Our Health

4.ఒథెల్లో సిండ్రోమ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి ?!

In మానసికం, Our Health, Our minds on జనవరి 28, 2017 at 5:07 సా.

4.ఒథెల్లో సిండ్రోమ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి ?!

Image result for suspicious husband

మునుపటి మూడు టపాల లో ఒథెల్లో సిండ్రోమ్ ఏ విధం గా కనబడుతుందో , జీవితాలను ఎట్లా చిన్నా భిన్నం చేస్తుందో తెలుసుకున్నాం కదా !
ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం !
ఒథెల్లో సిండ్రోమ్ ఒక మానసిక దుర్బలత  ! ఈ వ్యాధి ఎక్కువగా పురుషులలో కనబడుతుంది ! ఈ వ్యాధి గ్రస్తులు , తమ మానసిక స్థితి ‘ బ్రంహాండం ‘ గా ఉందనుకుంటారు ! అంటే , వారి ప్రవర్తన సహజమే అనీ , అందులో తప్పు ఏమీ లేదని బలమైన నమ్మకం తో ఉంటారు , వారి మటుకు వారు ! 
తమ జీవిత భాగస్వామి కానీ , తమ భార్యలు కానీ , ఇతరులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ , తమను అశ్రద్ధ చేస్తున్నారనే , అపోహ పడుతూ, వారిని అనుమానిస్తూ ఉంటారు , అందులో ఏమాత్రం నిజం లేక పోయినా !
క్రమేణా , ఈ అపోహ , అనుమానం  బలం గా వారి మనసు లో నాటుకుని ,  అనేక రకాలు గా వారి భార్యల, లేదా జీవిత భాగస్వాముల ప్రవర్తనను , అనుమానిస్తూ , అను నిత్యం , వారిని ప్రశ్నిస్తూ ఉంటారు , వారి ప్రవర్తన గురించి !
వారికి సమాధానాలు చెప్పలేక , భార్యలు సతమతమవుతూ ఉంటారు ! ఎందుకంటే , వారి సమాధానాలు , ఈ ‘  వ్యాధి గ్రస్తులను ‘ తృప్తి పరచలేవు గనుక !
వారిని  ఈమెయిల్ , ట్విట్టర్ , ఇస్టాగ్రామ్ , ఫేస్ బుక్ ఎకౌంట్ లు , తెరవ నివ్వరు ! ఒక వేళ తెరిచినా , పాస్ వర్డ్  తెలుసుకుంటారు , వారిని బెదిరించి ! 
ఆ తరువాత , వాటిని నిరంతరం పరిశీలిస్తూ ఉంటారు , అనుమానాస్పద కాంటాక్ట్ ల కోసం !
వారి భార్యలను , వారి వారి తల్లి దండ్రులకూ , బంధు మిత్రులకూ దూరం చేసి , వారిని ఏకాకులు గా చేస్తారు !  వారి  వారి , అభిరుచులనూ , వారి ఆనందాలనూ , ఏమాత్రం గౌరవించక , బయటకు వెళ్ళ కుండా , కట్టు దిట్టాలు చేస్తూ ఉంటారు !
వారి సాంఘిక పరిచయాలనూ ,  కలయిక లనూ నియంత్రిస్తూ ఉంటారు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని లక్షణాలు ! 
  1. బాగుందండి. టపాలు మిస్సవుతున్నానేమోననిపిస్తోంది. బాగా లేట్ గా చూశానీ టపా.

  2. కృతఙ్ఞతలు !
    మీరు ఎక్కువ గా ఏమీ మిస్సవ్వ లేదండీ !
    పని వత్తిడి వల్ల నేనే తరచు గా టపాలు వెయ్యట్లేదు !

    వీలున్నప్పుడల్లా మీ టపాలు చూస్తూ ఉన్నాను !
    ప్రవాహం లా సాగుతున్నాయి , కొనసాగించండి !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: