బంధాలు ఎందుకు తెగుతాయి ?7.
బంధాలు ఎందుకు తెగుతాయి? అనే విషయం మీద కొన్ని టపాలను ఇంత వరకూ పోస్ట్ చేయడం జరిగింది ! వాటిలో ముఖ్యం గా స్త్రీ పురుషుల పెరుగుదల ల తో పాటుగా , వారి ఆలోచనా ధోరణు లు కూడా ఎట్లా మార్పు చెందుతాయో , ఆ మార్పు చెందిన ఆలోచనా ధోరణు లు , వారి , వారి బంధాలను ఎట్లా ప్రభావితం చేస్తాయో కూడా తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు బంధాలు బలహీనం అవుతున్నప్పుడు , తీసుకోవలసిన జాగ్రత్తలూ , చేయ వలసిన కర్తవ్యం గురించి కూడా తెలుసుకుందాం !
1. కమ్యూనికేషన్ : స్త్రీ పురుషుల మధ్య సత్సంబంధాలకు , లేదా బలమైన సంబంధాల కు ప్రధానం గా కావలసిన బలం , వారిరువురి మధ్య ఉన్న కమ్యూనికేషన్ ! ఈ పదాన్నే మనం ప్రస్తుతం ఎక్కువ గా వాడుతూ ఉండడం వల్ల , ఈ పదం ఆంగ్ల పదమైనా కూడా , ఈ పదాన్నే ప్రస్తుతించడం జరుగుతుంది ! ( తెలుగులో కమ్యూనికేషన్ అంటే ‘ బట్వాడా ‘ అని ! కానీ బట్వాడా అనే పదం , దాదాపు కనుమరుగయింది , ప్రస్తుత వాడుక భాష లో ! )
బంధం బెడిసి కొడుతున్న సమయం లో స్త్రీ పురుషులు , ఒకరి మొహం , ఒకరు చూసుకోవడం తగ్గిస్తారు ! వారి జీవితం యాంత్రికం అవుతుంది ! ఒకరి తో ఒకరు సంభాషణ లు తక్కువ చేస్తారు ! ఒకరు ఆ ప్రయత్నం చేసినా , ఇంకొకరు , తమకు విపరీతమైన పని ఒత్తిడి ఉన్నట్టూ , చాలా పనులు ఉన్నట్టూ , అభినయం చేస్తూ ఉంటారు !
ఒక వేళ , నిజం గానే పని వత్తిడి ఉన్నా కూడా , అతి గా పని లో నిమగ్నమవుతూ , వారి సహచరుల తో సంబంధాలు తగ్గించుకుంటారు ! ఇక వర్తమాన గాడ్జెట్ లు అనేకం , కూడా , ఆ పని చేయడానికి , వారికి ఎంతగానో సహకరిస్తాయి ! అంటే , వాటిని ఉపయోగిస్తూ , వారు చాలా బిజీ గా ఉన్నట్టు , లేదా ఉంటూ , తమ బంధాలను బలహీనం చేసుకుంటూ ఉంటారు , లేదా నిర్లక్ష్యం చేసుకుంటారు !
కమ్యూనికేషన్ అనేది , స్త్రీ పురుషుల సంబంధాలలో , ఒక దృఢ మైన బంధం ! అది కనిపించక పోయినా కూడా ! ఆ ‘ బంధం ‘ బలహీన పడుతూ ఉంటే , మళ్ళీ పునరుద్దరించు కోవడం కర్తవ్యం !
అందుకు , ఓపిక గా ఒకరి అభిప్రాయాలు ఒకరు వినడం అలవాటు చేసుకోవాలి ! ఒక వేళ , గట్టి గా అరుస్తూ మాట్లాడు కోవలసి వస్తే , ప్రైవసీ ఉన్న అంటే ఏకాంత ప్రదేశాలకు వెళ్ళడం మంచిది ! ఒకరి అభిప్రాయం ఒకరు తెలుసుకునే సమయం లో , కొన్ని నిబంధనలు పాటించాలి , ఇరువురూ !
ఒకరు మాట్లాడే సమయం లో ఇంకొకరు వారి మాటలను ‘ కట్ ‘ చేయకుండా , వారు చెబుతున్నది , పూర్తి గా , శ్రద్ధ గా వినడం మంచిది ! శ్రద్ధ గా అనే అనడం ఎందుకంటే , ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు , వాచీ లో సమయం చూస్తూ నో , కిటికీ లోంచి ట్రాఫిక్ చూస్తూ నో , లేదా మొబైల్ లో ‘ కెలుకుతూ నో ‘ ఉంటే , చెప్పే వారికి కూడా అసహనం పెరుగుతూ ఉంటుంది ! వారిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు స్పష్టం అవుతుంది !
దేహ భాష , అంటే బాడీ లాంగ్వేజ్ తోనే మనం ఎక్కువ శాతం ఇతరులతో ‘ కమ్యూనికేట్ చేస్తాము ! మన సంభాషణ తో కేవలం కొంత శాతం మాత్రమే , ఇతరులతో ‘ సంభాషిస్తాము ‘ ! ఇది ఆశ్చర్య కరమైనప్పటికీ , వాస్తవం ! అందుకే శ్రద్ధగా వినడం , కమ్యునికేషన్ లో ముఖ్య సూత్రం !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !