అనంత యంత్రం . ఇన్ఫినిటీ మెషీన్ !. 3.
క్రితం టపాలో , అనంత యంత్రం , ప్రస్తుతం అందుబాటు లో ఉన్న కంప్యూటర్ ల కంటే భిన్నం గానూ , ఎన్నో రెట్లు వేగం గానూ , ఎట్లా పని చేయ గలదో తెలుసుకున్నాం కదా ! అందుకే , అమెరికా జాతీయ నిఘా వ్యవస్థ కూడా ( అంటే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ) 80 మిల్లియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి , ఈ క్వాంటం కంప్యూటర్ ల మీద పరిశోధన ప్రారంభించింది ‘ అని ఎడ్వర్డ్ స్నోడెన్ తాను లీక్ చేసిన రహస్యాలలో పేర్కొన్నాడు ! ఈ పధకానికి అమెరికా ‘ పెనె ట్రే టింగ్ హార్డ్ టార్గెట్స్’ అని రహస్యమైన కోడ్ పేరు కూడా పెట్టింది ! దానికి కారణం : ప్రస్తుతం అందుబాటు లో ఉన్న కంప్యూటర్ లు ఎన్క్రి ప్షన్ ను విశ్లేషణ చేయడానికి సంవత్సరాలు పట్టే సమయాన్ని క్వాంటం కంప్యూటర్ లు కేవలం కొన్ని రోజులలో చేయగలవు !
అందుకే , ఆ దిశలో అనేక పరిశోధనలు శర వేగం తో జరుగుతున్నాయి ! ఇప్పుడు పరిశోధకుల ప్రధాన సమస్య , కేవలం క్వాంటం కంప్యూటర్ ల ప్రధాన సూత్రం ( సూపర్ పొజిషన్ ) మాత్రమే కాదు ! అట్లా సూపర్ పొజిషన్ చేయగలిగి , ఇతర అణువులతో లింక్ అవగలిగితేనే , సమాచారం వేగం గా విశ్లేషణ చేయబడుతుంది ! ఇట్లా అనేక వేల లక్షల సూపర్ పొజిషన్ స్థితులు , ఒకదానితో ఒకటి సంధానం కావడాన్ని ఎంటాంగిల్మెంట్ ( entanglement ) అని అంటారు ! ఈ ఎంటాంగిల్మెంట్ చేయడానికి , క్వాంటం కంప్యూటర్ ను ఒక స్థిరమైన వాతావరణం లో ఉంచాలి ! అంటే , బాహ్య వాతావరణం ఏమాత్రం మారకూడదు ! అంటే , ఉష్ణోగ్రత లోకానీ , లేదా కుదుపులు లేకుండా నూ ,అయస్కాంత ప్రభావం కూడా లేకుండా , ఎప్పుడూ ఒక సమ స్థితి లో ఉంచితేనే , క్వాంటం కంప్యూటర్ సరిగా పని చేయగలుగుతుంది ! D wave కంపెనీ కూడా ఇట్లా ఎంటాంగిల్మెంట్ , సూపర్ పొజిషన్ తో పాటుగా చేయగలిగే కంప్యూటర్ లను తయారు చేసే ప్రయత్నం లో ఉంది !
క్వాంటం కంప్యూటర్ లు ఇంకో పధ్ధతి లో కూడా పని చేయగలుగుతాయి ! దానిని క్వాంటం అన్నీలింగ్ ( quantum annealing ) అని అంటారు. ఈ పద్దతి గురించి , ఈ చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు ! ఒక యాభై చిన్న చిన్న పర్వతాలు ఉన్న ఒక ప్రాంతం ఉందనుకోండి ! ఆ పర్వతాలన్నిటికీ ఎత్తు కనుక్కోవాలంటే , ఒక మనిషి యాభై పర్వతాలనూ ఒకదాని తరువాత ఒకటి , ఎక్కి , కనుక్కోవాలి ! ఇట్లా ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ లు చేస్తాయి ! కానీ యాభై మంది మనుషులు ఒకే సారి , ఆ యాభై పర్వతాలలో ఒక్కో దాన్ని ఎక్కి నా , ఆ యాభై మంది సమాచారం ఒకే సారి తెలుసుకునే అవకాశం ఉంటుంది ! ఇట్లా క్వాంటం కంప్యూటర్ లు అన్నీలింగ్ అనే సూత్రం ద్వారా సులభం చేయ గలుగుతాయి , ఆ పనిని ! ఈ సూత్రం ద్వారా పనిచేసే క్వాంటం కంప్యూటర్ లను అడయాబాటిక్ కంప్యూటర్ అని అంటారు ( adiabatic computers ).
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు !
Good info
మానవ మేధస్సును మించినదంటారా?
మానవ మేధస్సు ను మించే కంప్యూటర్ ఏదీ, ఎప్పుడూ కనుగొన బడదని నేను నమ్ముతాను !
కాక పొతే , క్వాంటం కంప్యూటర్ లు , అనేక వందల , వేల , లెక్కలను కానీ , బిట్స్ అఫ్ ఇన్ఫర్మేషన్ ను కానీ ఏక కాలం లో విశ్లేషణ చేయ గలిగే సామర్ధ్యం కలిగి ఉంటాయి !