Our Health

బంధాలు ఎందుకు తెగుతాయి ? 9. డబ్బు !

In Our Health on ఏప్రిల్ 17, 2015 at 2:35 సా.

బంధాలు ఎందుకు తెగుతాయి ? 9. డబ్బు ! 

స్త్రీ పురుషుల బంధానికి , ప్రత్యక్షం గానో , పరోక్షం గానో , డబ్బు  ఎంతగా ప్రభావితం చేస్తుందో , ప్రత్యేకించి చెప్ప నవసరం లేదు కదా ! బంధం ఏర్పడడానికి ముందు నుంచీ , ఆ బంధం గట్టి పడి , పాకం లో పడ్డాక , ఆ తీపి పాకం , చేదు అవ్వడానికి , లేదా ఇంకా తీయగా , అమృతమయం అవడానికి కూడా డబ్బు  చాలా  ఉపయోగకరం ! 
కానీ, విజ్ఞత కలిగిన స్త్రీ పురుషులు , తమ బంధం బలహీన పడకుండా , డబ్బు విలువ ను గ్రహించి , ఆ డబ్బును అదే స్థానం లో ఉంచి , ఆనంద మయ జీవితం గడప వచ్చు ! 
1. నిజాయితీ గా పరస్పరం తమ ఆర్ధిక విషయాలు తెలుసుకోవడం ! : చాలా వరకూ బంధాలు ఏర్పడే సమయం లో , పురుషులు , లేని పోని  గొప్పలు చూపిస్తూ ఉంటారు ! ఆస్తి పరులు గానూ , డబ్బు జల్సా గా ఖర్చు పెట్టే వారి లాగానూ , అమ్మాయిల ముందు , తమ ఇమేజ్  పెంచు కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ! నిజం గా డబ్బు కల వారయినా కూడా , ఒక బంధం ఏర్పడ్డాక , తమ భాగస్వాములతో , ఆర్ధిక పరమైన వాస్తవాలను , మనసు విప్పి , ఉన్నది ఉన్నట్టు , మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి ! 
2. ఎప్పుడు ? :  ఇట్లా మాట్లాడుకోవడం , బాగా ఉద్రేకం గా ఉన్నప్పుడో , లేదా ఇరువురి మధ్య వాదనలు జరుగుతున్నప్పుడో చేయకూడదు ! ప్రశాంతమైన , ఇరువురికీ అనుకూలమైన సమయాల లోనే  జరగాలి ! 
3. అప్పులూ , క్రెడిట్ కార్డు అప్పులూ , ఇతర లోన్ లూ , ఇట్లా ఏ ఆర్ధిక విషయాలూ దాచుకో కుండా మాట్లాడుకోవాలి !  ఎందుకంటే , అవి వారిరువురి జీవితాలనూ ప్రభావితం చేస్తాయి కాబట్టి ! 
4. పరస్పర నిందారోపణలు కూడదు :  ‘ నువ్వు ఎక్కువ గా ఖర్చు చెస్తున్నావనో , లేదా నీవు వృధాగా ఖర్చు పెడుతున్నావనో ‘ , ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ  , తప్పు పట్టాలని చూస్తూ ఉంటే , బంధం బలహీన పడడం ఖాయం ! అందుకే నిందలు మోపడం మానుకుని , వాస్తవాలు గ్రహించాలి, ఇరువురూ !
5. కొంత సమయం తీసుకున్నా , ప్రతి నెలా , మొదటి వారం లోనో , ఆఖరి వారం లోనో , ఇరువురూ , అనుకూల సమయం లో తీరిక గా కూర్చుని , తమ తమ ఆదాయం ఎంతో , ఖర్చులు ఏంటో , ఒక ప్రణాళిక వేసుకుని , అవసరమైన ఖర్చులకు తప్పించి , అనవసరమైన ఖర్చులను ఏ విధం గా తగ్గించుకోవాలో చర్చించుకుని , తగిన నిర్ణయాలు తీసుకోవాలి ! వాటిని అమలు చేయాలి కూడా ! ఆశ్చర్యకరం గా , ఇట్లా చిన్న పాటి  లెక్కలను కూడా చేసుకోకుండా , బతుకు భారం మోస్తున్న వారు కోట్లల్లో ఉన్నారు ప్రపంచం లో ! 
6. తగినంత డబ్బును ఆదా చేసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి !:  విహారాల కోసమో , విందుల కోసమో , లేదా తమ సంతానం కోసమో !  ఈ రోజుల్లో ప్రతి బ్యాంకు వాడూ , ఊరూ పేరూ తెలియక పోయినా కూడా అప్పులిస్తున్నాడు ! ఆ అప్పుల వల లో పడకుండా , కొద్ది కొద్ది మొత్తాలు ఆదా చేసుకుంటూ ఉంటే , ఆర్ధిక పరమైన వత్తిడులు, బంధాలను బలహీనం చేయ లేవు ! 
7. కేవలం , తమ తమ అవసరాలకే కాకుండా , కనీస మొత్తాలను అంటే , వారి సంపాదన లో అతి కొద్ది డబ్బు నైనా , ఆపదలో ఉన్న బంధువులకోసమో , లేదా పేద వారికోసమో , ఇట్లా, ధార్మిక కార్యాలకు ఉపయోగిస్తే , ఆ బంధం దృఢ పడడమే కాకుండా ,  వారి ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: