మనసు పడిన మగువను కౌగిలించుకోవడం ఎలా ?4.
క్రితం టపాలో, ఎదురెదురుగా, ప్రేయసీ ప్రియులు, కౌగిలించుకోవడం ఎలానో తెలుసుకున్నాం కదా !
మరి ప్రియుడు , ఒక్కసారిగా, ప్రేయసి వెనుక నుంచి ఆమెను కౌగిలించుకోవడం గురించి తెలుసుకుందాం !
ఈ రకమైన కౌగిలి లో , ఒక రకమైన ఆతృత , సస్పెన్స్ , కలిగించ వచ్చు , ప్రేయసి లో కానీ , ప్రియుడి లో కానీ !
ప్రత్యేకించి , ప్రేయసి , ఆ సందర్భం లో , ఇతర ముఖ్యమైన పనులేవీ చేస్తూ ఉండక పొతే , తన వెనుకనుంచి , ఒక్క సారిగా , ఆమె నడుము చుట్టూ చేతులు వేసి , ఆమె మెడకు , అతడి ముఖం తగిలిస్తూ ఉంటే , అది ఒక అందమైన , ఉక్కిరి బిక్కిరి చేసే అనుభూతి గా మిగిలి పోతుంది ఆమె మనసులో ! అట్లా కాకుండా , ఆమె వెనుకనుంచి వచ్చి తన వక్షో జాలను , అతడి వీపుకు హత్తుకుంటూ , ఉంటే , ఆమె ముఖం, అతడికి ఆనించడం కూడా ఓ అందమైన అనుభూతే ! కొన్ని కిటుకులు, ఆ అనుభూతుల రుచి ఎక్కువ చేస్తాయి ! రస మయం కూడా చేస్తాయి !
అతడు కనుక , వెనుక గా వస్తే , ఆమె నడుము చుట్టూ చేతులు వేయడమే కాకుండా , అతడి కటి వలయ భాగాన్ని కూడా అంటే అతడి టార్సో ను , ఆమె పిదురులకు , మధ్య లో సందు లేకుండా , తగిలించితే , ఆమెకు ఎక్కువ చేరువ అవుతాడు !
తలల స్పర్శలు , ఇరువురిలో ఊహా లతలను ఒక్కసారిగా పెనవేసుకుపోయే లా చేస్తాయి ! ప్రత్యేకించి, తలలు కలిసినప్పుడు , తలపులు కూడా కలిసి , ఆత్మీయత ,అవధులు దాటుతుంది , ఇరువురిలో !
ఎంత సేపు ?: కమ్మటి కౌగిలి లో , కాలమే కరిగి పోతుంది ! సమయం , సందర్భాన్ని బట్టి కౌగిలి సమయం కూడా , మారుతుంది ! పెరుగుతుంది ! అప్పుడప్పుడూ , దీర్ఘ మైన శ్వాస తీసుకుని , కౌగిలి కి సరిపడినంత ఆక్సిజన్ ను తాజా గా జత చేస్తూ ఉంటే , అలసట కూడా తగ్గి , ఆ కౌగిలి శక్తి వంతం అవుతుంది !
చేతుల అలసట కూడా తగ్గాలంటే , ఆ దృఢ బంధాన్ని , అప్పుడప్పుడూ సడలించి , చేతులకు , మిగతా ‘ ముఖ్యమైన చేతల ‘ మీద ధ్యాస పెడితే కూడా , ఆ కౌగిలికి ఎక్కువ రుచి వస్తుంది ! అట్లాగే , కేవలం వెనుకనే నిలబడకుండా , కౌగిలి సడలించి , ప్రేయసి , ప్రియుడిని తన ఎదురుగా తిప్పుకోవడమూ , లేదా ప్రియురాలిని , ప్రియుడు తన ఎదురుగా తిప్పుకోవడమూ , కూడా చేస్తూ ఉండ వచ్చు , సమయానుకూలం గా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !