బంధాలు ఎందుకు తెగుతాయి ?4.
పురుషుల శక్తి యుక్తులు , ఆత్మ విశ్వాసమూ , కేవలం వారి సామర్ధ్యాల మీదనే ఆధార పడి ఉంటున్నాయి , ఇప్పుడు కూడా , ప్రతి సమాజం లోనూ ! అందు చేతనే , పురుషులు , తమ లక్ష్యాలను సాధించడం ద్వారా , తమ ఆత్మ విశ్వాసాన్ని కూడా పెంచు కుంటారు ! తమకు తాము గర్వం గా తల ఎత్తుకుని , తాము ఉంటున్న సమాజం లో మన గలుగు తారు ! వారికై వారు , ఇతరుల సహాయం లేకుండా సాధించిన విజయాలతోనే , తాము పరిపూర్ణుల మైనట్టు భావిస్తారు ! ఈ లక్ష్యాల వేటలో , పురుషులకు , సహజమైన , అనుభూతులూ , ఆప్యాయతలూ , వెనకడుగు వేస్తాయి ! అంటే , పురుషుల లక్ష్యాలు ప్రధానం గా , భౌతిక అవసరాలు సాధించే దిశలోనే ఉంటాయి ! ప్రేమానురాగాలూ , ఆప్యాయతలూ ప్రధాన పాత్ర వహించవు ! వారు సాధారణం గా సమస్యల పరిష్కారం లో ,ఇతరుల సహాయాన్ని తీసుకోవడానికి వెనుకాడతారు ! అట్లా చేయడం తమ అసమర్ధత గా భావిస్తారు !
పురుషులు , ఆర్ధిక వ్యవహారాలలో ఎక్కువ గా తల మునకలవుతారు ! చాలా మంది పురుషులలో డబ్బు ప్రధాన మైన విషయం గా ఉంటుంది ! అంటే , వారి మెదడులో అధిక సమయం డబ్బు విషయాలు మాత్రమే తిరుగాడుతుంటాయి ! అబ్సెసివ్ గా ! జీవితం లో ఆర్ధికం గా విఫలమైన పురుషులు , తీవ్రం గా స్పందిస్తారు ! అంటే రియాక్ట్ అవుతారు ! చాలా విపరీతం గా నిరాసక్తత కు లోనవుతారు ! అంటే పురుషుల రోజు వారీ అనుభూతులు , వారి ఆర్ధిక స్థితి మీద చాలా వరకూ ఆధార పడి ఉంటాయి !
కానీ , అందుకు వ్యతిరేకం గా , స్త్రీల ప్రధాన విషయాలు , అందాలు , ప్రేమాను రాగాలు , ఆపేక్షా , ఆప్యాయతలు , పరిచయాలూ , బంధాలూ ! స్త్రీ ఆత్మ విశ్వాసం , ప్రధానం గా ఆమె అనుభూతుల మీదా , ఆమె ఏర్పరుచుకున్న , లేదా ఏర్పరుచుకునే బంధాల నాణ్యత మీదా ఆధార పడి ఉంటుంది !
అంతే కాకుండా స్త్రీలు , తమను , తాము , భౌతికం గా కూడా తాము నివసించే సమాజం లో అందం గా కనబడాలనీ , మంచి బట్టలు కట్టుకోవాలనీ , ఇతరులతో , అనుభూతుల తో కూడిన సంభాషణలు చేయాలనీ , భావిస్తూ ఉంటారు ! వారి వ్యక్తి గత వస్త్ర ధారణ లోకానీ , వారి శారిరిక మార్పులు కానీ , తమకు ఇష్టమైనవి కాక పొతే , వారిని , తీవ్రం గా క్రుంగ దీస్తాయి ! ఎంతగా అంటే , పురుషులు కనుక ఆర్ధికం గా నష్టపోతే ఎంతగా కృంగి పోతారో , అంత తీవ్రం గా ! స్త్రీల దృష్టి లో , ఇతరులకు సహాయ పడడమూ , లేదా సహాయం తీసుకోవడమూ , ఆత్మ న్యూనత అవ్వదు ! ఇతరులకు సహాయం చేయడం వారి బలం గా కూడా స్త్రీలు భావిస్తారు ! తమ పురుషులు , ఎక్కువ గా పని లోనూ , డబ్బు సంపాదన లోనూ సమయం వెచ్చిస్తే , దానిని స్త్రీలు ‘ తమను తిరస్కరిస్తున్నారన్న ‘ భావన తో కుమిలి పోతారు !
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు !
Missed u 4 a pretty long time due to…. Good series.
ధన్యవాదాలు శర్మ గారూ !