ఇన్సులిన్ ఇంజెక్షన్ ను నిలువ చేసుకోవడం ఎట్లా ? 1.
చాలామంది మధుమేహం ఉన్న వారు , మందు బిళ్లలతో షుగర్ కంట్రోల్ కాకపొతే , ఇన్సులిన్ వాడుతూ ఉంటారు , డాక్టర్ సలహా మీద.
ఈ రోజుల్లో డాక్టర్లు విపరీతం గా బిజీ గా ఉంటూ , అతి తరచు గా ఇన్సులిన్ ఇంజెక్షన్ ను ఎట్లా నిలువ చేసుకోవాలో వివరం గా రోగులకు వివరించరు . అందువల్ల వ్యాధి గ్రస్తులు , ఇన్సులిన్ ఇంజెక్షన్ లను ఎక్కడ పడితే అక్కడ నిలువ చేసుకొని ,క్రమం తప్పకుండా , సరి అయిన సమయానికే ఇంజక్షన్ తీసుకుంటూ ఉంటారు . కానీ షుగర్ కంట్రోల్ అవక , తాము చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసుకోలేరు !
సరి అయిన ఉష్ణోగ్రత లో ఇన్సులిన్ ఇంజక్షన్ లను నిలువ చేయక పొతే , ఆ ఇన్సులిన్ రసాయనం, పాలలో నిమ్మకాయ వేస్తే విరిగి పోయినట్లు విరిగి పోతుంది. అది విషం గా మారదు కానీ , విరిగి పోయిన ఇన్సులిన్ మందును ఇంజక్షన్ గా తీసుకుంటే , అది షుగర్ ను కంట్రోలు చేయదు !
అందువల్ల ఇన్సులిన్ ఇంజక్షన్ వాడే వారు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి , తప్పని సరిగా :
1. ఇన్సులిన్ ను వేడి ప్రదేశాలలో నిలువ చేయకూడదు.:
ఆఫీసులకు కారులో వెళ్లే వారు , కారు లో వేడి ప్రదేశాలలో ఇన్సులిన్ ఇంజక్షన్ ను ఉంచ కూడదు ! ఒక అరగంటే కదా అనో , లేదా , ఒక గంటే కదా కారు ప్రయాణం అని అశ్రద్ధ చేయకూడదు !
2. ఇన్సులిన్ ను ఫ్రీజ్ చేయకూడదు. అంటే ఫ్రీజర్ లో ఇన్సులిన్ ను నిలువ చేయకూడదు.
అంటే, ఐస్ క్రీమ్ లు పెట్టే చోట ! అట్లా పొరపాటు న నిలువ చేస్తే , ఆ ఇన్సులిన్ ను ఇంక పారేయాల్సిందే ! ఎందుకంటే , ఇన్సులిన్ రసాయనం ఫ్రీజర్ లో ఉంచితే విరిగి పోతుంది , ఎందుకూ పనికి రాదు , అంటే షుగర్ ను కంట్రోల్ చేయదు .
ఓపెన్ఇ చేయని ఇన్సు లిన్ ను ఫ్రిడ్జ్ లో తలుపు కు ఉన్న అర లో నిలువ చేయవచ్చు. అంటే రిఫ్రిజిరేటర్ లో . ఫ్రీజర్ లో కాదు.
3. సూర్య రశ్మి తగిలే చోట ఇన్సులిన్ ను ఉంచ కూడదు. అట్లా చేస్తే ఇన్సులిన్ రసాయనం ‘ విరిగి పోతుంది’ !
4. ఇన్సులిన్ మందు ఓపెన్ చేసే ముందు expiry date ఒక పుస్తకం లో నోట్ చేసుకోవాలి . ఒక సారి ఓపెన్ చేశాక , 28 రోజుల్లో దానిని వాడాలి , ఒకసారి సీల్ ఓపెన్ చేసిన ఇన్సులిన్ ను ఫ్రిడ్జ్ లో నిలువ చేయకూడదు 15- 25 సెంటిగ్రేడు టెంపరేచర్ ఉన్న గదులలో నే ఉంచాలి .
28 రోజుల తరువాత మందు మిగిలితే , దానిని వాడ కూడదు ! మందు ఇంకా ఉంది కదా అనుకుని .
5. ప్రతి సారీ ఇంజెక్షన్ సూది లో ఎక్కించే ముందు , ఇన్సులిన్ మందు ను ప్రత్యేకం గా గమనించాలి , దాని రంగు లో కానీ , వాసన లో కానీ ఏమైనా మార్పులు వచ్చాయా లేదా అని ! తేడా ఉంటే ఆ మందును వాడకూడదు.
అనుమానం ఉంటే డాక్టర్ ను సంప్రదించాలి.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు .
ఇంకా ఇంజక్షన్ దాకా రాలేదు 🙂 సెమి డయానిల్ పూటకో మాత్రలో ఉన్నాను, మంచి మాట చెప్పేరు, ఈ అనుభవం మాఅమ్మగారితో పడినదే!
మంచిదే నండీ, ప్రతి ఆరు నెలలకు ఒకసారి HbA1c అనే పరీక్ష చేయించుకుంటే ,
షుగర్ కంట్రోల్ ఎట్లా ఉందో తెలుసుకోవచ్చు కూడా.
మంచిదే నండీ, ప్రతి ఆరు నెలలకు ఒకసారి HbA1c అనే పరీక్ష చేయించుకుంటే ,
షుగర్ కంట్రోల్ ఎట్లా ఉందో తెలుసుకోవచ్చు కూడా.