5. ఒథెల్లో సిండ్రోమ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి ?!
క్రితం టపాలో చదివినట్టు , ఈ రుగ్మత ఉన్న వారు , తమ భార్యల సాంఘిక పరిచయాలను కంట్రోల్ చేస్తూ ఉంటారు.
వారి భార్యలు , ఆ కంట్రోల్ ను తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే , అప్పుడు , వారి మీద లేని పోని అపనిందలూ , ఆపవాదులూ వేస్తూ ఉంటారు !
వారికి ఇతర పురుషులతో రహస్య సంబంధాలు ఉన్నాయంటూ , వారిని మానసిక హింసకు గురి చేస్తారు !
క్రమేణా , వారిని శారీరకం గా కూడా హింసించడం మొదలు పెడతారు !
వారి దాంపత్య జీవితాన్ని చిన్నా భిన్నం చేసుకుంటారు !
వారి తప్పులకు కారణమంతా , వారి భార్యలే అని విమర్శిస్తూ ఉంటారు , వారిని ! తమ తప్పులను ఎప్పుడూ ఒప్పుకోకుండా !
అంతే కాకుండా , ఎప్పుడూ , తమ భార్యలను విపరీతమైన మానసిక వత్తిడికి గురి చేస్తారు !
ఆ వత్తిడి తగ్గి పోతుంటే , తాము బతకలేమనీ , తమకు ఆత్మ హత్యే శరణ్యమనీ , తమ భార్యలను బెదిరిస్తూ ఉంటారు , తరచూ !
తరువాతి టపాలో ఇంకొన్ని సంగతులు !