Our Health

తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ? 5.

In Our Health on జనవరి 6, 2015 at 6:22 సా.

తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?5. 

9. చాక్లెట్ : chocolate( పైన ఉన్న చిత్రం చూడండి ! ) : ఈ రోజుల్లో చాక్లెట్ తినని పిల్లలు ఎవరూ ఉండరు ! స్త్రీ పురుషులు కూడా ! ప్రతి సందర్భాన్నీ , ఒక  చాక్లెట్ బాక్స్ తో  ఘనం గా జరుపుకోవడం అత్యంత సామాన్యం , పాశ్చాత్య దేశాలలో ! ఆ సాంప్రదాయం , సహజం గానే మన దేశానికీ పాకింది ! 
చాక్లెట్  తియ్యగా ఉంటుంది అనే సత్యం అందరికీ తెలిసినదే ! మరి ఆ చాక్లెట్ రుచి ఎట్లా వస్తుంది ? అందులో కోకో  అనే పదార్ధం కలపడం వల్ల ! ఈ పదార్ధం , కోకో గానూ , కోకో వెన్న గానూ , కోకో విత్తనాల నుంచి గ్రహింప బడుతుంది !  ఐవరీ కోస్ట్ , ఘనా , ఇండొనీషియా  – ఈ మూడు  దేశాల నుంచే ,  ప్రపంచం లో లభించే చాక్లెట్ లలో 70 శాతం వాటికి లభించే కోకో  ఎగుమతులు ! 
చాక్లెట్ మరి కామ వాంఛ ను అధికం చేస్తుందా ? చాక్లెట్ లో ఏ పదార్ధాలు కామ వాంఛ కలిగిస్తాయి !? : 
చాక్లెట్ లో కోకో , కోకో లో ఉండే ఒక  రసాయన పదార్ధం థియో బ్రోమిన్ అనే కాఫీలో ఉండే పదార్దమే ! అంతే కాకుండా , కోకో లో ఫినైలిథైల్ అమిన్ అనే  ‘ మనకు కావలసిన ‘ అతి ముఖ్యమైన పదార్ధం  ఉంటుంది ! ఈ పదార్ధం  చాక్లెట్ తిన్న వారిలో   ‘ ప్రేమ లో పడిన భావన కలిగిస్తుంది ‘ ! కామ వాంఛ కు సంబంధించిన ఒక పత్రిక , ఒక పరిశోధన చేసి , రోజూ ఒక ముక్క చాక్లెట్  తినే స్త్రీలు  , చాక్లెట్ తినని స్త్రీల కన్నా కామ పరమైన సుఖమూ , సంతృప్తీ చెందుతున్నారని విశదం అయింది ! 
స్వచ్ఛ మైన కోకో లో టీ , కాఫీ లలో ఉండే వాటికన్నా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి ! వీటిలో ముఖ్యమైన వి ఫ్లావినాయిడ్ లు , ఇంకా ఎపి కాటెచిన్ అనేవి ! ఈ పదార్ధాలు , హృదయ రక్త ప్రసరణ కు ఉపయోగకరమని తెలిసింది ! ముఖ్యం గా డార్క్ చాక్లెట్ లో అంటే బాగా ముదురు చాక్లెట్ రంగు లో ఉన్న చాక్లెట్ ల లో అత్యధికం గా యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి ! అందుకే చాక్లెట్ తిన్న యువతులు ,  చెప్పలేని మధురానుభూతులు పొందుతారని అంటే , అందుకు శాస్త్రీయ  కారణం కూడా లేక పోలేదు !  
మరి చాక్లెట్ తింటే లావు అవుతారని అంటారు కదా ! ?:
ఇది మంచి ప్రశ్న . కోకో ఒక్కటే చాక్లెట్ లోఉండే , కామ వాంఛ ను అధికం చేసే పదార్ధం ! ఈ పదార్ధం సహజం గా చేదు గా ఉంటుంది !  ఆ చేదును హరించ డానికి ,  వ్యాపార మానవులు( క్రీమూ , పంచదారా కలిపి )  కనిపెట్టిన  మధురమైన పదార్ధమే చాక్లెట్ !  సహజం గానే, అతిగా చాక్లెట్ తినడం వలన  పంచదార , కొవ్వు కలిపిన చాక్లెట్ ల లో , క్యాలరీలు ఎక్కువ గా ఉండడమే కాకుండా , కొవ్వు కూడా ఉండి , అవి అన్నీ కలిసి  ఊబకాయమూ , ఇతర అనర్ధాలూ కలిగిస్తాయి , మానవ శరీరం లో ! గమనించ వలసినది ! మితం గా తినడమే ఆరోగ్యకరమని ! 
10. మకా ( పైన ఉన్న చిత్రం చూడండి ! ) :  ఈ కూర ఒక దుంప కూర ! ( దుంప కూరలన్నీ , ఆ యా మొక్కల వేర్లు అంటే రూట్స్ , రూపాంతరం చెంది , అంటే మారి పోయి , ఆహారం నిలువ చేసుకోడానికి దుంపలు గా మారతాయి !  బంగాళా దుంప లేదా ఆలుగడ్డ , ఇంకా కారెట్ , ఈ కోవ కు చెందినవే ! ) పెరూ దేశం లో ముఖ్యం గా ఎక్కువ గా లభిస్తుంది ! ఈ దుంప కూర లో అనేక రకాలైన ఖనిజాలూ , విటమిన్లూ , అమైనో యాసిడ్ లూ ఉంటాయి ! ఈ పదార్ధాలన్నీ ,  పురుషులలో   అంగ స్థంభ న అధికం చేస్తాయి !  అంటే అంగ స్థంభ న సమస్యలతో సతమతం అయ్యే పురుషులకు , ఈ దుంప కూర లాభం చేకూరుస్తుంది ! ఈ మకా  దుంప పొడి కూడా మార్కెట్ లలో లభ్యం అవుతుంది ! ఈ పొడి ని పళ్ళ రసాలలో రోజూ ఒక చెంచా కలుపుకుని తాగ వచ్చు , ఫలితాలు రావడానికి ! 
ఈ టపాల మీద మీ అభిప్రాయం తెలియచేయండి , మీ సందేహాలతో కూడా ! 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: