Our Health

గంజాయి దమ్ము  మంచిదేనా?1. 

In Our Health on ఆగస్ట్ 12, 2017 at 2:12 సా.

గంజాయి దమ్ము  మంచిదేనా?1. 
Image result for cannabis reaching brain
గంజాయి శాస్త్రీయ నామం  ‘  కన్నాబిస్ ‘   కన్నాబిస్  సటైవా  అనే మొక్క నుంచి తీసే రసాయన  పదార్ధం , గంజాయి అనబడుతుంది. దీనికి అనేక దేశాలలో అనేక రకాలైన పేర్లు ఉన్నాయి .
WEED ( వీడ్ ),  SKUNK ( స్కంక్  ) , SINSEMILLA ( సిన్సిమిల్లా  ), SENSI ( సెన్సి ), RESIN ( రెసిన్ ) , PUFF ( పఫ్ ), POT ( పాట్ ), MARIJUANA ( మరువానా ) , HERB ( హెర్బ్ ) , HASHISH ( హాషిష్ ) , HASH ( హాష్ ) , GRASS ( గ్రాస్ ) , GANJA ( గాంజా ) , DRAW ( డ్రా  ) , DOPE ( డోప్ ) , BUD (  బడ్ ) ,ఇంకా  BHANG ( భంగ్ ) అని అనేక రకాల పేర్లతో పిలుస్తారు.
గంజాయి ని సాధారణం గా   సిగరెట్ తాగినట్టు  దాని పొగను పీలుస్తారు  అంటే , గంజాయి కాలి , దాని పొగ  నేరు గా ఊపిరి తిత్తులలోకి పోయి , అక్కడనుంచి  రక్తం లో ప్రవేశించి , మెదడు ను చేరుకుంటుంది ! ( క్రింది చిత్రం చూడండి  ) 
Related image
గంజాయి ని బిస్కట్ లలో , చాక్లెట్లలో  , లేదా కేకు లలో కలిపి కూడా అమ్ముతారు. వాటిని తిన్నాక ,  వాటిలో ఉన్న గంజాయి  రక్తం లో కలిసి , మెదడును చేరుకుంటుంది !
Related image
( పైన కనిపించే చాకోలెట్ లో గంజాయి ఉంటుందని , అది ఆన్ లైన్ లో అమ్ముతారని , ఎంతమంది తల్లి దండ్రులకు తెలుసు ? ) 
ఏరకంగా అయినా , రక్తం లో ప్రవేశించిన గంజాయి , మెదడును చేరుకొని , మెదడు రసాయనాలను మార్చి , మానవులను  ‘ గంజాయి తాగిన మొహం ‘ వారి లా చేస్తుంది !
గంజాయి లో  ఉండే  ముఖ్యమైన రసాయనం పేరు THC  ( టీ  హెచ్ సీ  ) అంటే టెట్రా హైడ్రో కన్నాబినాల్ ( Tetra Hydro Cannabinol ).  ఈ రసాయన  ప్రభావం వల్లనే ,  అది తీసుకున్న వాళ్లలో , అనేకరకాలైమార్పులు సంభవిస్తాయి.
ఈ మార్పులు తెలుసుకోవడం , యువత తో పాటుగా , వారి తల్లి దండ్రులకు కూడా చాలా ముఖ్యం !
గంజాయి వాడుతున్న మొదటి రోజుల్లో  ‘ బాగా రిలాక్స్ అవుతున్న భావన ‘ కలుగుతుంది ! ఈ భావన, ముఖ్యం గా పగలూ రాత్రులూ ,  బాగా కష్ట పడుతూ , చదువుకునే విద్యార్థులకు ,  చేపలను పట్టడానికి నీటిలో వేసే ‘ ఎర ‘ లా పని చేస్తుంది !
కొందరు   చీటికీ మాటికీ , అంటే కారణం లేకపోయినా కూడా , నవ్వుతూ ఉంటారు , వారిలో వారు కానీ లేదా బయటకు గానీ !  సాధారణం గా ముభావం గా , మౌనం గా ఉండే వారు , అకస్మాత్తుగా , ఎక్కువ గా మాట్లాడుతూ ఉంటారు ! సహజం గా మనం  వినే  సంగీతం , విస్పష్టం గా , వినిపించడం , ఇంకా , అస్పష్టం గా కనిపించే రంగులు ఎక్కువ స్పష్టం గా కనిపించడం కూడా అనుభవం అవుతుంది వీరికి !
అంతే  కాకుండా , వీరికి , సమయం ‘ ఆగి పోయినట్టు గానూ , లేదా ,   గడియారం లో ముళ్ళు , చాలా నిదానం గా  కదులుతున్నట్టు గానూ  అనిపిస్తుంది ! ఎప్పుడూ సమయ పాలన తో పరిగెత్తే యువత కు , ఇది కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది !
కానీ గంజాయి ప్రభావం ఇంతటితో ఆగిపోదు !  అనేక రకాలుగా , ప్రమాద కరమైన ఇతర   లక్షణాలకు కూడా కారణం అవుతుంది , గంజాయి !
ఆకలి విపరీతం గా పెరుగుతుంది. 
బాగా నిద్ర మత్తుగా ఉండడం , సోమరి తనం గా తయారవడం , ప్రతి పనినీ వేగం గా చేయలేక పోయి, ‘ మన్ను తిన్న పాము ‘ లా  అతి నిదానం గా చేయడం !
జ్ఞాపకం చేసుకోవాలనుకున్న విషయాలు , త్వరగా జ్ఞాపకం చేసుకోలేక పోవడం ! అంటే అంతకు ముందు క్షణాలలో గుర్తుకు వచ్చే విషయాలు , గంజాయి తీసుకున్నాక ,  పది నిమిషాలు అయినా గుర్తుకు రాక పోవడం ! 
విపరీతమైన గాభరా చెందడం , ఆందోళన చెందడం ,  గుండె వేగం గా కొట్టుకుని ,చెమటలు పట్టడం ,  మాటి మాటికీ  తడబడం ,  అంటే confuse  అవడం కూడా ! 
క్రమేణా hallucinations  అనుభం అవడం జరుగుతుంది ! అంటే మనుషులు చుట్టూ లేక పోయినా కూడా వారి మాటలు వినిపించడం !  లేదా , మనుషులు గానీ , జంతువులు కానీ వారి చుట్టూ వాస్తవం గా లేక పోయినా కూడా , వారికి  ( గంజాయి తాగిన వారికి ) కనిపించడం ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
ప్రశ్నలకు ఆహ్వానం !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: