Our Health

Archive for the ‘మానసికం’ Category

ఫెటిషిజం లక్షణాలు ! 3.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 20, 2016 at 11:27 ఉద.

ఫెటిషిజం లక్షణాలు !3.

మునుపటి టపాలో చెప్పుకున్నట్టు , ఫెటిషిజం అంటే , నిర్జీవ వస్తువులను చూసి లేదా , 
జనాంగాలు కాని ఇతర  భాగాలను చూసి కానీ , కామాతృత చెందడమూ , లేదా కామానుభూతులు ఎక్కువ కావడమూ ! 
అనేక భారత భాషల సినిమాలలో  స్త్రీ  నాభి స్థానాన్ని చూపడమూ , లేదా , కాలి వేళ్ళను , కామ పరం గా చూపుతూ ఉంటారు , అది ఈ కోవ కు చెందినదే !
సాధారణం గా మనం , ఈ చిత్రాలు చూసినా , సినిమా బయటకు రాగానే , ఆ యా సందర్భాలు , మన మెదడు లో నిక్షిప్తమై ఉండవు !  కానీ ఫెటిషిజం అనే మానసిక రుగ్మత ఉన్న వారు, ఆ సీనులు పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ , కామానుభూతి చెందుతూ ఉంటారు !
అంతే కాకుండా , ఈ రకమైన అనుభూతులు , కనీసం  ఆరు నెలలకు మించి కలుగుతూ ఉంటే , అపుడు ‘ వ్యవహారం ‘ తీవ్రమైందని అనుకోవాలి ! 
అంతే కాక , వీరు , ఈ మానసిక రుగ్మత వల్ల , తీవ్రమైన ఆందోళన కు గురవుతూ ఉంటారు ! వారు విద్యార్థులయితే , చదువు లో ఏకాగ్రత తప్పి , చదువు కుంటు పడుతుంది ! లేదా ఉద్యోగస్తులవుతే , ఉద్యోగం అవకతవకలు గా చేస్తూ , పై అధికారి నుంచి దండన ‘ స్వీకరిస్తారు ‘ !
ఇంకా సమస్య తీవ్రం గా ఉన్న వారు , చెప్పుల షాపు లో లేదా ,  బ్రాల షాపు లోనో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు లేదా , వాటిలో ఉద్యోగం చేస్తూ , ‘ స్వాంతన ‘ చెందుతూ ఉంటారు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

ఫెటిషిజం అంటే ? 2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 14, 2016 at 11:08 ఉద.

ఫెటిషిజం అంటే ? 2. 

 ‘ ఫెటికోస్ ‘ అనే పోర్చు గీస్  పదం నుంచి  పుట్టింది ‘ ఫెటిషిజం ‘  దీని నిర్వచనం : అదేపనిగా ఒక నిర్జీవ వస్తువు ను చూస్తూ కానీ , తాకుతూ కానీ , కామోద్రేకం పొందడం.  మానవులు యుక్త వయసు వచ్చినప్పటి నుంచీ , తమకు నచ్చిన , అందమైన స్త్రీలను చూసినప్పుడు , ఆకర్షింప బడి , వారి లో  , కామ భావనలు కలగడం , సహజమే , కానీ నిర్జీవ వస్తువులు  అంటే , లంగాలో, బ్రా లో , హ్యాండ్ బ్యాగు లో , లేదా హై హీల్ పాద రక్ష లో చూసినప్పుడు , కామానుభూతులు పొందడాన్ని  ‘ ఫెటిషిజం ‘ అంటారు !’  ఆ డ్రెస్ లో ఆ యువతి బాగుంటుంది , లేదా ,ఆ గెట్ అప్ లో అతడు బాగుంటాడు ‘ అనే భావనలు సహజం గా వచ్చేవే ! ఇక్కడ బట్టలు నిర్జీవమైన వస్తువులయినప్పటికీ , ఆ భావనలు వచ్చిన వారికి , ఫెటిషిజం ఉన్నట్టు కాదు ! ఫెటిషిజం తీవ్రం గా ఉంటే , వారు  , అంతకు ముందు ఏ ఏ వస్తువులయితే , తమకు కామోత్తేజం కలిగించాయో , ఆ వస్తువులు లేనిదే , కామ క్రియ లో పాల్గొన లేరు !వారికి ఆ వస్తువులు అందుబాటులో  ఉండక పొతే , కామ క్రియ అసాధ్యం అవుతుంది , భౌతికం గా ఏ అవయవ లోపమూ లేనప్పటికీ ! 
ఫెటిషిజం,  స్త్రీలకంటే , పురుషులలోనే ఎక్కువ గా కనబడుతుంది ! అరుదుగా స్త్రీలలో కూడా ఉంటుంది . అందుకు కారణాలు స్పష్టం గా తెలియలేదు , ఇప్పటి వరకూ !
ఫెటిషిజం లో రకాలు ఉంటాయా ?:
ఫెటిషిజం ప్రధానం గా రెండు రకాలు :
1. ఆకార ఫెటిషిజం( ఫార్మ్ ఫెటిషిజం )  :  ఈ రకమైన  ఫెటిషిజం ఉన్న వారు , ప్రత్యేకమైన ఆకారం లో ఉన్న వస్తువులను చూస్తేనే , కామోత్తేజం చెందుతారు ! ఉదాహరణకు ,  ఒక యువతి  , సాధారణ ఆకారం లో ఉన్న చెప్పులు వేసుకుంటే , పెద్దగా ఆకర్షింపబడరు , ఆ  యువతి అందం గా ఉన్నా కూడా ! ఇంకో యువతి  హై హీల్స్ వేసుకుని నడుస్తూ ఉంటే , కామోత్తేజం కలుగుతుంది , కేవలం ఆ హై హీల్స్ కనబడగానే , ఆ యువతి ని  పూర్తి గా చూడక పోయినా కూడా ! 
2. పదార్ధ  ఫెటిషిజం:  దీనిని మీడియా ఫెటిషిజం అని అంటారు . ఈ రకమైన ఫెటిషిజం ఉన్న వారు , స్త్రీలు ధరించే బట్టలు లేదా ఇతర వస్తువులు తయారు చేయబడ్డ పదార్ధం తో కామోత్తేజం చెందుతారు !
ఒక యువతి , ఉతికి , ఇస్త్రీ చేసిన నూలు (కాటన్ ) బట్టలు వేసుకుని కనిపిస్తే కానీ , లేదా ఇంకొందరు ,యువతి,    పట్టు వస్త్రాలు ధరిస్తే కానీ ,  జంతు చర్మం తో చేసిన జాకెట్ ధరిస్తే కానీ , అమితం గా ఉత్తేజం చెందుతారు !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు !
మీ స్పందనలూ , సందేహాలూ తెలపండి , ఏమైనా ఉంటే  ! 

ఫెటిషిజం .1.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 13, 2016 at 1:26 సా.

ఫెటిషిజం .1.

ఉదయం  లేవగానే , స్నానం చేసి , ఉతికి ,ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని , తాజాగా తయారయ్యాడు , ఆకాష్ !  వేడి ఇడ్లీలూ , సెగలొస్తున్న సాంబారూ తిని, హెల్మెట్ పెట్టుకుని , కాలేజీకి బయలు దేరాడు , తన ‘ పంచ కల్యాణి ‘ బైక్ మీద, ఒక యోధుడి లాగా  !
 బైక్ తో పాటుగా , తన మనసు కూడా ఉరకలు వేస్తూ ఉంది !  యవ్వనం లో తనలో వచ్చే మార్పులతో , తనకు తెలిసిన అమ్మాయిల్లో మార్పులు కూడా నిశితం గా పరిశీలిస్తున్నాడు ! వారితో మాట్లాడుతున్నా , వారి పొందులో , సరదా గా కాలం గడిపినా , ఎంతో ఆనందం గా ఉంటున్నాడు ! తనలో ఆత్మ విశ్వాసం కూడా ఎక్కువ గా శ్వాస తీసుకుంటుంది ! కానీ అప్పుడే ఎక్కువ  చనువు తీసుకో లేక పోతున్నాడు , ఏ ఒక్క అమ్మాయి తోనూ !
అది ఓ  వేసవి మధ్యాహ్నం, నాలుగు గంటలయి ఉంటుంది. కాలేజీ అయ్యాక , ఇంటికి వచ్చే దారి లో  ఒక దుకాణం ముందు ఆగాడు , దాహం గా  ఉంటే , కూల్ డ్రింక్ కోసం. డ్రింక్ సిప్ చేస్తూ ,యదాలాపం గా  కొన్ని గజాల దూరం లో , రోడ్డు కు ఆవల కనిపిస్తున్న  ఒక మేడ వైపు చూశాడు ! పిట్ట గోడ మీద రెండు వైపులా చక్కటి పూల కుండీలు , ఆ మధ్య ,  ఆరేసిన బట్టలు కనిపిస్తున్నాయి !  నారింజ రంగులో ఉన్న కమీజ్ , చిలక పచ్చ రంగులో సల్వార్ , ఆ పక్కనే ఒక ముదురు నీలం రంగు పరికిణీ , ఆకు పచ్చని ఓణీ , ఆ పక్క గా , రెండు తెల్లటి బ్రాలు ! అన్నీ , వీస్తున్న గాలికి , రెప రెప లాడుతున్నాయి , వెనకా ముందుకు ఊగుతున్నాయి ! అప్పటి దాకా ఓ చూపు చూసిన ఆకాష్ కళ్ళు , తెల్లటి బ్రాలు  కనిపించగానే , ఒక్క సారిగా తీక్షణం అయ్యాయి ! అదే పనిగా పరిశీలించ సాగాయి ! ఆ బ్రాలు పెద్దవి గా కనబడుతున్నాయి , తన కళ్ళు బైనాక్యులర్స్ కానప్పటికీ ! ” ఆ గాలి కాస్త ఎక్కువ అవకూడదూ ?! కనీసం ఒక్క బ్రా , ఎగిరి , ఆకాశం లో తేలి పోతూ , ఈ ఆకాష్ మీద పడ కూడదూ ?! “  అనుకుంటూ , అప్రయత్నం గా తన తలను కూడా ముందుకు ఊపుతున్న ఆకాష్ కు  కూల్ డ్రింక్ సీసా  లో స్ట్రా చేసిన శబ్దం తో తెలిసింది, ఆ సీసా  ఖాళీ అయి చాలా సేపయిందని !  ఇంటికి చేరుకున్నాడు ఆకాష్ , ఇప్పుడు బైక్ కన్నా , తన ఆలోచనలు వేగం గా కదలాడుతున్నాయి. తాను చూసిన ఆ పరికిణీ , సల్వార్ , కమీజ్ , ఓణీ , ప్రత్యేకించి , ఆ  తెల్లటి బ్రా లు ! అవి వేసుకునే ఆ అమ్మాయి ఎంత బాగుంటుందో ?! ,ఆమె  తన వయసుదే   అయి ఉంటుంది ! తనతో స్నేహం చేస్తుందా ?! ఇట్లా ఆకాష్ ఆలోచనలు పరి పరి విధాలు గా పోతున్నాయి !
అప్పటి నుంచి , క్రమం తప్పకుండా , రోజూ కూల్ డ్రింక్ తాగుతున్నాడు , అదే దుకాణం లో , ఆకాష్ ! తన కళ్ళు , తనకన్నా ఆతృత గా ఎదురింటి మేడ  వైపు పోతున్నాయి ! కొన్ని సార్లు , ఇంకో రంగుల బట్టలు ఆరేసి ఉంటున్నాయి ! కానీ ఆకాష్ కళ్ళు , ఎదో ఒక చోట ఆరేసి ఉన్న బ్రా ల మీదే ఉంటున్నాయి ! అవి కనిపించక పొతే , నిరాశ చెందుతున్నాడు ! కనిపిస్తే , ఎదో ఒక మత్తైన పరవశానికి లోనవుతున్నాడు , ఆకాష్ ! రాత్రుల్లో , ఆ దృశ్యం పదే  పదే   గుర్తుకు వస్తోంది ! తనలో కామ పరమైన ఆలోచనలు చెలరేగుతున్నాయి ! 
వచ్చే టపాలో  మిగతా సంగతులు ! 

( రోడ్ రేజ్ ) దారి క్రోధం పరిస్థితికి పరిష్కారం ఏమిటి ?4.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జూలై 10, 2016 at 1:56 సా.
మీరు రోడ్డు మీద సవ్యం గానే మీ వాహనాన్ని నడుపుతూ పోతూ ఉన్నారు. అప్పుడు మీరు గమనిస్తారు , ఇంకో వాహనాన్ని , ఇతరులు ,తమ ఇష్టానుసారం గా నడుపుతూ ఉన్నారని ! అప్పుడు మీరు చేయ వలసినది :
1. ఆ వాహనదారుడికి అవరోధం కలిగించకుండా , మీ వాహనాన్ని పక్కకు తప్పించుకోవడం ఉత్తమం !
2. ఆ వాహన దారుడు తన వెకిలి చేష్టలతో మిమ్మల్ని కవ్విస్తే , ఆ విషయం పట్టించు కోనట్టు ప్రవర్తించడం  మంచిది !
3. ఒక ముఖ్య మైన సలహా :  ఆ పరిస్థితి లో మీరు దీర్ఘం గా ఊపిరి తీసుకుని వదులుతూ ఉండండి ! అప్పుడు , మీ మెదడు కు రక్త సరఫరా సాఫీ గా జరిగి , మీ ఆందోళనా , ఆదుర్దా , తగ్గుతాయి ! లేదంటే , అవి పెరిగి , మీరూ ఆ పరిస్థితి విషమించడానికి కారణమవ వచ్చు !
4. మీరు ప్రార్ధన ను నమ్ముతే ( ఏ మతానికి చెందిన వారైనప్పటికీ ! ), మనసులో ప్రార్ధించు కుంటే , మీరు శాంత పడతారు ! మీరు ఉన్న పరిస్థితి ఆందోళనకరం గా ఉన్నా కూడా !
5. మీకు ప్రియమైన , ఇష్టమైన , ఆప్తులను , తోబుట్టువులను కానీ  స్మరణకు తెచ్చుకోండి !  అప్పుడు , మీరు , ఉద్రేక పడకుండా , మీ వాహనాన్ని సవ్యం గానే నడప గలుగుతారు !
6. మీరు ముఖ్యం గా  గమనించ వలసినది ,  ఇతర వాహన దారుల  ప్రవర్తనా , వారి చోదకం ( డ్రైవింగ్ ) కన్నా , ఆ పరిస్థితి ని గమనించిన మీరు , మీ ప్రవర్తన ఎట్లా మార్చుకున్నారు అనే విషయం మీద నే మీరు ధ్యాస పెట్టాలి, అప్పుడే , మీ ప్రయాణం సురక్షితం అవుతుంది ! అంటే సమస్య ఇతర వాహన దారులు కాదు ! మీరు ఆపరిస్థితి లో  ఎట్లా రియాక్ట్ అవుతారనే విషయం మీద సమస్య తీవ్రత ఆధార పడి ఉంటుంది !
7. ఇతర వాహనదారుల్లో మీరు చూసిన క్రోధం,  మీ క్రోధం కూడా కలిస్తే , ప్రమాద కరం గా మారవచ్చు ! అందుకే , మీరు  ఆ పరిస్థితిలో , మీ కోపాన్ని , నివారించుకుని , లేదా నియంత్రించుకుని , మీ వాహనాన్ని , సురక్షితం గా గమ్యానికి చేర్చాలి , మీరూ చేరుకోవాలి !
మీకోసమూ , మీరు ప్రేమించే వారికోసం , మీరు ప్రయాణించే రోడ్డు మీద నడిపే ఇతర వాహనదార్ల  కోసమూ కూడా !

( రోడ్డు రేజ్ ) దారి క్రోధం ఎందుకు వస్తుంది ? 3.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జూన్ 11, 2016 at 10:50 ఉద.

దారి క్రోధం వచ్చే వారి మానసిక స్థితి ఎట్లా ఉంటుంది ?: 

road rage

1. ఇతర వాహన దారుల మీద ఎక్కువ కోపం : వారికి , వారు వాహనం నడుపుతూ చేసే తప్పులకన్నా , ఇతర డ్రైవర్ లు నడిపే పధ్ధతి ని వెంటనే   జడ్జ్ చేస్తూ అంటే నిర్ణయం చేస్తూ , వారిని విమర్శించడమే కాకుండా , వారిని అవమాన పరుస్తూ , వారి మీద హింసాత్మక దాడి చేయడానికి కూడా పూనుకుంటారు !
2. వారు అధిక రిస్క్ తీసుకుంటారు : అధిక క్రోధం తెచ్చుకునే వారు ,  వారి వాహనాలను నియమిత వేగం కన్నా  ఎక్కువ వేగం తో నడపడమే కాకుండా , వేగం గా లేన్లు మారుస్తూ , లేదా ముందు వెళుతున్న వాహనాలకు అతి దగ్గరగా నడుపుతూ ఓవర్ టేక్ చేస్తూ వాహనాలను నడుపుతారు కూడా !
3. త్వరగా ఉద్రేకం రావడమే కాకుండా ,  వారు  ఆ క్రోధం తో ఇతరులను తిట్టడమూ, కొట్టడానికి కూడా వెనుకాడరు !
4. వారు వారి వాహనాలలో కూర్చునే ముందే , క్రోధం తో  ఉంటారు , అంటే , వారి ఇంటి లో గొడవ పడడమో , లేదా ఆఫీసులో , ఏదో సంఘటన మీద  ఉద్రేకం చెందడమో జరుగుతుంది ! అంటే వారి ఆలోచనలు , ఉద్రేకం చెంది ఉంటాయి , వారు వాహనం నడిపే ముందే !
ఇక వాహనం నడుపుతూ ఉన్న సమయం లో , ఇతర వాహన దారులు చేసే , చిన్న తప్పిదాలకైనా , విపరీతం గా స్పందించి , వారిని దూషించడం , లేదా వారి మీద దాడి చేయడం కూడా చేస్తారు !  వారికి ఇంప ల్సివిటీ  అంటే , క్షణి కోద్రేకం  అధికం గా ఉంటుంది !
5. దారి క్రోధం తెచ్చుకునే వారు తరచూ వాహన ప్రమాదాలకు లోనవుతూ ఉంటారు , వారి ఆ మానసిక స్థితి తో ! 
మరి అట్లాంటి వాహన దారులు మీకు ఎదురైతే , మీరు చేయ వలసినది ఏమిటి ? : 
1. వారి చర్యలతో , మీరు ఉద్రేకం చెందక పోవడం ఉత్తమం ! :  ఒకరు ఉద్రేకం చెందితే నే , అక్కడ పరిస్థితి  ఆందోళన కరం గా మారుతుంది , అందుకు మీ ఉద్రేకం కూడా తోడ వుతే , ఆ పరిస్థితి విషమిస్తుంది . అందుకే , మీ క్రోధాన్ని అదుపులో ఉంచుకోవాలి ! మీరు మీ సహనం కోల్పోకూడదు !
2. అధిక ఉద్రేకం చెంది , దానిని ఇతరుల మీద చూపే వాహన దారులకు మీ మీద వ్యక్తి గత ద్వేషం లేదు ! :
వారు ఆ సందర్భం లో , ఆ స్థానం లో మీరు కాక , ఇంకెవరైనా ఉన్నా కూడా అదే రకం గా ప్రవర్తిస్తారు , అంటే , సమస్య వారికే ఉంది , మీకు కాదు కదా ! అందువల్ల , వారి ప్రవర్తన ను మీరు తీవ్రం గా పరిగణించ కూడదు !
వచ్చే టపాలో , దారి క్రోధం చూపుతున్న వారితో ఎట్లా ప్రవర్తించితే , మనకు  క్షేమమో తెలుసుకుందాం ! 

( రోడ్డు రేజ్ ) దారి క్రోధం ఎందుకు వస్తుంది ? 2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జూన్ 5, 2016 at 8:06 సా.

 

( రోడ్డు రేజ్ ) దారి క్రోధం ఎందుకు వస్తుంది ? 2.

మునుపటి టపాలో  దారి క్రోధం, ఏ,  ఏ  రకాలు గా ఉంటుందో తెలుసుకున్నాం కదా !
అకస్మాత్తు గా  వాహన చోదకులలో , మిగతా డ్రైవర్ ల మీద  వచ్చే కోపాన్నే , రోడ్ రేజ్ లేదా ‘ దారి క్రోధం ‘ అంటారు !
మరి నివారణ చర్యలు ఏమిటి ? :
1. నిద్ర :
 సరిగా నిద్ర పోకుండా , ఏ  వాహనాన్నీ నడప కూడదు !  నిద్ర లేమి , అనేక రుగ్మతలకు కారణం !  ఏకాగ్రత లేకపోవడం , చీటికీ మాటికీ  చికాకు పడడం , ఓరిమి తగ్గడం , ఇవన్నీ నిద్ర లేక పోవడం వల్లనే !
2. మద్యం  నిషిద్ధం ! : 
 అతిగా కానీ , కొద్దిగా కానీ , మద్యం సేవిస్తే , ఆ ప్రభావం డ్రైవింగ్ మీద తప్పకుండా పడుతుంది !  సామాన్యం గా  జనాలు , ‘ రాత్రి కదా, తాగింది , ఇప్పుడు పరవాలేదు లే ‘అనుకుని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు !  కానీ ఎంత తాగారో మర్చి పోతారు !
12 నుంచి 24 గంటల వరకూ కూడా , మద్యం మన రక్తం లో ఉంటుంది , తాగాక ! అంటే మద్యం రక్తం లో ఉన్నంత కాలం , ఆ తాగిన మద్యం ప్రభావం కూడా మన లో కనబడుతుంది ! 
ఇది శాస్త్రీయం గా నిరూపించ బడింది కూడా !  క్రోధం ఎక్కువ అవడం , మద్యం చేసే అనేకరకాలైన హాని లో ఒకటి ! 
3. ప్రయాణ పధకం : 
 ఎక్కడికి వెళ్ళాలో , ఆ చోటికి వెళ్ళడానికి , ముందే ఒక పధకం వేసుకుని , అంటే , ఎంత సమయం పడుతుంది , ప్రయాణానికి , ట్రాఫిక్ ఎక్కువ గా ఉంటే , ఎంత సమయం పడుతుంది ? ఆ సమయం లో  వాతావరణ ప్రభావాలు ఏమిటి ? అనే విషయాలు కూడా ముందే ఆలోచించుకుని ,
తదనుగుణం గా, వాహనం లో ముందుగానే బయలు దేరడం ,  మనలను , ఆ ప్రయాణానికి సిద్ధ పరిచి , శాంత పరుస్తుంది కూడా !
4. వాహనం లో సంగీతం :
  శాంత పరిచే ,మనసుకు నచ్చే ,  ఉత్తేజ పరిచే సంగీతాన్ని వినడం కూడా ఉపయోగకరం !
5. మీకు ప్రియమైన వారి ఫోటోలు కారులో మీకు కనిపించేట్టు ఉంచుకోవడం కూడా , వారి మీదా , వారితో గడిపే మీ జీవితం విలువ ను కూడా మీరు డ్రైవింగ్ చేస్తున్నంత సేపూ మీకు గుర్తుకు తెస్తాయి ! 
6. సెల్ ఫోన్ నిషిద్ధం :
డ్రైవింగ్ చేసే సమయం లో సెల్ ఫోన్ రిసీవ్ చేసుకోవడం గానీ ,  ఆ ఫోన్ లో మాట్లాడడం కానీ , చేయకూడదు ! కేవలం కొన్ని గంటల డ్రైవింగ్ సమయం లో , ఆ ఫోను చేసిన అవతలి వారు ఆగ గలరు !
మన  జీవితం కన్నా , ఆ ఫోన్ కాల్ ముఖ్యం కాదు కదా !?
7. అతి ముఖ్యమైన విషయం :
 డ్రైవింగ్ సమయం లో మీ అజాగ్రత్త , డ్రైవింగ్ నడిపే వారికీ , వారి కుటుంబానికే కాకుండా , ఆ సమయం లో  రోడ్డు మీద వాహనం నడుపుతున్న వారికి  కూడా అపాయకరం ! 
మిగతా విషయాలు , వచ్చే టపాలో !

( రోడ్డు రేజ్ ) దారి క్రోధం ఎందుకు వస్తుంది ? 1.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మే 10, 2016 at 6:39 సా.

( రోడ్డు రేజ్ ) దారి క్రోధం ఎందుకు వస్తుంది ? 1. 

 

ఏదైనా వాహనం దారిలో నడుపుతూ ఉన్నప్పుడు కలిగే క్రోధాన్ని ‘  రోడ్డు రేజ్ ‘ లేదా  ( మాయ ) దారి క్రోధం అని అంటారు ! 
సామాన్యం గా,  ఈ  దారి క్రోధం అనేక విధాలు గా కనబడుతూ ఉంటుంది , చోదకులలో లేదా ,వివిధ వాహనాలు నడిపే వారిలో !
1. సామాన్యం గా,   వాహనాలను  దూకుడు తో నడపడమో , యాక్సిలరేటర్ ఎక్కువగా నొక్కుతూ  నడపడమో ,  అకస్మాత్తు గా అంటే సడన్ గా బ్రేకు వెయ్యడమో చేస్తూ ఉంటారు , రోడ్డు రేజ్ తో నడిపే వారు !
2. ‘ టెయిల్ గేటింగ్ ‘  ( అంటే నడిపే వాహనానికీ , ముందు పోతున్న వాహనానికీ మధ్య  దూరం లేకుండా ,నడపడం , లేదా వెనక నుంచి వస్తున్న వాహనానికి  , కుడి ఎడమలకు పోడానికి అవకాశం ఇవ్వకుండా , ఆ వాహన దారికి అడ్డం గా తమ వాహనాన్ని  ఉద్దేశ పూర్వకం గా నడపడమో  చెయ్యడం !
3. ముందు వెళ్ళే వాహనాన్ని ,  వేగం గా వెనుక నుంచి అనుసరించడం !
4. అత్యంత శబ్దం తో హార్న్ కొడుతూ , లేదా ఎదుటి వారి కళ్ళలో పడేలా , కారు లైట్లను ఎక్కువ కాంతి వంతం గా వేస్తూ నడపడం !
5. పక్కన , ఎదురు గా , లేదా వెనక నడుపుతున్న వాహన చోదకులను భయ భ్రాంతులు చేసే ఏపనైనా చేయడం ! అంటే  వారిని వెక్కిరించ డమో , తమ వేళ్ళతో  భయ పెట్టడమో , లేదా తమ  దగ్గర ఉన్న కర్రలనూ , తుపాకులనూ , కత్తులనూ చూపిస్తూ భయ పెట్టడమో !
6.  ఉద్దేశ పూర్వకం గా ఇతర ఇతర  వాహన దారులను , తిట్టడమో , కొట్టడమో , లేదా తమ వాహనాలతో , వారి వాహనాలను ఢీ కొట్టడమో !
ఈ రకం గా ఉంటాయి , రోడ్ రేజ్ వచ్చిన వారి ప్రవర్తనలు  !
మిగతా విషయాలు,  తరువాతి  టపాలో !

ఏ వ్యాయామం ఎందుకు ? 2.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our mind on డిసెంబర్ 13, 2015 at 3:34 సా.

ఏ  వ్యాయామం ఎందుకు ? 2.

మునుపటి టపాలో , ఏరోబిక్ వ్యాయామం వల్ల, మన శరీరానికి కలిగే లాభాల గురించి తెలుసుకున్నాం కదా !
మరి ఇప్పుడు,  ఏ యే  రకాల వ్యాయామాలు మన మెదడు లో ఏయే భాగాలకూ , కేంద్రాలకూ , ఉపయోగ పడతాయో తెలుసుకుందాం !
పరిణితి చెందిన మానవ మెదడు , అంటే పూర్తిగా అభివృద్ధి చెందిన , మానవ మెదడు లో  ఉండే నాడీ కణాల సంఖ్య  వంద బిలియన్లు !
ఈ కణాలన్నీ కూడా  అనేక రూపాలలో , నిర్మితం అయి ,  అనేక లక్షల  సంధానాలతో  ,అన్ని ఇతర  కణాలతో సంబంధం కలిగి ఉంటాయి, నిరంతరం !
మన లో ఆలోచనలను జనింప చేయడానికీ , వివిధ రకాల పనులను మనతో చేయించడానికీ కూడా , మెదడు నిర్మితమై ఉంటుంది ! అందుకోసం మెదడు లో అనేక కేంద్రాలు నిర్మాణం అయి ఉన్నాయి !
ఉదాహరణకు :
ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ : ( క్రింద ఉన్న చిత్రం చూడండి !  చిత్రం లోని ఎరుపు భాగమే !  )  మనం , ఏ పని చేయ బోయినా , ఆ పని యొక్క యుక్తా యుక్త విచక్షణ కలిగించి , అవకతవక పనులను నివారించి , నిర్మాణాత్మక మైన, ఒక లక్ష్య నిర్దేశన  ఉన్న పనులను మాత్రమే , మన చేత చేయించే కేంద్రమే , ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ !
రోజూ , ఒక మాదిరి బరువులను ఎత్తడం వల్ల , ఈ భాగం శక్తి  వంత మవుతుంది !
ఫ్రాంటల్ లోబ్ : ( క్రింద ఉన్న చిత్రం చూడండి ! చిత్రం లోని ఎరుపు భాగమే !  ) ఇది మన మెదడు ముందు భాగం లో ఉండే నిర్మాణం !  అంటే మన నుదుటి వెనుక కపాలం అంటే స్కల్ లో ఉంటుంది !  ఈ నిర్మాణం , మానవుల కండరాలు   చేసే పనులను నియంత్రిస్తూ  ఉంటుంది !
క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల , ఈ భాగం ఎక్కువ క్రియాశీలం అవుతుంది !
హైపోతలామస్ : (క్రింద ఉన్న చిత్రం చూడండి , చిత్రం లోని ఎరుపు భాగమే ! )  ఈ కేంద్రం , అతి సున్నితమైనది. ఇది , మెదడు లోపలి భాగాలలో నిర్మితమై ఉండి , మానవుల ఆకలి నీ ,  కామ సంబంధమైన అనుభూతులనూ , లింగ నిర్ధారణ నూ ,  నియంత్రిస్తూ ఉంటుంది ! ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల  హైపోతలామస్ ఉత్తేజం అవుతుంది !
పరైటల్ లోబ్ (  క్రింద ఉన్న చిత్రం చూడండి,  చిత్రం లోని ఎరుపు భాగమే ! ) : ఈ కేంద్రం , ఫ్రాంటల్ లోబ్  తరువాత ఉండే భాగం !  ఈ భాగం లో మానవుల దృశ్య శబ్ద గ్రహణ నాడులను అనుసంధానం చేసి , మన ఆలోచనలను హేతు బద్ధం గా చేసే వ్యవస్థ ఉంటుంది !
హిప్పో క్యాంపస్ : ( క్రింద ఉన్న చిత్రం చూడండి ,చిత్రం లోని ఎరుపు భాగమే ! ) ఈభాగం మన జ్ఞాపక శక్తి కి కేంద్రం !  ఈ భాగం కూడా ఏరోబిక్ వ్యాయామం వల్ల  ఉత్తేజం అవుతుంది ! విద్యార్ధులకు  ఏరోబిక్ వ్యాయామాలు , పరీక్షల సమయం లో బాగా ఉపయోగం అందుకే !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

బంధాలు ఎందుకు తెగుతాయి ?6.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మార్చి 7, 2015 at 11:35 ఉద.

బంధాలు  ఎందుకు తెగుతాయి ?6. 

పురుషులు సర్వ సాధారణం గా , స్త్రీలు వారిని మార్చాలని ప్రయత్నిస్తున్నారని అంటారు ! 
స్త్రీలు సర్వ సాధారణం గా,  వారి పురుషులు , వారి మాట వినరని అంటూ ఉంటారు ! వారికి కావలసినది సానుభూతి ! కానీ, అందుకు భిన్నం గా పురుషులు , పరిష్కారాలు సూచిస్తూ ఉంటారు !
స్త్రీలు తమ ఇల్లు  , పరిసరాల , శుభ్రత కు చాలా ప్రాధాన్యత ఇస్తారు ! కానీ , పురుషులు ఆ విషయానికి , అంతగా ప్రాధాన్యత ఇవ్వక పోగా ,  శుభ్రత గురించిన ఏ  పని లోనూ , ఉత్సాహం చూపకుండా , ఇతరులు మాత్రమే చేయాలని అనుకుంటారు ! పురుషులు ఇంటి పని చేయడం , అవమానకరం గా కూడా భావిస్తారు ! 
మరి స్త్రీ పురుషుల బంధాల లో ఉన్న ఈ తేడాలకు పరిష్కారం ఏమిటి ? 
స్త్రీలు , చీకాకు , విసుగు ప్రదర్శిస్తున్న సమయం లో , పురుషులు చేయ వలసినది , పరిష్కారాలు చూపించడం కాదు ! 
వారిని శాంత పరిచే ప్రయత్నాలు చేయాలి ! 
పురుషులు , స్వాతంత్ర్యాన్నీ , అధికారాన్నీ , ఆస్వాదిస్తారు ! కోరుకుంటారు ! 
స్త్రీలూ , స్వాతంత్ర్యం కోరుకున్నా , వారికి ప్రధాన విషయాలు , వారిని అర్ధం చేసుకునే పురుషులు ! వారికి అంకితమైన పురుషులు , వారిని లాలన చేసే పురుషులు , వారికి ధైర్యం చెప్పి , జీవిత నౌక లో చేదోడు గా ప్రయాణం చేసే పురుషులు ! 
స్త్రీలు , తమ బంధం లో , ప్రత్యేకమైన వారిలా , గుర్తింపు , గౌరవం పొందు తున్నప్పుడు , ఎక్కువ ఉత్సాహ భరితులవుతారు !
తమ దైనందిన కార్యక్రమాలను , ఆనందం తో చేసుకో గలుగుతారు ! 
పురుషులు ,  తమ బంధం లో తమకు , సరి అయిన గుర్తింపు , ప్రశంస , విశ్వాసం , ప్రోత్సాహం ,లభిస్తున్నప్పుడే , ఎక్కువ క్రియాశీలం గానూ , ఆనందం గానూ , సంతృప్తి తోనూ  , ఆ బంధాన్ని కొనసాగిస్తారు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

బంధాలు ఎందుకు తెగుతాయి ?5.

In మానసికం, Our minds on ఫిబ్రవరి 27, 2015 at 6:08 సా.

బంధాలు ఎందుకు తెగుతాయి ?5. 

మనం, ఇప్పటి వరకూ , బంధాలు తెగి పోవడానికి  కారణమైన స్త్రీ పురుషుల మానసిక స్థితులు , వారి వారి  ఆలోచనా ధోరణులూ , ఏ రకం గా వైవిధ్యం గా ఉంటాయో తెలుసుకున్నాం ! ఇంకొన్ని వైవిధ్యాలు కూడా చూద్దాం ఇప్పుడు ! 
పురుషులు , సాధారణం గా , హేతు బద్ధం గా , విశ్లేషణా త్మకం గా , విషయాలను , పరిస్థితులనూ , అంచనా వేస్తూ ఉంటారు ! కానీ స్త్రీలు సాధారణం గా సృజనాత్మకం గానూ , స్పూర్తి దాయకం గానూ , వారి సమస్యలనూ , సంగతులనూ , అవగాహన చేసుకుంటూ ఉంటారు ! 
పురుషులు , వారి , వారి అనుభూతులనూ , మనో భావాలనూ  అర్ధం చేసుకోవడం లో వారే తికమక పడుతూ ఉంటారు , సామాన్యం గా ! అంతే కాకుండా , వారిలో నిగూఢమైన భావాలను , బహిరంగ పరచడం లో విఫలం అవుతూ ఉంటారు , అట్లా చేయడానికి  బిడియ పడుతూ ఉంటారు కూడా !  ఆ పరిస్థితులను కప్పి పుచ్చుకోవడం కోసం , తమ కు ‘ లోకువ ‘ అనిపించిన వారి మీద అధికారం చెలాయించ డమూ , వారిని తమ నియంత్రణ లో ఉంచుకోవడమూ కూడా చేస్తూ ఉంటారు ! అందుకు అవసరమవుతే , తమ శక్తి ని కూడా ఉపయోగిస్తారు ! 
పురుషులే , స్త్రీలకన్నా ఎక్కువ గా, తాము ఏర్పరుచుకున్న  బంధాల మీద ఎక్కువ గా ఆధార పడడమూ , ఆ బంధాల బలహీనతలకు ,  తీవ్రం గా స్పందించ డమూ జరుగుతుంది ! ఆ బంధాలు తెగితే , ఎక్కువ గా ఆత్మ న్యూనత చెందడం కూడా స్త్రీలకన్నా  పురుషుల లోనే ఎక్కువ !  దీనికి కారణం , ప్రధానం గా , పురుషులకు ఎక్కువ మంది ఆత్మీయులూ , స్నేహితులూ లేక పోవడమూ , ఇంకా , సహజం గానే పురుషుల లో ఉన్న  , ఇతరులకు చెప్పకుండా , తమ  బాధలను తమలోనే దాచుకునే గుణం వల్ల నూ  ! 
అందువల్లనే , పురుషులు , తమ క్రోధాన్నీ , ఉద్రేకాన్నీ ,తామే  సరిగా అర్ధం చేసుకోగలరు , తదనుగుణం గా స్పందించ గలరు కూడా , స్త్రీలకన్నా !
స్త్రీలలో కలిగే అనుభూతులూ , భావాలూ , సహజం గా చాలా లోతు గానూ , విస్తారం గానూ ఉంటాయి ! అట్లా గే , వారిలో కలిగే భావ స్పందనా తీవ్రత  కూడా ! 
ఉదా: లావణ్య  వయసు లో ఉన్న యువతి ! చదువు తో పాటుగా , ఉద్యోగమూ , సంపాదనా ఉండడం తో , ఆత్మ విశ్వాసమూ , స్వతంత్రతా , తొణికిస లాడుతూ ఉంటాయి , ఆమె  ప్రవర్తనలో !  ఆఫీసు లో మధుతో పరిచయం ! ప్రేమ గా మారింది ! కొంత కాలం ,  కలిసి ఉందామనే నిర్ణయం తీసుకున్నారు , స్వతంత్ర భావాలున్న వారవడం వల్ల ! 
మధుకు , ఉద్యోగ రీత్యా  ఇతర సిటీ లలో టూర్స్ వల్ల , లావణ్య  ఒంటరి దయింది , తాత్కాలికం గా ! ఆ సమయాలలో , మధు తో గడిపిన క్షణాలూ , పొందిన ఆనందమూ , ఆమెలో ఉవ్వెత్తున లేచి పడుతూ ఉంటాయి , అలల్లాగా !  ఈసారి ఇంటికి వచ్చాక , ఆ ఆనందాలు మధుతో మళ్ళీ పొందాలనుకుంటూ , ఎదురు చూస్తూ ఉంటే ,తిరిగి వచ్చిన మధు ,యదాలాపం గా , తనను పట్టించుకోక పోవడమూ ,  లాప్ టాప్ తో కుస్తీ పడుతూ ఉండడమూ , ఆమెలో అసహనాన్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి !  ఊరికే చీకాకు పడుతూ ఉంది ! తీవ్రమైన  విసుగు , కోపం ప్రదర్శిస్తూ ఉంది !  చేతి కందిన వాటిని విసిరేస్తూ ఉంది !  ఆమె కామోద్రేకానికి ,  కిచెన్ లో వంటలు మాడి పోతూ ఉన్నాయి ! మధు  కు ఆమె ప్రవర్తన లో మార్పు కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది !  మధు లో కోరికలు ఫ్రీజ్ అయ్యాయి ! తను అనుకుంటున్నాడు , ఊళ్ళో తను లేకపోవడం వల్ల , జరుగుతున్న పరిణామాలేనని ! తన లావణ్య , తాను దగ్గర లేక పోవడం వల్ల , ఎవరి వలలో నైనా పడిందా ?  అర్ధం చేసుకో లేక పోతున్నాడు , లావణ్య ప్రవర్తన లో మార్పులను !  చిగురిస్తున్న బంధం ఊగిస లాడడం మొదలు పెట్టింది ! 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: