Our Health

ఒథెల్లో సిండ్రోమ్……… 3.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జనవరి 15, 2017 at 10:29 ఉద.

ఒథెల్లో  సిండ్రోమ్……… 3. 

 

Image result for sunrise and birds
కాలం బరువు గా గడుస్తూంది !
నవీన్  మనసు లో అనుమాన బీజం  వేళ్లూనుకుంటూ ఉంది  !
ఏదో  వెలితి , మనసులో !
వనిత కు ‘ దగ్గర ‘ కాలేక పోతున్నాడు !
‘ వనిత ఇంకొకడి తో సంబంధం పెట్టుకుంది ‘ ఇదే ఆలోచన పదే పదే  కాగుతుంది,  గుండెల్లో !
ఇంటికి రాగానే , ఎదో ఒక సమయం లో వనిత హ్యాండ్ బ్యాగ్ లో చేతులు పెట్టి , హడావిడి గా వెదుకు తున్నాడు , సెల్ ఫోన్ నంబర్ లు  నోట్ చేసుకుంటున్నాడు !
మెసేజెస్ చెక్ చేస్తున్నాడు !
ఆఫీస్ నుంచి ఇంటికి రావడం ఆలస్యం అయినప్పుడల్లా , ఆవేశానికి లోనవుతున్నాడు !
దానితో, అనుమానం అలలు గా ఎగిసి పడుతుంది !
రాగానే వాదన మొదలవుతూ ఉంది , వనిత తో !
తనను అనుమానిస్తున్నందుకు బాధ గా ఉన్నా , అనేక మార్లు  అనునయం గా నిజం చెప్పి , నవీన్  మనసు  మార్చడానికి ప్రయత్నించింది !
అందుకు నవీన్ ను సైకియాట్రిస్ట్ దగ్గరకు కూడా తీసుకు వెళతానంది ! అదంతా వృధా ప్రయాస అయింది ! 
నవీన్ , తనలో ‘ ఏ లోపమూ లేదు , తప్పంతా వనితదే ‘  అని వాదిస్తున్నాడు , పదే పదే  !
వనిత కు నవీన్ ప్రవర్తన లో మార్పు ఎందుకు వచ్చిందో తెలియట్లేదు !
బ్రతుకు భారమవుతోంది  తనకు , డబ్బు  హోదా ఉన్నా, తన తప్పు లేకున్నా!
ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి !
హృదయం నవీన్ కోసం మెత్త బడి నప్పుడల్లా , మెదడు కర్తవ్యాన్ని తట్టి లేపుతూ ఉంది , వనితను  !
నవీన్ అనుమానాలు అతనికి పెను భూతాలయి , పీడిస్తున్నాయి,  అహో రాత్రాలూ !
వనిత రూమ్ లో  ఆమె బట్టలూ , పుస్తకాలూ , చిందర వందర అవుతున్నాయి !
నవీన్ , ఆమె లేని సమయం లో వెదుకుతున్నాడు, ఆమె కు లేని సంబంధాలను అంటగట్ట డానికి  ! ఉన్న సంబంధాన్ని , మంట గలపడానికి ! 
ఆ మంటలు ఉవ్వెత్తున ఎగసి పడడానికి , నవీన్ కు మద్యం తోడవుతూ ఉంది , రోజూ ! 
ఇట్లా నెలలు  గడిచాయి !
ఒక ఆది వారం ఉదయమే , ‘ అమ్మా వనితా ‘  అంటూ తలుపు తట్టాడు , ఆమె తండ్రి !
శని వారం రాత్రి త్వరగానే పడుకున్నా , నిద్రలేమి తో , నిరాశతో , తలుపు తెరిచింది , వనిత !
ఒక్కసారిగా  తండ్రిని చూడగానే బావురుమని ఏడిచింది , గుండెలకు హత్తుకుని , చిన్న పాపాయి లా !
విషయమంతా , బాగా అర్ధమయింది  తండ్రికి , ఆమె ఇమెయిల్స్ తో పాటుగా ,ప్రత్యక్షం గా వనితను కూడా చూశాక ! అక్కడక్కడా మచ్చలూ ,మానిన గాయాలూ కూడా కనిపించాయి, తన ‘ బంగారు తల్లి ‘ ఒంటి మీద !
ప్రమాద వశాత్తూ అయ్యాయని తండ్రికి  చెప్పడానికి  వనితకు ఎన్ని వంకలు దొరుకుతాయి కనక !
నవీన్  చీకటి గది లో, గాఢ నిద్రలో ‘  పడి ‘ ఉన్నాడు ,  జీవితాన్ని అంధకారం చేసుకుంటూ !
అతి కష్టం మీద తండ్రి ఉద్రేకాన్ని నివారించి , సూట్ కేస్ ను రోల్ చేసుకుంటూ , తండ్రితో కూడా బయటకు వచ్చింది వనిత !
బయట ఎంతో వెలుతురు గా ఉంది , ఆ ఉదయం ! ప్రత్యేకించి వనిత కు !
సూపర్ డీలక్స్ బస్ ఎక్కబోతూ ఒక్క ఫోన్ చేసింది, సంతోషం గా  తన తల్లికి ‘ అమ్మా నేనూ, నాన్నా మధ్యాహ్నం కల్లా ఇంటికి చేరుకుంటాం ‘ అని !
వెంటనే , సెల్ ఫోన్  ను బస్ ముందు టైర్ కింద టక్ చేసింది ఎవరి కంటా పడకుండా !
బస్ సిటీ లిమిట్స్ దాటుతూండగా , ఆకాశం లో స్వేచ్ఛ గా ఎగురుతున్న పక్షుల తో  సింక్రొనైజ్ అయింది వనిత మనసు,  హాయి గా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
  1. ఈ ఒథెల్లో సిండ్రోం ప్రేమ ఉన్న చోట ఏంతో కొంత ఉండక తప్పదేమో!

    ఒథెల్లో సిండ్రోం లక్షణాలు ఇలా ఉంటాయా!!
    గాఢమైన ప్రేమ- యాంత్రిక-అతి పరిచయం-అనుమానం-అసూయ- ద్వేషం-హింస…… ఇవి ఈ ఒథెల్లో సిండ్రోం స్టేజిలనిపిస్తుంది.

    టపా బాగుంది..కొనసాగించండీ

  2. కృతఙ్ఞతలు శర్మ గారూ!

    టపా టాపిక్ పూర్తి అయ్యాక మీ సందేహాలు తీరుతాయను కుంటాను !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: