్పర్శ :  కేవలం ఆమె పెదవులే కాకుండా , ఆమె దంతాలను కూడా మీ నాలుకతో  తాకవచ్చు ! అది కూడా ఒకరకమైన చక్కిలి గింతలు కలిగిస్తుంది మీ నెచ్చెలి లో ! 
చేతులతో !:  మొదటి ముద్దు సమయం లో, మీ చేతులను బుద్ధిగా మీకు ఇరు ప్రక్కలా ఉంచడమే శ్రేయస్కరం అంటారు !  మరి ఆ ముద్దు మొదటిది కానప్పుడు , మీ చేతులకు  పని కల్పించడం మీ బాధ్యత !  ప్రేయసి చెక్కిలి మీదనో , లేదా ఆమె శిరోజాలను సుకుమారం గా దువ్వుతోనో , లేదా ఆమెను మీ కౌగిలి లో ‘ బంధించో ‘  మీ ముద్దును ఆస్వాదించ వచ్చు , ఆమెతో కూడా ! 
దేహ భాష ! :  ముద్దులకు విశ్వ వ్యాప్త వైవిధ్యం ఉంది ! అంటే , ప్రపంచం లో ఏ ఒక్క ముద్దూ , ఒకే రుచి తో ఉండదు ! దానికి కారణాలు అనేకం ! దానిలో ముఖ్యమైనది , మనుషులంతా ఒక్కటే కాదు కదా ! అదే విధం గా,  ఏ ప్రేయసీ ఎప్పుడూ , ఒకే లా చుంబించ బడాలని అనుకోదు ! అంటే, వారికి కూడా వైవిధ్యం కావాలి !  ఏ ముద్దు ఆమెకు , ఇష్టమో , ఏ ముద్దు ఇష్టం లేదో  తెలుసుకోవడం ఒక కళ ! ఇంకో వంద టపాలు రాసినా , అది తెలుసుకోవడం సాధ్యపడదు !  కేవలం ,  ఆ ముద్దు పెట్టే వారి సమయ స్ఫూర్తి , వివేకం తోనే , అది సాధ్యం అవుతుంది !  కానీ ‘ సాధనమున పనులు సమకూరు ధరలోన !’  అనే సూక్తి ని , ‘  సాధనమున పనులు సమకూరు అధరాన ‘ అని గుర్తుంచుకుంటే !  మీరు విజయులే !  అప్పుడు మీకు , ‘ ఆమె ‘ ముద్దు మురిపాల తీరు తెన్నులు బాగా తెలుస్తాయి !  ప్రాక్టిస్ మేక్స్  పర్ఫెక్ట్ ! 
కమ్యునికేషన్ ! :  మీ ఇరువురి మధ్యా , పరిచయమూ , చనువు ఎక్కువ అవుతూ  ఉంటే , ముద్దు కూడా మురిపెం గా  అవుతూ ఉంటుంది !  ఆ స్థితి లో  అతడి ముద్దు మీకు నచ్చితే , ఆ సంగతి అతనితో చెబితే , మీ ఆనందం అధికం అవుతుంది ! ఒక వేళ ‘  ఆ ముద్దు’  నచ్చక పోయినా ,  మీ మనసులు కలిస్తే ,  మీరిరువురూ, సరదాగా ,  హాయి గా నవ్వుకుని,  మలి ప్రయత్నం చేయవచ్చు ! అందుకే ,   ప్రాక్టిస్ !  — — !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

చుంబన రహస్యాలు.12. ఫ్రెంచి ముద్దు ప్రేమైకం !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our mind, Our minds on సెప్టెంబర్ 27, 2013 at 9:37 సా.

చుంబన రహస్యాలు.12.  ఫ్రెంచి ముద్దు ప్రేమైకం !

మీ పెదవులతో, ఆమె పెదవులను  నెమలి ఈకతో  తాకినట్టు తాకడం :   మీ ఇరువురి పెదవులూ చేరువ అయిన తరువాత , మీ పెదవులతో, ఆమె పెదవుల మీద అతి సున్నితం గా తగలాలి !  ఆ టచ్, కేవలం,  మీరు ఒక నెమలి ఈక తో ఆమె పెదవులు తాకు తున్నంత సుకుమారం గా ఉండాలి !   ఎందుకు  అట్లా ? పెదవుల లో అనేక వందల నాడీ తంత్రులు గజిబిజి గా అల్లుకుని ఉంటాయి !  ఆ నాడీ తంత్రులు , అతి సున్నితమైన స్పర్శకు కూడా తక్షణమే స్పందించే  ధర్మం కలిగి ఉంటాయి !  మీ పెదవుల నెమలి ఈకలు ఆమె పెదవులను తాకగానే , ఆమె లో నూ , తద్వారా  ఆమె పెదవులలోనూ , విపరీతమైన యాంటిసిపేషన్ , ఎగ్జైట్ మెంట్ , కలుగుతాయి. అంటే ఆమె పెదవులు ,  మీ పెదవుల స్పర్శ తో ఉత్తేజం చెందడమే కాకుండా ,  మీ పెదవులతో బంధం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కూడా ! ఈ దశలో , పూర్తి ముద్దు కోసం కాదు ఆ ఎదురు చూపు !   ఈ పరిస్థితి లో, మీరు విపరీతం గా ఉద్రేక పడి పోకుండా , మీకు ఇప్పుడు ప్రపంచం లో  ఉన్న సమయం అంతా , మీ ఆధీనం లోనే ఉన్నట్టు భావించి , అతి నిదానం గా నింపాది గా  మీ నెమలీక  స్పర్శ ,  ఆమె పెదవులకు కలిగించాలి ! 
ఈ విధం గా కొంత సేపు ( ఎంతో సేపు ) చేసిన తరువాత , మీ ఉద్దేశం తెలియ చేయండి , ఫ్రెంచి ముద్దు కోసం ! అందుకు మీ సన్నద్ధత ను కూడా ఈపాటికి తెలియ చేసే ఉంటారు ! ఇప్పుడు, మీ నోరు విశాలం గా తెరచి , ఆమె కింది పెదవిని , మీ రెండు పెదవులతో లాక్ చేయండి అంటే బంధించడం !  ఆ తరువాత మీ నాలుక తో ఆమె క్రింది పెదవిని  ఇక్క సారిగా కేవలం కొన్ని క్షణాల పాటు స్వీప్ చేయండి , అంటే ఆమె క్రింది పెదవి మీద , మీ నాలుకతో వెన్న పూస్తున్నట్టు తాకడం !  ఆమెకు మీ చర్య ఇష్టం అవుతే ,  ఆమె నాలుక కూడా క్రియా శీలం అవుతుంది అంటే యాక్టివ్ గా మీ పెదవుల కోసం సాగుతుంది ! లేక , ఆమెకు ఇష్టం లేక పొతే  మీరు ఏ చర్యనూ ఫీల్ అవరు !  అప్పుడు , మీ ప్రయత్నం తాత్కాలికం గా విరమించుకుంటే మంచిది !  
ఆమె ఉత్సాహం చూపుతూ ఉంటే , మీ నాలుకకు పని పెట్టడం మీ తరువాతి కార్యక్రమం !   ఆమె నాలుకను మీ నాలుక తో తడిమి ( రుచి ) చూడడం , కొద్దిగా ఆమె నాలుకను తాకి , మళ్ళీ మీ నాలుక వెనుకకు పొతే , ఆమె దానిని అందుకోడానికి తన నాలుకను సాగ దీయడం ,  నోటి లో ఒక ప్రేమాట లా ఉంటుంది !   ఆనంద దాయకం గా , చిలిపి గానూ ఉంటుంది !  గుర్తు ఉంచుకోవలసినది, నాలుకను ఎప్పుడూ సాఫ్ట్ గానే ఉంచాలి ! దృఢ మైన కండరం గా చేయకూడదు !  అంతే కాకుండా , అత్యుత్సాహం తో మీ నాలుకను వీలైనంత పొడవు గా చాచి  ఆమె గొంతు కు అడ్డం గా పోనీయ కూడదు ! అప్పుడు ఆమె ఉత్సాహం నీరు కార్చిన వారవుతారు  మీరు ! 
మరి ఈ ఫ్రెంచ్ చుంబన కార్యక్రమం ఎక్కువ సమయం సాగుతుంటే , మీ   రిరువురూ శ్వాస తీసుకోవడం మరచి పోకూడదు !  మొహమాట పడకుండా , తరచూ శ్వాస తీసుకుంటూ ఉండాలి కూడా !  సరిపడినంత ఆక్సిజన్ అందితే , మీ మెదడు తో పాటుగా , మీ పెదవులూ , నాలుకా కూడా  ఉత్సాహం తో ‘ పని చేసి ‘ మీకు అధిక ఆనందాన్ని కలుగచేస్తాయి ! 
 
ఈ ఫ్రెంచి ముద్దులో కూడా కొన్ని అడ్వాన్స్ డ్  టెక్నిక్ లు ఉన్నాయి ! వాటి గురించి వచ్చే టపాలో ! 

చుంబన రహస్యాలు. 11. ఫ్రెంచి ముద్దు ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 26, 2013 at 11:04 సా.

చుంబన రహస్యాలు. 11. ఫ్రెంచి ముద్దు ఎట్లా ? 

కనులు కలిపి వలపు తెలుపు ! :  కనులు కలపడం అంటే  మీ కళ్ళు ‘ ఆమె ‘ కళ్ళ తో అనుసంధానం చేయాలి ! అంటే ఐ కాంటాక్ట్  చేయాలి ! మామూలు గా మనం ఎవరినైనా చూస్తున్నప్పుడు,  వారి కళ్ళ లో చూస్తాము కదా మరి ఆ చూపులకూ , ప్రణయ చూపులకూ అంటే రొమాంటిక్ చూపులకూ తేడా ఏమిటి ? ప్రణయ చూపులలో , అందాలను  ( కళ్ళ తో ) ప్రశంసిస్తూ కూడా , ఇంకా చిలిపి భావనలు కూడా తెలియ బరచడం !  మరి ముద్దు పెట్టుకోవాలని తెలపడం ఎట్లా ? 
అందుకు మీ చూపుల రూటు :   మొదట ఆమె కళ్ళతో జత కడతాయి , అక్కడ కొన్ని క్షణాలు ఉండి ,  నేరుగా ఆమె పెదవుల మీద పడతాయి  మళ్ళీ పెదవులనుంచి రూటు నేరుగా ఆమె కళ్ళలోకి వెళతాయి మీ చూపులు ! దానితో  మీ చుంబ న సందేశం  , ఆమె చూపుల ద్వారా , ఆమె మనసు టపా కు చేరుకుంటుంది, మీ మెసేజ్  ! 
చిలిపి నవ్వు : మీకు మీ ఉద్దేశం ఆమె కు తెలియ చేయగానే , మీ మనసు ఆనంద తాండవం చేస్తుంది , ఆ తాండవం ఆమెకు మీ చిరు నవ్వు ద్వారా తెలియ చేయండి !  మీ చిలిపి నవ్వు , ఆమెకూ ఆనందం కలిగించడం తో పాటుగా ,  ఆమె ను రిలాక్స్ చేసి , ఆమె లో చుంబనం చేయ బోతున్నందుకు కలిగే ఆందోళనలను నివారించ డమూ , లేదా తగ్గించడమూ చేస్తుంది !  ఆమెలో కానీ , అతనిలో కానీ భద్రతా భావాన్ని కూడా కలిగిస్తుంది  మీ పొందులో !  ఆ చిరునవ్వు , చిలిపి గా ఉన్నా , నిజాయితీ గా , స్వచ్ఛ మైనది గా ఉంటే ,  మీ చుంబనం రుచి మధురం గా ఉంటుంది ! ఆమె పాజిటివ్ గా స్పందించ గానే,  మీరు మరో అంగుళం ముదుకు వెళ్ళాలి ! అంటే అతి త్వరగా కాక , మరీ అంత నిదానం గానూ కాక ,  ఆమె పెదవులకై మీరు చేరువ కావాలి , ఆమెకు !  అదే సమయం లో ఆమె కూడా మీ పెదవులకు చేరువ కావడం గమనించండి ! 
మీరు నేరుగా ఆమె పెదవుల మీదనే దృష్టి పెట్టినా కూడా , మీ ముఖం ఆమె ముఖానికి సరిగ్గా ఎదురు గా ఉంచ కూడదు ! ఎందుకంటే , మీ ఇరువురి నాసికలూ ‘ విలన్ ‘  లవుతాయి ముద్దుకు ! అంటే  మీ ఇరువురి ముక్కులూ కలబడి,  మీకు,  ముద్దు దూరం అవుతుంది ! అందుకని,  మీరు ఆమె చేరువ అవుతున్న సమయం లో నే మీ తలను,  కొద్ది గా వంచాలి  నలభై అయిదు డిగ్రీలు ఒక ప్రక్కకు వంచితే , సరిగ్గా  మీ పెదవులు ఆమె పెదవులను చేరుకోగలవు !  మీరు ఆత్రుతగా,  తొంభై డిగ్రీలు కనుక మీ తల వంచితే , మీకు ఆమె పెదవుల పట్టు దొరకక పోగా , మీ చుంబ నోద్వేగం  కాస్తా చల్లారుతుంది !   ఆమె కానీ అతడు కానీ ఒక ప్రక్కకు తల వంచితే , మీరు ఆ డైరెక్షన్ కు ఆపోజిట్ అంటే , అభిముఖం గా మీ తల తిప్పాలి అప్పుడు మీ పెదవులు లంకె పడడానికి సరి అయిన పరిస్థితి ఏర్పడుతుంది ! 
కనులు మూసుకోవడం : మీ పెదవులు కలిసే సమయం లో మీ కనులు విశ్రాంతి తీసుకోవాలి , కను రెప్పలు మూసి ! అంటే మీరు కళ్ళు మూసుకోవడం జరగాలి !  కనులు తెరచి ముద్దు పెట్టుకోవడం ,  మీ నిజాయితీని శంకించే చర్య !  కనులు మూసుకుని  మీరు  చేసే చుంబనం మిమ్మల్ని , ఫ్లైట్ లో తీసుకు పోతుంది , ప్రణయ లోకానికి ! 
మీ పెదవులను చుంబన పొజిషన్ లో ఉంచడం:   సామాన్యం గా  బామ్మ లకు కానీ , నానమ్మ లకు కానీ ప్చ్ , ప్చ్ , ప్చ్ అని  ముద్దు ఇచ్చే సమయం లో లా , పెదవులను ముడి వేసి ఉంచకూడదు ! ఎందుకంటే ,  నానమ్మకు ఇప్పుడు ముద్దు ఇవ్వట్లేదు కనుక !  ప్రేయసికి ముద్దు ఇచ్చే సమయం లో మీ పెదవులను ఓపెన్ గా తెరచి ఉంచాలి !  అట్లాగని మీ నోటిని పూర్తి గా తెరచి ఉంచకూడదు ! ఒక మాదిరి గా తెరిచి , పెదవులను కొద్దిగానే,  బిగుతు గా ఉంచి   మీ బ్రహ్మాస్త్ర ప్రయోగానికి ఉపక్రమించాలి ! 
మిగతా సంగతులు వచ్చే టపాలో !