అనుమానం, పెనుభూతం ! 4. మరి చికిత్స మాటేంటి ?
క్రితం టపాలలో , అనుమానం , పెనుభూతం గా మారితే, మనుషులలో కనబడే మార్పుల గురించి తెలుసుకున్నాం కదా ! మరి చికిత్స మాటేంటి ?
మానసిక సమస్యలకు , సామాన్యం గా రెండు రకాల చికిత్సా పద్ధతులుంటాయి ! కనబడే ఆ మానసిక రుగ్మత పూర్వా పరాలు కనుక్కొని , వాటికి కారణాలు వెదకడం లో మానసిక వైద్యుల పాత్ర ఎంతగానో ఉంటుంది ! మానసిక రుగ్మతలు ఉన్న వ్యక్తి , బాగా తెలివి గల వారైతే , కేవలం వారి ఆలోచనలనూ , అనుభవాలనూ విశ్లేషించి , వాటి పరిష్కార మార్గాలను చెప్పి , ఆ రకమైన ఆలోచనా ధోరణులను సమూలం గా మార్చ గలిగే సామర్ధ్యం మానసిక వైద్యులకు ఉంటుంది !
చాలా సందర్భాలలో , ఇట్లా మార్చగలిగే అవకాశం , కొన్ని మందులు కూడా కలిపితే హెచ్చుతుందీ , త్వరగా చికిత్సా ఫలితాలు కనబడతాయీ కూడా !
మొండికి బడ్డ , తీవ్రమైన అనుమానాలు , అంటే పెనుభూతాల తో సతమత మవుతున్న వారితో ఎట్లా ప్రవర్తించాలి ?
ఇది కష్టమైన పనే , ప్రత్యేకించి , మానసిక రోగాల మీద ఏ రకమైన జ్ఞానమూ లేని వారికి ! తీవ్రమైన ‘ అనుమానాలతో ‘ అంటే పారనోయియా తో బాధ పడుతూ ఉండే వారు కొందరు , చీటికీ మాటికీ , విసుగు ప్రదర్శిస్తూ ఉంటారు ! సద్విమర్శలు ఎవరైనా బాగు కోరేవారు చేసినా కూడా , తీవ్రం గా రియాక్ట్ అవుతారు ! మనసులో మాట , ధైర్యం గానూ , స్వేచ్చ గానూ , బయటకు చెప్పుకోవడానికి జంకుతూ , చాలా రహస్యం గా ఉంటారు ! చాలా త్వరగా కోపోద్రేకులవుతూ ఉంటారు ! ఇట్లాంటి లక్షణాలు ప్రదర్శించే వారితో , జాగ్రత్త గా వ్యవహరించాలి ! అంతే కాకుండా , వారికి చికిత్స చేయడం కూడా ఎంతో శ్రమ తో కూడుకున్నదే కాక , సమయం కూడా పడుతుంది !
యాంగ్జైటీ ను తగ్గించే పద్ధతులూ , రిలాక్స్ అయ్యే పద్ధతులూ కూడా , వీరికి ఎంతగానో ఉపయోగ పడతాయి ! ఈ లక్షణాలున్న వారిని , ముందుగా , మానసిక వైద్యుల దగ్గరకు తీసుకు వెళ్లి , పరీక్ష చేయించడం ఉత్తమం ! వీరికి వీరి తల్లి దండ్రులూ , బంధువులూ , స్నేహితులూ ఇచ్చే సహకారం కూడా ఎంతో ఉపయోగ పడుతుంది ! అంతే కాకుండా , వారి చికిత్స లో ప్రముఖ పాత్ర వహిస్తారు , వీరందరూ !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !