Our Health

Archive for జనవరి, 2017|Monthly archive page

4.ఒథెల్లో సిండ్రోమ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి ?!

In మానసికం, Our Health, Our minds on జనవరి 28, 2017 at 5:07 సా.

4.ఒథెల్లో సిండ్రోమ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి ?!

Image result for suspicious husband

మునుపటి మూడు టపాల లో ఒథెల్లో సిండ్రోమ్ ఏ విధం గా కనబడుతుందో , జీవితాలను ఎట్లా చిన్నా భిన్నం చేస్తుందో తెలుసుకున్నాం కదా !
ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం !
ఒథెల్లో సిండ్రోమ్ ఒక మానసిక దుర్బలత  ! ఈ వ్యాధి ఎక్కువగా పురుషులలో కనబడుతుంది ! ఈ వ్యాధి గ్రస్తులు , తమ మానసిక స్థితి ‘ బ్రంహాండం ‘ గా ఉందనుకుంటారు ! అంటే , వారి ప్రవర్తన సహజమే అనీ , అందులో తప్పు ఏమీ లేదని బలమైన నమ్మకం తో ఉంటారు , వారి మటుకు వారు ! 
తమ జీవిత భాగస్వామి కానీ , తమ భార్యలు కానీ , ఇతరులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ , తమను అశ్రద్ధ చేస్తున్నారనే , అపోహ పడుతూ, వారిని అనుమానిస్తూ ఉంటారు , అందులో ఏమాత్రం నిజం లేక పోయినా !
క్రమేణా , ఈ అపోహ , అనుమానం  బలం గా వారి మనసు లో నాటుకుని ,  అనేక రకాలు గా వారి భార్యల, లేదా జీవిత భాగస్వాముల ప్రవర్తనను , అనుమానిస్తూ , అను నిత్యం , వారిని ప్రశ్నిస్తూ ఉంటారు , వారి ప్రవర్తన గురించి !
వారికి సమాధానాలు చెప్పలేక , భార్యలు సతమతమవుతూ ఉంటారు ! ఎందుకంటే , వారి సమాధానాలు , ఈ ‘  వ్యాధి గ్రస్తులను ‘ తృప్తి పరచలేవు గనుక !
వారిని  ఈమెయిల్ , ట్విట్టర్ , ఇస్టాగ్రామ్ , ఫేస్ బుక్ ఎకౌంట్ లు , తెరవ నివ్వరు ! ఒక వేళ తెరిచినా , పాస్ వర్డ్  తెలుసుకుంటారు , వారిని బెదిరించి ! 
ఆ తరువాత , వాటిని నిరంతరం పరిశీలిస్తూ ఉంటారు , అనుమానాస్పద కాంటాక్ట్ ల కోసం !
వారి భార్యలను , వారి వారి తల్లి దండ్రులకూ , బంధు మిత్రులకూ దూరం చేసి , వారిని ఏకాకులు గా చేస్తారు !  వారి  వారి , అభిరుచులనూ , వారి ఆనందాలనూ , ఏమాత్రం గౌరవించక , బయటకు వెళ్ళ కుండా , కట్టు దిట్టాలు చేస్తూ ఉంటారు !
వారి సాంఘిక పరిచయాలనూ ,  కలయిక లనూ నియంత్రిస్తూ ఉంటారు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని లక్షణాలు ! 

ఒథెల్లో సిండ్రోమ్……… 3.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జనవరి 15, 2017 at 10:29 ఉద.

ఒథెల్లో  సిండ్రోమ్……… 3. 

 

Image result for sunrise and birds
కాలం బరువు గా గడుస్తూంది !
నవీన్  మనసు లో అనుమాన బీజం  వేళ్లూనుకుంటూ ఉంది  !
ఏదో  వెలితి , మనసులో !
వనిత కు ‘ దగ్గర ‘ కాలేక పోతున్నాడు !
‘ వనిత ఇంకొకడి తో సంబంధం పెట్టుకుంది ‘ ఇదే ఆలోచన పదే పదే  కాగుతుంది,  గుండెల్లో !
ఇంటికి రాగానే , ఎదో ఒక సమయం లో వనిత హ్యాండ్ బ్యాగ్ లో చేతులు పెట్టి , హడావిడి గా వెదుకు తున్నాడు , సెల్ ఫోన్ నంబర్ లు  నోట్ చేసుకుంటున్నాడు !
మెసేజెస్ చెక్ చేస్తున్నాడు !
ఆఫీస్ నుంచి ఇంటికి రావడం ఆలస్యం అయినప్పుడల్లా , ఆవేశానికి లోనవుతున్నాడు !
దానితో, అనుమానం అలలు గా ఎగిసి పడుతుంది !
రాగానే వాదన మొదలవుతూ ఉంది , వనిత తో !
తనను అనుమానిస్తున్నందుకు బాధ గా ఉన్నా , అనేక మార్లు  అనునయం గా నిజం చెప్పి , నవీన్  మనసు  మార్చడానికి ప్రయత్నించింది !
అందుకు నవీన్ ను సైకియాట్రిస్ట్ దగ్గరకు కూడా తీసుకు వెళతానంది ! అదంతా వృధా ప్రయాస అయింది ! 
నవీన్ , తనలో ‘ ఏ లోపమూ లేదు , తప్పంతా వనితదే ‘  అని వాదిస్తున్నాడు , పదే పదే  !
వనిత కు నవీన్ ప్రవర్తన లో మార్పు ఎందుకు వచ్చిందో తెలియట్లేదు !
బ్రతుకు భారమవుతోంది  తనకు , డబ్బు  హోదా ఉన్నా, తన తప్పు లేకున్నా!
ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి !
హృదయం నవీన్ కోసం మెత్త బడి నప్పుడల్లా , మెదడు కర్తవ్యాన్ని తట్టి లేపుతూ ఉంది , వనితను  !
నవీన్ అనుమానాలు అతనికి పెను భూతాలయి , పీడిస్తున్నాయి,  అహో రాత్రాలూ !
వనిత రూమ్ లో  ఆమె బట్టలూ , పుస్తకాలూ , చిందర వందర అవుతున్నాయి !
నవీన్ , ఆమె లేని సమయం లో వెదుకుతున్నాడు, ఆమె కు లేని సంబంధాలను అంటగట్ట డానికి  ! ఉన్న సంబంధాన్ని , మంట గలపడానికి ! 
ఆ మంటలు ఉవ్వెత్తున ఎగసి పడడానికి , నవీన్ కు మద్యం తోడవుతూ ఉంది , రోజూ ! 
ఇట్లా నెలలు  గడిచాయి !
ఒక ఆది వారం ఉదయమే , ‘ అమ్మా వనితా ‘  అంటూ తలుపు తట్టాడు , ఆమె తండ్రి !
శని వారం రాత్రి త్వరగానే పడుకున్నా , నిద్రలేమి తో , నిరాశతో , తలుపు తెరిచింది , వనిత !
ఒక్కసారిగా  తండ్రిని చూడగానే బావురుమని ఏడిచింది , గుండెలకు హత్తుకుని , చిన్న పాపాయి లా !
విషయమంతా , బాగా అర్ధమయింది  తండ్రికి , ఆమె ఇమెయిల్స్ తో పాటుగా ,ప్రత్యక్షం గా వనితను కూడా చూశాక ! అక్కడక్కడా మచ్చలూ ,మానిన గాయాలూ కూడా కనిపించాయి, తన ‘ బంగారు తల్లి ‘ ఒంటి మీద !
ప్రమాద వశాత్తూ అయ్యాయని తండ్రికి  చెప్పడానికి  వనితకు ఎన్ని వంకలు దొరుకుతాయి కనక !
నవీన్  చీకటి గది లో, గాఢ నిద్రలో ‘  పడి ‘ ఉన్నాడు ,  జీవితాన్ని అంధకారం చేసుకుంటూ !
అతి కష్టం మీద తండ్రి ఉద్రేకాన్ని నివారించి , సూట్ కేస్ ను రోల్ చేసుకుంటూ , తండ్రితో కూడా బయటకు వచ్చింది వనిత !
బయట ఎంతో వెలుతురు గా ఉంది , ఆ ఉదయం ! ప్రత్యేకించి వనిత కు !
సూపర్ డీలక్స్ బస్ ఎక్కబోతూ ఒక్క ఫోన్ చేసింది, సంతోషం గా  తన తల్లికి ‘ అమ్మా నేనూ, నాన్నా మధ్యాహ్నం కల్లా ఇంటికి చేరుకుంటాం ‘ అని !
వెంటనే , సెల్ ఫోన్  ను బస్ ముందు టైర్ కింద టక్ చేసింది ఎవరి కంటా పడకుండా !
బస్ సిటీ లిమిట్స్ దాటుతూండగా , ఆకాశం లో స్వేచ్ఛ గా ఎగురుతున్న పక్షుల తో  సింక్రొనైజ్ అయింది వనిత మనసు,  హాయి గా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
%d bloggers like this: