మనసు పడ్డ మగువను ఎట్లా కౌగిలించుకోవాలి ? 3.
సాధారణం గా రెండు రకాలు గా ఉంటాయి, ఈ ప్రేమ మయ కౌగిళ్లు !
1. అభిముఖ కౌగిలి ! : ఇందులో ప్రేయసీ ప్రియులిద్దరూ ఒకరికి , ఇంకొకరు ఎదురెదురు గా ఉంటారు !
వారిరువురి చాతీ లు , ఉదర భాగాలూ , కటివలయ భాగాలూ , తగిలి ఉంటాయి ! అంటే ఒకరి ఛాతీ ఇంకొకరికీ , ఒకరి ఉదరం ఇంకొకరికీ , ఒకరి కటివలయం , అంటే పెల్విస్ , ఇంకొకరికీ తగులుతూ ఉంటాయి !
ఈ రకమైన కౌగిలి , ఎంతో స్పర్శ కలిగి , చాలా సన్నిహితం చేస్తుంది , ప్రియులను , కేవలం భౌతికం గానే కాకుండా , మానసికం గా కూడా !
అప్పుడు, పొడుగు గా ఉన్న వ్యక్తి , తనకన్నా తక్కువ ఎత్తు లో ఉన్న ప్రియుడిని కానీ ప్రియురాలిని కానీ , నడుము చుట్టూ చేతులు వేయడం , అవతలి వ్యక్తి , తమ మెడ చుట్టూ ( వదులు గా ) చేతులు వేయడం , జరుగుతుంది !
ఆమె మెడకు కానీ , తలకు కానీ మీ తలను , లేదా బుగ్గలను తగిలించండి ! మెడ భాగం అతి సున్నితమైన స్పర్శకు స్పందిస్తుంది !
కౌగిలిని బిగించడం : అంటే కొద్దిగా స్క్వీజ్ చేయండి ! ఆమె ఉక్కిరి బిక్కిరి అయి పోయి శ్వాస తీసుకోలేక పోయే అంత గా కాదు ! ఇట్లా కనీసం మూడు నాలుగు సెకండ్లు ఆమెను మీ కౌగిటిలో ‘ బంధించ వచ్చు ‘ ! మీ ప్రేమ తీవ్రత ను బట్టి , ఈ బంధనా సమయం పెరుగుతూ ఉంటుంది !
మీ చేతులకు పని చెప్పండి ! : ఆమె కురులను నిదానం గా సరిచేస్తూ కానీ , ఆమె తలను స్పృశిస్తూ కానీ , మీ చేతులు బిజీ అయి , మీరు ఆ కౌగిలి లో బిజీ అవుతూ ఉంటే , ఆ అనుభూతి , న భూతో , న భవిష్యతి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !