మరి గంజాయి పీలిస్తే ప్రమాదాలేంటి?2.
1. గంజాయి పీల్చాక వాహనం నడిపితే స్వర్గ ద్వారాలకు చేరువ అవడం ఖాయం :
గంజాయి పీల్చి డ్రైవింగ్ చేసే వారు, విచక్షణ, సమయ స్ఫూర్తి లోపించి , ప్రమాదాలకు లోనవడమే కాకుండా , ఇతర వాహన చోదకుల , పాద చారుల ప్రాణాలకు కూడా హాని కలిగిస్తారు ! ఈ విషయం
అనేక పరిశోధనల ఫలితం !
2. గంజాయి ఊపిరి తిత్తుల క్యాన్సర్ కు ( లంగ్ క్యాన్సర్ ) కు హేతువు :
బాగా పట్టు బిగించి గంజాయి దమ్ము లాగే వారి ఊపిరితిత్తులను , వారి జీవితాలనూ కూడా ఆ గంజాయి లాక్కెళుతుంది !
పొగాకు లో ఉన్న విషపదార్ధాల లాంటి విషాలే , గంజాయి లో కూడా ఉన్నాయని పరిశోధనల ద్వారా తెలిసింది !
3. గంజాయి స్కిజోఫ్రీనియా కి కారకం :
గంజాయి పీల్చే వారి మానసిక స్థితి క్రమేణా అధ్వాన్నం అవుతుంది !
వారు తరచూ , మనుషులు లేని చోట మనుషులను చూడడం , లేదా మనుషుల మాటలను లేదా ఇతర శబ్దాలను , ఎవరూ లేని చోట వినడం అంటే శూన్యం లో శబ్దాలను వినడం జరుగుతుంది !
అంటే వారు హాలూసినేషన్స్ అనే విచిత్ర అనుభూతి చెందుతూ ఉంటారు !
ఈ హాలూసినేషన్స్ తరచూ వస్తూ ఉంటే , వారు క్రమేణా విపరీతమైన భయం చెందుతూ , ఇతర వ్యక్తులు కొందరు కానీ , లేక అందరూ కానీ , వారి కి ఎప్పుడూ హాని తలపెట్టే ఉద్దేశం లో ఉన్నారని భావిస్తూ ఉంటారు ! ఈ భ్రమ నే ‘ పారనోయియా ‘ అంటారు !
ఈ పారనోయియా తీవ్రం గా ఉన్న వారు , వారి పక్కన ఉన్న వారి మీద అకారణంగా దాడికి దిగడమూ , వారిని కొట్టడం లేదా ఇతర రకాలు గా గాయ పరచడం కూడా చేస్తూ ఉంటారు !
4. గంజాయి వంధత్వానికి కారణం ( infertility ):
చాలా కాలం గంజాయి దమ్ము లాగే పురుషులలో శుక్ర కణాలు తగ్గి అంటే స్పెర్మ్ కౌంట్ తగ్గి పోయి ,వారు తండ్రులు కాలేక పోవడం , అట్లాగే స్త్రీలలో అండాలు తగ్గి , వారు గర్భవతులు కాలేక పోవడం కూడా జరుగుతుంది !
5. గంజాయి పీలిస్తే , వికలాంగ శిశువుల జననం :
బాగా గంజాయి పీల్చే స్త్రీలు గర్భవతులవుతే , వారికి కలగ బోయే శిశువులు అవయవ లోపాలతో పుట్టే ప్రమాదాలు ఎక్కువ అవుతాయి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
Good info