గుండె జబ్బుల గురించి అందరికీ ఎందుకు?

గుండె, లేక హృదయ సంబంధ మైన జబ్బులు, ప్రపంచం మొత్తం లో ఎక్కువ మందిని బాధ పెడుతున్నాయి. పై పటం చూడండి.
ఈ గుండె జబ్బుల వల్ల, బాధ పడుతున్న వ్యక్తే కాక, వారి కుటుంబం కూడా కుంగి పోయి, అనేక విధాల నష్ట పోతుంటారు.
ప్రపంచమంతా, మానవులలో పెరుగుతున్న ‘ చెడు ‘ జీవన శైలి ‘ పోకడలు, ఈ గుండె జబ్బులను ఇంకా, ఇంకా పెంచుతున్నాయి.
భారత దేశం లో కూడా, గుండె జబ్బుల వల్ల సంభవిస్తున్న మరణాలు, మిగతా అన్ని జబ్బులూ , కారణాల తో పోలిస్తే కూడా చాలా చాలా ఎక్కువ.
మరి అందరికీ ఈ గుండె జబ్బుల గురించి ఎంత వరకు తెలుసు?
చాలా మంది, గుండె జబ్బు తో బాధ పడుతున్న వారు, కేవలం ఉప్పు తగ్గించి ఆహారం తీసుకోవడమే చేస్తారు. మిగతా జాగ్రత్తలు అశ్రద్ధ చేస్తుంటారు.
అందుకు ప్రధాన కారణం, గుండె జబ్బుల మీద తగిన అవగాహన లేక పోవడమే !
అంతే కాక, కుటుంబం లోని యువత ఇలాంటి విషయాల మీద పరిజ్ఞానం పెంచుకుంటే కూడా, వారి తలిదండ్రులకూ, బంధువులకూ, తగిన సలహా ఇచ్చి, సహాయం చేసిన వారవుతారు.
అలాగే , వైద్య సలహా ఎప్పుడు తీసుకోవాలో కూడా తెలుసుకుంటే, అనవసరం గా సమయం వృధా, డబ్బు వృధా కాకుండా జాగ్రత్త పడవచ్చు, క్లినిక్స్ , హాస్పిటల్స్ , వైద్యుల చుట్టూ తిరగకుండా !
అతి ముఖ్యం గా , గుండె జబ్బుల మీద సరియిన అవగాహన ప్రతి ఒక్కరూ ఏర్పరుచుకుని, తగు జాగ్రత్తలు క్రమం గా పాటిస్తే, వారు ఎక్కువ ఆరోగ్య వంతులు గా, దీర్ఘ కాలం, ఆనంద మయ జీవితం గడపచ్చు. ఎందువల్ల నంటే చాలా రకాలైన గుండె జబ్బులు మన జీవనశైలి తో ప్రభావితం అవుతున్నవే !
తరువాతి టపా నుంచి గుండె , గుండె సంబంధమైన జబ్బులను వివరం గా తెలుసుకుందాము.
ఈ బ్లాగు చదివే ప్రతి వారి దగ్గర నుంచి ప్రశ్నలూ , అభిప్రాయాలూ, తెలుగు లో కానీ, ఇంగ్లీషు లో కానీ ఆహ్వానింప బడుతున్నాయి.
మీరు కేవలం, ఈ సైట్ కు మీ హిట్స్ ద్వారానే కాక, మీ ప్రశ్నల ద్వారా, మిగతా చదువరులకు కూడా ఎక్కువ సహాయం చేసిన వారవుతారు.