Our Health

తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?2.

In Our Health on డిసెంబర్ 20, 2014 at 11:08 ఉద.

తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?2.. 

3. అరటి పండు (  పై చిత్రం గమనించండి ): 
అనేక శతాబ్దాలు గా మన భారత దేశం లో జరిగే ఈ కార్యక్రమం లోనైనా , అరటి పండు ప్రధాన ఫలం గా కనబడడమే కాక ,  సంతాన సాఫల్యానికి అంటే ఫర్టిలి టీ  కి  ఒక సంకేతం గా ఉంది !
అరటి పండు లో బ్రోమలైన్ అనే ఎంజైమ్ లభిస్తుంది !  ఈ బ్రోమలైన్ అనే ఎంజైమ్ , కామ వాంఛ ను అధికం చేయడమే కాకుండా ,  వంధ్యత్వాన్ని కూడా నివారిస్తుంది ! బ్రోమలైన్ అనే ఎంజైమ్, ఇంకా , శరీర సహజ రోగ నిరోధక శక్తి ఎక్కువ గా ఉండడానికి కూడా సహకరిస్తుంది !  అంతే కాకుండా , ఈ బ్రోమలైన్ , ఆర్త్రైటిస్ అంటే కీళ్ళ నొప్పులు కూడా నివారిస్తుంది .  అరటి పండు లో లభ్యమయే , విటమిన్లు ( రైబో ఫ్లేవిన్ ) , ఖనిజాలు ( పొటాషియం ) అనేక జీవరసాయన చర్యలలో  ప్రముఖ పాత్ర  ప్రముఖ పాత్ర వహిస్తూ , నిరంతరం , శరీరాన్ని , ఆరోగ్యం గా ఉంచడమే కాకుండా , శరీరాన్ని శక్తివంతం గా ఉంచుతాయి !  అరటి పండు లో , కనీసం పది విటమిన్ లూ , పది ఖనిజాలూ , లభ్యం అవుతాయి , పిండిపదార్ధమూ , గ్లూకోజు తో సహా ! 
అరటి పండు ను ఎట్లా తినాలి ?:  కామ వాంఛ అధికం అవ్వాలనుకునే ప్రేయసీ ప్రియులు , అరటి పండును ముక్కలు గా కోసి  ఒకరి నగ్న శరీరం మీద ఉన్నవి ఇంకొకరు తింటే , బాగా ప్రయోజనం ఉంటుందని , కొన్ని అంతర్జాల సైట్ లలో సలహా ఇవ్వడం జరిగింది !  మరి ఎట్లా తినడం అనేది , ఎవరి ఇష్టం వారిది ! 
4. ఆస్పరాగస్ (  పై చిత్రం గమనించండి ):ఆస్పరాగస్  ఒక మొక్క లేత కాడ ! ఈ కాడ లో మన శరీరానికి అవసరమయే ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ పుష్కలం గా లభిస్తుంది !  
మరి ఫోలిక్ యాసిడ్ కూ ,  వాంఛ కూ సంబంధం ఏమిటి ? 
కామ వాంఛ అధికం కావడానికి అవసరమయే హిస్టమిన్ అనే జీవ రసాయనం తయారు కావడానికి , ఫోలిక్ యాసిడ్ అవసరం ఉంటుంది ! అంటే ఫోలిక్ యాసిడ్ తక్కువ గా  శరీరం లో ఉంటే ,  హిస్టమిన్ కూడా తక్కువ గా ఉత్పత్తి అయి , తద్వారా , కామ వాంఛ కూడా అంతంత మాత్రం గానే ఉంటుంది ! పురుషుల్లోనూ , స్త్రీలలోనూ కూడా ! 
ఆస్పరాగస్ ను ఎట్లా తినాలి ? : ఆస్పరాగస్ కాడలను లేతవి గా ఉన్నవి కొని , శుభ్రం గా , స్వచ్చమైన ( గోరువెచ్చటి ) నీటిలో కడిగాక ,  కొద్దిపాటి నీటిలో ( ఎక్కువ నీళ్ళ లో అయితే విటమిన్లు , మిగతా పోషక పదార్ధాలు అన్నీ ఆ నీటిలో కలిసి పోయి వృధా అవుతాయి )   , తగినంత సేపు ఉడికించి , సలాడ్ లలో కలుపు కోవడ మో , లేదా మిగతా కూరల్లో కలుపుకోవడమో చేసి , తినవచ్చు ! విదేశాలలో , ఈ ఆస్పరాగస్ విరివి గా లభ్యం అవుతుంది ! 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు ! 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: