Our Health

తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?4.

In Our Health on జనవరి 1, 2015 at 1:52 సా.

తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?4. 

అవకాడో ( avocado ): 
అవకాడో ఒక చెట్టు ఫలం ! ( పై చిత్రం చూడండి )ఈ ఫలం లో ఫోలిక్ యాసిడ్ , ఇంకా పొటాషియం సమృద్ధి గా లభిస్తాయి ! ఇంకా పైరిడాక్సిన్ అనే విటమిన్ ( దీనినే విటమిన్  B 6  అని కూడా అంటారు )  ఈ పండు , స్త్రీ పురుషులిద్దరిలోనూ , కామ వాంఛ ను అధికం చేస్తుంది !  అజ్ టెక్ నాగరికత లో ప్రజలు  అవకాడో ను  ‘ వృషణాల ‘ వృక్షం అని పిలిచేవారు, అందుకే ! పొటాషియం , థైరాయిడ్  గ్రంధి ని సరి అయిన స్థితిలో ఉంచి , ఆ గ్రంధి లో నుంచి మన దేహానికి అనునిత్యమూ అవసరమయే థైరాయిడ్ హార్మోనులను సమ తుల్యం చేసి , మన రక్తం లో విడుదల చేయడానికి దోహద పడుతుంది !  థైరాయిడ్ గ్రంధి  సరిగా పని చేయలేక పొతే కూడా , కామ వాంఛ తగ్గుతుంది ! స్త్రీలలోనూ , పురుషులలో కూడా  థైరాయిడ్ లోపం జరగవచ్చు !
అల్మండ్స్ ( సీమ బాదం పప్పు ) ( almonds )( పై చిత్రం చూడండి ):  మన దేహానికి ఫాట్టీ ఆమ్లాలు అవసరం ఉంటాయి . ఈ ఫాట్టీ ఆమ్లాలు అందుకే ‘ అత్యవసర ఫాట్టీ ఆమ్లాలు లేదా ఎసెన్షియల్ ఫాట్టీ యాసిడ్ లు అనబడతాయి !
ఈ అత్యవసర ఫాట్టీ యాసిడ్ లకు ఆ పేరు ఎందుకు వచ్చింది ?:  మన దేహం లో , మనకు నిత్యం అవసరమయే  అనేకమైన హార్మోనుల తయారీకి  మూల రసాయన పదార్ధాలు ఈ  అత్యవసర ఫాట్టీ ఆమ్లాలే ! అంటే  కామ వాంఛ కు  అనివార్యమయే ఈస్ట్రో జెన్ , టె స్టో స్టిరాన్  హార్మోనులు కూడా ఈ ఎసెన్షియల్ ఫాట్టీ ఆమ్లాల నుంచి ఉత్పత్తి అయే జీవ  రసాయనాలే ! అంటే హార్మోనులను ఉత్పత్తి చేయడానికి అవసరమయే ముడి సరుకు  ఈ ఎసెన్షియల్ ఫాట్టీ ఆమ్లాలు  ! సీమ బాదం పప్పు లో ఈ ఎసెన్షియల్ ఫాట్టీ ఆమ్లాలు అధికం గా ఉండడమే కాకుండా , ఇతర విటమిన్లు , అంటే విటమిన్ E , B 2, ఇంకా ముఖ్యమైన ఖనిజాలు – మెగ్నీషియం , కాల్షియం కూడా లభిస్తాయి !
ఈ సీమ బాదం పప్పు వాసన కూడా ,  స్త్రీ పురుషులలో కామ వాంఛ ను  రగిలిస్తుందని ప్రయోగాల ద్వారా తెలిసింది అందుకే ,అనేక దేశాలలో  ఈ సీమ బాదం పప్పు వాసన వేసే క్యాండిల్స్ ను కూడా అమ్ముతారు, శయన మందిరం లో , వెలుతురు తో పాటుగా , కామ దీపాన్ని కూడా దేదీప్యం చేయడానికి !
మరి ఈ సీమ బాదం పప్పును ఎట్లా తినాలి ? : వీటిలోని పోషక పదార్ధాలను  వృధా కాకుండా  పొందాలంటే , పచ్చి వాటినే , ( రోస్టు చేయడం అంటే వేయించడం , లేదా , చెక్కర  లేదా ఉప్పు కలిపినవి కానీ కాకుండా  ) తింటే మంచిది !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: