ఒథెల్లో సిండ్రోమ్. 6 మరి చికిత్స ఏమిటి ?
క్రితం టపాలలో ఒథెల్లో సిండ్రోమ్ అంటే ఏమిటి ? , దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి ? అనే సంగతుల గురించి తెలుసుకున్నాం కదా !? ఇప్పుడు దానికి చికిత్స ఏమిటో కూడా తెలుసుకుందాం !
ముఖ్యమైన మొదటి విషయం :
ఒథెల్లో సిండ్రోమ్ ను మొదట నిర్ధారించుకోవాలి ! అది తమంత తాము చేయలేక పొతే , స్పెషలిస్ట్ సహాయం తీసుకోవాలి !
ఈ రుగ్మత ఉన్న వారికి , మద్యం అలవాటు ఉందో లేదో , అంతకు ముందు ఆ అలవాటు లేక పొతే , ఈ మధ్య కొత్తగా ఆ అలవాటు అయిందో లేదో అని కూడా పరిశోధన చేయాలి , లోతు గా !
ఎందుకంటే , మూలకారణం, చికిత్స కు కొంత వరకు మాత్రమే లొంగుతుంది , కూడా ఉన్న , లేదా ఉండే , మద్యం , ఇంకా ఇతర వ్యసన పదార్ధాల వాడకం ( అంటే ముఖ్యం గా మత్తు మందులు ) కూడా ఈ ఒథెల్లో సిండ్రోమ్ ను బాగా ప్రభావితం చేస్తుంది , కాబట్టి వాటిని కూడా సమూలం గా ఒదిలించు కోవాలి !
రెండో విషయం : ఈ రుగ్మత ఉన్న వారికి డిప్రెషన్ లేదా కుంగుబాటు కూడా ఉండ వచ్చు , దాని చికిత్స తప్పనిసరిగా జరగాలి !
దానితోపాటుగా , తరచు కనిపించే పారనోయియా , లేదా సైకోసిస్ అనే మానసిక పరిస్థితి ని కూడా మందులతో కంట్రోల్ చేయాలి !
ఇక మూడో విషయం :
సైకాలజిస్ట్ ద్వారా , ఈ రుగ్మత ను దీర్ఘ కాలికం గా చికిత్స జరిపించి , ఈ ఒథెల్లో సిండ్రోమ్ ఉన్న వారి మానసిక విపరీత పరిస్థితి లో సమూలమైన మార్పులు తీసుకు రావాలి !
పైన చెప్పిన ఈ మూడు ముఖ్యమైన చికిత్సా పద్ధతులు అనుసరిస్తూ , క్రమం తప్పకుండా , ఈ ఒథెల్లో సిండ్రోమ్ తీవ్రత ను అంచనా వేస్తూ , లేదా వేయిస్తూ ఉండాలి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
మీ అభిప్రాయాలూ , ప్రశ్నలూ , తెలుపగలరు !