Our Health

పాజిటివ్ సైకాలజీ- విశదమైన ఆప్టిమిజం – 17.

In మానసికం,Our minds on మే 30, 2012 at 7:37 సాయంత్రము

పాజిటివ్ సైకాలజీ- విశదమైన  ఆప్టిమిజం  - 17.

మనం మార్టిన్ సెలిగ్మన్ ప్రతిపాదించిన  ఆశావాదం లేక ఆప్టిమిజం గురించి తెలుసుకుంటున్నాము కదా ! ఇప్పుడు మానవులలో ఈ ఆప్టిమిజం ఏ ఏ రకాలు గా కనపడుతుందో చూద్దాము ! 
ముఖ్యం గా  ఈ మనస్తత్వం మూడు రకాలు గా కనిపించ వచ్చు. అంటే ఈ మూడు రకాలూ ఒకే వ్యక్తి లో కాక ,  ఈ మనస్తత్వాన్ని బట్టి మానవులు మూడు రకాలకు చెందుతారు అంటే సరి గా ఉంటుంది. మొదటి రకం : తాత్కాలికమూ , శాశ్వతమూ : ఈ రకం లో  నిరాశా వాద మానవులు , వారి జీవితం లో ఏదైనా అనుకున్నట్టు జరగక పొతే , ఇక వారికి ఎప్పుడూ ఏదీ సక్రమం గా జరగదు అనుకుంటారు. 
 ఒక ఉదాహరణ : ప్రమోద్ ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో ఉద్యోగానికి ఇంటర్వ్యు లో భాగం గా బోర్డ్  రూం లో   ఒక టాక్ ఇవ్వ వలసి వచ్చింది. తను అనుకున్నట్టు మాట్లాడ లేక పోయాడు.  ఇక అంతర్మధనం మొదలైంది. నేను ఎప్పుడూ ఇంతే ! నాకు మాట్లాడం చేత కాదు ! దానికి తోడు ఆ వెధవ  పవర్ పాయింట్ కూడా అప్పుడే ఫ్రీజ్ అయి చావాలీ ! మొత్తం ప్రెజెంటేషన్  ను నాశనం చేశాను!  బోర్డ్ రూం లో ఉన్న వారందరూ ఏమనుకుంటారు? నేను ఫస్ట్ క్లాస్ లో పాసయిన ఇంజినీర్ లా  ఇంప్రెషన్ ఇవ్వలేదు ! అని తనను విమర్శిచుకుంటూ ,  విచార పడుతున్నాడు 
ఇలాంటి పరిస్థితి నే  ఆనంద్  కూడా ఫేస్ చేశాడు. కానీ ఆనంద్ , ప్రమోద్ కాదు , ఆనంద్ ఆనందే ! ఆనంద్ ఆశావాది అంటే ఆప్టిమిస్ట్ . ఇంటర్వ్యు కాగానే ‘  ఆ కొద్ది గా పవర్ పాయింట్  సరిగా పని చేసి ఉంటే , ఇంకా బాగుండేది నా ప్రెజెంటేషన్. అందులో  బోర్డ్ రూం లో అందరూ లంచ్ తరువాత భుక్తాయాసం తో   మగత నిద్ర లో ఉన్నట్టున్నారు, సరిగా కాన్సంట్రేట్ చేయలేదు నా టాక్ మీద . ఇంకో ఇంటర్వ్యు  లో నాకు ముందే అవకాశం వస్తే , ( ఇంటర్వ్యు బోర్డ్ మెంబర్లు ఎలర్ట్ గా ఉన్నప్పుడు ) నేను ఇంకా బాగా  నా టాక్ ప్రిపేర్ చేసుకొని , ఇంకా బాగా టాక్ ఇచ్చి  సెలెక్ట్ అవుతాను  !  అని  అనుకున్నాడు 
డాక్టర్ కారెన్ రీవిచ్ అనే సైకాలజిస్టు  ఇలా తాత్కాలికం గా నూ శాశ్వతం గానూ ఆశావాద , నిరాశా వాద మనస్తత్వాలను ఇంకో విధం గా కూడా  వివరించారు. పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్ధి ‘ నేను శుంట ను ‘ అని అనుకున్నా డనుకోండి. ఇందులో నిరాశావాదం శాశ్వతం గా  గుప్తమై ఉంది. అంటే ఈ విద్యార్ధి  ఆలోచనా ధోరణి  ఒక శాశ్వతమైన నిరాశా ధోరణి ని ప్రతి బింబిస్తుంది. అంటే దాని ప్రభావం తను తరువాత మళ్ళీ తీసుకునే పరిక్ష మీద కూడా ఉంటుంది. అలాగే పరీక్ష ఫెయిల్ అయిన ఇంకో విద్యార్ధి ‘ పరీక్షల ముందు నేను సరిగా రివైజ్  చేయను ‘ అని అన్నాడనుకొండి. అప్పుడు ఆ విద్యార్ధి మనస్తత్వం , కేవలం తాత్కాలిక పెసిమిజాన్నే  ప్రతిబింబిస్తుంది. అంటే ఈ విద్యార్ధి లో   ’ సరిగా పరీక్ష ముందు కూడా రివైజ్ చేస్తే  పాస్ అవగలను అనుకునే ఆశావాదం తొంగి చూస్తుంది. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !

పాజిటివ్ సైకాలజీ – ఆశావాదం ( ఆప్టిమిజం ).16.

In మానసికం,Our minds on మే 29, 2012 at 9:17 సాయంత్రము

పాజిటివ్ సైకాలజీ – ఆశావాదం ( ఆప్టిమిజం ).16.

మనం సామాన్యం గా చాలా మందిని చూస్తూ ఉంటాము మన అనుభవం లో.   మనం ప్రత్యేకించి పరిశీలనగా చూడక పోయినా, కొంత మంది ,  కష్ట సమయాలలో , నిరంతరం అంటే కష్టాలు ఒక దానిమీద ఒకటి అనుభవిస్తున్నా కూడా , మంచి రోజులు వస్తాయి ‘ అనుకుంటూ ,జీవనం సాగిస్తారు. అలాగే ఇంకొంతమంది , కష్ట సమయాలలో , ఇంకా క్రుంగి పోయి , తమనూ , తమ ‘ తల రాత ‘ నూ , లేదా ‘ విధి రాత నూ ‘ నిందించు కుంటూ కాలం వెళ్ళ దీస్తారు. 
గత ఇరవై సంవత్సరాల కాలం లో ఈ ఆశావాదం లేక ఆప్టిమిజం  మీద  విస్తృతం గా పరిశోధనలు జరిగాయి.  వీటితో , ఆశా వాదం , లేదా ఆప్టిమిజం  అంటే పైన ఉదహరించినట్టు కాక చాలా లోతైన అర్ధం ఉందని. 
ఈ ఆప్టిమిజం  ను రెండు విధాలుగా , చెప్పుకోవచ్చు. 
షియార్ ఇంకా కార్వార్  అనే సైకాలజిస్టులు ఆప్టిమిజం ను ‘  మన జీవితం లో ఎప్పుడూ,  మనకు  చెడు కన్నా మంచే జరుగుతుంది అని అనుకునే స్వభావం లేదా  ప్రవ్రుత్తి   అని నిర్వచించారు.  అలాంటి వారు , మీద పిడుగులు పడుతున్నా , తమకు ఏమీ అపాయం జరుగదు అని అనుకునే వారు.   మన రోజు వారీ భాష లో అలాంటి వారు ఎప్పుడూ  జీవితం లో వెలుగు వైపు తమ   దృష్టి ఉంచుతారు. అదే  పెసిమిస్టు లు , అంటే నిరాశా వాదులు ,  వారి జీవితం లో ఏదో ఒకటి ఎప్పుడూ వారికి ప్రతికూలం గా జరుగుతుంది , తప్పకుండా ‘  అని అనుకునే వారు. 
ఇంకో సైకాలజిస్టు ,  మన పాజిటివ్ సైకాలజీ గురువు మార్టిన్ సెలిగ్మన్ ఈ ఆశావాదాన్ని  ఇంకో రకం గా నిర్వచించారు. ఆయన నిర్వచనం లో 
‘ ఆశావాదం మూలాలు కేవలం   మంచి మాటలు అంటే  ఆశాజనకమైన, లేదా విజయం గురించి  మాటలు అనుకోవడం కానీ , దృశ్యాలు ఊహించడం  లో కానీ ఉండదు.  ఆశావాదం లేక ఆప్టిమిజం  కారణాల గురించి మనం ఆలోచించే ధోరణి లో ఉంటుంది’ . 
( ‘ The basis of optimism  does not lie in positive phrases or images of victory, but the way you think about  causes’ )
దీనినే ‘ విశదమైన  ఆశావాదం’  లేదా  ఎక్స్ప్ల నేటరీ  ఆప్టిమిజం ( explanatory optimism ) అంటారు.  ఈ విశదమైన  ఆశావాదం , లేదా ఆప్టిమిజం మనకు నిత్య జీవితం లో చాలా ముఖ్యం. దీనిని అలవాటు చేసుకుంటే , జీవితానందం అధికం అవుతుంది. 
 ఈ విశదమైన ఆశా వాదం గురించి వచ్చే టపా లో విపులం గా తెలుసుకుందాము ! 

పాజిటివ్ సైకాలజీ – మతం చేసే హితం. 15.

In మానసికం,Our minds on మే 29, 2012 at 12:15 ఏ ఎమ్

పాజిటివ్ సైకాలజీ –  మతం చేసే హితం. 15.

మన జీవితార్ధం తెలుసుకోవడం లో మన మతం చేసే హితం ఎంతో ఉంది. త్రికరణ శుద్ధి తో
( అంటే, మనసా , వాచా , కర్మణా ) ఆచరించే ఏ మతం అయినా  ఇహ పర సాధనకు సోపానం అవుతుంది. మతం తో  దానగుణం , సేవా దృక్పధం అలవడుతాయి.అలాగే వేదాంత ధోరణి , పరోపకార  నైజం , ఇలాంటి గుణాలు కూడా , జీవితార్ధాన్ని , జీవిత పరమార్ధాన్ని  మనకు ఎప్పటికప్పుడు తెలియ చేస్తూ , అధికానంద హేతువు అవుతాయి.  నిరంతరం విజ్ఞానాన్ని పెంపొందించు కోవాలనే తృష్ణ , జిహ్వ కూడా అధికానందం పొందడానికి దోహద పడతాయి.  
చిన్న చిన్న సేవా కార్యాలు ఒక క్రమం గా అంటే వారానికో పక్షానికో కొన్ని సార్లు  చేస్తూ ఉంటే కూడా , మనం  అధికానందం పొందుతాము.  అంతే కాకుండా, మనం చేసే చిన్న చిన్న సేవా కార్యాల  వల్ల మనం మన ఇరుగు పొరుగు వారితో మంచి సంబంధాలు ఏర్పరుచుకో గలుగు తాము. అలాగే వారి నుంచి పాజిటివ్ అభిప్రాయాలు కూడా స్వీకరించ గలుగుతాము .
క్షమా గుణం : మనం మన జీవితాలలో  ఎన్నో సంఘటనలు , మనకు కోపం , ఉద్రేకము కలిగిస్తూ ఉంటాయి. ఇలా మన కోపానికి ఇతరులు కూడా చాలా సమయాలలో కారకులవుతుంటారు. కానీ మనం క్షమా గుణం అలవరుచు కుంటే, మన మనసు తేలిక అవుతుంది.  మనకు అధికం గా కోపం తెప్పించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే , వారిని క్షమిస్తూ ఉన్నట్టు ఒక ఉత్తరం రాసి పారేస్తే కూడా ఆ కోపం మాయ మవడమో, లేక తగ్గి పోవడమో జరుగుతుంది.  అలా కాక మనం, వారిని క్షమించ కుండా  తరచూ కోపం తెచ్చు కుంటూ ఉంటే ,  ఆ ( కోపం కలిగించిన ) సంఘటనలు పదే పదే  మన మనసులను తోలిచినట్టు అయి , మనను కలత పెడుతూ ఉంటాయి. 
ఇక్కడ సుమతీ శతక కారుడు వందల ఏళ్ల క్రితం వ్రాసిన పద్యం మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే  ఆ పద్యం యదార్ధం కూడా ! 
తన కోపమే తన శత్రువు, 
తన శాంతమె తనకు రక్ష,దయ చుట్టంబౌ , 
తన సంతోషమే  స్వర్గము  
తన దుక్ఖమే నరకమండ్రు తధ్యము సుమతీ !

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !
Follow

Get every new post delivered to your Inbox.