Our Health

Posts Tagged ‘ఉండే చోటు మీద ఆపేక్ష’

ఉండే చోటు మీద మమకారం.3.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మార్చి 2, 2014 at 2:37 ఉద.

ఉండే చోటు  మీద  మమకారం.3. 

 
ఉండే చోటు మీద, మమకారం ఎట్లా ఏర్పడుతుందో  చూద్దాము ! 
ఒక ప్రదేశం లో కొంత కాలం ఉండడం , లేదా ఉంటుండడం జరిగితే , ఆ ప్రదేశం మీద ప్రేమ ఏర్పడుతుంది , ఆపేక్ష ఏర్పడుతుంది ! ఇఫు తువాన్ అనే శాస్త్రజ్ఞుడు , ఈ పరిస్థితి కి ‘ టోపో ఫిలియా’   అని పేరు పెట్టాడు ! కంగారు  పడ నవసరం లేదు, పేరు ను చూసి ! టోపో  = అంటే ఒక ప్రదేశం అని ఫిలియా = అంటే ఇష్టం అనీ అర్ధం ! అంతే ! అంటే, ఈ పరిస్థితి లో మానవులకు ,  ఒక ప్రాంతం లో ఉండడం జరిగిన తరువాత , వారు , ఇతర ‘ ఏ ‘ ప్రాంతాలకు వెళ్లి ఉంటున్నా కూడా , వారికి అంతకు ముందే నచ్చిన ప్రాంతానికి వెళదామనే ఆసక్తి కలుగుతుంది !  ఆ ఆకాంక్ష పెరుగుతుంది !
ఆ చోటి స్మృతులు : 
ఒక చోట కొంత కాలం ఉండడం వల్ల కలిగే అనుభూతుల జ్ఞాపకాలు , ఉదాహరణకు : ఒక ప్రాంతం లో ఉంటూ ఉంటే , ఆ ప్రాంతం లో ఉంటున్న ఇతర వ్యక్తులతో , తమకు కలిగిన అనుభవాలు కూడా వారికి , ఆ ప్రాంతం తో ఒక బంధం ఏర్పరుచుతాయి ! అంటే , ఒక చోటు మీద ఆపేక్ష , లేదా ఎటాచ్ మెంట్ , కేవలం ఆ స్థానానికే పరిమితం అయి ఉండదు ! ఫలానా ప్రాంతం లో తమ జీవితం ఎంతో ప్రశాంతం గా గడచిందనీ , లేదా  అక్కడి మనుషులు ఎంతో మంచి వాళ్ళనీ , తమతో స్నేహ పూర్వకం గా ఉండడమే కాకుండా , తమకు  సమస్యలు ఏర్పడినప్పుడు , తమ వంతుగా , సహాయం కూడా చేశారనీ కూడా , ఆ అనుభవాలను గుర్తు తెచ్చుకుంటూ ఉండడం సహజమే ! 
ఇంతే కాకుండా  ‘ నేను పట్నం మనిషినే ‘ అని కానీ ‘ నేను టౌను మనిషిని ‘ అనుకోవడం కానీ జరిగినప్పుడు , వారు కేవలం ఒక్క పట్నాన్నే కాకుండా , తాము  ఏ పట్టణం లోనైనా నివశించడం ఇష్ట పడే వారిమని తెలియ చేస్తున్నట్టే !  అంటే , వారు ,  పట్నం లో ఉండే   అనేక వసతులకు  అలవాటు అవడమూ , ఇష్టమవడమూ , జరుగుతుంది ! ఉదా: ప్రస్తుతం , హైదరాబాదు లో , వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉంటున్న వారికి , ఆ రకమైన అనుభూతులు ఏర్పడడానికి కారణం అదే !   వారు , వారి అనుభవాలను ఎప్పుడూ , రాజకీయాలకు అతీతం గా, వారి మనసులలో పదిల పరుచుకుంటారు ! జరుగుతున్న మార్పులు వారిని ప్రభావితం చేస్తున్నది కూడా అందుకే !  
ఆ చోటి ప్రవర్తన : అంటే మనం , మనకు నచ్చిన ప్రాంతాన్ని మళ్ళీ దర్శించినప్పుడు , మనం పొందే వివిధ అనుభూతులు , అనుభవాల కలయికే , మన ప్రవర్తన లో కనిపిస్తుంది ! మనకు ఇష్టం ఉన్న ప్రాంతానికి , ఉదాహరణకు , మన సొంత ఊరు, కొంత కాలం తరువాత  వెళ్ళినప్పుడు , మనకు తెలియకుండానే , మంచి అనుభూతులు పొందుతాము ! ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది , మనకు !  చలాకీ గా తిరుగుతాము ,అక్కడి  మనుషులను కలుస్తాము కూడా ! ఆనందం గా  గడుపు తాము ! దీనినే నాస్టాల్జియా అని కూడా అంటారు ! అంటే , గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ ,  ఆనందానుభూతులు పొందడం ! 
అందుకే , ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు , ఒక చోట ఉన్న ప్రజలు , ఇంకో చోట పునరావాసం చేసుకుంటున్నప్పుడు , ఈ రకమైన ఎటాచ్ మెంట్ , లేదా ఆపేక్షను చూపడమే కాకుండా ,  ఆ అనుభవాలు పొందిన తమ ప్రాంత ప్రజలతో , వాటిని పంచుకుంటారు కూడా ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

ఉండే చోటు మీద ఆపేక్ష ! 2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఫిబ్రవరి 22, 2014 at 10:26 ఉద.

ఉండే చోటు మీద ఆపేక్ష ! 2. 

 
సాధారణం గా , ఉండే చోటు మీద, మనకు ఏర్పడే ఆపేక్ష , అనేక  పరిస్థితుల మీద ఆధార పడి ఉంటుంది ! అంటే, మనం ఉండే చోట , కేవలం ఒక ఇంట్లో ఉంటూ , తలుపులు మూసుకుని , బయటి ప్రపంచం తో సంబంధం లేకుండా , జీవనం సాగిస్తూ ఉంటే ,  మనం ఉండే చోటు, మనలను ఎక్కువ గా ప్రభావితం చేయదు ! కానీ, అధిక శాతం మానవులు , తాము ఉండే చోటు లో అనేక సంబంధాలను ఏర్పరుచు కుని ఉంటారు. ఇంకా ఏర్పరుచు కుంటూ ఉంటారు కూడా !  ఈ సంబంధాలలో , ఇతర మానవులతో ఏర్పరుచుకునే సంబంధాలు అతి ముఖ్యమైనవి ! 
స్క్యానెల్ , గిఫర్డ్ అనే ఇద్దరు సామాజిక మానసిక శాస్త్ర వేత్తలు ,  మానవులు, తాము నివశించే  స్థానం మీద ఏర్పరుచుకునే ఈ ఎటాచ్ మెంట్ లేదా ఆపేక్షను , ప్రధానం గా, మూడు  ప్రభావితం చేస్తాయి అని తేల్చారు ! అవి :  వ్యక్తి గతమైన  సంబంధాలు , పరిస్థితులు , ఇంకా వారు ఉండే స్థానం అని అంటే మూడు P లు ! ( Person , Process and Place  ).
వ్యక్తి గతమైన  సంబంధాలు : ప్రతి మానవుడి కీ తాము , పుట్టి పెరిగిన ప్రాంతం మీద తమకు ఒక ప్రత్యేక మైన అభిమానం , ఆపేక్ష ఉంటాయి ! ఎందుకంటే , తాను , తప్పటడుగులు వేస్తూ, నడక నేర్చుకుంటూ , నడవ గలిగాక , తాను తిరిగిన ప్రాంతాలు  , తన వ్యక్తి గత జీవితం తో పెనవేసుకుని ఉంటాయి ! తను, వెళ్ళిన బడి , దర్శించిన దేవాలయమూ , వెళ్ళిన సినిమా హాలు , విహరించిన పార్కు , చూసిన ప్రత్యేకమైన ప్రాంతాలూ , ఇట్లా తాను ఉండే చోట ఉన్న అనేక ప్రాంతాలు , వ్యక్తి గత ప్రాధాన్యత సంతరించు కుంటాయి !  అందుకే , ప్రతి వ్యక్తీ , తాను ,  ‘ ఆ ‘ ప్రాంతానికి చెందిన వాడినని ‘ ఒక గర్వమూ ఆత్మ విశ్వాసమూ తొ ణికిస లాడుతూ  చెప్పుకుంటాడు ! అంతే కాక , వారు ‘ ఆ ‘ ప్రాంతానికి ‘ చెందినందుకు గర్వ పడుతూ ఉంటారు కూడా ! ఈ వ్యక్తి గతమైన ఎటాచ్ మెంట్ , కేవలం వారి వ్యక్తి గత జీవితం  లో మైలు  రాళ్ళు గానే కాక , వారు , వారి కుటుంబ సభ్యులతో కూడా , ఒకే ప్రాంతం లో ఉండి , అక్కడే పెరుగుతూ ఉంటే , ఆ స్మృతులు కూడా ఎక్కువ బలీయం గా  ఏర్పడి , వారు ఉండే ప్రాంతం తో ముడి పడి పోతుంది !  
అంతే కాక , వారు ఉండే ప్రదేశం లో , వారి వారి సంప్రదాయాలనూ , మత పరమైన అనేక కార్యక్రమాలనూ , పండుగలనూ , ఉత్సాహ భరితం గా , ఆనందం గా గడుపుకున్న క్షణాలు కూడా , వారి హృదయాలలో గా ఢ మైన ముద్రలు వేస్తాయి ! వారి మధుర స్మృతులన్నీ కూడా  వారి మనసులలో , చక్కగా పెయింట్ చేయబడిన వర్ణ చిత్రాలు గా ఉండడమే కాకుండా , బ్యాక్ గ్రౌండ్ ఎప్పుడూ , వారుండే ప్రాంతం , పదిలం గా  అనేక వర్ణాలతో  పెయింట్ చేయబడి ఉంటుంది ! వారుండే ప్రాంతం , చారిత్రక మైనది కూడా అయి ఉంటే , ఆ అనుభూతులు కూడా అక్కడ ఉండే వారికి , ఆ ప్రాంతం మీద తమ ఆపేక్ష ను ఎక్కువ చేస్తుంది  !  
ఒక కుటుంబం గానూ , ఒక  సమాజం గానూ, ఉన్న చోట , వారు జరుపుకునే వేడుకలు , వినోదాలు కూడా , వారు ఉండే చోటు మీద ఎటాచ్ మెంట్ ను కలిగిస్తాయి !  చిన్నతనం లో , స్నేహితులతో కానీ , అన్నదమ్ములతో , అన్నా చెల్లెళ్ళ తో గానీ , గాలి పటాలు ఎగరేసు కోవడమూ , క్రికెట్ ఆడుకోవడమూ , జండా వందనానికి వెళ్ళడమూ , హోలీ ఆడుకోవడమూ , దీపావళి పండగ చేసుకోవడమూ , ఇట్లా అనేక సంఘటనలు , వ్యక్తి జీవితం లో , తాను  ఉండే ప్రాంతం తో ఎటాచ్ అయి ఉంటాయి ! 
వచ్చే టపాలో , మరి,  ఈ ఎటాచ్ మెంట్, ఎట్లా ఏర్పడుతుంది ? అనే విషయం గురించి తెలుసుకుందాం ! 
%d bloggers like this: