బంధాలు ఎందుకు తెగుతాయి !? 1.
బంధం అంటే కలయిక ! ఆ కలయిక, ఒక తాడు కు రెండు వైపులా కావచ్చు ! రెండు తాళ్ళకు ఒక్కో వైపు కూడా కావచ్చు ! కేవలం భౌతికం గా పరిశీలిస్తే, ఒక బంధం దృఢ మైనది గా ఉండాలంటే , అందుకు అవసరమయే తాడు , ఏ పదార్ధం తో చేయబడ్డదో అనే విషయం ఎంత ముఖ్యమైనదో , ఆ తాడుతో వేయ బడే ముడి ఏ రకం గా వేయ బడిందో అనే విషయం కూడా అంతే ముఖ్యమైనది ! అంతే కాకుండా , అట్లా వేయబడిన ముడి , పరిసర వాతావరణ ప్రభావాలకు కూడా బలపడడమూ , లేదా బలహీన బడడమూ జరుగుతూ ఉంటుంది ! అంటే , పరిసరాలు అతి శీతలం గా ఉన్నా , లేదా అతిగా వర్షాలు పడి , ఆ వేయబడ్డ ముడి నానినా , లేదా అత్యధిక ఉష్ణోగ్రత ల ప్రభావం వల్ల , అంటే మండు వేసవి వేడికి కానీ , లేదా ముడి కి అతి దగ్గర గా మంటలు చెల రేగడం కానీ జరిగితే , ఆ ప్రభావం తో , వేయ బడ్డ బంధం , తెగి పోతుంది ! స్త్రీ పురుష సంబంధాలను కూడా చాలా వరకూ ఈ రకం గా అన్వయించుకోవచ్చు ! ప్రస్తుత అంతర్జాల యుగం లో మానవ సంబంధాలతో పాటుగా , స్త్రీ పురుష సంబంధాలు కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించు కుంటున్నాయి , సహజం గానే ! స్త్రీ పురుషుల సంబంధాల లో తేడాలు , వారు స్త్రీ, పురుషులవడం వల్ల వస్తుంటాయి ! ఈ విషయం ఒక్క ముక్క లో చెప్పగలిగినా , అనేక కారణాలు , స్త్రీ పురుష సంబంధాలను ప్రభావితం చేస్తాయి !
మరి స్త్రీ పురుషుల ఆలోచనా ధోరణులలో తేడాలు ఏమిటి ?
పరిణితి అంటే డెవలప్ మెంట్ పరం గా చూస్తే , అమ్మాయిల మెదడు కుడిభాగం త్వరగా అభివృద్ధి చెందుతుంది ! మెదడు కుడి భాగం లో త్వరగా మాట్లాడడం , ఇంకా ఒకాబులరీ అంటే అనేక పదాలను అర్ధం తెలుసుకో గలిగే నేర్పు , ఇంకా జ్ఞాపక శక్తి కి కూడా ముఖ్యమైన స్థానాలు ఉంటాయి ! ఇంకా పదాలను వ్యక్తీకరించడం కూడా మెదడు కుడి భాగం క్రియా శీలం గా ఉంటే జరుగుతుంది ! ‘ ఆ అమ్మాయి , నాలుక భలే చురుకు ! ఎంత బాగా మాట్లాడుతుందో ! మాటల పుట్ట ! నానిది కూడా అదే వయసు , కానీ మౌనం గా ఉంటాడు , అని బాలికలను ప్రశంశించడం మనం చూస్తూనే ఉంటాము !
అబ్బాయిలలో మెదడు లో ఎడమ భాగం, అంటే లెఫ్ట్ హెమి స్ఫియర్ త్వరగా అభివృద్ధి చెందుతుంది ! దానితో సమస్యలకు పరిష్కారం కనుక్కోవడమూ , జటిల మైన పజిల్స్ ను పరిష్కరించ గలగడమూ , ఏ ప్రదేశం ఎక్కడ ఉందో కనుక్కోవడమూ , కూడా త్వరగా చేయడం జరుగుతుంది ! ‘ ప్రభాకర్ , ఊరంతా చుట్టి వస్తాడు, ఒక సైకిల్ ఇస్తే !అని కానీ , ‘ వాడికి ఆ శక్తి ఉంది ! అనుకున్న పని సాధిస్తాడు ‘ అని కానీ అనడం కూడా వింటూ ఉంటాము, మనం !
స్త్రీలు , పెరుగుతూ ఉన్న కొద్దీ , మెదడు రెండు భాగాలనూ , బాగా ఉపయోగించుకోవడం జరుగుతుంది ! అంటే రైట్ అండ్ లెఫ్ట్ హెమి స్ఫియర్స్ ! ఆ రెండు భాగాలనూ జత చేసే , కార్పస్ కలోసం అనే పట్టీ , పురుషులలో కన్నా స్త్రీలలో ఎక్కువ మందమైనది గా కనిపించింది ( పురుషులలో కన్నా ) , శాస్త్రజ్ఞులకు ! వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు !