బంధాలు ఎందుకు తెగుతాయి ?12. మొండి వాదన !
ఒక బంధం ఏర్పడే మొదటి దశలలో కానీ , ఏర్పడ్డాక కానీ , స్త్రీ పురుషుల మధ్య , అనేక సందర్భాలలో వాదోప వాదాలు జరుగుతూ ఉంటాయి ! ఆ సందర్భాలలో , సాధారణం గా పురుషులు , తమ పెద్ద గొంతు తోనో , లేదా మొండి వాదనతోనో , స్త్రీల నోరు మూయించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ! స్త్రీలు కూడా , కొన్ని , కొన్ని సమయాల లో , తమ ఇంట్లో వారికీ , తమ వీధిలో వారందరికీ కూడా , వినపడేంత గొంతుతో , తమ వాదనను వినిపిస్తారు ! మరి, ఆ వాదనలను , తమ జీవితాలకు ఉపయోగ కరం గా మార్చుకోవడం ఎట్లా ? :
1. విరామం !:
వాదనలు , తారాస్థాయి కి చేరుకునే సమయం లో , రక్త పీడనం హెచ్చుతుంది ! అంటే అధిక బీపీ ! దానితో , ఆందోళన , మానసిక వత్తిడి కూడా ఎక్కువ అవుతాయి ! చాలా మందికి కోపం వస్తే, వారి గుండె కాయ , ఎక్కువ వేగం గా కొట్టుకుంటూ ఉంటుంది ! కొందరు శివాలు ఎత్తినట్టు , ఊగి పోతూ ఉంటారు , చెప్పలేనంత కోపం తో !
ఎక్కువ కోపం వచ్చిన వారు , పక్షవాతమూ , గుండె జబ్బు ( హార్ట్ ఎటాక్ ) బారిన అకస్మాత్తు గా పడిన సందర్భాలు కూడా అనేకం ! కోపం లోనూ , ఆవేశం లోనూ , మానవులు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతారు ! కేవలం , గుస గుసలు కూడా ఇతరులకు వినిపించే చోట , నోరు పెద్దది చేసుకుని , అరవడం మొదలు పెడతారు ! అంటే , వారు ఏ సమస్య గురించి ఆలోచిస్తున్నారో , ఆ సమస్య ను సరిగా , అంటే హేతుబద్ధం గా అర్ధం చేసుకోలేక పోతారు ! అట్లాగే , పరిష్కారం కూడా కనుగొన లేక పోతారు ! అందుకని , కోప తాపాలు , ఆ బంధం లో ఎవరికి ఎక్కువ గా అవుతున్నాకూడా , వారిరువురూ , వెంటనే విరామం తీసుకోవడం , అతి ముఖ్యమైన చర్య ! వెంటనే ఆ స్థానం నుంచి , వెళ్ళిపోవడం , చేయవలసిన పని !
2. మీ వాదన లక్ష్యం ఏమిటి ?: మీరు , మీ వాదనతో , ఏమి సాధిద్దామని అనుకుంటున్నారు ? ఈ విషయం ముందుగానే ఆలోచించుకోవాలి ! లేకపోతే , మీ వాదన కు ఫలితం ఉండదు ! అంతే కాకుండా , మీరు , మీ వాదన ఎట్లా ఉంటే , మీ ‘ బంధం ‘ లో ఉన్న సమస్య పరిష్కారం అవుతుందో కూడా , ముందుగానే , ఆలోచించుకోవాలి !
కేవలం, మీరు వాదించే , మీ ఎదుటి వారి మనసును గాయ పరచడమే , మీ లక్ష్యం కాకూడదు ! సమస్యను , పరిష్కార దిశగా , మీరు చూడ గలుగు తే , మీరు నిదానం గా ఆ సమస్య గురించి ఆలోచించ గలగడమే కాకుండా , మీ ఎదుటి వారి అభిప్రాయాలను కూడా గౌరవించి , వాటిని కూడా ఓపికతో వినే అలవాటు చేసుకుంటారు !
ఎవరి మనసులో ఉన్నది వారు, బయటకు చెప్పుకోకుండా , ‘ బాటిల్ ‘ చేసుకోవడం కూడా , అధిక రక్త పీడనకూ , ఇతర మానసిక రుగ్మత లకూ దారి తీస్తుందని , అనేక శాస్త్రీయ పరిశీలన ల ద్వారా తెలిసింది !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !